సామాన్య భక్తులకి కనీసం రెండు సెకనులు కూడా కళ్ళారా స్వామిని చూడనీయకుండా మహా లఘు అని, మహా మహా లఘు అని పేర్లు పెట్టి గెంటి వేసే టీ.టీ.డీ. అధికార గణం ఈ రోజు విజయ్ మాల్య కోసం రెండు గంటలు క్యు లైనులని ఆపెశారన్న వార్త వింటేనే పట్టరాని ఆగ్రహం వస్తోంది. ఇంక ఆ రెండు గంటలు పిల్లా పాపలతో నిలబడి పోయిన భక్తుల అవస్థలు ఆ భగవంతుడికే ఎరుక! అసలు ఒక మద్యం వ్యాపారికి ఆలయ నిర్వహణ పగ్గాలు అందించడమే తప్పు. అధికారం చేతిలో వున్నప్పుడు తోటి మద్యం వ్యాపారికి ఎర్ర తివాచీలు పరచటంలో ఆశ్చర్యం లేదు. పీ.వీ.ఆర్.కే.ప్రసాద్, కామి శెట్టి శ్రీనివాసులు వంటి నిబద్ధత గల (మాజీ) అధికారులని-- వయసై పొయిందనో లేదా కోర్టు చెప్పిందనో వంకతో వేటు వేసిన ఆలయ అధికార గణం ... ఎ అర్హత వుందని - భోగ లాలసుడిగా పేరు పడ్డ ఈ మద్యం వ్యాపారికి రాచ మర్యాదలు చేసారో అవస్థలు పడ్డ భక్త జనులకి వివరణ ఇచ్చి తీరాలి.
just want to add P.R.K Prasad is Rtd. IAS and one of the good officer in PV's PM office. He is behind the naming of longest express highway in Hyderabad.
ReplyDeleteTTD's wrong decission definitely missing his services.
"..........ఎ అర్హత వుందని - భోగ లాలసుడిగా పేరు పడ్డ ఈ మద్యం వ్యాపారికి రాచ మర్యాదలు......."
ReplyDeleteఇప్పుడున్న టిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ ఎవరూ? ఒక మద్యం వ్యాపారి. తన తోటి మద్యం వ్యాపారికి మర్యాదలు చేయటంలో ఆశ్చర్యం ఏమున్నది.
అసలు ఒక మద్యం వ్యాపారిని టిరుపతి తిరుమల దేవస్థనం వంటి అధ్యాత్మిక కేద్రానికి చైర్మనుగా వేసినవాడిని చెప్పుచ్చుకు కొట్టాలి.
కనకపు సిం హాసనం మీద శునకాన్ని కూర్చొపెడితె అది తొటి శునకాలని పట్టించుకుంటుంది కానీ సామాన్య భక్తుల సంగతి దానికెందుకు?
ReplyDeleteరెండు సంవత్సరాల క్రితం మేము తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే జరిగింది. గర్భగుడిలొకి వెళ్ళెముందు జరిపే చెకింగ్ పాయింట్ దగ్గర మమ్మల్ని దాదాపు గంట సేపు పైన ఆపెసారు. కారణం విజయ్ మల్యా, నేపాల్ రాజు గారు వగైరాలు వచ్చారు. మెము ఇక్కడ క్యూలొ అవస్థలు పడుతూంటే వారు పక్క లైనులొంచి హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపొయారు. ముందే రిసర్వ్ చెసుకుని వెళ్ళని కారణంగా దాదాపు రెండు-మూడు గంటలు దర్శనం టికట్ కీ, దాదాపు అంతె సెపు దర్శనానికీ లైన్లలో నించుని ఉన్న మాకూ, మిగతావారికీ ఇది చూసి చాలా కోపం వచ్చింది. చాలా మంది భక్తులు ముడుపులు కట్టిన నాణేల మూటలు నెత్తిన పెట్టుకుని ఎంతో ఒపికగా దేవుడిని చూడటానికి వేచి ఉన్నారు. ఆ మూటలు కింద పెట్టలేకా, గంటల తరబడి మోయలేక చాలా అవస్థ పడ్డారు. ఇంక చిన్నపిల్లల తల్లితండ్రులూ, పెద్దవారూ.. వీరి సంగతి చెప్పక్కర్లేదు. దేవుడు, ట్రాఫిక్ మరియూ డెత్ గొప్ప లెవెలెర్స్ అంటారు మరి ఇదేమిటో??
ReplyDeleteసారాయి అమ్ముకొనే వాడికి దేవస్థానం పగ్గాలు అప్పగిస్తే ఇలాగే ఉంటుంది.
ReplyDelete"అసలు ఒక మద్యం వ్యాపారికి ఆలయ నిర్వహణ పగ్గాలు అందించడమే తప్పు. "
ReplyDelete"అసలు ఒక మద్యం వ్యాపారిని టిరుపతి తిరుమల దేవస్థనం వంటి అధ్యాత్మిక కేద్రానికి చైర్మనుగా వేసినవాడిని చెప్పుచ్చుకు కొట్టాలి."
"సారాయి అమ్ముకొనే వాడికి దేవస్థానం పగ్గాలు అప్పగిస్తే ఇలాగే ఉంటుంది."
-ఈ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. ఇంకోటేంటంటే.. ప్రస్తుత తితిదే చైర్మనుపై వాన కురిసినా ఆయన పట్టించుకోడు, అంచేత రేపు మళ్ళీ ఇదే పని చేసినా చేస్తాడు.
చెప్పిచ్చుకుని కొట్టాలి
ReplyDeleteనిజమే ! ఎవరు కొట్టాలి ? ఆకొట్టటానికి కాదుకదా ,కనీసం నిలదీసి ప్రశ్నించేందుకు తమ సమయాన్ని వెచ్చించి ముందు కొచ్చేదెవరు ? కనీసం వాల్ల అనాారాలపై ఒక వమ్దరూపాయలు ఖర్చెట్టి ఒక పిటీషన్ కోర్ట్లో వెయ్యాలనుకునే దెవరు. ఒక్క ఫోన్ కాల్ లేక క మెయిల్ పంపటానికి ప్రయ్త్నిస్తున్నదెందరు ?
వాస్తవానికి పుణ్యక్షేత్రాలన్నీ వ్యాపార క్షేత్రాలు కావటానికి కారణం హిందువులలో ఉన్న ఈ నిరాసక్తతే ప్రధాన కారణం . మనం ప్రశ్నిస్తామని తెలిస్తే కదా వాళ్ళు భయపడేది .