ఆచార్య జయశంకర్ వంటి మేధావిని, విద్యా వేత్తని కోల్పోవటం కేవలం తెలంగాణా ప్రాంతానికే కాదు...తెలుగు వారందరికీ తీరని లోటే. విద్యా రంగంలో ఆయన మన రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయం. అలాగే తాను నమ్మిన సిద్దాంతం పట్ల నిబద్ధత, తన సిద్ధాంత వ్యాప్తి కోసం ఎంచుకున్న గాంధేయ మార్గం కూడా మెచ్చ దగ్గవి. అయితే ఆయన మరణానంతరం నివాళి అర్పించటానికి వచ్చిన తెలంగాణా నాయకులని తెలబాన్ శ్రేణులు చొక్కాలు చిరిగేలా కొట్టటం, రాళ్ళతో దాడి చేయటం ఎ మాత్రం సమర్ధనీయం కాదు. జయ శంకర్ కూడా జీవించి వున్నప్పుడు ఎటువంటి హింసా వాదాన్ని సమర్ధించలేదు. వసూళ్ళ నాయకుల చేతిలో పడి తెలంగాణా ఉద్యమం ఏనాడో పెడ తోవ పట్టింది. కనీసం ఉద్యమ సిద్ధాంత కర్త మరణించిన విషాద సమయంలో సైతం సంయమనం లేకుండా తెలబాన్ శ్రేణులు ప్రవర్తించాయి. జయ శంకర్ అంతిమ యాత్ర జరిగిన సమయంలో కూడా రెచ్చి పోయిన తెలబాన్లు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం పై రాళ్ళతో చెప్పులతో దాడి చేయటం పెచ్చరిల్లిన ఉన్మాదానికి పరాకాష్ట. ఉద్యమం ముసుగులో ఏమి చేసినా చెల్లి పోతుందనే ధీమా వారి చర్యల్లో కన పడుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ కి అత్యంత ప్రియమైన టాంక్ బండ్ విగ్రహాలని కూలదోసి ఆయన ఆత్మని క్షోభింప జేసిన తెలబాన్లు ఇక ఏకంగా ఆయన విగ్రహాలపైనే ప్రతాపం చూపారు. ఈ అరాచకత్వాలని ఇక ఎంత మాత్రం సహించకూడదు. ప్రభుత్వం అనేది ఒకటి ఉందన్న స్పృహ కూడా లేకుండా పెచ్చరిల్లుతున్న వేర్పాటు తీవ్ర వాద గణాల భరతం పట్టే దిశగా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతైనా వుంది
Wednesday, June 22, 2011
Sunday, June 19, 2011
లగడపాటి లెక్కలో తప్పేముంది?
దొంగ దీక్షలతో కేంద్రాన్ని ఏమార్చి 2009 డిసెంబరు తొమ్మిదిన తెలంగాణకి అనుకూలంగా ప్రకటన ఇచ్చిన నాడు, అందరికంటే ముందుగా అప్రమత్తమై రాష్ట్రాన్ని ముక్కలు గాకుండా కార్యాచరణకి దిగిన వాడు లగడపాటి రాజగోపాల్. ఆయన వ్యక్తిగతంగా వ్యాపారి కావచ్చు. ఆయన వ్యాపార ప్రయోజనాలు హైదరాబాదు లో విస్తరించి ఉండవచ్చు. అది వేరే విషయం. అయితే ఉత్తి పుణ్యానికే రాష్ట్రాన్ని ముక్కలు చేద్దామని జూసిన వేర్పాటు వాదుల కుట్రలు భగ్నం చేస్తూ సమైక్యాంధ్ర ఉద్యమ నావకి చుక్కానిలా నిలిచిన రాజ గోపాల్ అంటే తెలబాన్లకి కంటగింపుగా వుండటం సహజమే. ఆనాటి నుంచి లగడపాటి ఏం మాట్లాడినా దుమ్మెత్తి పోయడం అన్నది తెలబాన్లకి అలవాటుగా మారింది.
