Wednesday, January 2, 2013

అఖిల పక్షం మిధ్య...తెలంగాణా మిధ్య !

గత నెల 28వ తెదీన దేశ రాజధానిలో జరిగిన అఖల పక్ష సమావేశం తర్వాత ఏదో అద్భుతం జరిగిపోతుందన్న హడావిడి రాష్ట్రంలో రాజకీయ పక్షాలు చేస్తున్నాయి.   కేవలం ఎఫ్.డీ.ఐ. బిల్లుని గట్టేక్కించుకొవటానికే,   తెలంగాణా ప్రాంత ఎంపీలు జారి పోకుండా అఖిల పక్షం ఎరని కాంగ్రెస్ అధిష్టానం వేసిందన్నది సుష్పష్టం.  అయినా కేంద్రంలో హొమ్ మంత్రి మారినంత మాత్రాన రాష్ట్రంలో రాజకీయ పక్షాల అభిప్రాయాలు తెలుసుకోవటానికి సమావేశం అవసరమా?   రాష్ట్ర విభజన అన్నది కేవలం రాజకీయ పక్షాలు మాత్రమే నిర్ణయించే విషయం కాదు. రాష్ట్రంలో రాజకీయ పక్షాలే కాక, సమాజం లోని అన్ని వర్గాలనుంచి అభిప్రాయాలని సేకరించి-క్రోడీకరించి-విశ్లేషించి శాస్త్రీయంగా ఇచ్చిన శ్రీ కృష్ణ కమిటీ నివేదిక చేతిలో వుండగా, హొమ్ మంత్రికి సమావేశం అవసరమా?  ఇటువంటి నాన్చుడు వ్యవహారాలతోనే రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్ మంట గలిపింది. సూటిగా ఆలోచిస్తే......ఏకాభిప్రాయం అనేది లేకుండా (రాజకీయులే కాదు, సమాజంలోని అన్ని వర్గాలలోను) రాష్ట్ర విభజన సాధ్యం కాదు. ఇప్పుడు రాష్ట్రంలో భిన్న వర్గాల మధ్య ఏకాభిప్రాయం లేనే లేదు..రానే రాదు. అటువంటప్పుడు ప్రత్యెక రాష్ట్రం వచ్చే ప్రసక్తే లేదు. శ్రీకృష్ణుడు తన నివేదికలో చూపిన  ఆరో అత్యుత్తమ పరిష్కారం అమలు చేయటమే కేంద్రం తక్షణ కర్తవ్యం. 

4 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. సమావేశంలో ఏదో అద్భుతం జరిగిందనే అపోహ నాకయితే లేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని తారుమారు చేసే అంగబలం & ధనబలం ఆంధ్రా crony capitalist & contractor mafiaకి ఉందని డిసెంబర్ 23 నాడే తేలిపోయింది.

    అయితే తెలంగాణా ప్రజాబలం ముందు ఈ తరహా చిల్లర డ్రామాలు ఎల్లకాలం గెలుస్తాయనుకోవడం మాత్రం మూర్ఖత్వం. కొరివితో తల గోక్కుంటున్న ఆంధ్రా రాజకీయవేత్తలకు ఎప్పుడో ఒకప్పుడు చావుదెబ్బలు తప్పవు.

    ReplyDelete
    Replies
    1. ప్రతిసారీ ఏదో ఒక డేట్ ఇచ్చేవాళ్ళు ఈసారి ఎప్పుడో ఒకప్పుడు అని నీరసపడిపోతున్నారు, అందుకు కారణం కొరివిగాళ్ళు చెప్పాలి. ఎప్పుడో డేట్ ఇవ్వాలి.

      Delete
  3. ఈ సారి గడువు షిండే గారు ఇచ్చారు లెండి.

    ReplyDelete