కేంద్రం లో యూ పీ ఏ ప్రభుత్వానికి ఆక్సిజన్ లాగా 33 మంది ఎమ్పీలని అందించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి కేంద్ర మంత్రి ముందు ఏ భంగిమలో ఉన్నాడో చూడండి...ఒక పక్క రైల్వే సౌకర్యాలన్నీ ఇతర రాష్ట్రాల వాళ్ళు తన్నుకు పోతూ మనకి ముష్టి విదిలిస్తున్నా అడిగే దిక్కు లేదు...అలాగే కనీసం మన సొంత గ్యాస్ కూడా మనం వాడుకునే స్వాతంత్ర్యం లేదు.. (మన గ్యాస్ ని గద్దలా తన్నుకు పోదామని ప్రయత్నించినపుడు పెట్రోలియం శాఖ మంత్రి మన వాడే!) ప్రజల బాగోగులు చూడటం ఏనాడో మరచి పోయి, అధికారం కాపాడుకోవటం కోసం అధిష్టానం ముందు సాగిల పడటమే ఇప్పుడు తెలుగు వాడికి తెలిసింది... కేంద్రం మిధ్య అంటూ డిల్లీ దాష్టీకానికి ఎదురొడ్డి నిలిచిన ఎన్ టీ ఆర్ తోనే తెలుగు వాడి పౌరుషం కూడా చచ్చి పోయింది. కేవలం రాజకీయ నాయకుల పదవులు పెంచుకోవటం కోసం ప్రత్యెక రాష్ట్రం కావాలంటూ అర్ధం పర్ధం లేని ఆందోళనలు చేస్తూ మన అనైక్యతని పొరుగు రాష్ట్రాల వారికి, కేంద్రానికి చాటి చెప్పాం. దాని ఫలితం గానే ఇంత లోకువ అయ్యాము. భారత దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో చూసినా, అక్కడి రాజకీయ నాయకులు అధికారంలో వున్నా, ప్రతి పక్షంలో వున్నా కూడా తమ సొంత రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకున్నాకే తమ స్వార్ధం చూసుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఒక పక్క ప్రజలు కరెంటు లేక, నీళ్ళు లేక, ఇతర సౌకర్యాలు లేక అలమటిస్తుంటే..కేవలం అధికారం కాపాడుకోవటం కోసం దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న ఘనులు మన తెలుగు వారు! మనలో ఈ అనైక్యత కొన సాగినంత కాలం రాష్ట్ర అభివృద్ది సున్నా అనటంలో ఏ మాత్రం సందేహం లేదు..
NTR was wrong. We should have a strong center with states taking care of their own interests without compromising the federal nature of the republic.
ReplyDeleteNtr thone sachhipoindhaa... joke of the millenium... inka emina kathalu cheppakapoyaavaa.. enti ala chethulu kattukuntee avamanama.. nee kandalani nee chupuni check chesuko.. pachha kameralavaadiki antha pachhagaane kanipisthaddi... ilantivi chala pic lalo ala jaruguthaayi.. eppudina migithaa images chusna mohamenaa needhi.
ReplyDeleteika CBN vachhi mana porushanni nilabeduthaadu ani cheppaledhu.
Chandrababu worldbank kallu pattukunnapudu emiandhi telugupourshamu. ikkdada delhilone. mari chandrababu internationalgaa parvu teesesaadu
ReplyDeleteకిరణ్ కుమార్ రెడ్డి "నీ బాంచన్ కాల్మొక్తా దొరా!" స్టైల్‌లో చేతులు కట్టుకుని కూచోవడం, ఆడి వైపు కాలూపుతూ జైరాం నరేష్ కిస్న పరమాత్మ టైపులో ఎడమచేత్తో చక్రం పట్టిన పోజివ్వడం చూస్తే.... రాజీవ్ గాంధీ హవాయి చెప్పులు లగెత్తి మోసుకొచ్చిన అంజయ్య కాలం మళ్ళీ వచ్చేస్తాందా అనిపించింది.
ReplyDeleteఇంట్లో వాడు ముండా అంటే (శంకర్రావు, డిఎల్, బొత్స..) దారిన పోయే బిచ్చగాడూ (జైరాం) ముండా అంటాడంటే ఇదే అయ్యుంటుంది.
ఏమోయ్ శంకర్ బాబు,
ReplyDeleteస్కూలు మాష్టారి ముందు ఒద్దికగా మనవాడు కూర్చుని బుద్దిగా పాఠాలు నేర్చేసు కుంటూంటే, అట్లా శ్రీ కృష్ణ పరమాత్మా ముందూ అర్జునుడు ఉన్నట్టు అంత మంచి సీను మీద అట్లా కామెంటడం ఏమీ బాగో లేదు సుమీ ! అయినా ఇట్లాంటి డిసిప్లిన్ లేకుంటే స్కూలు కుర్రోడు ఇట్లా పబ్లిక్ ఎగ్జాం గట్టెక్కు తాడు మరి ? చదువు నేర్చు కుంటున్నప్పుడు అట్లా గే ఉండాలోయ్ మరి
చీర్స్
జిలేబి.
YSR ఇలాగే చేతులు కట్టుకున్నాడా?
ReplyDelete