Sunday, December 9, 2012

ఆంధ్రావనికి నేడు విద్రోహ దినం..


పచ్చగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం భగ్గుమనటం మొదలై నేటికి మూడేళ్ళు! కేంద్రం లోని యూపీఏ ప్రభుత్వానికి ఆక్సిజన్ లాగా 32 మంది ఎమ్పీలని అందించిన ఆంధ్ర రాష్ట్రానికి మేడం జన్మ దిన కానుకగా ఇచ్చిన మర్చి పోలేని కానుక ఇది....దొంగ దీక్షలకి మోస పోయి, తెలుగు వారిని విడ దీద్దామని ప్రకటించి భంగ పడిన రోజు ఇది.... పర్యవసానాలు ఆలోచించకుండా తెలుగు జాతిని ముక్కలు చేసే ప్రకటన చేసి, ఆనక వెనక్కి తీసుకొని తద్వారా రాష్ట్రాన్ని ఉద్యమాల ఊబిలోకి దించి..తెలుగు ప్రజలందరికీ కష్ట నష్టాలని కలుగ జేసిన కాంగ్రెస్ పార్టీ నేడు మళ్ళీ అఖిల పక్షం అన్న నాటకానికి తెర లేపింది. ఎఫ్ డీ ఐ బిల్లు ఆమోదం పొందటంలో ఎటువంటి ఆటంకం రాకుండా ఉండటానికే తెలంగాణా ఎంపీ లని బుజ్జగించటం కోసం, రాష్ట్రంలో చల్లారిన వేర్పాటు వాదాన్ని మళ్ళీ రగిలించటానికి అఖిల పక్షం డ్రామాని మొదలు పెట్టింది. అసలు రాష్ట్రాన్ని విడ గొట్టాలా ఒద్డా అన్నది నిర్ణయించటానికి రాజకీయ పార్టీలకి వున్న హక్కు ఏమిటి? రాష్ట్రమంటే కేవలం రాజకీయులే కాదు...అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాల్ని పరిగణన లోకి తీసుకోవాలి. రాష్ట్రంలోని అన్ని వర్గాలతో విస్తృతంగా చర్చలు జరిపి, కూలంకషంగా పరిశోధించి ఇచ్చిన శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక ఏమైంది? శ్రీకృష్ణుడు నివేదించిన నివేదికలోని ఆరో అత్యుత్తమ పరిష్కారాన్ని అమలు చేయటానికి రాజకీయ పార్టీలకి అభ్యంతరాలేమిటి?  కేవలం వోటు బ్యాంకు రాజకీయాలు తప్ప మరేమీ కాదు. 2014 లో తాము  ఎలాగు అధికారంలోకి రామని నిర్ణయించేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఈలోగా రాష్ట్రాన్ని వీలైనంతగా తగల పెట్టి వెళ్ళాలనే కుట్రని అమలు జరుపుతోంది. రాష్ట్రంలోని ప్రతి పధకానికి ఇందిరా, రాజీవ్ పేర్లని మోస్తున్న తెలుగు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న కానుక ఇది. కనీసం ఒక్క పధకానికైనా లేదా పర్యాటక ప్రాంతానికైనా మన తెలుగు ప్రధాని పీవీ పేరు ఉందా? ప్రాంతాలకి అతీతంగా ఈ కుట్రని ఎదుర్కోవాల్సిన అవసరం తెలుగు వారందిరికీ ఇప్పుడు వుంది...కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమె కాదు..విభజన వాదం పేరుతొ రాజకీయాలు చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్న రాజకీయులందరినీ తరిమి కొట్టి తెలుగు వారు తామంతా ఒక్కటే అని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఇప్పుడు వుంది.
లేని పక్షంలో బ్రిటిష్ వారికన్నా అధ్వాన్నంగా డివైడ్ అండ్ రూల్ పాలసీ ని అమలు పరుస్తున్న కాంగ్రెస్ రాజకీయాలకు బలైన చరిత్ర హీనులుగా మనం మిగిలి పోతాం. 


4 comments:

  1. విద్రోహమా?! అలాంటి వన్నీ తెలబాన్ల లాంటి బేకార్‌గాళ్ళకుంటాయి. ఈమధ్య మనోభావాలు ఎవడికీ దెబ్బతింటలేదు, ఎందుకో ఎరికేనా? తెలబానాలోనే వున్నాడు, చెంచెల్గూడ బూచోడు వచ్చి ఎడాపెడా ఓదార్చినా ఓదారుస్తాడనే భయం వుంది మరి! :)

    ReplyDelete
  2. నిజమయిన విద్రోహ దినం నవంబరు 1, 1956. ఆ తరువాత డిసంబరు 23, 2009.

    ReplyDelete
  3. "పచ్చగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం"......అవునవును కామెర్ల కళ్ళతో చూస్తే పచ్చగానే కనిపిస్తుంది!!!!!
    @"దొంగ దీక్షలకి మోస పోయి, తెలుగు వారిని విడ దీద్దామని"........ఇది కరక్ట్ కాకపోవచ్చుగానీ......."ఆనక వెనక్కి తీసుకొని..." ఇదిమాత్రం దొంగ దీక్షలకి భయపడే అన్నది జగమెరిగిన సత్యం(జగడపాటి, నున్నపనేనిల ముద్దుల సాక్షిగా!)

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete