పని చేయని ప్రభుత్వోద్యోగులకి జీతాలివ్వాల్సిన పని లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన 1617 జీవో ని కొట్టివేస్తూ జీవో 177 అమలు పరచాల్సిందే అంటూ కొరడా ఝుళిపించింది. ఏడాదికి ఉన్న 365 రోజుల్లో 52 ఆది వారాలు, 15 పండుగ సెలవులు, ఇంకా కాజువల్ లీవు, ఐచ్చిక సెలవులు, గట్రాలతో మూడో వంతు పైన రోజులు వేతనంతో కూడిన సెలవులు ప్రభుత్వోద్యోగులకి లభిస్తున్నాయి. ఇక మిగిలిన రెండు వందల రోజులైనా సక్రమంగా పని చేయకుండా బందుల పేరుతొ, సమ్మెల సాకుతో పని ఎగ్గొడుతుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోటం శోచనీయం. ఉద్యోగులకి తాము ఉద్యోగంలో చేరేనాడు తెలియదా ..తాము ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వుద్యోగులమని? మరి ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులుగా ఉంటూ రాని తెలంగాణా వంకతో విధులు ఎగ్గొడితే అప్పనంగా జీతాలు ఇవ్వాలా? ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కోదండరాం రెండేళ్లుగా ఏం చేస్తున్నారు? ఆయనకి కాన్దక్టు రూల్సు వర్తించవా? అంతే కాదు. ఈ తీర్పు కేవలం ఉద్యోగులకే కాక - పని చేయని మంత్రులకూ, శాసన సభ్యులకి కూడా వర్తింప జేయాలి. శాసన సభ్యులందరికీ తెలుసు తాము ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ఉన్నామని! అలాగే మంత్రులకి కూడా తెలుసు.. తాము 23 జిల్లాలకు సేవ చేయాల్సిన బాధ్యత తమకి వుందని! అటువంటిది ఉద్యమం పేరుతొ విధులు ఎగ్గొడుతున్న మంత్రి వర్యులకి జీతాలు ఆపాలి. సౌకర్యాలు తొలగించాలి. కోర్టు సు మోటో గా ఈ విషయంలో కలుగ జేసుకొని పని చేయని ప్రొఫెసర్లకి,రాజకీయులకి తగిన గుణ పాఠం చెప్పాలి.
Wednesday, August 17, 2011
Sunday, August 14, 2011
ఇల్లలుకగానే పండుగ కాదు!
హైదరాబాద్.....23జిల్లాలతో కూడిన మన రాష్ట్రానికి రాజధాని... రాష్ట్రంలోని ప్రతి జిల్లా వారికి హైదరాబాద్ తో ఏదో ఒక విధమైన అనుబంధం/సంబంధం వుంది. ఆ విధమైన అనుబంధం ఉండబట్టే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి చెందిన వారు తమ మేధో సంపత్తిని, ఆర్ధిక వనరుల్ని వుపయోగించి ఈ నగరాన్ని దేశంలోనే ఐదో పెద్ద నగరంగా అభివృద్ది చేసారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో 8 లక్షల పై సంఖ్యలో ప్రజలు హైదరాబాదు నుండి స్వస్థలాలకి వెళ్లి వస్తారని వెల్లడి అవుతోంది. దీన్ని బట్టే చెప్పవచ్చు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి హైదరాబాదుతో గల అనుబంధమేమిటో! ఇలా అన్ని ప్రాంతాల వారి సమిష్టి కృషితో వచ్చిన అభివృద్ది ఫలాలని, తద్వారా వచ్చే ఉపాధి అవకాశాలని అన్ని ప్రాంతాల వారికి అందించటం న్యాయం. ధర్మం. కానీ తాజాగా తెలబాన్ల తల తిక్క ఆందోళనలకి లొంగి, రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ నియామకాల్లో 14-F నిబంధన రద్దుకి ప్రతిపాదించటం, దాన్ని రాష్ట్రపతి ఆదర బాదరాగా ఆమోదించేయటం దురదృష్టకరం. రాష్ట్రం మొత్తానికి అందాల్సిన వాటాని కేవలం ఆరో జోన్ కి మాత్రమె అందించ బూనటం అక్రమమే. పైగా రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడగానే తెలబాన్ శ్రేణులు పండగ చేసుకోవటం మరింత మూర్ఖత్వం. