Monday, September 9, 2013

ఇదెక్కడి (తెలబాన్) న్యాయం ?

ఎన్జీవోల సభ జరిగిన రోజు ఎల్బీ స్టేడియం బైట నిజాం కాలేజీ విద్యార్ధులని పీక కోసేస్తానని ఒక సీమాంధ్రుడు  హెచ్చరించాడంటూ తెలంగాణా మీడియా అదే పనిగా ప్రచారం చేసేస్తోంది. 

http://www.youtube.com/watch?v=O0Ws3BGK9AU

ఆ సీమాంధ్రుడు (?) ఎందుకలా అన్నాడో - అలా అనటానికి ముందు నిజాం కాలేజీ విద్యార్ధులు ఏమైనా అన్నారేమో వంటి విషయాలు ఎవరికీ పట్టవు.  కానీ గల్లీ నుండి డిల్లీ స్థాయి నాయకులందరూ ఘోరం జరిగి పోయిందని గుండెలు బాదేసుకుంటూ ఆ వ్యక్తి పై పోలీసు కేసులు బనాయించేశారు.  సైగలు  చేయటమే పోలీసు కేసు పెట్టేంత పెద్ద నేరమైతే..... 

https://www.youtube.com/watch?v=SJL_5iYUMY8

పై వీడియో లో  00.35  -  01.13  సమయంలో ఒక ఓ యూ జేఏసీ విద్యార్ధి నాయకుడు ఏమన్నాడో వినండి..         
టీవీ కెమెరాల సాక్షిగా " ఏపీ ఎన్జీవో లు దిగ్బంధనాన్ని ధిక్కరించి సమావేశానికి వస్తే తంతాం.  తన్ని తీరతాం. చెప్పేది వినకుండా బందు ని ధిక్కరించి లోనికి వస్తే తెలంగాణా వారి చేతిలో చావు దెబ్బలు తప్పవు" అని ప్రకటించిన విద్యార్ధి నాయకుణ్ణి సమావేశం రోజు ముందస్తు అరెస్టు చేసారో లేదో కూడా తెలియదు.  పోలీసులు,  కోర్టులు సు మోటో గా కేసులు ఎందుకు బుక్ చెయ్యవు? తెలంగాణా వారికొక న్యాయం - బైటి వారికొక న్యాయం అమలు జరుగుతోందా?       అలాగే  సమావేశం లో గలాటా చేసిన పోలీసు కి,  బైట గలాటా చేసిన మరో విద్యార్ధి నాయకుడి కి దెబ్బలు తగిలాయని ఆక్రోశిస్తారే తప్ప తాము  బస్సు ల పై చేసిన దాడులని , అందులో గాయ పడ్డ ఆంధ్రా ఎన్జీవో ల గురించి గురువింద తెలబాన్లు ఎందుకు మాట్లాడరు?

Sunday, September 8, 2013

తెలబాన్ పైత్యం!


తమ అడ్డాగా భావించే రాజధాని నడిబొడ్డున ఏపీ ఎన్జీవో లు నిర్వహించిన సమావేశం విజయవంతం అవటంతో తెలబాన్లు ఉక్రోషం పట్టలేక పోతున్నారు.  వారు చేసిన  బంద్ విజయవంతమైనా  సభని నిలువరించలేక పోవటంతో పైత్యం ప్రకోపించింది.   వివరాల్లోకి వెల్తే :


పైత్యం 1 :  ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా  ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారం ఎటువంటి హింసాత్మక సంఘటనలకి తావు లేకుండా ప్రశాంతంగా సభ నిర్వహించినందుకు   ఎన్జీవో లని యావత్ దేశం అభినందిస్తోంది.  కానీ ఉద్యోగులు తమ రాజధానిలో సమావేశం జరుపుకోవటమే మహాపరాధంగా తెలబాన్లకి కనిపిస్తోంది. సమావేశ ప్రాంగణం మలినం అయిందంటూ పాలతో శుద్ది చేసామంటూ తమ మనస్సులో ఎంత మాలిన్యం వుందో బయట పెట్టేసారు..  ఈ పని చేసింది ఏ చదువు రాని  వారో, అనామకులో కాదు.  విజ్ఞులైన న్యాయవాదులు! గత వారం వైద్యులు ఎలా ప్రవర్తించారొ ముందరి టపాల్లో చూసాం.  మేధావి వర్గాలకి చెందిన వారే పొడ గిట్టదన్నట్లు ప్రవర్తిస్తుంటే ఇంకా సామాన్య తెలబాన్ ల సంగతి ఏమిటి ?  రాష్ట్రం విడి పొతే సీమాంధ్రుల ని. సీమాంధ్ర ఉద్యోగులని బతకనిస్తారా ? 


