సీమాంధ్ర ప్రాంతీయుల మనో భావాలకి ఏ మాత్రం విలువనివ్వకుండా తెలంగాణా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తీరు అత్యంత ఆక్షేపణీయం ... శ్రీ కృష్ణ కమిటీ నివేదికని తుంగలో తొక్కి ఏక పక్ష నిర్ణయంతో తెలంగాణా రాష్ట్రాన్ని తెలుగు వారి నెత్తిన రుద్దే సాహసం కాంగ్రెస్ పార్టీ చేసిందంటే అందుకు వేరే బయట వారిని ఎవరిని నిందించనవసరం లెదు. ప్రత్యెక రాష్ట్రం సంగతి ఎలా వున్నా తెలుగు వారి పరువు-ప్రతిష్ట, హస్తినా పుర వీధుల్లో దిగ జారి పోయింది అన్నది కఠోర వాస్తవం. మధ్య ప్రదేశ్ కి చెందిన దిగ్విజయ్ సింగ్, కాశ్మీరు కి చెందిన ఆజాద్, కర్నాటక నుంచి వీరప్ప మొయిలీ , కేరళ నుండి వాయలార్ రవి...వీళ్ళా మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించేది ? తెలుగు వారిని ఎంత లోకువ కట్టక పొతె..కనీసం తదుపరి రాజధాని ఏమిటి అన్న ప్రత్యామ్నాయం చూపకుండా రాష్ట్రాని విభజించెసి... మళ్ళీ ఆ రాజధాని కోసం సీమాన్ధ్ర నాయకులని తమ చుట్టూ తిప్పుకోవాలన్న కుతంత్రంతో కాంగ్రెస్ ఆదిస్థానం వ్యవహరిస్తుంది? తెలంగాణా లాగే దేశంలో ఇతర ప్రాంతాల్లో వున్న విభజన వాద ఉద్యమాల విషయంలో కాంగ్రెస్ ఇలాగే ప్రవర్తించే సాహసం చేస్తుందా? ఆయా రాష్ట్రాలు తమ వ్యవహారాల్లో వేలు పెట్టనిస్తాయా?
మహానుభావుడు ఎన్టీఆర్ ఏనాడో చాటారు..
"ఇంటిలోన అరమరికలు వుంటే ఇల్లెక్కి చాటాలా , కంటిలో నలుసు తీయాలంటే కను గుడ్డు పెరికి వెయాలా.. పాలు పొంగు మన తెలుగు గడ్డను పగల కొట్టవద్దు.... నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చెయద్దు.."
ఇప్పటికే నవ్వుల పాలు అయి పొయాము.. శాస్త్రీయం గా సర్వే చేసి ఇచ్చిన శ్రీ కృష్ణ కమిటీ నివేదికని చేతిలో వుంచుకొని కూడా దాన్ని పార్లమెంటులో చర్చకు పెట్టే ప్రయత్నం చెయ్యకుండా, హస్తినా పురిలో ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం గా ప్రదక్షిణాలు చేసి పనికిమాలిన స్వంత నివేదికలు అధిష్టానానికి సమర్పించి కాలక్షేపం చేసిన కాంగ్రెస్ నాయకులు, అలాగే క్షంతవ్యం కాని మౌనం వహించి విభజనని అడ్డుకోలేక పోయిన ప్రతిపక్ష నాయకులు కూడా చరిత్ర హీనులుగా మిగిలిపోవటం ఖాయం.
రామన్న గారూ, తెలంగాణా కావాలని అడిగిన వారిలో ఎక్కువ శాతం తెలుగు వారే.
ReplyDeleteనిజమె.. అడిగిందీ తెలుగు వారే .. పుచ్చుకొబొయెదీ తెలుగు వారే .. అందుకు నొచ్చుకుంటున్నదీ తెలుగు వారిలో ఇంకో భాగమే! కానీ ఇచ్చిన విధానమే బాగులెదు. ప్రత్యామ్నాయ రాజధాని చూపి, నదీ జలాలు-ఆదాయ వనరుల పంపకం తేల్చి అప్పుడు విభజన చేస్తే ఎటువంటి అభ్యంతరం ఉండదు. అంతే కానీ 56 సంవత్సరాల పాటు 23 జిల్లాల వారు కలిసి సంపూర్ణంగా అభివృద్ది చేసిన హైదరాబాద్ నగరాన్ని వున్న పళం గా 10 జిల్లాల వారికి ధార పోయటం అన్నది అసమంజసం. పైగా కేవలం పదేళ్ళలో కొత్త రాజధానిని వెతికి పునర్నిర్మించటం సాధ్యమయ్యే పనేనా? అదీ హైదరాబాదు నుంచి దైనందిన పరి పాలన కొన సాగిస్తూ .. అకస్మాత్తుగా సొంత ఇంటినుండి గెంటి వేయబడ్డ భావన సీమాంధ్రుల కి కలగటంలో ఆశ్చర్యం లేదు.