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మొత్తం తెలంగాణా ప్రాంతం జీడీపీ లో ఆరో వంతు కేవలం హైదరాబాదు నగరంనుంచే వస్తోంది. దీన్ని బట్టే హైదరాబాద్ పోటేన్సి ఏమిటో అర్ధం అవుతోంది. అంత ప్రాముఖ్యత గల హైదరాబాదుని అప్పనంగా కొట్టేయాలనే దుగ్ధతోనే కొన్ని వేర్పాటు వాద శక్తులు తెలంగాణా ఉద్యమాన్ని నడిపిస్తున్నాయి. రాష్ట్ర జనాభాతో పోలిస్తే ఆరో జోన్ లో వచ్చే ఎస్ ఐ ఉద్యోగాల సంఖ్య అతి స్వల్పం. ఇంకా ఆ కొద్ది పాటి ఉద్యోగాల కోసం ఆరాట పడాల్సిన అగత్యంకూడా లేదు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే. స్వల్ప విషయాలకే రాద్ధాంతం చేసి మిగతా ప్రాంతాల వారికి అన్యాయం చేయ తలపెట్టిన వారు రేపు ఖర్మ కాలి ప్రత్యెక రాష్ట్రం ఇస్తే హైదరాబాదులో సీమాన్ధ్రులని బతకనిస్తారా?? ఖచ్చితంగా లేదు అని వారి ప్రకటనలు, చేష్టలు నిరూపించాయి. నిరూపిస్తున్నాయి. కేంద్రం ఇకనైనా తాత్సారం చేసే ధోరణి కట్టి పెట్టి, విశాలాంధ్ర హితంలో ఆలోచించి, వేర్పాటు వాద ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచి వేయాలి. తద్వారా దేశంలో మరెక్కడా ఇటువంటి అభివృద్ది నిరోధక ఉద్యమాలు తలెత్తకుండా నివారణ చర్యలు తీసుకోవాలి.
Wednesday, August 10, 2011
తెలబాన్ చెల్లెమ్మ చిలక పలుకులు!
తెలంగాణా వచ్చుడో..కే సి ఆర్ సచ్చుడో... అని తెలబాన్ నాయకుడు ప్రకటించి ఎన్ని ఏళ్ళు గడిచిందో తెలీదు కానీ ఈ రోజు వరకు ఏదీ జరగలేదు. జరిగే అవకాశం కూడా కను చూపు మేరలో కనపడట్లేదు. అయితే ఉద్యమం పేరిట అమాయకుల (ఆత్మ) బలి దానాలు మాత్రం జరిగి పోతున్నాయి. హఠాత్తుగా ఈ విషయం విజయ శాంతికి ఎలా గుర్తుకి వచ్చిందో కానీ నిన్న తెలబాన్ మహిళల సమావేశంలో ఆమె తెలంగాణా కోసం ఎవరినీ బలి దానాలు చేయద్దనీ, అవసరమైతే, తానూ, అన్న కే సి ఆర్ చస్తమనీ చిలక పలుకులు పలికేసారు. తామంతా రాజీనామాలు చేస్తే భూకంపం వచ్చేస్తుందన్న బిల్డప్ ఇచ్చి తీరా ఈ రోజుకి కనీసం ఆ రాజీనామాల్ని ఆమోదింప జేసుకోవడం చేతకాని వారు ఏకంగా బలి దానాలు చేస్తామంటే నమ్మే స్థితిలో ఎవరూ లేరు. తెలంగాణా ప్రాంతంలో ఆధిపత్య పోరు కోసం కృత్రిమంగా జరిపించబడుతున్న ఈ ఉద్యమ కారణంగా యావత్తు రాష్ట్ర ప్రజానీకం ఇబ్బందుల పాలు, నవ్వుల పాలు కావటమే గాక రాష్ట్ర అభివృద్ది కూడా దశాబ్దాల వెనక్కి వెళ్లి పోయింది. తెలుగు వారే తేల్చుకుంటే ఇంకా కేంద్రం, హోం మంత్రి ఎందుకు? చావటానికా అని ప్రశ్నించిన తెలబాన్ చెల్లి నోటి దురుసులో అన్నకి ఏ మాత్రం తీసి పోనని నిరూపించింది. ఎంత పార్లమెంటు సభ్యులైతే మాత్రం కేంద్ర హోం మంత్రి గురించి ఇలా మాట్లాడడం నేరమే! కేంద్రం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, రోజుకో విధంగా విధ్వంసకర వ్యాఖ్యలు చేస్తున్న తెలబాన్ నాయకులని కట్టడి చేయాలి. అలాగే మార్చిల పేరుతొ, బందుల వంకతో నిత్యం ప్రజానీకాన్ని వేధిస్తున్న తెలబాన్ అనుచర గణం కూడా హద్దులు దాటకుండా చర్యలు చేపట్టాలి.