తాజాగా-- రాష్ట్రంలో ఎన్నికలు వస్తే సమైక్య వాదులకి 240 ,వేర్పాటు వాదులకి 40 సీట్లు వస్తాయి -- అన్న లగడపాటి ప్రకటన పై తెలబాన్ శ్రేణులు శాపనార్ధాలు పెట్టటం ప్రారంభించాయి. తాను నిర్వహించిన సర్వే లో ఈ విషయం వెల్లడైందని రాజ గోపాల్ అంటున్నప్పుడు, చేతనైతే ఆ సర్వే అబద్ధమని నిరూపించాలి గానీ వ్యక్తిగత దూషణలకి దిగటం చేతకాని తనం. రాష్ట్రాన్ని విభజిస్తే ఏర్పడే పరిణామాలు అంటూ రాజ గోపాల్ చెప్పినవి అన్నీ శ్రీ కృష్ణ కమిటీ 8 వ అధ్యాయంలో వున్నవే. లగడపాటి సొంత సర్వే లని పక్కన పెడితే, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమిటీ రాష్ట్రంలోని పరిస్థితుల్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి సమస్యకి తగిన పరిష్కారాలని సూచించి ఆరు నెలలు గడిచి పోయాయి. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించటం మాని, శ్రీ కృష్ణ కమిటీ సూచించిన ఆరవ అత్యుత్తమ పరిష్కారం అమలు పరిచే చర్యలు చేపట్టాలి. గోర్ఖాలాండ్ మాదిరిగానే రాష్ట్రంలో వెనుక బడ్డ తెలంగాణా, ఉత్తరాంధ్ర, రాయల సీమల్లోని ప్రాంతాలకి ప్రత్యెక ప్యాకేజీలు ప్రకటించి వాటి సత్వర అభివృద్ధికి బాట వేయాలి. తద్వారా ఎటువంటి వేర్పాటు వాద ఉద్యమాలు భవిష్యత్తులో తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
వంట చేసి ఏం సాధించారు?
త్యాగాల వల్ల తప్ప వేరే విధంగా తెలంగాణా రాదని సెలవిస్తూనే వంటా వార్పూ అంటూ తెలబాన్ నాయకుడు చేసిన హడావిడికి అర్ధం పరమార్ధం ఏమిటో ఆయనకే తెలియాలి. ఓ పక్క కాంగ్రెస్, తెదేపా నాయకులని రాజీనామాలు చేయమని హుంకరిస్తూనే, తానూ, తన తెలబాన్ చెల్లి ఈ రోజుకి కూడా రాజీనామా ఊసు ఎందుకు ఎత్తరో ఏనాడు వివరించిన పాపాన పోలేదు. నిజంగా ఉద్యమం పట్ల చిత్త శుద్ధి, నిబద్ధత గల పెద్ద మనిషి ఐతే మొదటి సారి రాజీనామా తిరస్కరణకి గురి అయ్యాక మళ్ళీ సరైన ఫార్మాట్లో రాజీనామా ఇవ్వాలన్న విషయం ఎవరైనా చెప్పాలా? తాను పదవిని పట్టుకుని వేళ్ళాడుతూ ఇతరులని రాజీనామా చేయాలని వత్తిడి చెయ్యటం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాల కిందకే వస్తుంది. ఇలా వంటలు చేస్తూ, వసూళ్లు చేస్తూ ఉద్యమ నాయకుడుగా చెలామణీ కావటం బహుశా వేరెవరికీ సాధ్యం కాక పోవచ్చు. ఇక తెలబాన్ జే ఎ సి నాయకుడిదీ అదే తంతు! తన ప్రొఫెసర్ పదవికి రాజీనామా ఇవ్వడు కానీ.