పచ్చగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం భగ్గుమనటం మొదలై నేటికి రెండేళ్ళు! కేంద్రం లోని యూపీఏ ప్రభుత్వానికి ఆక్సిజన్ లాగా 32 మంది ఎమ్పీలని అందించిన ఆంధ్ర రాష్ట్రానికి మేడం జన్మ దిన కానుకగా ఇచ్చిన మర్చి పోలేని కానుక ఇది....దొంగ దీక్షలకి మోస పోయి, తెలుగు వారిని విడ దీద్దామని ప్రకటించి భంగ పడిన రోజు ఇది....నాడు రగిలించిన రావణ కాష్టం నేటికి కూడా ఆరకుండా తెలుగు జాతి పరువు ప్రతిష్టలను నడి బజారున పడేస్తుండటం మిక్కిలి బాధాకరం. తాజాగా శాసన సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా మజ్లిస్ నాయకుడు ఒవైసీ ప్రసంగం ఇక్కడ గమనార్హం. తమది సమైక్య వాదమే అని కుండ బద్దలు కొట్టిన మజ్లిస్ నేత, గత రెండేళ్లుగా వచ్చిన 30 వేల కోట్ల రూపాయల నష్టానికి బాధ్యులెవరని నిలదీశారు. (30 వేలన్నది మజ్లిస్ లెక్క. వాస్తవానికి మనం నష్ట పోయింది ఇంకా ఎక్కువ.) అలాగే హైదరాబాద్ బ్రాండ్ నేం ఏమయి పోయిందని ఆవేదన వెళ్లగక్కారు. నిజమే.. రెండేళ్ళ క్రితం వరకు మన హైదరాబాదు నగరం అభివృద్ది విషయంలో దేశంలో ఐదవ స్థానం.. మరి ఇప్పుడు? చెప్పుకుంటే సిగ్గు చేటు. దీనికి బాధ్యులెవరు? ఇంకెవరు? పర్యవసానాలు ఆలోచించకుండా తెలుగు జాతిని ముక్కలు చేసే ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీదే ఈ బాధ్యత. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న చందంగా తొందర పాటు ప్రకటన చేసేసి..ఆనక వెనక్కి తీసుకొని తద్వారా రాష్ట్రాన్ని ఉద్యమాల ఊబిలోకి దించి..తెలుగు ప్రజలందరికీ కష్ట నష్టాలని కలుగ జేసిన కాంగ్రెస్ పార్టీని తెలుగు జాతి ఎన్నటికీ క్షమించదు.
ఏల క్షమించుటీ వికట హీన మనస్కుల రాజకీయులన్
ReplyDeleteవేలకు వేలకోట్లనగ విత్తము నష్టము వీరి పుణ్యమే కదా
మేలుకు మారుగా కపట మెంతగ జేసిరి వీరివల్ల ఛం
డాలపు పేరువచ్చిన దుదారత నుండెడి యాంధ్రజాతికిన్
@ శ్యామలీయం:
ReplyDeleteతెలుగు జాతి ఆవేదనని అచ్చ తెలుగు పద్యంలో చక్కగా వివరించారు...కృతఙ్ఞతలు.
ఉదయా ,
ReplyDeleteనీవు అలిగి పుట్టింటి కి వెళ్ళిపోయావు. నీవు వెళ్ళిన దగ్గర నుండి బయట ముగ్గు లేదని ప్రక్కింటి సుబ్బమ్మ గారు రోజూ నీ గురించి అడుగుతున్నారు. పని అమ్మాయి రావడం లేదు రోజూ ఆఫీసు నుండి ఇంటికి వచ్చి నా బట్టలు, అంట్లు నేనే తోముకుంటున్నాను. రోజూ బయట తినడం వల్ల డబ్బు ఖర్చు అవడమే కాకుండా నా ఆరోగ్యం కూడా చెడిపోయింది. తాళాలు వేసుకుని ఆఫీసుకి వెళ్ళాలంటే రోజూ ఆలస్యం అయిపోతున్నది. బ్యాంక్ చెక్ బుక్ ఎక్కడ పెట్టావో కనపడటం లేదు. ఇల్లు తుడవాలన్నా కష్టం గా ఉంది. మొక్కలు ఎండిపోతున్నాయి. వంట కి ఇబ్బంది గా ఉంది రోజూ బ్రెడ్ తినలేక పోతున్నాను. నువ్వు రుబ్బి పెట్టిన ఇడ్లీ పిండి అయిపోయింది, సాంబారు కూడా అయిపోయింది. ప్రొద్దున్న, సాయంత్రం బయట తినడానికి మనసొప్పడం లేదు, బద్దకంగా ఉంటోంది. ఇస్త్రీ కూడా నేనే చేసుకోవలసి వస్తోంది. ఇన్ని పనులు ఇంట్లో ఉంచుకుని హాయిగా నీ పుట్టింట్లో కూర్చున్నావు, నీకసలు బాధ్యత లేదు, సంసారం మీద ఇంట్రెస్టు లేదు. ఇటువంటి దాన్ని కని నా మీదకి తోలినందుకు మీ నాన్న ని అనాలి .........