నయన తార మతం..ఎవరి అభిమతం?
సినీ నటి నయన తార హిందూ మతం స్వీకరించటం పై ఓ క్రిష్టియన్ సంస్థ కారాలు మిరియాలు నూరటం అర్ధ రహితం. పెళ్లి అయి, పిల్లలు గల వాడని, ఆస్తి అంతా మాజీ భార్యా బిడ్డలకే రాసిచ్చాడని తెలిసి కూడా ప్రభు దేవాని వివాహం చేసుకోవాలన్న నిర్ణయం తీసుకొన్న వ్యక్తికి, తాను ఏ మతం పాటించాలన్న విషయంలో కూడా నిర్ణయం తీసుకొనే విచక్షణ, స్వేచ్చ వుంటాయి. వ్యక్తిగత స్వేచ్చని మీరి, మత సంస్థలు చేసే ఇటువంటి ప్రకటనలు ఆక్షేపణీయం. అయినా గతంలో ఎంతో మంది హిందూ మతంనుంచి క్రిష్టియన్ మతానికి మారిన సంఘటనలున్నాయి. ఆ మార్పిడులన్నీ ఎటువంటి ప్రలోభాలు, ప్రేరణలు లేకుండానే జరిగాయని ఎవరైనా చెప్ప గలరా? మన రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్చ స్ఫూర్తిగా, పర మత సహనం పాటిస్తున్న హిందూ సమాజాన్ని రెచ్చ గొట్టే ఇటువంటి ధోరణులని కొనసాగించడం - మంచి తనాన్ని చేతగాని తనంగా తీసుకోవడమే అవుతుంది.
Friday, August 5, 2011
ఏమిటీ అరాచకత్వం?
(ఆంద్ర జ్యోతి, ఆగష్టు 5 , 2011 )
ఆంధ్రా ప్రాంత అధికారి నిర్బంధం :
నారాయణఖేడ్, ఆగస్టు4: తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రా అధికారులు విధులు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం ర్యాకల్ గ్రామ పంచాయతీ భవనంలో ఆంధ్ర ప్రాంతాని కి చెందిన వ్యవసాయాధికారిని గురువారం రెండు గంటల పాటు నిర్బంధించారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన శ్రీధర్ ఇటీవల నారాయణ్‌ఖేడ్ వ్యవసాయాధికారిగా బాధ్యతలు చేపట్టారు. విధి నిర్వహణలో భాగంగా ర్యాకల్ గ్రామానికి వెళ్లారు. దీంతో అక్కడికి చేరుకున్న తెలంగాణ నిరసనకారులు ఆంధ్రా అధికారుల వల్ల తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ.. శ్రీధర్‌ను గ్రామ పంచాయతీ భవనంలో నిర్బంధించారు. తెలంగాణ ప్రాంతంలో విధులు నిర్వహిస్తే ఇదే పరిస్థితి కొనసాగుతుందని వారు హెచ్చరించారు. 14ఎఫ్‌ను తొలగించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమాచారాన్ని గ్రామస్థులు ఎస్ఐ రవీందర్‌రెడ్డికి అందజేయడంతో ఆయన కలుగజేసుకొని నిర్బంధం నుంచి విడిపించారు.
--------
జడ్చర్ల, న్యూస్‌లైన్: జడ్చర్ల సీఐ విఠల్‌రెడ్డి లంచం తీసుకుంటుండగా.. ఏసీ బీ అధికారులు పట్టుకున్న సంఘటన జడ్చర్లలో తీవ్ర కలకలం రేపింది. విష యం తెలుసుకున్న కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, తదితర పార్టీలతో పాటు జే ఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐని కో స్తాంధ్రకు చెందిన హోటల్ యజమాని, ఓ టీవీ ఛానల్ కుమ్మక్కై అక్ర మంగా కేసులో ఇరికించారని వారు ఆరోపించారు. సీఐకి మద్దతుగా తెలంగాణ నినాదాలు చేస్తూ పోలీస్‌స్టేషన్ లోపలికి చొచ్చుకు వెళ్లారు. సీఐ విఠల్‌రెడ్డి, ఏసీబీ అధికారులు ఉన్న క్వార్టర్‌పై దాడి చేసి, కి టికీల అద్దాలను పగులగొట్టారు. లోపలికి ప్రవేశించి, ఫైళ్లను చింపివేశారు. ఏసీబీ డీఎస్పీ రఘుపతిగౌడ్, తది తర ఇన్‌స్పెక్టర్లను బయటికి లాక్కొచ్చి, తీవ్రంగా కొట్టారు. దాడిలో డీఎస్పీ రఘుపతిగౌడ్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఏసీబీ అధికారులను పో లీస్‌స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు. ఆందోళనకారులు అక్కడికి సైతం వెళ్లి, ఏసీ బీ అధికారుల పై దాడికి యత్నించారు. ఈ దశలో పోలీసు బలగాలు స్టేషన్ వద్దకు చేరుకొని, ఆందోళనకారులను స్టేషన్ బయటికి పంపించివేశారు. దీంతో ఆందోళనకారులు రహదారిపై రాస్తారోకో దిగి సీఐ కి మద్దతుగా, ఏసీబీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ శాసనసభ్యులు మల్లురవి, ఎంపీపీ నిత్యానందం, తది తర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పోలీస్‌స్టేషన్‌లో మకాం వేసి, పరిస్థితిని సమీక్షిం చారు. గాయపడ్డ ఏసీబీ అధికారులను అతికష్టం మీద ఆస్పత్రికి తరలిస్తుడగా ఏసీబీ అధికారుల వాహనంపై రాళ్లతో దాడి చేయడంతో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం ఎస్పీ సు ధీర్‌బాబు జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు వచ్చి, పరిస్థితి ని సమీక్షించారు. పలువురు డీఎస్పీలు, సీఐల నే తృత్వంలో ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.
హోటల్‌పై దాడి: పథకం ప్రకారమే సీఐని ఏసీబీ అధికారులకు ప ట్టించారని ఆరోపిస్తూ.. అందుకు కారణమైన త్రీ స్టార్ హోటల్ యజమాని రామ్మోహన్‌కు చెందిన హోటల్‌పై ఆందోళనకారులు దాడి చేశారు. కొత్తబస్టాండ్‌లోని హోటల్‌పై దాడి చేసి, అద్దాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అలాగే సమీపంలోని త్రీస్టార్ హోటల్‌పై దాడికి యత్నించగా, అక్కడ మోహరించి ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
హోటల్‌పై దాడి: పథకం ప్రకారమే సీఐని ఏసీబీ అధికారులకు ప ట్టించారని ఆరోపిస్తూ.. అందుకు కారణమైన త్రీ స్టార్ హోటల్ యజమాని రామ్మోహన్‌కు చెందిన హోటల్‌పై ఆందోళనకారులు దాడి చేశారు. కొత్తబస్టాండ్‌లోని హోటల్‌పై దాడి చేసి, అద్దాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అలాగే సమీపంలోని త్రీస్టార్ హోటల్‌పై దాడికి యత్నించగా, అక్కడ మోహరించి ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
--------
(ఆంద్ర జ్యోతి, ఆగష్టు,5 , 2011 )
బీఎస్ఎన్ఎల్ కార్యాలయ ధ్వంసం కేసులో 14 మందికి పదేళ్ల్ల జైలు
