ప్రపంచం మొత్తంలోనే అతి సంపన్నమైన దేవాలయం మన తిరుమల తిరుపతి దేవస్థానం! కోట్లాది భక్తులు కానుకలుగా, ముడుపులుగా సమర్పించే ధనాన్ని, బంగారం ఇతర విలువైన వస్తువుల సంరక్షణ, నిర్వహణల బాధ్యతలని ఆ భక్తుల తరపున నిర్వర్తించాల్సిన దేవస్థానం ధర్మ కర్తల మండలి ఆ బాధ్యతలని సక్రమంగా నిర్వహిస్తోందా?? లేనే లేదు. అసలు దేవాలయాల ధర్మ కర్తల మండలిలో రాజకీయ నాయకులు ప్రవేశించిన నాడే నిబద్ధత అన్నది అడుగంటి స్వార్ధ ప్రయోజనాలకి పెద్ద పీట వేసుకోవటం మొదలైంది. తెలుగు దేశం నుంచి కాంగ్రెసులోకి ఫిరాయించి దానికి ప్రతిఫలంగా టి.టి.డీ. అద్యక్ష పదవిని పొందిన ఆదికేశవులు నాయుడు చేస్తున్న పని అదే. ఆనంద నిలయం అనంత స్వర్ణ మయం పేరుతొ కేవలం ఏక వ్యక్తి ఎజెండాగా సాగుతున్న ఈ కార్యక్రమం ఎ మాత్రం కొనసాగటానికి వీల్లేదు.బోర్డు సభ్యులు అబ్యంతరాలు చెప్పినా,ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా,కోర్టు కేసులు వేస్తున్నా కూడా ఈ పధకం అమలుకి ఆయన పట్టు పడుతున్నారంటే దీని వెనుక స్వార్ధ ప్రయోజనాలు లేవని ఎలా అనుకోగలం? విజయ్ మాల్యా వంటి వారిని రప్పించి ఈ పధకానికి బంగారం ఇప్పించి అందుకు ప్రతిగా వారికి ప్రత్యెక సౌకర్యాలు కలుగ చేయటం కేవలం తన వ్యాపార ప్రయోజనం కోసం కాదా? అయినా టే.టే.డీ. ఇతర ధార్మిక కార్యక్రమాలన్నిటికీ ఇచ్చే చందాల పై వున్న ఆదాయ పన్ను మినహాయింపు ఈ అనంత బంగారం పధకానికి లేదు. దీన్ని బట్టే ఇది స్వంత ఎజెండా అని నిరూపితమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో కలుగ జేసుకుని అశేష భక్త జనుల అభీష్టానికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రాజెక్టులు అమలు జరగకుండా చూడాలి. పాలక మండలి చైర్మన్లుగా రాజకీయ నాయకుల బదులు పీ.వీ.ఆర్.కే.ప్రసాద్ లాంటి నిబద్ధత గల మాజీ అధికారులని నియమిస్తే భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట వేసినట్లవుతుంది.
మీరింక సత్యకాలంలొ వున్నారు. చిన్నవి పెద్దవి దెవాలయాలకన్నితికి మన అంధ్రా ప్రదేస్ లో రాజకీయ కార్యకర్తలే ధర్మకర్త్ల కమిటీలలో మెంబర్లు.
ReplyDeleteవాల్ల్ అని నియమించిన తరువాథ వారు యధాసక్తి సేవ- కైంకర్యము చేస్తారు. కమిటీలు మారినప్పుదు దెవలయం సములంగా మార్చదానికి ప్రయత్నిస్తారు,
తిరుపతి బాలజి విషయములో యెదైన పెద్దగా వుంటుంది . మన తెలుగు భక్తులు తిరుపతి దర్సించిన తరువాత మద్రాస్ లో శ్రిలక్ష్మి అమ్మవారి బంగారు కొవెల కు హెచ్చుమంది వెల్తున్నారు.
అలంటి వారిని ఆకర్షించాదానికి తిరుపతి దెవాలయం కూడ బంగారు తాపడము చెస్తున్నారు అనుకొండి
Your observations are absolutely correct.
ReplyDeleteసారాయి అమ్ముకొనే వాడిని దేవస్తానం చైర్మన్ గ నియమిస్తే ఇలాగే ఉంటుందండీ.
ReplyDeleteనేను సత్య కాలంలోనే వున్నాను. వొప్పుకుంటాను. కానీ ఈ ఆధునిక కాలంలో, అడిగే వాడు లేడన్నట్లుగా యదా శక్తి భక్తుల సొమ్ము దుర్వినియోగం చెయ్యటానికి జరుగుతున్న ప్రయత్నాన్ని విమర్శించే హక్కు నాకే కాదు అందరికీ వుంది. వెల్లూరు గుడి బంగారు తాపడం చేయించారంటే అది కేవలం యాత్రికులని ఆకర్షించి వారి దగ్గరనుండి మరింతగా నగదు, కానుకలు గుంజుదామనే తప్ప వేరే కారణం లేదు. అటువంటి చీప్ ట్రిక్స్ ని అనుకరించాల్సిన ఖర్మ వెంకటేశ్వర స్వామికి ఉందా? లేదా వెల్లూరు గుడి బంగారు తాపడం చేయించాక తిరుమల స్వామి ప్రభ ఏమైనా తగ్గిందా?
