2012 సంవత్సరం అత్యంత విషాదకర సంఘటన తో ముగుస్తోంది.. 13 రోజుల పోరాటం అనంతరం ఢిల్లీ అత్యాచార బాధితురాలు కన్ను మూసింది... ఆమె కుటుంబానికే గాకే యావత్ దేశానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అసలు విషాద సంఘటన కన్నా మీడియా వాళ్ళు వచ్చి
కాకుల్లా పొడుచుకు తినే ప్రశ్నలకి సమాధానాలు చెప్పటమే ఆయా కుటుంబ సభ్యులకి వేదన గా
సంభవిస్తుంది. ఇక్కడ గుడ్డిలో మెల్ల లాంటి విషయమేమిటంటే-- ప్రభుత్వ ఆంక్షల వల్ల
కావచ్చు, లేదా స్వయం నియంత్రణ కావచ్చు..వారి వ్యక్తిగత వివరాల జోలికి ఏ మీడియా కూడా
తొంగి చూడలేదు. అమానత్, నిర్భయ, దామిని వంటి మారు పేర్లతోనే సమాచారం అందించారు తప్ప వారి
వ్యక్తిగత వివరాలు గోప్యంగా వుంచటం హర్షణీయం ఇంకా అభిలషణీయం కూడా.
జరిగిన దారుణానికి పరిహారంగా లక్షల రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగాలని డిల్లీ, ఉత్తర
ప్రదేశ్ ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి కానీ అదే సమయంలో వారి గోప్యత కి భంగం
వాటిల్లకుండా కూడా సరైన చర్యలు తీసుకోవటం అత్యంత ఆవశ్యకం. అలాగే నిందితులకి విధించాల్సిన శిక్ష విషయంలో కూడా ఫేస్ బుక్ లో నేను చూసిన
ఒక సూచన..
"If
Government can send the victim to Singapore for better treatment,
I strongly suggest they should send the accused to
Saudi Arabia for better justice !!"
నిజమే కదా! మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని సింగపూర్ తరలించిన
ప్రభుత్వం..మెరుగైన న్యాయం కోసం నిందితులని సౌదీ అరేబియా కి అప్పగిస్తే
బాగుంటుంది..
If Government can send the victim to Singapore for better treatment, I strongly suggest they should send the accused to Saudi Arabia for better justice !!
ReplyDelete:)
అంటే మనం ఇలాంటివి జరుగుతున్నా సహిస్తాం అనా మీ ఉద్దేశ్యం?
ReplyDeleteఇది ప్రభుత్వాన్ని హేళన చేస్తూ వ్రాసినది కాదు మనల్ని మనం హేళన చేసుకుంటూ వ్రాసినది "If Government can send the victim to Singapore for better treatment, I strongly suggest they should send the accused to Saudi Arabia for better justice !!"
ఇందులో ఎవరినీ హేళన చేయటం అన్న ప్రసక్తే లేదు. ఇంటువంటి అత్యాచార కేసుల్లో ఎంత మంది నిందితులకి శిక్షలు పడిందీ అన్నది గత పదిహేను రోజులుగా ఏ వార్తా పత్రిక తిరగేసినా తెలుస్తుంది. బాధిత కుటుంబాల వేదన రోదనగానే మిగిలి వుండగా, నిందితులు దర్జాగా కళ్ళ ముందు తిరుగుతున్న సంఘటనలు కోకొల్లలు. నిజంగా సౌదీ అరేబియా కి అప్పగించటం జరిగే పని కాదు. కానీ నిందితులకి సత్వరం కఠిన శిక్ష పడాలన్న ప్రజాగ్రహం ఇటువంటి సూచనల్లో కనపడుతుంది.
Deleteఒక పక్క ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్నా ప్రతీ రోజు ఏదో అటువంటి ఒక సంఘటన వెలుగులోకి వస్తుంది.
ReplyDeleteదామిని ఉదంతం నిందితులకు సత్వరం శిక్ష పడవలసిందే అందులో సందేహం లేదు.
కాని ఈ రోజు ఉన్న బాధ, వ్యతిరేకత ఇంకా అందరిలో వ్యక్తమౌతున్న ఆగ్రహం, బాధితుల పట్ల సంఘీభావం, సత్వరమే న్యాయం జరగాలన్న కోరిక ఎలా consolidate అవుతయ్యన్నదే ప్రశ్న.
ఈ ఉధృతి, ప్రశ్నించే స్వభావం ప్రజ మరువకూడదని, వేరు నుంచి, అంటే పుట్టుక నుండి పెంపకం లోనే ఆడ మగ సమానమని ఉగ్గు పాలతో నేర్పి నేటి యువత next generation ని పెంచుతారని ఆశిద్దాం, ప్రార్ధన చేద్దాం.
అమానత్ / నిర్భయ్/ దామిని/ఇంకా ఎంతో మంది కి ఆత్మ శాంతి అప్పుడే.