ప్రొద్దుటూరు, ఆగస్టు 5 : సమైక్యాంధ్ర ఉద్యమ నేపధ్యంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ధ్వంసం కేసులో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన పద్నాలుగు మంది ఉద్యమకారులకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2009లో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ధ్వంసం, లోపల పరికరాల కాల్చివేతపై కొండాపురం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి నేరం రుజువు కావడంతో నిందితులు 14 మందికి పదేళ్ల జైలుశిక్షతో పాటు 25 వేల రూపాయల జరిమానా విధిస్తూ ప్రొద్దుటూరు సీనియర్ సివిల్ జడ్జి ఎ.శ్రీనివాసకుమార్ శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే... సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకున్న క్రమంలో 2009 డిసెంబర్ 19న కొందరు ఉద్యమకారులు కొండాపురం పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని అడ్డుకుని లోనికి ప్రవేశించారు. కార్యాలయంలో అద్దాలు పర్నిచర్ ధ్వంసం చేసి, అక్కడ వున్న ట్రాన్స్‌మిషన్ పరికరంపై పెట్రోలు పోసి నిప్పుపెట్టారు. దీంతో బీఎస్ఎన్ఎల్ సంస్థకు సుమారు 2 లక్షల 32 వేలు నష్టం వాటిల్లిందంటూ ఆ సమయంలో విధులు నిర్వర్తిస్తున్న బాలమునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కొండాపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, కాల్చివేతపై చౌటపల్లె, పొట్టిపాడు, కొండాపురం, గండ్లూరు, రామచంద్రానగర్ తదితర గ్రామాలకు చెందిన 14 మందిపై అప్పట్లోనే కేసు నమోదైంది. ప్రొద్దుటూరు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతూ వచ్చింది. కేసులో నిందితులపై నేరం రుజువు కావడంతో కోర్టు ఈమేరకు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ముద్దాయిలు 14 మందిని ప్రత్యేక వాహనంలో కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
-------
ఒకే రోజు వచ్చిన పై మూడు వార్తలు చూస్తె ఏమనిపిస్తోంది? తెలబాన్లు ఉద్యమం ముసుగులో ఎన్ని అరాచకాలు చేసినా నిద్ర నటిస్తున్న ప్రభుత్వం, న్యాయ వ్యవస్థలు సమైక్యాంధ్ర వాదుల పై మటుకు తమ ప్రతాపం చూపిస్తున్నాయి. విధ్వంసం చేసిన వారిని సమర్ధించటం నా ఉద్దేశ్యం కాదు. అయితే ఈ న్యాయం అందరికీ సమంగా వర్తింప జేయాలి. జాగో-భాగో...నాలుకలు కోస్తాం...ఆస్తులు లాక్కుంటాం... తరిమి కొడతాం...ఇంకా సవా లక్ష విధ్వంసకర ప్రకటనలు చేసిన నాయకుల పై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. అంతెందుకు..సాక్షాత్తు దేశ రాజధానిలో టీవీ కెమెరాల సాక్షిగా విధుల్లో ఉన్న దళిత ఉద్యోగిని చితక బాదిన తెలబాన్ మేనల్లుడికి ఇంత వరకు ఇంత వరకు ఏ శిక్షా పడలేదు! దాంతో మరింతగా రెచ్చి పోయి పాఠ్య పుస్తకాల్లో మా తెలుగు తల్లి పాట ఉన్న పేజీలు చించి తగల పెట్టమని వదరుతున్నాడీ వీరుడు! ఆ ప్రకటన రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానించడం కాదా! సు మోటో గా న్యాయస్థానాలు ఇటువంటి ధిక్కార వైఖరులపై స్పందించవా? నానాటికీ వెర్రి తలలు వేస్తున్న వేర్పాటు వాదాన్ని ఏదో ఒక స్థాయిలో కట్టడి చేయక పొతే, మన రాష్ట్ర భవిష్యత్తు ఈశాన్య భారతంలో ఉన్న అత్యంత వెనుక బడ్డ రాష్ట్రాల కన్నా అధ్వాన్నంగా తయారయ్యే రోజు ఎంతో దూరంలో వుండదు.
Sunday, July 24, 2011
స్పీకర్ తప్పుడు నిర్ణయం!
