Tuesday, March 9, 2010

పదే పదే.. అదే పొరపాటు!




కేంద్రంలో వున్న యు.పీ.ఎ. ప్రభుత్వం లోని కాంగ్రేసు పార్టీ, తమది సంకీర్ణ ప్రభుత్వం అన్న సంగతి మరచి పోయి తమ అధినేత్రి పుట్టిన రోజు సందర్భంగానూ, మహిళా దినోత్సవ సందర్భంగానూ దేశ ప్రజలకు కానుకలు ఇవ్వబోయి భంగ పడటం మనం చూస్తున్నాం. ఉదాహరణకి మహిళా రిజర్వేషన్ల బిల్లు సంగతే తీసుకుంటే..ఉద్దేశం మంచిదే అయినాకూడా బిల్లు ప్రవేశ పెట్ట బోయే ముందు భాగస్వామ్య పక్షాలతో చర్చించి వారిని సంతృప్తి పరచిన తరువాత బిల్లు ప్రవేశ పెడితే బాగుండేది. ఇప్పుడు పెద్దల సభలో ఆ ఎం.పీ. ల ప్రవర్తన వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇండియా పరువు పోయింది. అలాగే మూడు నెలల క్రితం తెలంగాణా పై ఒక విధాయక నిర్ణయం భాగస్వామ్య పక్షాలకు కనీసం తెలియ జేయకుండా అర్ధ రాత్రి ప్రకటించేశారు. ఆ తరువాత అడుసు తొక్కనేల..కాలు కడగనేల అన్న చందంగా కేంద్రం వ్యవహరించిన సంగతి మనం చూసాం. కనుక ఇకనైనా యు.పీ.ఎ. ప్రభుత్వం సంకీర్ణ ధర్మాన్ని గుర్తెరిగి మసలుకుంటే బాగుంటుంది.

3 comments:

  1. మహా భారతం లో ఒకడే సైంధవుడు. ప్రతీ దానికీ మోకాలడ్డే సైంధవులు కోకొల్లలు. అది తెలంగాణా అయినా, మహిళా బిల్లు అయినా. తెలంగాణా విషయం గత ఆరు సంవత్సరాలుగా చర్చిస్తూనే ఉంది ప్రనభ్ కమిటీ రూపంలో. అన్ని పార్టీలు ఉత్తరాలు ఇచ్చాయి. తీరా ప్రకటన చేసేసరికి మొకాలడ్డారు కొంతమంది సైంధవులు. ముఖ్యంగా మన గడ్డం బాబు. అలాగే మహిళా బిల్లుపై ఎప్పటినుండో చర్చ జరుగుతూనే ఉంది, ఇంకా జరిగేదేమిటి చర్చ? ఇది కేవలం సైంధవుల కుట్ర మాత్రమే.

    ReplyDelete
  2. మహిలా బిల్లు అచ్చిందంటే బాబు పని జమ్ జమ్మల్ మర్రి

    ReplyDelete
  3. సంకీర్ణ ప్రభుత్వం మాట అటుంచండి, ఈ "అమ్మ" కానుకలేమిటో నాకర్థం కావట్లేదు. ఆ అమ్మ లేకపోతే మనకివనిని జరిపించరా, కానుకలు ఇవ్వరా?

    ప్రతీదీ ఆ అమ్మ కొసమేనా? అంటే దేశంలో ప్రజలు ఎప్పుడూ అమ్మ గారి కేసి గోతికాడ నక్కలలాగా చూస్తూ ఉండాలా? ఎంత గౌరవమిస్తున్నారో మన దేశప్రజలకి !

    ReplyDelete