రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అసలు ఇక్కడ ప్రభుత్వం అనేది పని చేస్తోందా అని సందేహం వస్తోంది. వేర్పాటు వాదం వెర్రి తలకెక్కి రైల్ రోకో అనగానే ప్రభుత్వమే ముందుగా రైళ్ళని రద్దు చేయటం చేతగాని తనమే. రైళ్ళ రద్దు వల్ల ఏర్పడే కోట్లాది రూపాయల నష్టానికీ, ప్రయాణీకుల కష్టాలకీ బాధ్యత ఎవరిది? ముమ్మాటికీ ఈ చేతకాని ప్రభుత్వానిదే.. ఉద్యమం ముసుగులో తామేం చేసినా చెల్లి పోతుందన్న అభిప్రాయం ఇప్పటికే తెలబాన్ల నర నరాల్లో జీర్ణించుకు పోయింది. దానికి తోడు ప్రభుత్వమే చేవ చచ్చిన రీతిలో ఇలా తోక ముడిచేయడం ఏ మాత్రం క్షంతవ్యం కాదు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ముందు తన ఉద్యోగులనే కట్టడి చేయలేక పోతోంది. ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటూ ప్రజా సేవ చేయాల్సిన ఉద్యోగులు అర్ధం పర్ధం లేని డిమాండ్లతో ఆగష్టు ఒకటినుండి పని చేయ బోమని బెదిరించటం ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన అలుసే. తెలుగు వారి చరిత్రకి సగర్వ సాక్ష్యాలైన టాంకు బండు విగ్రహాల్ని కూల్చిన వారిపై ఈ రోజు వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇక ఈ రోజు నల్గొండ జిల్లా చుట్టూ గోడ కట్టేస్తామని బెదిరించాడో మాజీ మంత్రి! అసలు తెలంగాణా ఉద్యమ వాదంలో సహేతుకత ఎంత వుంది, ఈ సమస్యకి అత్యుత్తమ పరిష్కారం ఏమిటి తదితర విషయాలన్నీ శ్రీకృష్ణుడు ఏనాడో కుండ బద్దలు కొట్టేసాడు. అయినా కూడా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తూ ప్రజలు ఇబ్బందుల పాలవుతుంటే చోద్యం చూస్తూ కూచోటం క్షమార్హం కాదు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా వేచి చూసే ధోరణి మాని రాష్ట్రం లో పరిస్థితులు గాడిన పడే వరకు రాష్ట్రపతి పాలన విధించాలి. శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన ఆరో అత్యుత్తమ పరిష్కారం అమలుకి చిత్త శుద్ధితో కార్యాచరణ సాగించాలి. తద్వారా దేశంలో ఇతర ప్రాంతాల్లో వేర్పాటు వాదాలు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవాలి.
Thursday, July 14, 2011
Wednesday, June 22, 2011
నివాళి ఇచ్చే విధానం ఇదా?
ఆచార్య జయశంకర్ వంటి మేధావిని, విద్యా వేత్తని కోల్పోవటం కేవలం తెలంగాణా ప్రాంతానికే కాదు...తెలుగు వారందరికీ తీరని లోటే. విద్యా రంగంలో ఆయన మన రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయం. అలాగే తాను నమ్మిన సిద్దాంతం పట్ల నిబద్ధత, తన సిద్ధాంత వ్యాప్తి కోసం ఎంచుకున్న గాంధేయ మార్గం కూడా మెచ్చ దగ్గవి. అయితే ఆయన మరణానంతరం నివాళి అర్పించటానికి వచ్చిన తెలంగాణా నాయకులని తెలబాన్ శ్రేణులు చొక్కాలు చిరిగేలా కొట్టటం, రాళ్ళతో దాడి చేయటం ఎ మాత్రం సమర్ధనీయం కాదు. జయ శంకర్ కూడా జీవించి వున్నప్పుడు ఎటువంటి హింసా వాదాన్ని సమర్ధించలేదు. వసూళ్ళ నాయకుల చేతిలో పడి తెలంగాణా ఉద్యమం ఏనాడో పెడ తోవ పట్టింది. కనీసం ఉద్యమ సిద్ధాంత కర్త మరణించిన విషాద సమయంలో సైతం