భావోద్వేగాలలో చేసిన రాజీనామాలుగా చిత్రీకరిస్తూ తెలంగాణా ప్రాంత శాసన సభ్యుల రాజీనామాలని స్పీకర్ తిరస్కరించటం సరైన చర్య కాదు. గతంలో కూడా స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్డి వున్నప్పుడు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. కానీ ఆనాటి పరిస్థితులు వేరు. దొంగ దీక్షలతో మభ్యపెట్టి, అన్ని పార్టీల అంగీకారం ఉందన్న తప్పుడు సమాచారం అందించి రాత్రికి రాత్రి తెలంగాణా అనేసరికి ఒక్కసారిగా వచ్చిన భావోద్వేగ పరిణామమే సీమాంధ్ర శాసన సభ్యుల, ఎంపీల రాజీనామాలు! కానీ ఇప్పటి పరిస్థితి వేరు.. తెలంగాణా రావటంలేదన్న నిస్పృహ కావచ్చు.. లేదా నియోజక వర్గాల్లో తిరగనివ్వమన్న వేర్పాటు తీవ్ర వాదుల ఫత్వాలకి భయపడి కావచ్చు..రాజీనామా ఇచ్చిన వారంతా ఫలానా తేదీన ఇస్తామని ముందే చెప్పారు. ఆ విధంగానే చేసారు. ఇంక ఇందులో భావోద్వేగాలకు చోటెక్కడ? రాజీనామాలు తిరస్కరించటం అన్నది స్పీకర్ విచక్షణాదికారమే కావచ్చు. కానీ దానికి భావోద్వేగాల ముద్ర వేయటం తప్పు. ఇలా నిర్ణయించే ముందుగా శాసన సభ్యులందరినీ విడి విడిగా స్పీకర్ విచారించి వుంటే, వారిలో ఎందరు స్వచ్చందంగా రాజీనామా ఇచ్చారో, ఎంత మంది ఒత్తిడి కి లోనై ఇచ్చారో తేట తెల్లమయ్యేది! అలాగే కృత్రిమంగా కొనసాగింప బడుతున్న తెలంగాణా ఉద్యమం పట్ల ఆ ప్రాంత శాసన సభ్యుల నిబద్ధత కూడా బయట పడేది! రాష్ట్రాన్ని రావణ కాష్టంలా రగిలిస్తున్న ఉద్యమం పట్ల ఒక అంచనాకి వచ్చే అరుదైన అవకాశాన్ని స్పీకర్ చేజేతులా జార విడిచారనటంలో ఏ మాత్రం సందేహం లేదు. Thursday, July 21, 2011
అసెంబ్లీ రౌడీలు!
పై అధికారుల ఆదేశానుసారం తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ఏపీ భవన్ ఉద్యోగి పై, శాసన సభ్యుడినన్న అహంకారంతో ఒళ్ళు మదించిన తెలబాన్ మేనల్లుడు హరీష్ రావు చేసిన దౌర్జన్యం సహించరానిది. టీవీ కెమెరాల సాక్షిగా ఏపీ భవన్ ఓ ఎస్ డీ చంద్ర రావు పై హరీష్ రావు చేసిన దాడిని చూసిన దేశం మొత్తం నిర్ఘాంత పోయింది. చేసిన ఘన కార్యం చేసేసి, ఆనక తీరిగ్గా విచారిస్తున్నానంటూ క్షమాపణ చెప్పేస్తే చాలదు. ఇటువంటి అసెంబ్లీ రౌడీలని, అసెంబ్లీ రౌడీ సినిమాలో చూపించిన విధంగానే నడి వీధికి తెచ్చి, టీవీ కెమెరాల సాక్షిగా అదే ఉద్యోగి చంద్ర రావు చేత కుళ్ళ బొడిపించేయ్యటమే వారికి చెయ్యాల్సిన శాస్తి!
Wednesday, July 20, 2011
కాంగ్రేసు ని తెలుగు వారు క్షమించరు!