DeleteCorrectly said Ramanna garu
Delete"నిజమె.. అడిగిందీ తెలుగు వారే .. పుచ్చుకొబొయెదీ తెలుగు వారే .. అందుకు నొచ్చుకుంటున్నదీ తెలుగు వారిలో ఇంకో భాగమే": మరి ఇతర భాషల వారిని విమర్శించడం ఎందుకండీ?
Delete"ప్రత్యామ్నాయ రాజధాని చూపి, నదీ జలాలు-ఆదాయ వనరుల పంపకం తేల్చి అప్పుడు విభజన చేస్తే ఎటువంటి అభ్యంతరం ఉండదు": గత కొన్ని ఏళ్లుగా జరిగిని చర్చోపచర్చలలో ఈ విషయాలు ప్రస్తావనకు తేలేదే మరి? అందరూ తెలంగాణా వద్దని, నక్సలైట్లు బలపదతారని, మరొటనొ అన్నారు తప్ప ఈ అంశాలను ఎందుకు లెవనెత్తలెదు?
"అకస్మాత్తుగా సొంత ఇంటినుండి గెంటి వేయబడ్డ భావన": ఆంద్ర రాజధాని *మాత్రమె* మారుతుంది. దేశంలో అన్ని నగరాలకు మల్లె హైదరాబాద్లో కూడా ఉండొచ్చు. ఎందుకు ఆవేదన?
ఇతర భాషల వారిని నా టపాలో ఎక్కడా విమర్శించలేదు. ఒక తెలుగు వాడి అంతరంగం తోటి తెలుగు వాడికి తెలుస్తుంది కానీ నిర్ణాయక పదవుల్లో ఇతర భాషల వాళ్ళు వున్నప్పుడు రాష్ట్రం గురించి దోసె తిరగేయటమనీ, కేకు ముక్క అని చులకన చేసిన మాట వాస్తవం కాదా?
Deleteఇక ఇన్నాళ్ళు జరిగిన చర్చోప చర్చలన్నీ టీ వీ చానెళ్ళలో జరిగాయి కానీ చట్ట సభల్లో కానే కాదు. అధికారిక నివేదిక ఐన శ్రీ కృష్ణ కమిటీ నివేదికని బుట్ట దాఖలు చెసారు.
ఆవేదన కాదు.. ఆందోళన! ఈ రోజు తేనె పూసిన కత్తుల్లా మాట్లాడుతున్న తెలబాన్ నాయకుల గత వ్యాఖ్యానాలు, ప్రకటనలు జ్ఞప్తికి తెచ్చుకుంటే "దేశంలో అన్ని నగరాలకు మల్లె హైదరాబాదు లో కూడా ఉండొచ్చు అన్న భరోసా కలగదు.
>>>
ReplyDeleteమధ్య ప్రదేశ్ కి చెందిన దిగ్విజయ్ సింగ్,
కాశ్మీరు కి చెందిన ఆజాద్,
కర్నాటక నుంచి వీరప్ప మొయిలీ ,
కేరళ నుండి వాయలార్ రవి...వీళ్ళా మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించేది ?
<<<<<
>>>>>
శాస్త్రీయం గా సర్వే చేసి ఇచ్చిన శ్రీ కృష్ణ కమిటీ నివేదికని చేతిలో వుంచుకొని కూడా దాన్ని పార్లమెంటులో చర్చకు పెట్టే ప్రయత్నం చెయ్యకుండా,
<<<<
ఆత్మ వంచనకు , హిపోక్రసీ కి కూడా ఒక హద్దు ఉండాలి .
ఈ చీకిష్ణ , దుగ్గల్ వగైరాలు తెలుగు వాళ్ళా????
ఒక సమస్యకు ఆరు తీర్పులూ ... రహస్య ఎయిత్ చాప్టర్ ...!
చెత్త బుట్ట కూడా ఛీ అంటుంది
ఆంధ్ర పార్టీలలో ఏ పార్టీ సమైక్యనినాదం తో ఎన్నికలలో పోటీ చేసింది?
ఎ పార్టీ సమైక్యవాద పార్టీ ?
శ్రీ కృష్ణ, దుగ్గల్ తదితరులు తెలుగు వాళ్ళు కాక పోవచ్చు . కానీ సమస్యని రాజకీయ కోణం లోనించి కాకుండా శాస్త్రీయంగా విశ్లేషించి ఆరు పరిష్కారాలు చూపారు. వాటిలో హైదరాబాదుతో కూడిన తెలంగాణా ఇవ్వటం అన్నది కూడా ఒక పరిష్కారం అన్నది మరిచి పోకూడదు. అయితే ఆ నివేదిక పై చట్ట సభల్లో సభల్లో చర్చ జరిగి వాటిలో ఏది అత్యున్నత పరిష్కారమో నిర్ణయించి అమలు చేస్తే బాగుండేది. కానీ ఆఖరి నిమిషం వరకు అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం అని మభ్య పెడుతూ సీమాన్ద్రులని దొంగ దెబ్బ తీసింది కాంగ్రెస్! రాజకీయ పార్టీల సమైక్య/విభజన వాదాల ని ప్రజలు పట్టించుకోవటం ఏనాడో మానేశారు. కానీ ఆయా పార్టీల నిర్వాకం వల్ల సొంత ఇంటిలోనే పరాయి వాళ్ళలా మనుగడ సాగించాల్సిన దౌర్భాగ్యం సీమాన్ద్రులకి దాపురించింది...
