అత్యంత హేయమైన పధ్ధతిలో, అవమానకరమైన రీతిన తెలుగు జాతిని, తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టిన దుష్ట శక్తి కాంగ్రెస్ పార్టీ! ఇక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష స్థానంలో వుండి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన పరమ లోప భూయిష్టమైన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుని (అద్వానీ గారే సెలవిచ్చారు) - అనేక రాజ్యాంగ సవరణలు అవసరమైన పరిస్థితిలో కూడా వాటిని విస్మరించి కాంగ్రెస్ అకృత్యానికి వంత పాడిన చరిత్ర హీనమైన పార్టీ బీజేపీ ! మిగిలిన పార్టీల సంగతి చెప్పనక్కరలెదు. అవకాశ వాదమే తప్ప, అవమానానికి గురి అవుతున్న తెలుగు జాతికి అండగా నిలబడ్డ పార్టీ లేనే లెదు. అందుకే ఈ రోజు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో నేను రంగంలో నిలబడ్డ అన్ని రాజకీయ పార్టీల అభ్యర్ధులని తిరస్కరిస్తూ నా వోటు "నోటా" కి వెసాను. మనది ప్రజాస్వామ్య దేశం. మెజారిటీ ప్రజల అభిమతం ప్రకారం ఏదేని రాజకీయ పార్టీ గాని, అభ్యర్ధి కానీ నెగ్గవచ్చు గాక...నా వ్యక్తిగత హోదాలో మాత్రం అవకాశ వాద పార్టీలను, వాటి అభ్యర్ధులను తిరస్కరించి సంతృప్తి చెందాను. వోటింగ్ మెషిన్ లో నోటా బటన్ ప్రవేశ పెట్టి తిరస్కార వోటుకి అవకాశం కలిగించిన భారత ఎన్నికల కమిషన్ వారికి ధన్యవాదాలు!
Wednesday, May 7, 2014
Wednesday, March 19, 2014
జీఓఎం కు వచ్చిన ఈ మెయిళ్లు 13,251 మాత్రమెనట !
రాష్ట్ర విభజనకై ఏర్పాటు చేసిన జీఒఎం కి వచ్చిన ఈ మెయిల్స్ విషయమై గతంలో నేను ఒక టపా వేయటం జరిగింది. అలాగే ఇదే విషయమై కేంద్ర హొమ్ శాఖకి సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం వివరాలు కూడా వేరొక టపా లో తెలియజేశాను. విజ్ఞాపన అందిన మూడు నెలల తరువాత కేంద్ర హొమ్ శాఖ తీరికగా పంపిన సమాధానం ఇక్కడ పొందుపరుస్తున్నాను.
Kindly provide the following information at the earliest :
1.Howmany emails were received in response to the invitation of feed back on terms of reference of Group of Ministers (GoM) constituted for bifurcation of Andhra Pradesh
Reply: 13,251 emails were received in response to the invitation of feedback by the GoM.
2.Howmany emails supported for bifurcation of Andhra Pradesh and howmany emails opposed the bifurcation of Andhra Pradesh
Reply: Information not maintained by the CPIO.
3.Whether the GoM has studied all the emails received in this regard
4.Whether the response of the public vide emails is being incorported in the report of GoM
Reply: (Point Nos 3 & 4) Do not come under the purview of the RTI Act,2005.
5.It is requested to kindly provide the soft copies of the mails received or to made them accessible for public view in any website
Reply: Right now, it is not technically feasible to make available in soft copy or through web. However, efforts are being made to make it feasible.
పార్లమెంటు తలుపులు మూసి, ప్రత్యక్ష ప్రసారాలు కట్టి పెట్టి, బాధిత ప్రాంత ప్రతినిధులని వెళ్ళగొట్టి - ఉరుకులు పరుగుల మీద అడ్డగోలు రాష్ట్ర విభజన చేసిన కేంద్రానికి ప్రజాభిప్రాయాన్ని చదివే తీరిక కూడా లేదని స్పష్టమై పోయింది. ప్రజాభిప్రాయానికి ఎలాగూ పాతరేశారు, కనీసం రాజ్యాంగ బద్ధత పాటించారా అంటే, అదీ లేదు. ఆర్టికిల్ 371 (D) గురించి అటార్నీ జనరల్ అభిప్రాయం ఏమిటి అన్నది ఈ రోజుకీ బ్రహ్మ పదార్దమే ! ఇదే విషయమై సమాచార హక్కు చట్టం కింద నేను విచారిస్తే నాకు లభించిన సమాధానం ఇది !