కేంద్రంలో యూ పీ ఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటానికి వెన్ను దన్నుగా మంది 33 మంది ఎంపీ లని అందించిన ఆంద్ర రాష్ట్రాన్ని ఏడాదిన్నర పాటు రావణ కాష్టంలా రగిలించాక, తీరిగ్గా ప్రణబ్ ముఖర్జీ గారు డిసెంబరు 9 ప్రకటన సమాచార లోపంతో ఇచ్చిన పొరపాటు ప్రకటనగా తేల్చేసారు. ఇదే విషయమై నేను రాసిన ఇంతకు ముందు టపా ఇక్కడ చదవచ్చు. http://andhraaakasaramanna.blogspot.com/2010/02/blog-post_17.html
ఆంద్ర ప్రదేశ్ లో స్వపక్షం లేదా విపక్షం ఎవరు అధికారంలో వున్నా కూడా మన రాష్ట్రం పట్ల కాంగ్రేసుకి ఎప్పుడూ సవతి తల్లి ప్రేమే! నిన్నటి వరకూ రాష్ట్ర విభజన విషయం తేల్చాల్సింది అధిష్టానమే-సోనియా నే అంటూ రాష్ట్ర నాయకత్వం భజన చేస్తుంటే చోద్యం చూస్తూ ఉండి....ఈ రోజు తెలుగు వారి సమస్యని తెలుగు వారే సామరస్యంతో పరిష్కరించుకోవాలంటూ సుద్దులు చెప్పటం కాల్చి వాత పెట్టి వెన్న రాసినట్లే ఉంది. ఇంతోటి పరిష్కారం చెప్పటానికి ఏడాదిన్నర సమయం తీసుకోవాలా? తదుపరి పరిణామాలు ఊహించకుండా తొందర పాటుతో డిసెంబరు 9 ప్రకటన చేసేసి, రాష్ట్రాన్ని తగల పెట్టి, అభివృద్ధిని దశాబ్దాల వెనక్కి నెట్టిన కాంగ్రేసు పార్టీని తెలుగు వారు ఎన్నటికీ క్షమించరు.
Sunday, July 17, 2011
దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి!
సీమాంధ్ర మంత్రి తోట నరసింహం పై తెలబాన్లు దౌర్జన్యం చేసిన దరిమిలా తమకు రక్షణ కరువైందని వాపోయిన మంత్రి టీజీ వెంకటేష్ రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ హరీష్ రావు చేసిన ప్రకటన దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లే ఉంది. ఆయన పై సు మోటో గా కేసు బుక్ చేయాలనీ, మంత్రి పదవినుంచి తొలగించాలనీ ఇంకా చాల డిమాండ్లు చేసారు. గురువింద గింజ మాదిరిగా ఆరోపణలు చేసే ముందు తమ కింద ఎంత నలుపు వుందో తెలుసుకోక పోవటం ఆశ్చర్యకరం! ఆంధ్రా వాలే భాగో....నాలుకలు కోస్తాం.. సీమాంద్రులని తరిమి కొడతాం... వారి ఆస్తుల్ని లాక్కుంటాం..ఇలా ఒకటా రెండా? ఎన్నెన్ని ప్రేలాపనలు! ఉద్యమం ముసుగులో ఏమి చేసినా, ఏమి వాగినా చెల్లి పోతుందన్న ధీమాలో చేసిన అకృత్యాలు ఎన్ని?
సు మోటో గా కేసులు బుక్ చేయాల్సి వస్తే ముందు తెలబాన్ల పైన బుక్ చేయాల్సిన కేసులు లెక్కకి అందవు.
గీతా ఆర్ట్స్ కార్యాలయాన్ని ఆక్రమించి తెలంగాణా బేనర్ కట్టటం... మర్యాద రామన్న షూటింగ్ అడ్డుకొని యూనిట్ సభ్యులతో బలవంతంగా జై తెలంగాణా అనిపించటం...అదుర్స్ సినిమాని ఆడనివ్వబోమని బెదిరించడం...వాహనాలపై టీజీ స్టికర్లు వుండాలని హుకుం లు జారీ చేయటం...రాష్ట్రం రాకుండానే రాజ ముద్రని చలామణీ లోకి తేవటం..ఇలా చెప్పుకుంటూ పొతే కేసులు బుక్ చేయాల్సిన సంఘటనలు కోకొల్లలు.