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు కట్టిన పన్నుల్లోంచి జీతం తీసుకుంటూ ఒక ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడతాడు. అనుకూలంగా మాట్లాడితే తప్పు లేదు. కానీ ఇతర ప్రాంతాల పై, ప్రాంతీయుల పై విద్వేషాగ్నుల్ని రగిలించడం క్షంతవ్యం కాదు. ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం కొత్తగా చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసి కొరివితో తల గోక్కునే అవకాశం లేనే లేదు. అది తెలంగాణా కాంగ్రెస్ నాయకుల డిల్లీ పర్యటనలో వారి పట్ల హై కమాండ్ చూపిన మర్యాదే తెలియ జేసింది. ఇంకా వంటా వార్పూ, డెడ్ లైన్, రాజీనామా అంటూ ప్రజలని ఏమార్చడం సాధ్యం కాదు. పైగా మిలియన్ మార్చ్ అంటూ పేర్లు పెట్టి జనాల్ని సమీకరించి రాష్ట్ర చారిత్రిక సంపద ఐన విగ్రహాలని కూల్చి వేయడం క్షమించరాని నేరం. ఇప్పటికే రాష్ట్రానికి కోలుకోలేని నష్టం జరిగి అభివృద్ధి అనేది ఆమడ దూరం వెళ్ళింది. ఇంకా ఇటువంటి అర్ధం పర్ధం లేని ఉద్యమాలని ప్రభుత్వం ఎంత మాత్రం సాగనీయకూడదు. రాష్ట్ర హితానికి వ్యతిరేకంగా, ప్రజలని అసౌకర్యాల పాలు జేసే విధంగా సాగే ఎటువంటి కార్య కలాపాలని అయినా ఉక్కు పాదంతో అణచి వేస్తేనే మళ్ళీ రాష్ట్రాభివృద్ధి గాడిలో పడుతుంది.
Saturday, June 11, 2011
దళిత కార్డు దుర్వినియోగం కాకూడదు..
ఎంపీ నన్న అహంకారంతో విద్యుత్ శాఖ ఉద్యోగి పైన నోరు పారేసుకున్న సర్వే సత్య నారాయణ ఉద్యోగుల సంఘీభావానికి తోక ముడిచి క్షమాపణ చెప్పారు. ప్రోటోకాల్ విషయమై తప్పు జరిగిందని ఆరోపిస్తూ విద్యుత్ శాఖ ఉద్యోగి పై బూతుల పంచాంగం విప్పిన పార్లమెంటు సభ్యుడు, ఆ శాఖ ఉద్యోగులు అందరూ సంఘీభావంతో
ఒక్కటిగా నిలబడటంతో దిక్కు తోచక కులం కార్డుని వెలికి తీసారు. ఎస్.సి. ఎస్.టీ. చట్టం కింద కేసు పెడతాననీ, స్పీకర్ కి ఫిర్యాదు చేస్తాననీ పరి పరి విధాల బెదిరించారు. అయినా కూడా ఉద్యోగులు వెరవక పోవటంతో తప్పని సరై క్షమాపణలు చెప్పారు. ఎంపీ స్థానంలో ఉన్న వాడే ఉచితానుచితాలు గ్రహించకుండా స్వల్ప వివాదానికి సైతం దళిత కార్డుని వాడ బూనటం ఔచిత్యం అనిపించుకోదు. ఎంపీ గారే కాదు. చాల మంది మన దేశంలో ఒక దళితుడిని తప్పు పడితే చాలు..అంబేద్కర్ ని అవమానించినంత హడావిడి చేస్తారు. పుట్టుక రీత్యా దళితుడైనంత మాత్రాన అన్ని తప్పులనించి ఇమ్యూనిటీ వున్నట్లు ప్రవర్తించటం మంచిది కాదు. రాజ్యాంగం తమకి కల్పించిన వెసులుబాటుని తమ పురోభివృద్ధికై వాడుకోవాలి గానీ ఇలా దుర్వినియోగం చేయడం కూడదు.
Subscribe to:
Posts (Atom)