1.Whether any report has been submitted by the Attorney General of India to the Group of Ministers (GoM) constituted for bifurcation of Andhra Pradesh regarding dealing with status of Article 371 (D) of Constitution of India for bifurcation of the Andhra Pradesh ..
2.If submitted, what is the report submitted by the Attorney General in this regard and whether GoM has incorporated the suggestion given by the Attorney General in their report ..
Reply :- Point Nos.1&2 : No information available with the CPIO
ప్రజానీకం పట్ల గానీ, రాజ్యాంగ వ్యవస్థల పట్ల గానీ జవాబుదారీ తనం అన్నది ఏ కోశానా లేకుండా నిస్సిగ్గుగా జరిగిన రాష్ట్ర విభజన భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయం...
Saturday, March 1, 2014
కృష్ణారావు గారి అమాయకత్వం!
రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రేతర వ్యక్తి ఉండాలంటూ ప్రస్తుత అధికారి మహంతి పదవీ కాలాన్ని పొడిగించటం తెలుగు అధికారులని అవమానించటమే అని సీనియర్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు మండి పడ్డారు.
కృష్ణారావు గారు సీనియర్ అధికారి. తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణాధికారిగా సమర్ధవంతంగా పని చేసి మంచి పేరు తెచ్చుకొన్న వ్యక్తి. అయితే సాధారణంగా ప్రభుత్వంలో ఉన్న సీనియర్ స్థాయి అధికారులకి ప్రభుత్వ పోకడలు, సాధారణ ప్రజలకన్నా ఎక్కువగానే ఆకళింపు అవుతాయి. అటువంటప్పుడు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో తెలుగు వారికి గానీ, తెలుగు వారి అభిప్రాయాలకి గానీ చోటే లేదన్న విషయం సామాన్య పౌరునికి కూడా అవగతమై పోయింది. రాష్ట్ర శాసన సభ అభిప్రాయానికే పూచిక పుల్ల విలువనివ్వని కేంద్రం, రాష్ట్ర అధికారులకి విలువనిస్తుందని ఆయన ఎలా ఆశించారో? అంతే కాదు.. సీమాంధ్ర ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు తమ జీతాల్ని, జీవితాల్ని పణంగా పెట్టి 66 రోజుల పాటు సమ్మె చేసినా చలించని కేంద్ర ప్రభుత్వం ఆయన 10 రోజుల పాటు ఆర్జిత సెలవు పై వెళితే స్పందిస్తుందా? గత సంవత్సరం జూలై 30 వ తేదీ తరువాత నుండి తెలుగు వారికి జరిగిన అవమానాల్లో ఇది ఎన్నోది అని లెక్క వేసుకోవటమే మనకి గానీ, కృష్ణారావు గారికి కానీ మిగిలిన కర్తవ్యం!
Friday, February 21, 2014
తెలంగాణా వచ్చింది మాయా జూదం తోనే!
ధృతరాష్ట్రుని లాగ ప్రధాని, భీష్మ పితామహునిలాగా అద్వానీ, కళ్ళు-చెవులు మూసుకొని ఉండగా ..
రాజ్యాంగంలోని ఆర్టికిల్స్ 3,4 అనే శక్తివంతమైన పాచికలతో శకుని పాత్ర ధరించిన కేంద్రం పార్లమెంటు సభల్లో ఆడిన మాయాజూదం తో తెలంగాణా రాష్ట్రం వచ్చింది... . మార్గం ఏదైనా కూడా వారనుకొన్న గమ్యం చేరుకున్న తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు!
