రామ్ చరణ్, ఉపాసన ల నిశ్చితార్ధం అత్యంత వైభవోపేతంగా జరిగింది. సంతోషం. కానీ ఈ నిశ్చితార్ధ వేడుకల్లో జరిపించిన పూజ కార్యక్రమం సక్రమంగా లేదు. కామినేని ఉపాసన తాను కుర్చీలో కూర్చొని, దేవతని తన కాళ్ళ దగ్గర వుంచి పూలు విసురుతూ చేసిన పూజ దైవాపరాధమే అవుతుంది. కనీసం పూజ కార్యక్రమం జరిపించిన బ్రాహ్మణోత్తములకైనా ఇది తప్పుగా కనపడలేదా?
రామన్న గారు
ReplyDeleteఆమె కాదు, రాంచరణ్ కూడా అలాగే చేసాడు. ఇక బ్రాహ్మణులంటారా అంతా కలి ప్రభావం. ఎవరికి నియమాలు తెలియటం లేదు. లేదా ఎందుకొచ్చిన గొడవ అని వదిలేసి ఉంటారు.
yes we also thought same thing.It is money power.What to do.
ReplyDeleteఆకాశరామన్న గారూ...మీరు గమనించి వ్రాసిన విషయం చాలా సున్నితమైనది...అంతేకాదు...నిర్దుష్టమైన పూజా విధానానికి సంబందించినదిగా నేను చదివి నట్లు గుర్తు...
ReplyDeleteమీరు చెప్పినది కరెక్టే..
పూజ చేస్తున్నప్పుడు ఆసనానికి కూడ అత్యంత ప్రాముఖ్యత ఉంది. అందుకె ఆసనం గురించి ఈ క్రింది విధంగా చెప్పబడింది....
ఆత్మసిద్ధి ప్రదానాశ్చ సర్వరోగనివారణం
నవసిద్ధి ప్రదానాశ్చ ఆసనం పరికీర్తితం
ఆత్మజ్ఞానాన్ని కలిగించడానికి, సర్వరోగాలను నివారించడానికి, నవసిద్ధులను ప్రాప్తింపజేయడానికి, ‘ఆసనం’ అవశ్యమైయున్నదని చెప్పబడుతోంది.
ఇక ‘ఆ’ అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తూ, ‘ స ‘ అంటే సర్వరోగాలను హరిస్తూ, ‘నం’ అంటే నవసిద్ధులను ఇచ్చేదని అర్థం.
ఆ రోజులలో పులిచర్మాన్ని, కృష్ణాజినం, కంబళి, దర్భాసనం, పట్టు వస్త్రం, నూలువస్త్రాలను ఆసనాలుగా ఉపయోగించేవారు.
నేటి పరిస్థితులకు తగినట్లుగా పులిచర్మం, కృష్ణాజినం తప్ప మిగితావాటిని అసనాలుగా ఉపయోగించుకోవచ్చుట .
ఆశ్చర్యకరంగా ఉండొచ్చు కానీ...ఉపాసన,రాంచరణ్ లు ఒక పీఠం మీద కూర్చుని పూజ చేయడం పూజా విధానంలో అంగీకరించథగిన విషయమే....
ఫూజ చేసే సమయంలో నేలమీద కూర్చుని పూజ చేయకూడదని పెద్దలంటారు. పూజ, వ్రతాలు, నోములు ధ్యానం, స్తోత్రాదులు చేసేటపుడు భగవంతునికి ఎదురుగా ఆసనం మీద ఆసీనులు కావాలంటారు. ఉచితాసనం పైన కూర్చునే ధార్మిక కార్యాలు చేయాలని బ్రహ్మాండపురాణం చెప్తోంది. ఆసనం లేకుండా చేసే పూజ దైవకార్యాలు ఎటువంటి ఫలాన్ని ఇవ్వవని శ్రాస్తంచెప్తోంది.
ఇలా ఉచితాసనం అంటే ఎటువంటి ఆసనం ఉండాలన్నధర్మసందేహానికి సమాధానం బ్రహ్మాండపురాణమే వివరాలను అందిస్తోంది.
దేవాలయాల్లో పూజారులు నేలపైన ఒకవేళ నేలపై కూర్చుని పూజచేసినట్లు అయితే వారికి కష్టాలు, మానసికవేదన, చిత్త్భమ్రబాధలు, దుఃఖాలు కలుగుతాయట. అందుకనే వారు జింకచర్మం, పులిచర్మం లాంటివి ఆసనాలుగా ఉపయోగిస్తారు. రాతి మీద కూర్చుని పూజచేస్తే అనారోగ్యాలు కలుగుతాయి. చెక్కపైన కూర్చుని చేస్తే దురదృష్టం సంపద నష్టం లాంటివి కలుగుతాయి. గడ్డిపైన కూర్చుని పూజచేస్తే ఇతరులనుంచి అవహేళన, అమర్యాద కలుగుతాయి. వెదురు చాపపై కూర్చుని పూజించడం కూడా దారిద్య్రానికి గురౌతారు. బట్టపైన కూర్చుని పూజచేస్తే హాని కలుగుతుంది. ప్రత్యేకంగా పూజకోసమే తయారుచేసుకొన్న పుల్లల చాపపైన కూర్చుని చేసే అదృష్టం, సంపదవృద్ధి కలుగుతాయి. ఏకాగ్రత కలుగుతుంది. కృష్ణజింకచర్మం పైన కూర్చుని పూజ చేయడం సర్వ శ్రేష్ఠం అంటారు. తివాచి పైన కూర్చుని కూడా పూజ చేయవచ్చు. దీన్ని కూడా పవిత్రంగానే భద్రపరుచుకోవాలి. అలానే ఎరుపు రంగు కంబళిపైన కూడా కూర్చుని పూజచేయవచ్చు.
దీన్ని బట్టి పూజ చేసేందుకు మనసు తో పాటుగా ఆసనం కూడా కావాల్సిందే. సుఖాసనంలోనే భగవంతుని నామాన్ని స్థిరంగా మననం చేయవచ్చుగదా.
ఇదంతా యెంతవరకు కరెక్టు అనే విషయం మీద నేను వివరించడంలేదు....బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిందని చదివాను ...భక్తి అనే శీర్షికలో...ఒక వార్తా పత్రికలో...కొన్నాళ్ళక్రితం....
అయితే కాళ్లకు దగ్గిరలో భగవంతుని ప్రతిమ ఉంచి పుష్పాలను వదులుతూ పూజ చేయడం ....ఒకింత విస్మయాన్ని కలిగించిన మాట వాస్తవమే...శాస్త్రాలు చదివిన పండితులు మాత్రమే చెప్పగలరు......
ఈ విషయాల మీద చర్చ అంత అవసరం కాదు అనిపించినా... పూజ అనేది పూర్తిగా..వ్యక్తిగత విషయం...శాస్త్ర పరంగా ఇన్ని విషయాలు ఉన్నాయని చదివిన తర్వాత....అవి వ్రాసానంతే...
ఇలాంటి విషయాల్ని వదిలేసి...మరో మంచి సాంఘిక విషయం మీద ద్రుష్టి సారించి...సంధించండి మీ భావ శరాన్ని...కొనసాగిద్దం...ఆవిషయం పై చర్చని...చర్చని...