సంయమనం లేకుండా తెలబాన్ శ్రేణులు ప్రవర్తించాయి. జయ శంకర్ అంతిమ యాత్ర జరిగిన సమయంలో కూడా రెచ్చి పోయిన తెలబాన్లు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం పై రాళ్ళతో చెప్పులతో దాడి చేయటం పెచ్చరిల్లిన ఉన్మాదానికి పరాకాష్ట. ఉద్యమం ముసుగులో ఏమి చేసినా చెల్లి పోతుందనే ధీమా వారి చర్యల్లో కన పడుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ కి అత్యంత ప్రియమైన టాంక్ బండ్ విగ్రహాలని కూలదోసి ఆయన ఆత్మని క్షోభింప జేసిన తెలబాన్లు ఇక ఏకంగా ఆయన విగ్రహాలపైనే ప్రతాపం చూపారు. ఈ అరాచకత్వాలని ఇక ఎంత మాత్రం సహించకూడదు. ప్రభుత్వం అనేది ఒకటి ఉందన్న స్పృహ కూడా లేకుండా పెచ్చరిల్లుతున్న వేర్పాటు తీవ్ర వాద గణాల భరతం పట్టే దిశగా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతైనా వుంది
Sunday, June 19, 2011
లగడపాటి లెక్కలో తప్పేముంది?
దొంగ దీక్షలతో కేంద్రాన్ని ఏమార్చి 2009 డిసెంబరు తొమ్మిదిన తెలంగాణకి అనుకూలంగా ప్రకటన ఇచ్చిన నాడు, అందరికంటే ముందుగా అప్రమత్తమై రాష్ట్రాన్ని ముక్కలు గాకుండా కార్యాచరణకి దిగిన వాడు లగడపాటి రాజగోపాల్. ఆయన వ్యక్తిగతంగా వ్యాపారి కావచ్చు. ఆయన వ్యాపార ప్రయోజనాలు హైదరాబాదు లో విస్తరించి ఉండవచ్చు. అది వేరే విషయం. అయితే ఉత్తి పుణ్యానికే రాష్ట్రాన్ని ముక్కలు చేద్దామని జూసిన వేర్పాటు వాదుల కుట్రలు భగ్నం చేస్తూ సమైక్యాంధ్ర ఉద్యమ నావకి చుక్కానిలా నిలిచిన రాజ గోపాల్ అంటే తెలబాన్లకి కంటగింపుగా వుండటం సహజమే. ఆనాటి నుంచి లగడపాటి ఏం మాట్లాడినా దుమ్మెత్తి పోయడం అన్నది తెలబాన్లకి అలవాటుగా మారింది.
తాజాగా-- రాష్ట్రంలో ఎన్నికలు వస్తే సమైక్య వాదులకి 240 ,వేర్పాటు వాదులకి 40 సీట్లు వస్తాయి -- అన్న లగడపాటి ప్రకటన పై తెలబాన్ శ్రేణులు శాపనార్ధాలు పెట్టటం ప్రారంభించాయి. తాను నిర్వహించిన సర్వే లో ఈ విషయం వెల్లడైందని రాజ గోపాల్ అంటున్నప్పుడు, చేతనైతే ఆ సర్వే అబద్ధమని నిరూపించాలి గానీ వ్యక్తిగత దూషణలకి దిగటం చేతకాని తనం. రాష్ట్రాన్ని విభజిస్తే ఏర్పడే పరిణామాలు అంటూ రాజ గోపాల్ చెప్పినవి అన్నీ శ్రీ కృష్ణ కమిటీ 8 వ అధ్యాయంలో వున్నవే. లగడపాటి సొంత సర్వే లని పక్కన పెడితే, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమిటీ రాష్ట్రంలోని పరిస్థితుల్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి సమస్యకి తగిన పరిష్కారాలని సూచించి ఆరు నెలలు గడిచి పోయాయి. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించటం మాని, శ్రీ కృష్ణ కమిటీ సూచించిన ఆరవ అత్యుత్తమ పరిష్కారం అమలు పరిచే చర్యలు చేపట్టాలి. గోర్ఖాలాండ్ మాదిరిగానే రాష్ట్రంలో వెనుక బడ్డ తెలంగాణా, ఉత్తరాంధ్ర, రాయల సీమల్లోని ప్రాంతాలకి ప్రత్యెక ప్యాకేజీలు ప్రకటించి వాటి సత్వర అభివృద్ధికి బాట వేయాలి. తద్వారా ఎటువంటి వేర్పాటు వాద ఉద్యమాలు భవిష్యత్తులో తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
వంట చేసి ఏం సాధించారు?