అవన్నీ ఒకెత్తు. శాసన సభ్యుడైన నాగం ని (తెలుగు దేశంలో వుండగా) చితక్కొట్టటం, నిజాల్ని నిక్కచ్చిగా మాట్లాడినందుకు టీవీ కెమెరాల సాక్షిగా కొట్టండి రా వాణ్ని అంటూ జే పీ పై భౌతిక దాడికి దిగటం, పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలని ద్వంసం చేయటం ఆటవిక చర్యలు కావా? వాటి పై చర్యలు తీసుకోకూడదా ?
అన్నిటికన్నా దారుణం..తెలుగు జాతి చరిత్రకి సగర్వ సాక్షులైన టాంకు బండ్ విగ్రహాల్ని ద్వంసం చేయటం. అందుకుగాను మిలియన్ మార్చ్ నిర్వాహకులని శిక్షించటం...ఆధ్వర్యం వహించిన పార్టీని నిషేధించటం చెయ్యాలి. కానీ అటువంటి చర్యలేమీ తీసుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చో బట్టే నేడు తెలబాన్లు ఉద్యమం ముసుగులో అరాచకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అలుసు పెచ్చు మీరటంతో, ప్రభుత్వంలో భాగమైన మంత్రినే వేలెత్తి చూపుతున్నారు. కానీ ఒక వేలెత్తి చూపితే, నాలుగు వేళ్ళు తమకేసే చూస్తాయన్న నిజం మూర్ఖ తెలబాన్లకి ఎప్పుడు అర్ధం అవుతుందో?
Thursday, July 14, 2011
అరాచకత్వానికి హద్దే లేదా?
రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అసలు ఇక్కడ ప్రభుత్వం అనేది పని చేస్తోందా అని సందేహం వస్తోంది. వేర్పాటు వాదం వెర్రి తలకెక్కి రైల్ రోకో అనగానే ప్రభుత్వమే ముందుగా రైళ్ళని రద్దు చేయటం చేతగాని తనమే. రైళ్ళ రద్దు వల్ల ఏర్పడే కోట్లాది రూపాయల నష్టానికీ, ప్రయాణీకుల కష్టాలకీ బాధ్యత ఎవరిది? ముమ్మాటికీ ఈ చేతకాని ప్రభుత్వానిదే.. ఉద్యమం ముసుగులో తామేం చేసినా చెల్లి పోతుందన్న అభిప్రాయం ఇప్పటికే తెలబాన్ల నర నరాల్లో జీర్ణించుకు పోయింది. దానికి తోడు ప్రభుత్వమే చేవ చచ్చిన రీతిలో ఇలా తోక ముడిచేయడం ఏ మాత్రం క్షంతవ్యం కాదు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ముందు తన ఉద్యోగులనే కట్టడి చేయలేక పోతోంది. ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటూ ప్రజా సేవ చేయాల్సిన ఉద్యోగులు అర్ధం పర్ధం లేని డిమాండ్లతో ఆగష్టు ఒకటినుండి పని చేయ బోమని బెదిరించటం ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన అలుసే. తెలుగు వారి చరిత్రకి సగర్వ సాక్ష్యాలైన టాంకు బండు విగ్రహాల్ని కూల్చిన వారిపై ఈ రోజు వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇక ఈ రోజు నల్గొండ జిల్లా చుట్టూ గోడ కట్టేస్తామని బెదిరించాడో మాజీ మంత్రి! అసలు తెలంగాణా ఉద్యమ వాదంలో సహేతుకత ఎంత వుంది, ఈ సమస్యకి అత్యుత్తమ పరిష్కారం ఏమిటి తదితర విషయాలన్నీ శ్రీకృష్ణుడు ఏనాడో కుండ బద్దలు కొట్టేసాడు. అయినా కూడా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తూ ప్రజలు ఇబ్బందుల పాలవుతుంటే చోద్యం చూస్తూ కూచోటం క్షమార్హం కాదు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా వేచి చూసే ధోరణి మాని రాష్ట్రం లో పరిస్థితులు గాడిన పడే వరకు రాష్ట్రపతి పాలన విధించాలి. శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన ఆరో అత్యుత్తమ పరిష్కారం అమలుకి చిత్త శుద్ధితో కార్యాచరణ సాగించాలి. తద్వారా దేశంలో ఇతర ప్రాంతాల్లో వేర్పాటు వాదాలు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవాలి.
Subscribe to:
Comments (Atom)