ఇక సీమాంధ్ర ! మాయా జూదంలో సంక్రమించిన ఓటమి ఎప్పటికీ ఓటమి కానేరదు! ఈ ప్రాంతపు రాజకీయ నాయకుల శల్య సారధ్యంతో దెబ్బ తిన్న సీమాంధ్ర నూతన రాష్ట్రం - నేలకి కొట్టిన బంతి లాగ పైకి లేవాలి! ఏ ఇతర రాష్ట్రాల వారు కుట్రలు పన్ని తెలుగు వారిని బలహీన పరచాలని చూసారో - వారందరూ ఈర్ష్య పడేలా స్వల్ప కాలంలోనే గణనీయమైన అభివృద్ది సాధించి తెలుగు వారి సత్తా ఏమిటో చాటాలి! ఈ గమ్యం చేరటానికి సీమాంధ్ర కి కూడా శుభ కామనలు!
Thursday, February 20, 2014
విభజన ఇస్తున్న విష ఫలాలు !
పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని - ఒక లక్ష్యాలు, ఉద్దేశాలు లేని బిల్లుతో - కేవలం రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా అడ్డగోలు విభజనకి కాంగ్రేస్ పార్టీ తెగబడింది.
ఇక మన రాష్ట్రంలోనే, ప్రస్తుత రాజధాని లోనే తెలంగాణా ప్రాంత ఉద్యోగులు దాష్టీకం మొదలు పెట్టేసారు. విభజన జరిగే వరకు కూడా ఆగలేక పోతున్న వారు రేపు బిల్లు చట్ట బధ్ధమైతె సీమాంధ్రుల ని ప్రశాంతంగా ఉద్యోగాలు చేయనిస్తారా? కేంద్రం కందిరీగల తుట్టెని కదిపింది... ఇది రాష్ట్రంలోని రెండు ప్రాంతాలని ఏ పతనపు అంచులకి తీసుకు పోతుందో కాలమే తేల్చాలి! Wednesday, February 19, 2014
కాంగ్రెస్ అంటించిన కార్చిచ్చు ఆంద్ర ప్రదేశ్ తో ఆగదు !
"మా నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణా కి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని యూపీఏ-1 ఉన్నప్పుడే మాట ఇచ్చారు. కనుక తెలంగాణా రాష్ట్రం ఇవ్వటం మా విధి. దానినే మేం నిర్వర్తించాం"
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు లోక్ సభ ఆమోదం పొందిన వెంటనే లోక్ సభ బయట కేంద్ర హొమ్ మంత్రి షిండే ప్రకటన ఇది!
ఆర్టికిల్ 3 ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయమే లేకుండా - రాష్ట్రంలో అధిక శాతం ప్రజలు ముక్త కంఠంతో నిరసిస్తున్నా - చివరికి రాష్ట్ర శాసన సభ, శాసన మండలి తిరస్కరించినా కూడా, కేంద్రమే ఒక నిర్ణయం తీసుకొని ఎంత నిరంకుశంగా, అప్రజాస్వామికంగా అమలు పరచ వచ్చో ఆంద్ర ప్రదేశ్ విషయంలో ఉదాహరణ చూపింది. 23 జిల్లాల భవితవ్యాన్ని కేవలం 23 నిమిషాల చర్చ(?) తో ఎలా నిర్దేశించ వచ్చో అన్న దానికి ఒక దారి చూపింది. అయితే ఈ దారి ఎన్ని విపరిణామాలకి దోవ తీస్తుంది అన్నది వెంటనే తెలిసి పోయింది. తెలంగాణా ఏర్పాటు చేసిన విధంగానే గోర్ఖాలాండ్ ను కూడా ఆర్టికిల్ 3 కింద వెంటనే ఏర్పాటు చేయాలని గోర్ఖా జన్ ముక్తి మోర్చా
డిమాండ్ చేసింది.