త్యాగాల వల్ల తప్ప వేరే విధంగా తెలంగాణా రాదని సెలవిస్తూనే వంటా వార్పూ అంటూ తెలబాన్ నాయకుడు చేసిన హడావిడికి అర్ధం పరమార్ధం ఏమిటో ఆయనకే తెలియాలి. ఓ పక్క కాంగ్రెస్, తెదేపా నాయకులని రాజీనామాలు చేయమని హుంకరిస్తూనే, తానూ, తన తెలబాన్ చెల్లి ఈ రోజుకి కూడా రాజీనామా ఊసు ఎందుకు ఎత్తరో ఏనాడు వివరించిన పాపాన పోలేదు. నిజంగా ఉద్యమం పట్ల చిత్త శుద్ధి, నిబద్ధత గల పెద్ద మనిషి ఐతే మొదటి సారి రాజీనామా తిరస్కరణకి గురి అయ్యాక మళ్ళీ సరైన ఫార్మాట్లో రాజీనామా ఇవ్వాలన్న విషయం ఎవరైనా చెప్పాలా? తాను పదవిని పట్టుకుని వేళ్ళాడుతూ ఇతరులని రాజీనామా చేయాలని వత్తిడి చెయ్యటం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాల కిందకే వస్తుంది. ఇలా వంటలు చేస్తూ, వసూళ్లు చేస్తూ ఉద్యమ నాయకుడుగా చెలామణీ కావటం బహుశా వేరెవరికీ సాధ్యం కాక పోవచ్చు. ఇక తెలబాన్ జే ఎ సి నాయకుడిదీ అదే తంతు! తన ప్రొఫెసర్ పదవికి రాజీనామా ఇవ్వడు కానీ.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు కట్టిన పన్నుల్లోంచి జీతం తీసుకుంటూ ఒక ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడతాడు. అనుకూలంగా మాట్లాడితే తప్పు లేదు. కానీ ఇతర ప్రాంతాల పై, ప్రాంతీయుల పై విద్వేషాగ్నుల్ని రగిలించడం క్షంతవ్యం కాదు. ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం కొత్తగా చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసి కొరివితో తల గోక్కునే అవకాశం లేనే లేదు. అది తెలంగాణా కాంగ్రెస్ నాయకుల డిల్లీ పర్యటనలో వారి పట్ల హై కమాండ్ చూపిన మర్యాదే తెలియ జేసింది. ఇంకా వంటా వార్పూ, డెడ్ లైన్, రాజీనామా అంటూ ప్రజలని ఏమార్చడం సాధ్యం కాదు. పైగా మిలియన్ మార్చ్ అంటూ పేర్లు పెట్టి జనాల్ని సమీకరించి రాష్ట్ర చారిత్రిక సంపద ఐన విగ్రహాలని కూల్చి వేయడం క్షమించరాని నేరం. ఇప్పటికే రాష్ట్రానికి కోలుకోలేని నష్టం జరిగి అభివృద్ధి అనేది ఆమడ దూరం వెళ్ళింది. ఇంకా ఇటువంటి అర్ధం పర్ధం లేని ఉద్యమాలని ప్రభుత్వం ఎంత మాత్రం సాగనీయకూడదు. రాష్ట్ర హితానికి వ్యతిరేకంగా, ప్రజలని అసౌకర్యాల పాలు జేసే విధంగా సాగే ఎటువంటి కార్య కలాపాలని అయినా ఉక్కు పాదంతో అణచి వేస్తేనే మళ్ళీ రాష్ట్రాభివృద్ధి గాడిలో పడుతుంది.
Saturday, June 11, 2011
దళిత కార్డు దుర్వినియోగం కాకూడదు..