ReplyDeleteధనాపేక్ష ఎంతైనా చేయిస్తుంది. భక్తి, పాప పుణ్యాల ఎరుక ఉన్నవాడిని ధర్మకర్త క్రింద నియమిస్తే బాగుంటుంది. అయినా ఏదో ఒకరోజు స్వామి వారు వాళ్ళని గట్టి చావుదెబ్బ తీస్తారు. అప్పుడు కాని గుణపాఠం అవ్వదు.
ReplyDeleteఆనంద నిలయం స్వర్ణమయం చేద్దామనే ప్రయత్నం, దేవుడి కోసమూ కాదు భక్తుల కోసమూ కాదు. మీరన్నట్లు, స్వార్ధ ప్రయోజనం కోసమే అని భక్తులందరూ ఘోషిస్తున్నారు.
ReplyDeleteఅయినా మన గౌరవనీయమైన చైర్మన్ గారు దీపం ఉండగా, ఇల్లు చక్క పెట్టుకోక పోతె, ఆ పదవికి వచ్చిన పరమార్ధం నెరవేరనట్లే.
అసలు ప్రజా సేవ చెయ్యదల్చుకున్న నాయకులు, పదవి దక్కక పోతే సిద్ధంతాలకి అతీతం గా, అంతరంగానికి (అది ఉంటే రాజకీయాలలో ఉండలేరనుకోండి) విరుద్ధం గా పార్టీ లు మారక్కర లేదు.కానీ మన టీటీడి చైర్మన్ గారు పదవితో మాత్రమే ప్రజా సేవ చెయ్యలని త్రికరణ శుద్ధి గా నమ్మిన వ్యక్తి.ఏ పాత్రలొ పోస్తే ఆ రూపం సంతరించుకో గలిగిన మన చైర్మన్ గారు (పార్టీ ల తో ప్రమేయం లెని) తను నమ్మి ఆచరించే భక్తి ని గురించి మాట్లాడి అనుకున్నది చేసే ప్రయత్నం లో ఉన్నారు.
ప్రజలందరూ ఉద్యమించి ముందుగా, మీరన్నట్లు,టీటీడి లో నిర్ణయాధికారాన్ని రాజకీయ నాయకుల చేతి నించి తప్పించి, ఆ పదవిని రాజకీయాలకి అతీతం చేసి, చిత్త శుద్ధి కలిగిన పీవీఆర్కే ప్రసాద్ లాంటి వాళ్ళ అధీనం చేస్తె తప్ప ఈ ఆగడాలు ఆగవు.
తి తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గౌ.కృష్ణారావుగారు మాత్రం అవినీతిరహితుడు,మంచివ్యక్తి,భగవంతునిపై అచంచల విశ్వాసమున్నవారు,సమర్థుడు.
ReplyDeleteకరక్టే. కృష్ణారావు గారు ఈ.ఓ. గా వచ్చాక భగవంతుని ముందు అందరూ సమానులే అన్న ఉద్దేశ్యంతో వీ.ఐ.పీ. సెల్లార్ ఎంట్రీ దర్సనం రద్దు చేసారు. బ్లాక్ మార్కెట్ లోకి వెళుతున్న కరెంట్ బుకింగ్ సేవలని ఇంటర్నెట్ కి మళ్ళించారు. ఇంకా చాలా సంస్కరణలు చేసే ఉద్దేశ్యంలో వున్నారు. ఈ అనంత బంగారం పధకం గూడ ఆయనకి ఇష్టం లేదు. కానీ ఆయన ప్రభుత్వంలో ఒక చిన్న అధికారి మాత్రమె. ఆయనకి స్వేచ్చగా పని చేసే వీలు కల్పించి చైర్మన్ గా పీ.వీ.ఆర్.కే. ని నియమిస్తే దేవస్థానం బాగు పడుతుంది.
ReplyDeleteEVM ల పనితీరుపై వెనక్కి తగ్గిన ఎలక్షన్ కమిషనర్ , BSNL ప్రైవేటీకరణ కు శాం పిట్రోడా సిపార్సు నివేదిక తెలంగాణ సమస్య, అంధ్రాలో బలహీన ముఖ్యమంత్రి, పాత బస్తీలో అల్లర్లు తదితర వార్తల నేపద్యంలో :
ReplyDeleteనవీన్ చావ్లా: ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీకి సహకరించాడు(అట)
శ్యాం పిట్రోడా: భారత దేశంలో శాంకేతిక విప్లవానికి ఆద్యుడు, రాజీవ్ గాంధీకి సన్నిహితుడు
పిట్రోడా సిఫారసులు:
30 శాతం వాటా అమ్మాలి.