ఆర్టికిల్ 3 ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయమే లేకుండా - రాష్ట్రంలో అధిక శాతం ప్రజలు ముక్త కంఠంతో నిరసిస్తున్నా - చివరికి రాష్ట్ర శాసన సభ, శాసన మండలి తిరస్కరించినా కూడా, కేంద్రమే ఒక నిర్ణయం తీసుకొని ఎంత నిరంకుశంగా, అప్రజాస్వామికంగా అమలు పరచ వచ్చో ఆంద్ర ప్రదేశ్ విషయంలో ఉదాహరణ చూపింది. 23 జిల్లాల భవితవ్యాన్ని కేవలం 23 నిమిషాల చర్చ(?) తో ఎలా నిర్దేశించ వచ్చో అన్న దానికి ఒక దారి చూపింది. అయితే ఈ దారి ఎన్ని విపరిణామాలకి దోవ తీస్తుంది అన్నది వెంటనే తెలిసి పోయింది. తెలంగాణా ఏర్పాటు చేసిన విధంగానే గోర్ఖాలాండ్ ను కూడా ఆర్టికిల్ 3 కింద వెంటనే ఏర్పాటు చేయాలని గోర్ఖా జన్ ముక్తి మోర్చా
డిమాండ్ చేసింది.
The Gorkha Janmukti Morcha extends heartiest congratulations to the people of Telangana as the bill for creation a separate state of Telangana has been passed in the Lok Sabha. We would now request the Centre to similarly consider the just and fair demand for separate state of Gorkhaland, which is amongst the oldest in the country.
Today's passage of the Telengana bill makes it clear that stateconsent is not necessary for its bifurcation, a fact which we have been reiterating for a long time.
Those opposing creation of smaller states have wrongly argued that such consent from state assembly is required before rearranging its boundary.
We, are, confident that the Centre will sooner than later respect the sentiments of the Gorkhaland area and will take an unilateral decision on creating Gorkhaland despite protest from the rest of Bengal. Creation of a separate state of Gorkhaland along the lines of Telengana will fulfil the long standing demand of the people of Darjeeling, Dooars and surrounding Terai regions and bring justice to the Indian Gorkhas.
Congratulations to both the Congress and the BJP for respecting sentiments of Telengana people and supporting the bill.Today's passage of the Telengana bill makes it clear that stateconsent is not necessary for its bifurcation, a fact which we have been reiterating for a long time.
Those opposing creation of smaller states have wrongly argued that such consent from state assembly is required before rearranging its boundary.
We, are, confident that the Centre will sooner than later respect the sentiments of the Gorkhaland area and will take an unilateral decision on creating Gorkhaland despite protest from the rest of Bengal. Creation of a separate state of Gorkhaland along the lines of Telengana will fulfil the long standing demand of the people of Darjeeling, Dooars and surrounding Terai regions and bring justice to the Indian Gorkhas.
రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతోనిమిత్తం లేకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయ వచ్చని స్పష్టం అయిన దరిమిలా దశాబ్దాలు గా ఉద్యమం వున్నగోర్ఖాలాండ్ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇది ఇక్కడితో ఆగదు... రాబోయే కేంద్ర ప్రభుత్వాల్లో తమకు పరపతి ఉన్న ప్రాంతాల ప్రజలందరూ ప్రత్యెక రాష్ట్రాలు అడిగే పరిస్థితి తప్పక వచ్చి తీరుతుంది. ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విభజన వాదులు కేంద్రం తో కుమ్మక్కు అయ్యి ప్రత్యెక రాష్ట్రాన్ని సాధించిన వైనం వారికి మంచి మార్గ దర్శనమవుతుంది. చివరికి భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయానికి ఎన్ని రాజ్యాలు, సంస్థానాలు వున్నాయో అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు ఏర్పడినా ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు !
Tuesday, February 18, 2014
తెలుగు జాతి వంచింప బడింది..