ఎంపీ నన్న అహంకారంతో విద్యుత్ శాఖ ఉద్యోగి పైన నోరు పారేసుకున్న సర్వే సత్య నారాయణ ఉద్యోగుల సంఘీభావానికి తోక ముడిచి క్షమాపణ చెప్పారు. ప్రోటోకాల్ విషయమై తప్పు జరిగిందని ఆరోపిస్తూ విద్యుత్ శాఖ ఉద్యోగి పై బూతుల పంచాంగం విప్పిన పార్లమెంటు సభ్యుడు, ఆ శాఖ ఉద్యోగులు అందరూ సంఘీభావంతో
ఒక్కటిగా నిలబడటంతో దిక్కు తోచక కులం కార్డుని వెలికి తీసారు. ఎస్.సి. ఎస్.టీ. చట్టం కింద కేసు పెడతాననీ, స్పీకర్ కి ఫిర్యాదు చేస్తాననీ పరి పరి విధాల బెదిరించారు. అయినా కూడా ఉద్యోగులు వెరవక పోవటంతో తప్పని సరై క్షమాపణలు చెప్పారు. ఎంపీ స్థానంలో ఉన్న వాడే ఉచితానుచితాలు గ్రహించకుండా స్వల్ప వివాదానికి సైతం దళిత కార్డుని వాడ బూనటం ఔచిత్యం అనిపించుకోదు. ఎంపీ గారే కాదు. చాల మంది మన దేశంలో ఒక దళితుడిని తప్పు పడితే చాలు..అంబేద్కర్ ని అవమానించినంత హడావిడి చేస్తారు. పుట్టుక రీత్యా దళితుడైనంత మాత్రాన అన్ని తప్పులనించి ఇమ్యూనిటీ వున్నట్లు ప్రవర్తించటం మంచిది కాదు. రాజ్యాంగం తమకి కల్పించిన వెసులుబాటుని తమ పురోభివృద్ధికై వాడుకోవాలి గానీ ఇలా దుర్వినియోగం చేయడం కూడదు.
Monday, May 23, 2011
ఎస్ ఆర్ సీ బొమ్మలాట కాదు..
తెలంగాణా చిచ్చుని రగిల్చి ఇప్పటికే రాష్ట్రాన్ని అధో గతి పాల్జేసిన కేంద్రం తాజాగా సార్వత్రిక ఎన్నికల వరకు కాల యాపన చేయటానికి వీలుగా రెండో ఎస్.ఆర్.సీ అస్త్రాన్ని బైటకి తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణా విషయమై ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్న జగన్, చంద్ర బాబు లాంటి వారిని మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టటానికి కాంగ్రేసు కి ఉన్న ఈ అవకాశం జార విడుచుకోదు. తమ స్వార్ధ పూరిత రాజకీయాల కోసం తెలుగు వారిని చదరంగంలో పావుల్లా వాడుకోవటం, తెలుగు రాష్ట్రాన్ని ఎల్ల వేళలా వంచించటం కాంగ్రెసుకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఎస్.ఆర్.సీ పేరుతొ ఆడ బోయే నాటకం కూడా అదే. అయితే ఎప్పుడో 1955లోనే ఫజల్ అలీ నేతృత్వంలో ఏర్పడిన మొదటి ఎస్సార్సీ ఇక్కడి పరిస్థితుల్ని కూలంకషంగా అధ్యయనం చేసి తద్వారా ఇచ్చిన నివేదిక ఆధారంగానే విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. ప్రత్యెక తెలంగాణా, ప్రత్యెక హైదరాబాదు వాదనలు ఎంత డొల్లవో కమిషన్ ఆనాడే కుండ బద్దలు కొట్టింది. ఆ వివరాలన్నీ కమిటీ రిపోర్టు 369 నుండి 389 వరకు గల పేరాలలో వివరంగా చర్చించడం జరిగింది.
