(పక్కన ఉన్న చిత్రం ఆగష్టు,2012 నాటిది)
సీల్డ్ కవర్ ముఖ్యమంత్రిగా వచ్చి అధిష్టానం ముందు చేతులు కట్టుకున్న కిరణ్ కుమార్ రెడ్డి గురించి నేను గతంలో ఒక టపా వేయటం జరిగింది. అధిష్టానం ముందు చేతులు కట్టుకున్న అదే కిరణ్ కుమార్ రెడ్డి నేడు ఎందుకు తిరగబడ్డారు? ఎందుకంటే తలుపులు మూసి కొడితే పిల్లి అయినా తిరగబడుతుందని తెలిసిందే ! అసలు తెలంగాణా తేనె తుట్టెని కదిపిన 2009 డిసెంబర్ 9 నాడు కేంద్ర హొమ్ మంత్రి ప్రకటనలో ఏం ఉంది? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకి ప్రక్రియని ఆంద్ర ప్రదేశ్ శాసన సభ తీర్మానం ద్వారా ప్రారంభింప చేస్తామని సాక్షాత్తు కేంద్ర హొమ్ మంత్రి ఆనాడు ప్రకటించారు. అంటే రాష్ట్ర విభజన ప్రక్రియ అన్నది రాష్ట్రం లోనే ప్రారంభం కావాలన్న విషయం కేంద్రానికి తెలుసు. కానీ ఇప్పుడెం జరిగింది? రాష్ట్రంలో ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వం ఉందన్న స్పృహే లేకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో మెజారిటీ ప్రజల అభిప్రాయానికి విలువ లేకుండా సర్వాధికారాలు కేంద్రం చేతులోకి తీసుకొని - రాజ్యాంగం లోని ఆర్టికిల్ 3 లో రాసి వుంది కదా అన్న అహంకారంతో కేంద్రం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటానికి పూనుకుంది. లక్ష్యాలు, ఆర్ధిక పత్రం వంటివి ఏమీ లేకుండా తప్పుల తడకలతో కూడిన చిత్తు కాగితాల వంటి బిల్లు (?) ని రాష్ట్ర శాసన సభ మొహాన కొట్టి అభిప్రాయం చెప్పమంది. అదే ఆర్టికిల్ 3 లో రాసి వుంది కాబట్టి రాష్ట్రానికి పంపారు కానీ లేని పక్షంలో ఈ పాటికి కేంద్రమే రాష్ట్ర ప్రమేయం లేకుండా అడ్డగోలు విభజన పూర్తి చేసి పారేసి ఉండేది! అసలు బిల్లా లేక ముసాయిదా బిల్లా అన్నది స్పష్టత లేకుండా ఏదో ఒకటి రాష్ట్రానికి పంపేసి అభిప్రాయం చెప్పమంటే ఎలా కుదురుతుంది? ఈ విషయాన్నే ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రశ్నకి స్పందించాల్సిన కేంద్ర హొమ్ శాఖ ఏమీ మాట్లాడక పోయినా కేంద్ర మంత్రి జై రామ్ రమేష్ మాత్రం బుజాలు తడుముకున్నారు. ముఖ్య మంత్రి నోటీసు పై అసహనం వెళ్లగక్కారు! అసలీ జై రామ్ రమేష్ ఎవరు? ఆయన స్వంత రాష్ట్రమైన కర్ణాటకలో ఠికానా లేకపోతె పాముకి పాలు పోసినట్లు రెండు సార్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్య సభకి పంపితే నేడు కేంద్ర మంత్రి హోదా వెలగబెడుతున్నారు. పాలు తాగి రొమ్ము గుద్దిన రీతిగా తనను ఎన్నుకున్న రాష్ట్రాన్నే ముక్కలు చేయటానికి అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మంత్రుల కూటమిలో ఉండి తప్పుల తడకల బిల్లు తయారీలో ఆయనదే ముఖ్యమైన పాత్ర! అందుకే ముఖ్యమంత్రి నోటీసు పై కేంద్ర హొమ్ శాఖ కి బదులుగా ఆయనే బదులిస్తున్నారు. నకిలీ నోట్ల లాగా నకిలీ బిల్లులు వుండవు అంటూ జైరామ్ రమేష్ చేసిన ప్రకటన వ్యక్తిగత హోదాలో చేసారా లేదా కేంద్రం తరపున చేసారా అన్న ముఖ్యమంత్రి ప్రశ్నకి కూడా సమాధానం లేదు! పైగా ప్రతి వారు రాజ్యాంగ నిపుణులు అవుతున్నారని దుగ్దని వెలిబుచ్చుతున్నారు. రాష్ట్రపతి పంపిన బిల్లు అంటూ రోజుకి వంద సార్లు నొక్కి వక్కాణించే వేర్పాటు వాదులు కూడా గమనించాల్సిన విషయం ఒకటే! అన్ని వివరాలతో కూడిన - పార్లమెంటులో ప్రవేశ పెట్టబోయే సమగ్రమైన బిల్లునె రాష్ట్ర శాసన సభ అభిప్రాయానికి పంపాలి తప్ప లక్ష్య నిర్వచనం లేకుండా, శాసనాధికారాల బదలాయింపు వివరాలు లేకుండా, ద్రవ్య వ్యవహారాల మోమోరాండం లేకుండా కొన్ని చిత్తు కాగితాలు పంపి దానినే బిల్లు అనుకోమంటే ఎలా కుదురుతుంది? ఆ చిత్తు కాగితాలని చించి వేసిన, తగల పెట్టిన కొంత మంది శాసన సభ్యుల చర్య సరైనదే!