కేవలం ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం తెలుగు జాతి ఘోరంగా వంచింప బడింది. హేతు బద్ధత అన్నది లేకుండా ప్రధాన పతిపక్షం కూడా కేంద్ర వంచనకి వంత పాట పాడి తెలుగు వారి గుండెల్లో విభజన కత్తి దించింది. టేబుల్ ఐటెం గా కాబినెట్ నోట్ తయారైన నాటినుండి లోక్ సభలో బిల్లు ప్రవేశ పెట్టె సమయం వరకు అన్ని ప్రక్రియల్లోను వంచనే! బాధిత ప్రాంతం యొక్క వాణి ని నొక్కి పెట్టి, సభలో వారికి సరైన ప్రాతినిధ్యమే అన్నది లేకుండా చేసి - జరుగుతున్న దురంతాన్ని ప్రజానీకం తిలకించకుండా ప్రత్యక్ష ప్రసారాలు కట్టి పెట్టి, లోక్ సభ తలుపులు మూసిపెట్టి చేసిన దురాగతం భారత ప్రజాస్వామ్య చరిత్రకే మాయని మచ్చ.. తెలుగు తల్లి రక్తాశ్రువులు కారుస్తుంటే కేంద్రంతో కుమ్మక్కు అయిన వేర్పాటు వాదులు అడ్డ తోవలో రాష్ట్రం ప్రకటింప బడ్డా కూడా అఖండ విజయం సాధించినట్లు రొమ్ములు విరుచుకుంటే సిగ్గు చేటు. విభజన కాష్టంలో పదవుల బొగ్గులు ఏరుకుందామనే రాజకీయ నాయకులు - వారు ఏ పార్టీ వారైనా సరె.. ఏ ప్రాంతం వారైనా సరే .. తప్పనిసరిగా చరిత్ర హీనులే! తెలుగు జాతికి ఈరోజు మర్చి పోలేని దుర్దినం అనటంలో ఏ మాత్రం సందేహం లెదు...
Sunday, February 16, 2014
సీమాంధ్ర దేశం అడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది?
సున్నితమైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాన్ని ఎంత అధ్వాన్నంగా యూపీఏ ప్రభుత్వం హ్యాండిల్ చేసిందో పై ప్రకటన చూస్తె అర్ధం అవుతుంది. గతంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలన్నీ ఎస్సార్సీ ద్వారానో, కమిటీల నివేదికల ద్వారానో లేదా ఆయా రాష్ట్రాల శాసన సభల తీర్మానాలతొనొ ఏర్పడ్డాయి. అంతే తప్ప ఆర్టికిల్ 3 కింద కేంద్ర ప్రభుత్వానికి వున్న అధికారాన్ని దుర్వినియోగ పరుస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం అన్నదే లేకుండా జరగలేదు. ఆర్టికిల్ 3 కింద కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ పరంగా అధికారం వుంది అన్నది నిజమె. అయితే ఆ విచక్షణాధికారాన్ని వినియోగించే ముందు రాష్ట్రంలోని రెండు ప్రాంతాల వారి అంగీకారం ఉందా లేదా అన్న ఆలోచనే లేకుండా కేవలం ఒక ప్రాంత ప్రయోజనాలకే కొమ్ము కాస్తూ విభజన ప్రతిపాదించ బట్టే - నేడు విభజన బిల్లు ని కూడా దొంగ చాటుగా, ప్రతి పక్షాలకి సమాచారం కూడా లేకుండా లోక్ సభలో ప్రవేశ పెట్ట వలసిన దుస్థితి దాపురించింది. రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించి పంపిన బిల్లుని కూడా నిస్సిగ్గుగా, పార్లమెంటు సమావేశాలు వారంలో ముగుస్తాయనగా, 3 నెలలలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనగా ప్రవేశ పెట్టటమే