http://en.wikipedia.org/wiki/Para_369_to_389_of_SRC
పోనీ అర్ధ శతాబ్దం తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందనుకున్నా..తాజాగా కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమిటీ కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటమే అత్యుత్తమ పరిష్కారమంటూ తేల్చి చెప్పింది. అంతే కాదు. ఝార్ఖండ్, చత్తీస్ గడ్ వంటి చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల మావోయిష్టుల వంటి తీవ్రవాద దళాల చర్యలు పెచ్చుమీరటంతో పాటు రాజకీయ అనిశ్చితి కూడా సంభవమేనని సవివరంగా నివేదించింది. ఇప్పటికైనా కేంద్రం తెలుగు వారి భవిష్యత్తుతో, వారి అభివృద్ధితో ఆటలాడుకోవటం మానాలి. చేతనైతే సరైన పాలకుణ్ణి పెట్టుకొని సమైక్య రాష్ట్రం అభివృధికి తోడ్పడాలి. లేదా తమ వల్ల కాదనుకుంటే రాష్ట్రపతి పాలన విధించి అభివృది నిరోధకంగా మారిన వేర్పాటు వాదాన్ని తుదముట్టించాలి. లేని పక్షంలో తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు వాడి ఆగ్రహ జ్వాలకి కాంగ్రేసు పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో తుడిచి పెట్టుకు పోవటం ఖాయం.
Sunday, April 17, 2011
వెర్రి కుదిరింది..రోకలి తలకి చుట్టండి..
ప్రత్యెక రాష్ట్రం వస్తుందన్న ఆశ నానాటికీ సన్నగిల్లుతుండటంతో దైవం మీద భారం వేస్తూ శత చండీ యాగం చేసాడు తెలబాన్ దొర! తప్పు లేదు. ఇష్ట కామ్య సిద్ది కొరకు దైవ సహాయాన్ని అర్ధించడంలో అధిక్షేపించాల్సిన అవసరమే లేదు.
అయితే ఆకులో అన్నీ వడ్డించి అంచులో ..... రాసినట్లు యాగం చివరలో పిట్టల దొర చేసిన వ్యాఖ్యలు మన్నించ దగ్గవి కాదు. ఆంధ్ర బ్రాహ్మణులది ఆర్భాటమట! తెలంగాణా అర్చకులే నిష్ఠ గల వారట!
(షరా: ఆ వైద్యుడు కూడా ఆంధ్ర ప్రాంతంలో జన్మించి వుండకూడదు / విద్యాభ్యాసం చేసి వుండకూడదు. )
Thursday, April 14, 2011
కళ్ళు తెరిచిన ప్రభుత్వం!
ఇన్నాళ్ళకి రాష్ట్రంలో ప్రభుత్వం నేనున్నాను అంటూ అస్తిత్వం చూపింది.. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రభుత్వమంటే లెక్కే లేనట్లు ఇష్టానుసారం చెల రేగుతున్న వేర్పాటు వాద శక్తులకి ముకు తాడు వేసే దిశగా జీవో 177 విడుదల చేసింది. ఈ జీవో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికీ వర్తిస్తుంది. అయినా కూడా దీని పై తెలబాన్ నాయకులు, తెలంగాణా ప్రాంత ఉద్యోగులు గుమ్మడి కాయ దొంగ బుజాలు తడుముకున్నట్లు రచ్చ చేస్తున్నారు. అసలు ప్రభుత్వోద్యోగులందరికీ కాండక్టు రూల్సు, డిసిప్లినరీ రూల్సు అనేకం వుంటాయి. అవన్నీ సక్రమంగా అమలు జరిపితే ఇలాంటి జీవో ఇవ్వాల్సిన అవసరమే వుండదు. అయినా కూడా ఇన్నాళ్ళు సహనం వహించిన ప్రభుత్వం ఇప్పటికైనా కొరడా ఝుళిపించడం అభినందనీయం. రాజకీయ నాయకులు ఉద్యమాలు, ఆందోళనలు చేసారంటే అది వారి వ్యాపకం కాబట్టి ఆక్షేపించాల్సిన పని లేదు. అయితే తాము చేస్తున్న ఉద్యోగాలతో ఏ మాత్రం సంబంధం లేని ఆందోళనల కోసం విధులు ఎగ్గోట్టేసి తేరగా ప్రజల సొమ్ము భోం చేద్దామనుకొనే ఉద్యోగుల పట్ల ఇటువంటి చర్య సముచితమే. తెలబాన్ దొర వెంటనే స్పందిస్తూ ఈ జీవో ఇవ్వడానికి తెలంగాణా మంత్రుల ఆమోదం ఉందా అంటూ రంధ్రాన్వేషణ మొదలు పెట్టేసాడు! అంతే కాదు! తెలంగాణా మంత్రులంతా రాజీనామా చేయాలని హుకుం జారీ చేసేసాడు! నిజమే...తెలంగాణా మంత్రులే కాదు..తెలంగాణా ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులు కూడా (కోదండ రాం తో సహా) తమ తమ కొలువులకి రాజీనామాలు ఇచ్చేసి ఉద్యమంలో పాలు పంచుకుంటే ఎవరికీ ఏ విధమైన అభ్యంతరాలు ఉండబోవు. ప్రభుత్వానికి కూడా ఇలా కర్ర పట్టుకోవాల్సిన పని కూడా వుండదు.
