రానున్న ప్రజా పధం కార్యక్రమంలో తెలంగాణా కోసం రాజీనామా చేయని ప్రజా ప్రతినిధులని నిలదీయాలని కే.సి.ఆర్. పిలుపునివ్వడం విచిత్రం. తన పార్టీకి చెందిన శాసన సభ్యులందరూ రాజీనామా చేసినా పదవిని పట్టుకు వేళ్ళాడుతున్న తానె అలా నిల దీయాల్సిన పక్షంలో మొదటి వ్యక్తిగా నిలబడాల్సి వస్తుందని ఆయనకి తోచలేదు కాబోలు! ఫాల్తూ కమిటీ అని చెడ తిట్టిన శ్రీ కృష్ణ కమిటీ కి నివేదిక ఇవ్వడమే గాక చర్చలు కూడా జరిపి వచ్చారు. మంచిదే. కానీ తిరిగి వచ్చిన వెంటనే కమిటీ నివేదిక అనుకూలంగా రాక పొతే అంతర్యుద్ధం తప్పదని హెచ్చరించడం సమస్యని మళ్ళీ మొదటికి తేవడమే! కేవలం ఉనికిని కాపాడుకోవటానికి చేసే ఇటువంటి కాల యాపన జిమ్మిక్కు రాజకీయాలు ప్రజలు గమనించడం లేదనుకోవడం పొరబాటు. ఇటువంటి పంధానే కొనసాగిస్తే ఇప్పటికే హైదరాబాదు నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడానికి మొహం చెల్లని ఆయన పార్టీకి ఏకంగా తెలంగాణాలోనే నూకలు చెల్లే రోజు వస్తుంది.
కమిటీ రిపోర్ట్ లో ఏముండాలో కూడా ఈయనే చెప్పేసాడా?మరి కమిటీ ఎందుకో?
ReplyDeleteKCR is a buffoon, politics is not interesting without him. :))
ReplyDeleteదిక్కుమాలిన కమిటీ ముందు మాట్లాడటానికి సమయమింకా కావాలని మారాం చేశారు, కనీసం 8రోజులైనా కావాలిట! లేదంటే ఏకధాటిగా 12గంటలైనా :))
ReplyDelete'దిక్కుమాలిన కమిటీ' కి వీళ్ళ పనికిమాలిన బ్రతుకుల్లో అంత ప్రాధాన్యత వుంది మరి! :P
baaga raasinav annaa.
ReplyDeleteబాగుంది.
ReplyDeleteశ్రీకృష్ణ కమిటీ పీకే గడ్డి కి టెండర్ వేయటానికి వెళ్ళాడా డిల్లీ కి?
ReplyDelete