3 లక్షల మంది ఉద్యోగుల్లో 1 లక్షమందిని స్వచ్చంద పదవీ విరమణ లాంటి పధకాలుపెట్టి రిటైర్ చేయించాలి
9 కోట్లా 30 లక్షల లైన్లతో జి.ఎస్.ఎం. మొబైల్ నెట్ వర్క్‌ని 35 వేల కోట్ల ఖర్చుతో విస్తరించాలనే ప్రతిపాదనకు స్వస్తి చెప్పాలి. పరికరాల ఆర్డర్లని ఆపివేయాలి. నెట్ వర్క్‌ని ఔట్ సోర్సింగ్ చేసుకోవాలి.
సంస్తకున్న కాళీ భూముల్ని వాణిజ్య పరంగా వాడుకోవాలి. ఆపని చెయ్యటానికి ఒక రియల్ ఎస్టేట్ సంస్తని ఏర్పరచాలి- అదీ ప్రైవేట్ భాగస్వామ్యంతో
ఈ మధ్య దేశంలో జరిగే కొన్ని అవాంచనీయ సంఘటనలకు(పాకిస్తాన్ మంత్రి ఫోటో ప్రచురణ, మహారాజా ఎక్స్ప్రెస్ కి గీసిన రూట్ మేప్ లో ఢిల్లీ ని పాకిస్తాన్లో చిత్రించడం మొదలైనవి ) ఇంతవరకూ ఎవర్నీ బాధుల్ని చేయలేదు ... ఎందుకో తెలీదు
బహుశా వీటన్నింటి వెనుకా నకిలీ కణిక వ్యవస్త హస్తం ఉన్నట్లు అనుమానం . నకిలీ కనికుడికి ఇందిర ,రాజీవ్ లంటే పడదు, వాల్లను Unpopular చెయ్యాలి.ఇందుకు ఇందిర, రాజీవ్ లకు సన్నిహితులైతే వాళ్ళ వేలితో వాళ్ళ కన్నే పొడిచినట్టు అని భావించి ఉంటాడు. ఆ విధంగా ఇందిర ,రాజీవ్ లకు సాధ్యమైనంత వరకు అపఖ్యాతి తేవాలని నకిలీ కణికుడి ఉద్ధేశ్యం లా కనిపిస్తుంది ,ప్రస్తుతం ఇందిర, రాజీవ్ లు జీవించిలేరు. అయినా సరే ఆ అపఖ్యాతిని వాల్లకు మూటగట్టాలని భావిస్తున్నాడు. నిజానికి ఇప్పూడున్నది ఇందిరా కాంగ్రెస్ కాదు ... ఇటలీ కాంగ్రెస్ . మరి ఈటలీ కాంగ్రెస్ చేసిన తప్పుకి ఇందిరాకాంగ్రెస్ ఎలా బాధ్యత వహిస్తుంది . *** పేపర్ చదివితే ఈ విషయం స్పష్టమౌతుంది ... దేశంలో అత్యంత వెనుకబడిన వాల్లు ముస్లింలు, సహజీవనం తప్పుకాదు అని సుప్రీం కోర్టు వాఖ్య ...ఇత్యాదివన్ని అతని సృష్టే ... మొత్తానికి దేశంలో ఏదొ జరిగి పొతోంది ... అన్నింటికీ ఏదో లింకుంది .
దేవుడు వీళ్ళను తన గోపురానికి బంగారు తాపడం చేయమన్నాడా?టి.టి.డి. చైర్మెన్ గా ఎవరు వచ్హినా ముందు బంగారు తాపడం చేయడానికే వెల్తారు.ఎందుకంటే అక్కడ ఏ క్యారేట్ బంగారం వాడింది తెలియదు,ఊరక బంగారం రంగులో ఉంటే సరి పోతుంది.అందులో ఎంత డబ్బైనా కొల్లగొట్టే అవకాశం ఉంది.అటువంటి మంచి అవకాశాన్ని మన రాజకీయ నాయకులు వదలరుగా.
ReplyDeleteరామన్నా!
ReplyDelete" శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళం"
స్వామి కి విరక్తి వచ్చేసి ఎప్పుడో ఏడు కొండలు వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు.
ఇక గుడి గోడలు బంగారమంటావా! కానీ!
అమాయక చక్రవర్తి ఆ దేవుడు...............
రేయనక పగలనక కష్టాలు పడి చంటి పిల్లలని
ఎత్తుకుని పడుతూ లేస్తూ వచ్చే సామాన్యులని
లఘు దర్శనమనే పేరు తో దూరం నెట్టేసి నప్పుడే ఆయన మనసు విరిగిపోయి ఉంటుంది.
ఓ ఫలమో ఓ పుష్పమో ఓ ఆకో అదీ కలగక పొతే కొంచెం నీరొ చాలునన్నాడు గానీ వజ్రాల కిరీటాలడిగారా?
ఈసారి నువ్వు తిరుపతి వెళ్ళినప్పుడు చూడు
స్వామి ఎంత దిగులుగా కనిపిస్తారో
నీలాంటి నాలాంటి సామాన్యులు వెళితే స్వామి ఆనందిస్తారు గానీ
ఆనంద నిలయాన్ని స్వర్ణమయం చేసి మనకి తలుపులు మూసినప్పుడు కాదు............
idee pinteaaa
ReplyDelete