అయినా యెదటి వాడు యేదయినా కీలకమయిన విషయం మాట్లాడుతంటే శ్రధ్ధగా వినాల్సొచ్చినప్పుడు మనమూ ఒకోసారి అలా చేస్తాం కదా, దాన్ని అతిగా విమర్శించదం తప్పేమో కదా?!
ReplyDeleteమీరన్నది నిజమే! కానీ తాను కేంద్ర మంత్రి కావచ్చు.. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసి బూటు కాలు చూపిస్తూ కూర్చోవటం సభ్యతా?
Delete"లక్ష్యాలు, ఆర్ధిక పత్రం వంటివి ఏమీ లేకుండా తప్పుల తడకలతో కూడిన చిత్తు కాగితాల వంటి బిల్లు"
ReplyDeleteDid the previous bills have statement of objects & reasons? Did the center send financial info in those cases?
Every anti-Telangana guy speaks of తప్పుల తడక but no one has provided a list of such defects with reasoning.
"అసలు బిల్లా లేక ముసాయిదా బిల్లా": Every document is a draft till it is reviewed & authorized.
"దానినే బిల్లు అనుకోమంటే ఎలా కుదురుతుంది?": This did not stop the previous states starting from Andhra in 1953. Why did Andhras wake up now?
more than thousand defects are listed. But you and central authorities are saying that they were just openions, centre need not to accept. Do you know that? Is it a federal spirit in your openion to reject the state assembly completely?
DeleteDo you know the bill was in assemblee Didn't came forward from president? the versions are different. Why that was happened. Every billl(normal bills like paty scale revisions ) must have an objective, header details and conclusion, Then why they threw a rough papers without having any constitutionally correct format?
Deletecareless ness, attrocious, despotic approach should not go in between two equally powerfull constitutional institutions.
DeleteWhy did Andhras wake up now?
Delete--
we can't sleep for sixty years like you.
with reasoning.
Deleteyou never come to agreement for reasonable talk. You yourself cried - "If you support telangaana, then only I will hear what you talk. if not i won't listen".
Is it true or not?
ఓరీ ఏడుపుగొట్టుముక్కలోడా ఆపరా నీ అబద్దాల దొంగ ఏడుపు.పోయి తెలపాము విష సైట్లు సర్పాచారి, పన్నగ విషాయి వగైరా చాలా ఉన్నాయి.అక్కడ పోయి నీ ఏడుపు ఏడువ్, విషం కక్కు, అబద్దాలు చెప్పు.
DeleteA persuasive, well written argument indeed. We must get rid of the practice of accommodating outsiders who know nothing/who have scant respect for telugus as rajya sabha m.ps. If centre persists in bulldozing states, the day is not far off when states demand segragation from centre n demanding full autonomy!
ReplyDeleteWhatever one says telabans wont accept. You mention any fact, they are not ready to accept. The telabans are masters in inventing distorting and spreading lies and hatred.They say whatever they say is only correct and they dont listen to others. Regarding, outsider intervention in Telugu problems, they are following the path laid by king Jayachandra long back.
Deletewell said akaasaa ramanna
ReplyDeleteఅయినా యెందుకు ఈ కేవీపీ వాళ్ళు అలా యేడ్చి పోతున్నారు, అసలు సమైక్య వాదులయి ఉండి విభజనకు క్రూరంగా తెగబదుతున్న అధిష్టానం తరపున పోటీ చేయడ మెందుకు?యేదయినా వ్యూహం గానీ ఉందేమో అనుకున్నాను, అదీ లేనప్పుడు, "మేమసలు పోటీ చెయ్యం " అని వాళ్లంతట వాళ్ళే తిరస్కరిస్తే మరింత ఫోర్సుగా ఉండేదేమో?
ReplyDeleteఅసలు ఆంధ్ర రాష్ట్ర పునర్వ్యవస్తీకరణ బిల్లుని ఇప్పటి పార్లమెంటులో ప్రవేశపెట్టలేరు.నోరు తెరిస్తే చాలు ఆర్టికిల్ 3 అన్నీ చేసేస్తుంది అనేవాళ్ళు ఒకటి గుర్తుంచుకోవాలి.దాని ప్రకారం కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టదలుచుకున్న బిల్లునే ఇక్కడికి పరిశీలనకు పంపాలని అదీ చెప్తున్నది. యెంత సామాన్యయిన బిల్లు కయినా సరే స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కంపల్సరీగా ఉండాలి.అవేవీ లేకుండా చిత్తు ప్రతిని పంపటం అంటే శాసన సభని అవమానించటమే.మీ అభిప్రాయాలు చెబితే అవి కూడా కలిపి అసలు బిల్లుని అప్పుడు రూపొందించి పార్లమెంటులో పెడతామంటున్నది కేంద్ర హోం సాఖ. కానీ అసలు బిల్లుని యెప్పుడు రూపొందించినా దాన్ని మళ్ళీ ఇక్కడికి పంపకుండా తిన్నగా పార్లమెంటులో ప్రవేశపెట్టటం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించటమే.ముఖ్యమంత్రికి రాజ్యాంగం తెలియదా? స్పీకర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది.తప్పుల తడకగా బిల్లుని పంపించటం యెందుకు చేశారో గానీ, అది ఇప్పుడు శాసన సభ్యులుగా యెన్నికయిన తెలంగాణా సభ్యులు కూడా సభలో భాగమే కాబట్టి వారిని కూడా అవమానించినట్టే.
