Tuesday, April 27, 2010

ఆది కేశవుడి ఆగడాలకు అడ్డు లేదా?

             కేవలం తిరుమల దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి కోసమే పార్టీ ఫిరాయించి ఆ పదవిని పొందిన ఆదికేశవులు నాయుడు దేవస్థానం విషయంలో చేస్తున్న ఆకృత్యాలకు  అంతే లేకుండా పోతోంది. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన అనంత స్వర్ణ మయం పధకానికి హై కోర్టు అడ్డు చెప్పినా కూడా ఇంకా ఆ పధకం పట్ల  ఆయన ప్రత్యెక శ్రద్ధ చూపడం  పట్ల ఎవరికైనా అనుమానాలు రాక తప్పదు. తాజాగా నిన్న - సామాన్య భక్తులందరికీ కొండ ప్రవేశం నిషిద్ధమైన వేళలో - తానె దగ్గరుండి అంబానీ కుటుంబాన్ని కొండ పైకెక్కించి, ఆలయ ప్రవేశం చేయించి సకల మర్యాదలు  చేయడంలో అర్ధం, పరమార్ధం ఏమిటి? పైగా కోర్టు కేసు క్లియర్ అయితే ఈ పధకానికి బంగారం విరాళంగా ప్రకటిస్తామని అంబానీలు ప్రకటించటం నిజంగా సిగ్గు చేటు. తన ఆలయాన్ని స్వర్ణ మయం చేయమని ఆ దేవుడేమీ కోరలేదు. ఈ అంబానీలు ఇచ్చే బంగారానికి ఏమీ ఆయన మొహం వాచి లేడు. కార్య నిర్వహణ అధికారిగా కృష్ణారావు గారు వచ్చిన దగ్గరనించి, ఆయన చేస్తున్న సంస్కరణలకు అడుగడుగునా అడ్డు తగులుతూ, స్వంత ప్రయోజనాల కోసం  ఆలయ మర్యాదలని మంట గలుపుతున్న ఆది కేశవుని కబంధ హస్తాలనుంచి టీ.టీ.డీ.  ఎప్పుడు విముక్తమవుతుందో?

5 comments:

  1. >>కోర్టు కేసు క్లియర్ అయితే ఈ పధకానికి బంగారం విరాళంగా ప్రకటిస్తామని అంబానీలు ప్రకటించటం నిజంగా సిగ్గు చేటు.

    Deenilo tappemito ardham kaaledandi naaku.

    ReplyDelete
  2. అంబానీలకి నిజంగా చిత్త శుద్ధి వుంటే ఇవ్వదలుచుకున్న బంగారం/కానుకలు దేవునికి హుండీలో సమర్పించేయాలి కానీ కోర్టు కేసులతో లింకు పెట్టకూడదు. అంటే సదరు పధకం పై వారికి కూడా నమ్మకం లేనట్లే కదా! అందుకనే చిత్త శుధ్ధి లేని శివ పూజలాగా వారు చేసిన యాత్ర ఫలితం దక్కలేదు- వారి క్రికెట్ జట్టు వొడి పోయింది కదా!

    ReplyDelete
  3. కోర్ట్ కేసు గెలవనిచ్చాడు కాబట్టే మొక్కు తీర్చుకున్నాడు, ఇందులో ఎవరిది తప్పు/ఒప్పు!!? సారానాయుడికి నిత్యదర్శన భాగ్యం కలిగే పదవి వుంది , ఇందులో ఎవరిది తప్పు/ఒప్పు!!?
    అయినా అజ్ఞాతను నాకెందుకులేండి , గోవింద గోవిందా! :)

    ReplyDelete
  4. వీళ్ళందరిని ఏం చేయాలండి? మనం చూస్తూ ఊరుకోవల్సిందేనా?

    ReplyDelete
  5. Aakasa Ramanna గారూ...,

    నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
    ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
    నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
    మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

    తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
    తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
    హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

    మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

    - హారం ప్రచారకులు.

    ReplyDelete