అప్రజాస్వామికం. వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు ప్రవేశ పెడతారు? రెండు నెలలలో ముగిసి పోయే కాలపరిమితిలో ఉన్న ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టకూడదు కనుక! అలాగే రాష్ట్ర విభజన వంటి కీలక నిర్ణయం కూడా 52 నెలలు నిద్ర పోయిన కేంద్రం చివరి 8 నెలలలో తీసుకొని హడావిడిగా అమలు పరచాలని చూడటం - కేవలం రాబోయే ఎన్నికలలో ప్రయోజనం పొందుదామన్న దురుద్దేశ్యం తోనే అన్నది స్పష్టం. ఆ నిర్ణయం అమలు పరిచే విషయంలో కూడా సీమాంద్ర ప్రాంత ప్రజల, ప్రతినిధుల, మంత్రుల విన్నపాలని పూర్తిగా పెడ చెవిన పెట్టి, స్వయానా కేంద్రమే తెలంగాణా ప్రాంత ప్రతినిధిగా అవతారమెత్తి విభజన బిల్లు తయారు చేయబట్టే నేడు ఈ ఉద్రిక్త పరిస్థితులు దాపురించాయి. పాలక పక్షం సంగతి అలా ఉంచితే ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ కూడా తాము చిన్న రాష్ట్రాలకి అనుకూలమంటూ తెలంగాణ కి మద్దతు ప్రకటించటం శోచనీయం. తాము 3 రాష్ట్రాలు ఇచ్చామని గర్వంగా చెప్పుకొనే బీజేపీ పార్టీకి ఆ మూడు రాష్ట్రాలు ఏ పరిస్థితుల్లో ఏర్పడ్డాయో తెలియదనుకోవాలా? బీజేపీ ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాల విషయంలో ఆయా రాష్ట్రాల శాసన సభలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపితే విభజన ప్రక్రియ సాఫీగా జరిగిందన్న సంగతి మరువకూడదు. పైగా అప్పుడు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలే కొత్తగా రాజధానులు ఏర్పాటు చేసుకున్నాయి తప్ప, పూర్తిగా అభివృద్ది చెందిన ఉమ్మడి రాజధానిని కబ్జా చేస్తూ, తల్లి రాష్ట్రాన్నే తన్ని తగలేసే రీతిగా ఏర్పడలేదు. ఇవేమీ ఆలోచించకుండా గుడ్డిగా తెలంగాణాకి మద్దతు అంటే సీమాంధ్ర పరిస్థితి ఏమిటి? ఈ విధంగా పాలక పక్షం - ప్రతిపక్షం ఒక్కటై పోయి సీమాంద్ర ప్రాంత ప్రయోజనాలకి ఇసుమంతైనా విలువనివ్వకుండా ముందుకు సాగటం ఘోరం. దొంగ చాటుగా బిల్లుని ప్రవేశ పెట్టటానికి దిగజారిన కేంద్రం, ఆ సమయంలో నిరసనలకి వచ్చిన సీమాంధ్ర ప్రజా ప్రతినిధులపై ఇతర ప్రాంత/ఇతర రాష్ట్ర ఎంపీలతో భౌతిక దాడులు చెయించటమే గాక విభజన బిల్లు లోక్ సభ ఆస్తి అని కేంద్ర హొమ్ మంత్రి ప్రకటించిన సమయంలో సీమాంద్ర సభ్యులని సభనుండి బహిష్కరించి - బాధిత ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యమే సభలో లేకుండా చేసి - బిల్లుని ఆమోదింప జేసుకుందామని కుట్ర పన్నితె ఇక సీమాంధ్రకి గత్యంతరం ఏమిటి? ప్రత్యెక దేశం వంటి డిమాండ్లు రావటంలో ఆశ్చర్యం ఏమి ఉంటుంది?
(ప్రత్యెక దేశం వాదాన్ని సమర్ధించటం నా ఉద్దేశ్యం కాదు. పరిస్థితి ఇంతలా ఎందుకు దిగజారింది అన్న ఆవేదనే ఇది. )
Friday, February 14, 2014
లగడపాటి వాదనలో నిజమెంతో తేల్చాలి!