Deleteee lekkana goutham gariki supreme court lo AP case lu evina vaste telugu valle teerpu cheppali antaremo kharma.
ReplyDeleteఇకపోతే గత నాలుగేళ్లగా విసృతస్తాయి చర్చలు జరిగాయన్నది వాస్తవం. శ్రీకృష్ణ కమిటీ నుంచి ఈమధ్యటి అఖిల పక్షం వరకూ అందరూ మావోలనో విగ్రహాలనో ఇంకోటనో అన్నారో తప్ప తమ డిమాండ్లను చెప్పలేదు. కొందరు తెలివి మీరి తెలంగాణా వచ్చాక తెలంగాణా వారే నష్టపోతారని, అందుకే తాము వ్యతిరేకిస్తున్నామని కూడా బీరాలు పోయాయి.
ReplyDeleteఇకపోతే హైదరాబాద్లో ఆంధ్రులతో సహా భారతీయులు అందరూ ఉండొచ్చు. ఎవరికీ అభ్యంతరం లేదు. ఎవరికీ ప్రత్యెక హక్కులు ఉండవు. తెలుగు భాష పేరుతొ హైదరాబాదీలను విడదీయడానికి మాత్రం ప్రయత్నిచోడ్డు.
చర్చలన్న తరువాత రెండు ప్రాంతాల వారు అతిశయోక్తులు చెప్పటం సహజమే. అందుకే చర్చల సంగతి పక్కన పెడితే అధికారిక మాధ్యమం శ్రీ కృష్ణ కమిటీ మాత్రం మావోలనో, విగ్రహాలనో ఇంకోటనో అంటూ అస్పష్టంగా ఏమీ చెప్పలేదు. శాస్త్రీయంగా విస్తృత సర్వే చేసి 6 సూచనలు చేసింది. అందులో హైదరాబాదు తో కూడిన తెలంగాణా ఇవ్వమని కూడా చెప్పింది. కానీ ఎప్పుడు? విధి లేని పరిస్థితుల్లో మాత్రమె మూడు ప్రాంతాల సంపూర్ణ అంగీకారంతో అమలుచేయ వచ్చని విశ్స్పష్టం గా చెప్పింది. కానీ జరిగిందేమిటి? అంగీకారం లేకుండా అడ్డగోలు విభజన చేస్తే జరగబోయే పరిణామాలు కూడా సవివరంగా చెప్పింది:
ReplyDelete"The implications of this option are that (i) if earlier agitations are anything to go by, this decision will give rise to serious and violent agitations in the coastal Andhra and Rayalaseema regions, where the backlash will be
immediate; the key issues being Hyderabad and sharing of water and irrigation resources; (ii) there will be every likelihood of pressure being put by the general public on the leaders of the political parties of Seemandhra region
(MLAs/MLCs/MPs) to resign and fight for united Andhra Pradesh; (iii) the agitation for separation of Rayalaseema from coastal Andhra may also start taking shape sooner than expected; (iv) even though water and irrigation
issues can be handled by creating autonomous/semi-autonomous structures, the apprehensions of the people of coastal Andhra and Rayalaseema will continue to be voiced; and (v) the impact on internal security situation with
the anticipated growth of Naxalism and religious fundamentalism."
"The division of the state will also have serious implications outside Andhra Pradesh. It would not only give fillip to other similar demands but it will be for the first time, after the re-organisation of states, that a political demand for dividing a linguistically constituted state would have been conceded by the Union Government with the creation of two Telugu speaking
states. The issue requires a most calm and dispassionate consideration of the consequences. The matter should also be seen in the larger context of whether a region can be allowed to decide for itself what its political status
should be, as that would only create a demand for a great number of small states resulting in problems of coordination and management."
కమిటీ చెప్పినదంతా అక్షరం పొల్లు పోకుండా ఇప్పుడు జరుగుతోంది . ఇంత సాధికారికంగా ఉన్న నివేదికని చేతిలో వుంచుకొని, దాని మీద చట్ట సభల్లో చర్చలు జరపకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో వుంచుకొని చేసిన ఈ విభజన కాంగ్రెస్ పార్టీ పాలిట బూమరాంగ్ అవటం ఖాయం.
ఇంకా హైదరాబాదులో ఆంధ్రులతో సహా భారతీయులు అందరు ఉండొచ్చన్న చిలక పలుకులు మీరు చెప్తే, నేను వింటే సరిపోదు. గత నాలుగేళ్ళుగా తెలబాన్ నాయకులు చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యానాలు జ్ఞప్తికి తెచ్చుకుంటే ఆ భరోసా ఎక్కడుంటుంది?