Wednesday, April 13, 2011
శభాష్ దీదీ!
బెంగాల్ విభజనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని మమతా బెనర్జీ కుండ బద్దలు కొట్టారు. గోర్ఖాలాండ్ ఏర్పాటుకి తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకమని దీదీ స్పష్టం చేసారు. ఎన్నికల ముంగిట్లో....అందులో ప్రతి పక్షంలో ఉంటూ కూడా విధాన నిర్ణయం ధైర్యంగా ప్రకటించటం అభినందించాల్సిన విషయం.
ఈ మాత్రం చేవ, తెగువ మన వాళ్లకి వుంటే తెలంగాణా సమస్య కోతి పుండు బ్రహ్మ రాక్షసిలా తయారయి వుండేది కాదు. అంతే కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కావలసినది ఏమిటో శ్రీ కృష్ణ కమిటీ అరటి పండు వలిచి ఇచ్చినట్లు విశదీకరించాక కూడా ఒక విధాన నిర్ణయం తీసుకోకుండా మీన మేషాలు లెక్కిస్తున్న మన రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకి..ఎంత సేపూ స్వంత ఎజెండాలని అమలు చేసుకుంటూ పబ్బం గడుపుకోవడమే తప్ప సమస్య పరిష్కారానికి చిత్త శుద్ధి చూపడం తెలియదన్నది స్పష్టమై పోయింది.
Sunday, April 3, 2011
అతిశయోక్తికైనా హద్దు వుండాలి!
పెట్టుబడులకి అత్యంత అనువైన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అంటూ ప్రభుత్వం ఈ రోజు పత్రికల్లో విడుదల చేసిన ప్రకటన చూస్తె నవ్వాలో ఏడవాలో తెలీదు. ఓ పక్క తెలబాన్ల దెబ్బకి ఇప్పటికే ఉన్న వ్యాపార వాణిజ్య వర్గాలన్నీ దుకాణాలు కట్టేసుకోవడమో లేదా గుజరాత్ కి తరలి వెళ్లి పోవటమో చేస్తున్నాయి. ఇక కొత్తగా రాష్ట్రం కేసి తొంగి చూసే ధైర్యం ఏ వ్యాపార వేత్త కి లేనే లేదు. రాష్ట్రం లో ఆస్థిరతకి కారణమైన తెలబాన్ సమస్యని పరిష్కరించకుండా ప్రభుత్వం ఎన్ని మసి పూసి మారేడు కాయ చేసే ప్రకటనలు చేసినా ఏ వాణిజ్య వేత్త నమ్మే పరిస్థితి లేదు. కేవలం తెలబాన్ సమస్య పరిష్కారం కోసమే ఏర్పరచిన శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన అత్యుత్తమ ఆరో పరిష్కార మార్గం అమలు విషయమై శ్రద్ధ చూపి ఆ తరువాత ఇటువంటి ప్రకటనలు ఇస్తే అర్ధవంతంగా వుంటుంది. ప్రభుత్వానికి నిజంగా చిత్త శుధ్ధి వుంటే తక్షణం వేర్పాటువాదాన్ని కూకటి వేళ్ళతో పెకలించే దిశగా చర్యలు తీసుకొని, రాష్ట్రం లో ప్రశాంత పరిస్థితులు నెలకొలిపే ప్రయత్నం చేయాలి.
Subscribe to:
Comments (Atom)