ఇలా రాస్తే ఏ పెళ్ళానికయినా భర్త దగ్గరకి తిరిగి వెళ్ళాలని అనిపిస్తుందా ????
ఎంతసేపూ "తన్ హాయీ" కోసం "పరవళ్ళు" తొక్కుతారే కానీ , పెళ్ళాన్ని దారిలోకి తెచ్చుకునే తరీకా నేర్చుకోరు !!!
-----------------
మీరు చెప్పేది కూడా అలాగే ఉంది, కలిసి ఉందామంటారు, తెలబాన్లు అంటారు, ఖర్చు అయిపోయింది అంటారు. మంటపెట్టి ,సెగ కాచుకోవాలనుకుంటారు. అవ్వా కావాలి.... బువ్వా కావాలి.
"తెలంగాణా" వాళ్ళు అమాయకులు, ఒక్కరు తిట్టారని అందరినీ ఒకే గాటన కట్టకండి. వారి మనసులను గెలుచుకునే ప్రయత్నం చేయండి చేతనయితే !!!!!
@ నీహారిక : మీరు చెప్పింది నిజమే. తెలంగాణా ప్రజలు అమాయకులే. వారి మనసులని విష పూరితం చేసి, తెలంగాణేతర ప్రజల పట్ల, ప్రాంతాల పట్ల నర నరానా విద్వేషం చిమ్మేలా సామరస్య వాతా వరణాన్ని కలుషితం చేసిన తెలబాన్లకే మా విమర్శలు, ఉత్తర ప్రత్యుత్తరాలు వర్తిస్తాయి. వేర్పాటు వాద వెర్రి తలకెక్కిన కొద్ది మంది తెలబాన్లు తప్ప తక్కిన అమాయక తెలంగాణా వాసులందరూ సమైక్యాంధ్ర లో భాగమే...
ReplyDeleteNovember 1, 1956 is the black day.
ReplyDeleteనీహారిక...మీ ఊహలకి జోహారిక..
ReplyDeleteబాగా చెప్పారు. కానీ శాంతివచనాలు చెప్పేవారికి తెలబానులు ఇచ్చే బహుమానం ఏంటో చెప్పగలరా ?
ఒక సీనియర్ మంత్రి..పరకాల ప్రభాకర్ కు చేసిన తెలంగాణా సన్మానం చూసాం కదా.. కనీసం 'మాట' కూడా వినని తెలబానులకు ఏమి చెప్పమంటారో మీరే సెలవీయండి మీ 'ఊహాశక్తి' తో...
/ఒక్కరు తిట్టారని అందరినీ ఒకే గాటన కట్టకండి. /
మనుషుల భాష ఉపయోగించే తెలంగాణా రాజకీయ నాయకుడిని కనీసం ఒక్కడిని చూపించగలరా మీరు ?
/మనసులను గెలుచుకునే ప్రయత్నం చేయండి చేతనయితే /
తెలబానుల బూతులకు గాయపడిన మనసులు అటువైపుకూడా ఉంటాయి. ఆలొచించండి కాస్త..
మొత్తానికి మనసులు గెలిచే పని కూడా మాదే నన్నమాట .. బాగుందండీ..ఊహాశక్తి దండిగా ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రయత్నం చేయవచ్చునేమో..
/అవ్వా కావాలి.... బువ్వా కావాలి. /
కసబ్, ఒసామా గాళ్ళు చచ్చి ప్రపంచం శాంతియుతం గా ఉండాలనుకోవడం స్వార్దమేమీ కాదులెండి. ఆ కోరిక కోరే వాళ్ళను 'ఆశపోతు' అని ఎవరూ అనరు...'ఊహాశక్తి' మరీ ఎక్కువైన వాళ్ళు తప్ప..