పారదర్శకతకు పాతరేస్తూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుని కేంద్ర హొమ్ మంత్రి లోక్ సభలో ప్రవేశ పెట్టిన తీరు అప్రజాస్వామికం. రోజువారీ సభా వ్యవహారాల్లో లేని అంశాన్ని ఉన్న పళంగా సభ్యులకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ బిల్లుని ప్రవేశ పెట్టె విషయంలో ప్రతిపక్షాలన్నీ అభ్యంతరం లేవనెత్తాయి. ఈ అభ్యంతరాలన్నీ ఒక ఎత్తు అయితే, బిల్లుని ప్రవేశ పెట్టినట్లు చెప్పబడుతున్న సమయంలో జరిగిన అరాచక సంఘటనలు మరో ఎత్తు. ప్రత్యక్ష ప్రసారం తిలకిస్తున్న వారికి ఆశ్చర్యం కలిగించేలా లోక్ సభ కెమెరాలు హొమ్ మంత్రి ముందు జరిగిన దృశ్యాలని చూపక పోవటం లోనే కేంద్ర ప్రభుత్వ కుట్ర బయల్పడుతోంది. తెలంగాణా ప్రాంత ఎంపీ లతో పాటు ఇతర రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు కూడా మూకుమ్మడిగా దాడి కి పాల్పడటం తో ఆత్మ రక్షణకే పెప్పర్ స్ప్రే వాడ వలసి వచ్చిందని లగడపాటి రాజగోపాల్ వాదిస్తున్నారు. భారత ప్రజాస్వామ్యం తల దించుకొనె విధంగా లగడపాటి ప్రవర్తించారంటూ పెడ బొబ్బలు పెడుతున్న అధికార పక్షం వారు ఆ సమయంలో లోక్ సభ చిత్రీకరణ దృశ్యాలని బహిర్గిత పరచవచ్చు కదా! ఆ దృశ్యాలని దాచెయటంతోనే కేంద్ర ప్రభుత్వం లోక్ సభ కార్యాలయం పైన కూడా వత్తిడి తెచ్చి కుట్ర పూరితంగా వ్యవహరించిందని స్పష్టం అవుతోంది. అంతే కాదు, ఆ గొడవ జరిగిన తరువాత కేవలం ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన 16 మంది సభ్యులని మాత్రమె లోక్ సభ నిబంధన 374 (ఎ) కింద సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించటం కూడా పక్షపాత పూరితమే అవుతుంది. లోక్ సభ నిబంధన 374 (ఎ) ప్రకారం :
Rules of procedures and conduct of Business in Lok Sabha
Chapter XVII - General Rules of Procedure:
Automatic Suspension of a member -
*9 374A. (1) Notwithstanding anything contained in rules 373 and 374, in the event of grave disorder occasioned by a member coming into the well of the House or abusing the Rules of the House persistently and wilfully obstructing its business by shouting slogans or otherwise, such member shall, on being named by the Speaker, stand automatically suspended from the service of the House for five consecutive sittings or the remainder of the session, whichever is less:
Provided that the House may, at any time, on a motion being made, resolve that such suspension be terminated.
(2) On the Speaker announcing the suspension under this rule, the member shall forthwith withdraw from the precincts of the House.
(*9 Added by L.S. Bn.(II) dt. 5.12.2001, Para 2430)
లోక్ సభ వెల్ లోపల జరిగిన గొడవ కేవలం ఆ 16 మంది సభ్యులు వెళ్ళటం వల్ల మాత్రమె జరిగినట్లు స్పీకర్ భావించారా? ఎప్పుడైనా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. పై నిబంధన ప్రకారం లోక్ సభ వెల్ లోకి వచ్చిన సభ్యులందరినీ సస్పెండ్ చేయవలసి వుంటుంది. చివరికి లగడపాటి చేత మిరియాల పొడి జల్లించుకున్న బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్ లతో సహా ఆ సమయంలో తమ తమ స్థానాల్లో కాకుండా సభ యొక్క వెల్ లోపల ఉన్న సభ్యులందరినీ సస్పెండ్ చేయాలి. కానీ తమకి కంట్లో నలుసుల్లా మారిన 16 మందిని మాత్రమె సస్పెండ్ చేయడం చూస్తె స్పీకర్ ని కూడా ప్రభావితం చేసారేమో అన్న అనుమానం వచ్చి తీరుతుంది. ఈ విషయంలో కేంద్రం తన సచ్చీలత ని నిరూపించుకోవాలంటే తక్షణం బిల్లు ప్రతిపాదన చేయబడినట్లు చెప్పబడుతున్న సమయంలోని సభా దృశ్యాలని ప్రజానీకానికి బహిర్గిత పరిచి, సభా మర్యాదలకి వ్యతిరేకంగా ప్రవర్తించిన సభ్యులందరి పై చర్యలు తీసుకోవాలి. అంత సాహసం చెయ్యటానికి కేంద్రం ముందుకి వస్తుందా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నే !