ReplyDeleteఇప్పుడు రాష్ట్రపతి మారిన పరిస్థితిని బట్టి రాజ్యాంగ పరిశీలన కోరవచ్చు.లేదంటే అసెంబ్లీ తిరస్కరించిన బిల్లుని భాజపా కూడా యెగువ సభల్లో తిరస్కరించవచ్చు. అసలు బిల్లుని అంత తప్పుల తడకగా రూపొందించింది కూడా సభలో భాజపాకి వ్యతిరేకించటానికి పనికొచ్చే ఉద్దేశంతోనే చేసి ఉందవచ్చు.కొద్ది కాలం నుంచీ ఆ రెండు పార్టీల మధ్యనా ఒక రకమయిన ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనబడుతున్నది.
అసలు సభ మొదలవగానే అవిశ్వాస ప్రకటన గొడవ ఉండనే ఉంది.సభ మొదలయ్యే ముందే విలీనం ప్రతిపాదన మరోసారి తెర ముందుకు రావచ్చు.విలీనం చెయ్యకుండా మామూలు సీట్ల సర్దుబాటు కాంగ్రెసు అవసరాన్ని తీర్చలేదని అందరికీ తెలిసిన విషయమే.విలీనం చేస్తే ఉద్యమ పార్టీ ఉనికే ఉండదు. ఒకసారి కాంగ్రెసులో కలిసాక యెవరికి సీట్లివ్వాలనేది కాంగ్రెసు సొంత అవసరాల ప్రకారం తెకావాలకే మొదటి ప్రాధాన్యత ఉంటుది. తెరాస లోని ఉద్యమనేతలకి మిగిలేది మట్టే.
విలీనం చెయ్యక పోయినా, విభజన ఆగిపోయినా 2014 యెన్నికల్లో తెలంగాణాలో తెరాసా మూడు జాతీయ స్థాయిలో పేరున్న మదగజాలతో ఒంటరి పోరు చెయ్యాల్సి ఉంటుంది. దానికి తోడు ఈ మధ్యనే మైలేజీ పెంచుకున్న లోక్ సత్తా మరియు ఆప్ కూడా రంగం లో ఉంటాయి. ఉద్యమం తీవ్రంగా ఉందనుకున్న కాలం లోనే ధరావతులు కోల్పోయిన తెరాసా పరిస్థితి ఇంత మందిని యెదుర్కోవాల్సి వస్తే యేమవుతుందో వూహించడం యేమంత కష్టం కాదు.అంతా అయిపోయాక దీనికన్నా విలీనమే బాగుండేదని బావురు మనాల్సిన పరిస్థితి యెదురవ వచ్చు.
భాజపా మేము వచ్చాక ఇస్తాం అంటున్నది కానీ అసలు అడగటానికి తెరాసాకి సరయిన ప్రాతినిధ్యమే లేకపోతే, అడిగేందుకు పట్టుమని పదిమందయినా లేకపోతే తనంతట తనుగా ఇస్తుందా అనేది సందేహమే. అదీ గాక ఉద్యమం తొలి రోజుల నుంచీ మేము చిన్న రాష్ట్రాలకి అనుకూలం, తెలంగాణాకు అనుకూలం అని యెన్ని సంకేతాలు ఇచ్చినా పట్టించుకోకుండా కాంగ్రెసునే అంటకాగిన తెరాస పట్ల యేమీ కంటగింపు ఉండదని అనుకోగలమా?పొరపాటున లేఖ ఇచ్చి ఇరుక్కుపోయినా సమైక్యానికే అనుకూలంగా ఉన్న తెదెపా అనే బలమయిన స్నేహితుడి కన్నా యేనాడూ తమవైపు చూడని తెరాసా వైపు భాజపా ఉదారంగా మొగ్గు చూపుతుందా?
యతో ధర్మ స్తతో జయం.
తన సొంత పార్టీ లోనే యేకాభిప్రాయం సాధించుకోలేని వాళ్ళు యెదటి వాళ్లని యేకాభిప్రాయం చెప్పమని గద్దిస్తున్నారు - మూఢమతే?!
ReplyDeleteGreat post! I am actually getting ready to across this information, is very helpful my friend. Also great blog here with all of the valuable information you have. Keep up the good work you are doing here.
ReplyDeleteบาคาร่าsa-gaming