కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల వారు తె.రా.స. ని బాయిలో నూకి గడ్డ మీద వున్నాయని కే.సి.ఆర్. వాపోయారు. అసలు తెరాస శాసన సభ్యులని బావిలోకి ఎవరు తోసారు? జే.ఎ.సి.లో ప్రతిపాదన పెట్టేసి దానికి మిగతా పార్టీల అంగీకారం వుందో లేదో తెలుసుకోకుండానే ప్రజల్లో క్రెడిట్ కొట్టేద్దామన్న అత్యుత్సాహంతో పది మంది శాసన సభ్యుల్నీ బావిలోకి తోసింది కే.సి.ఆర్. కాదా? రాజీనామా అస్త్రం ఎప్పుడూ పని చేయదన్న సంగతి ఇప్పుడు తెలిసాక మిగతా పార్టీలని తూర్పార పడితే ఉపయోగం ఏమిటి? (అయినా ప్రస్తుతానికి కే.సి.ఆర్., విజయ శాంతి ఇంకా బావిలోకి దూకలేదు. గట్టు మీదే ఉండి వారి శాసన సభ్యులు మునుగుతారా, తేల్తారా అని అంచనాలు వేస్తున్నారు.) తాము ఆశించినట్లుగా రాజ్యాంగ సంక్షోభం రాకుండా పరిస్థితి ఉప ఎన్నికల వైపు తిరిగేసరికి దిక్కు తోచక..ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయం ఆయా పార్టీల విజ్ఞతకి వదిలేస్తున్నామని బుకాయిస్తున్నారు. విజ్ఞత గల పార్టీలు కాబట్టే అనవసరంగా ఉప ఎన్నికల ఖర్చు ప్రజల పై రుద్దకుండా చేసాయి. మరి మళ్ళీ వీళ్ళని గెలిపిస్తే ఆరు నెలలకల్లా ఏదో కారణం చెప్పి ఉప ఎన్నికలు తేరని గ్యారంటీ ఏముంది? (రాజీనామాల్లో ప్రపంచ రికార్డు వారిది!) అయినా ..తెలంగాణా కోసం రాజీనామాలు చేస్తున్నామని చెప్పి మళ్ళీ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక అయి వచ్చేస్తే ఇక వారు చేసిన త్యాగం ఏమిటి?? నిజంగా త్యాగధనులే అయితే ఓ.యు. విద్యార్ధులు కోరినట్లుగా ఆత్మార్పణ చేసిన విద్యార్ధుల బంధువులని వారి నియోజక వర్గాల్లో నిలబెట్టి గెలిపించుకోవాలి. అప్పుడే విద్యార్ధుల బలి దానానికి కొంతయినా సఫలత చేకూరుతుంది.
Few days back Krishna Vamshi asked Sekhar kammula a question - Why dont you rope in Superstar (comedian) Brahmanandam into your movies? Answer is irrelevant for us.
ReplyDeleteI now have a suggestion for Sekhar Kammula...look around you will find better comedians in politics.
Akasa Ramanna... finds only Telangana issue very important.... and wants to break all the comments supporting Telangana... funny fellow...
ReplyDeleteWhy should TRS loose it's seats for idiots who gave their wretched lifes?!
ReplyDeleteI don't understand the logic... means give theeir relatives a chance to cash-in the idiotic suicides?!
What if people kill their relatives to get this 'chance' in lucrative business called POLITICS?
Use some brain, please.
మాటిమాటికీ రాజీనామా చేసే పిచ్చోల్లు పోటీ చేయడమెందుకు? రాజినామా చేసేటోల్లను ఆరు సంవత్సరీకాలు బహిష్కరించాలి అన్నట్టు.
ReplyDeleteకేసీఆర్ తెలబాన్ ఎమ్మెల్లేలు బాయిలో దుంకిండ్రు. ఆణ్ణే బోదురు కప్పలలెక్క బెకబెకమంటూ ఉండరాదె.
శాసన సభ్యులంతా త్యాగధనులని నిరూపించుకోవాలంటే నేను ఒక ఆల్టర్ నేటివ్ సూచించాను తప్ప అదే సొల్యుషన్ కాదు. ఇక చని పోయిన విద్యార్ధులని తిట్టడం అనవసరం. వారిని చని పోయేలా ప్రేరేపించిన ఫన్నీ ఫెలోస్ గురించి ఆలోచించండి. తెలంగాణా ఇప్పుడు బర్నింగ్ సమస్య కాబట్టే విమర్శిస్తున్నా...
ReplyDeleteతెరాస కార్పొరేషన్ ఎన్నికలు బహిష్కరి౦చినట్లు ఈ ఉప ఎన్నికలను కూడా బహిష్కరి౦చాలి.
ReplyDeleteమాటిమాటికీ రాజీనామా చేసే ఈ టీఆరెస్ వాళ్ళు ఎలక్షన్లలో నిల్చోడమెందుకో తెలీదు. అయినా పనిచెయ్యని ఎమ్మెల్యేలు ఉంటే ఎంత? ఊడితే ఎంత? తమాషా ఏంటంటే, అక్కడ ఎవరు పోటీ చెయ్యాలో అక్కడి ప్రజలు తప్ప, జెఏసీ వాళ్ళూ, కోదండరాం, ఇలా ప్రతీ అడ్డమైన వాళ్ళూ చెప్పేస్తున్నారు. వీళ్ళు పనిచెయ్యరూ, ఇంకొళ్ళని పనిచెయ్యనివ్వరూ. పాపం ప్రజలు.
ReplyDelete