తెలంగాణ పై కేంద్రం ఇక తొండి ఆడనవసరం లేదు!
లోక్ సభలో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశ పెడుతున్న సమయంలో జరిగిన సంఘటనల పై లోక్ సభ స్పీకర్ స్పందన ఇది! నిజమే! ఒక ప్రజాస్వామ్య దేశం యొక్క అత్యున్నత చట్ట సభలో జరగకూడని సంఘటనలు నిన్న లోక్ సభలో చోటు చేసుకున్నాయి. అయితే ప్రతి వాదనకి రెండో కోణం అన్నది ఉండి తీరుతుంది. అసలు లోక్ సభలో విభజన బిల్లు సక్రమంగా ప్రవేశ పెట్టె విషయమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రోజువారీ వ్యవహారాల సూచిలో లేని ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లుని ఉన్న పళంగా అనుబంధ అంశంగా చెర్చెసి, కనీసం ప్రతిపక్ష నాయకురాలికి సైతం సరైన సమాచారం ఇవ్వకుండా సభలో బిల్లు ప్రవేశ పెట్టిన తీరు పరువు తక్కువ కాదా? తెలంగాణా విషయంలో కేంద్రానిది మొదటి నుండీ అదే తొండి ఆట! కాబినెట్ నోట్ మొదలుకొని బిల్లు ఆమోదం వరకు అన్నీ టేబుల్ ఐటం వ్యవహారాలే నడిచాయి. ముందస్తు సమాచారం ఇచ్చి ప్రక్రియ కొనసాగించే ధైర్యం ఏ స్థాయిలోనూ కేంద్రం చూపలేదు. చివరికి ఇప్పుడు లోక్ సభలో
బిల్లు ప్రవేశ పెట్టె విషయంలో కూడా స్వయానా ప్రతిపక్ష నాయకురాలు అభ్యంతరం తెలియ జేసినా కూడా దొంగాట ని కేంద్రం కొన సాగిస్తూనే ఉంది. అసలు పదవీ కాలం ముగుస్తున్న చివరి రోజుల్లో ఒక రాష్ట్ర విభజన వంటి ప్రాముఖ్యత గల బిల్లుని ప్రవేశ పెట్టటానికే రాష్ట్రపతి అనుమతి ఇవ్వకూడదు. అందునా స్వయానా కేంద్రమే ఒక ప్రాంత ప్రయోజనాలకి కొమ్ము కాస్తూ ఏక పక్షంగా తయారు చేసిన బిల్లుని సాధారణ బిల్లు మాదిరిగా గుర్తించరాదు. పైగా ఈ బిల్లుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ, శాసన మండలి కూడా తిరస్కరించి పంపిన సందర్భంలో ఆయా సభల అభ్యంతరాలని పరిష్కరించాకే విభజన ప్రక్రియ కొనసాగించాలి. అయితే దురదృష్ట వశాత్తు రాష్ట్రపతి కూడా ఈ విషయంలో
తన విచక్షణాధికారాన్ని వినియోగించకుండా కేంద్ర మంత్రి మండలినిర్ణయానికే పచ్చ జెండా ఊపారు. బీజేపి సీనియర్ నాయకుడు అద్వానీ సైతం ప్రస్తుత పరిస్థితుల్లో వోట్ ఆన్ అక్కౌంట్ తప్ప మరే బిల్లులు ప్రవేశ పెట్టరాదంటూ అభిప్రాయ పడ్డారు. ఐనా ఎవరి అభిప్రాయంతో నైనా కేంద్రానికి పనేముంది? ఇప్పుడు బాధిత ప్రాంతమైన సీమాంద్ర ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులందరినీ సభ నుండి బహిష్కరించిన తరువాత కేంద్రానికి ఇక తొండి ఆడే అవసరం లేదు. రాజ మార్గంలోనే మెజారిటీ ప్రజాభిప్రాయానికి గొంతు నొక్కే ప్రక్రియని చట్ట సభల్లోనే పూర్తి చేయ వచ్చు.
Subscribe to:
Comments (Atom)