పైత్యం 2 :  ఎన్జీవో ల సభని జరగనివ్వబోమని హెచ్చరికలు చేసారు. ఉద్యోగులని రానివ్వకుండా చెయ్యటానికి బంద్ లు దిగ్బంధనాలు ప్రకటించారు.  ఓయూ  ప్రబుద్దులైతే తంతామని కూడా హెచ్చరించారు.  ఇన్ని ఉద్రిక్తతల మధ్య సభ జరుగుతున్న సమయంలో బుద్ది-జ్ఞానం వున్న వాడు ఎవడైనా సభా ప్రాంగణం లో జై తెలంగాణా అంటాడా? అది కూడా రక్షణ బాధ్యతల్లో ఉన్న ఒక పోలీసు బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తే అర్ధమేమిటి?  ఇదే పని మిలియన్ మార్చ్ సమయంలో సీమాంధ్ర వ్యక్తి ఎవరైనా చేస్తే టాంకు బండు విగ్రహాల మాదిరి ముక్కలై పోడా ? ఎంతో  సంయమనం పాటించిన ఎన్జీఓ లు ఏ మాత్రం రెచ్చి పోకుండా ఆ పోలీసుని సభా ప్రాంగణం నుండి పోలీసుల ద్వారానే బయటకు క్షేమంగా  పంపించారు.  అదే పెద్ద మహాపరాధమై పోయింది తెలబాన్ నాయకులకి!  భావోద్వేగంతో అలా ప్రవర్తించిన ఆ పోలీసుని అదే వేదిక పైకి తీసుకొని వెళ్లి సన్మానిస్తే వారికి ఇంపుగా వుండేదేమో?


పైత్యం 3 :  సభ పూర్తి స్థాయి లో విజయవంతం అవటంతో దిక్కు తోచని తెలబాన్లు చివరికి తెలంగాణా వాళ్లు సంపూర్ణంగా సహకరించ బట్టే సభ సజావుగా జరిగిందని ప్రకటించేశారు. సభ నుండి తిరిగి వెళ్ళే వారికి పూలు పండ్లు ఇవ్వమని శ్రేణులని ఆదేశించారు. ఆ ఆదేశాలని శ్రేణులు ఇలా పాటించాయి !          

Saturday, September 7, 2013

శభాష్ ఎన్జీఓస్ !



  చిరుద్యోగులు సాధించారు!  రాజకీయ నాయకులు కలలోనైనా చేయలేనిది చేసి చూపించారు.... సంకల్ప శుద్ధి వుంటే ఏమైనా సాధించ వచ్చని నిరూపించారు.  రాజధాని నడి  బొడ్డులో సమైక్య శంఖారావం పూరించారు. పరిమిత సమయంలో  ఎన్నో ఆంక్షల మధ్య సభ నిర్వహించుకోవాల్సిన పరిస్థితుల్లో,    సభా  నిర్వహణకి తెలబాన్లు ఎన్ని ఆటంకాలు కల్పించినా కూడా - బంతిని నేలకేసి కొడితే లేచినట్లుగా వేర్పాటు వాదులకి చెంప పెట్టుగా  సమైక్య వాణి వినిపించారు.
 ఇచ్చిన మాటకి కట్టుబడి ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా సంయమనం పాటించి సభా మర్యాద అంటే ఏమిటో తెలియజెప్పారు.   తెలబాన్లు ఎంతగా రెచ్చ గొట్టాలని చూసినా  సభలో ద్వేషం, విద్వేషం అన్న పదాలకి తావు లేకుండా సూటిగా సుత్తి లేకుండా తమ కార్యకమాన్ని నడిపించి భళా అనిపించుకున్నారు.  పాలించమని ప్రజలు పార్లమెంటుకు పంపితే విభజిస్తున్న కేంద్ర దురాగతాన్ని ముక్త కంఠం తో ఖండించారు.  హైదరాబాదు ఏ ఒక్కరి సొత్తు కాదు - తెలుగు వారందరిదీ అని ఎలుగెత్తి చాటారు.  ఇంతటి ఘనత సాధించిన ఏపీ ఎన్జీవో నాయకులు, సభ్యులు అందరికీ సమైక్యాంధ్ర శుభాభినందనలు.....         

Friday, September 6, 2013

కుక్క కాటుకి చెప్పు దెబ్బ !

ఒక రాష్ట్రం లోని ప్రభుత్వ ఉద్యోగులు - ప్రభుత్వ అనుమతి తో - తమ రాజధాని నగరంలో - ఒక సమావేశం జరుపుకోదలుచుకుంటే -  దానికి హైకోర్టు కూడా అనుమతి మంజూరు చెయ్యాలా ?  సిగ్గు చేటు !   అసలు ఉద్యోగులు హైదరాబాదులో సమావేశం అని ప్రకటించిన మరుక్షణం నుండే తెలబాన్లు శివాలెత్తడం మొదలు పెట్టారు.  హైదరాబాదు తమకి అడ్డా అయినట్లు సీమాంధ్ర లో  ఎక్కడో సమావేశం పెట్టుకోమని ఫత్వా జారీ చేసేసారు.   ఎక్కడో గుజరాత్ నుండి వచ్చిన నరేంద్ర మోడీ సభ జరుపుకుంటే వారికి అభ్యంతరం లేదు కానీ మన రాష్ట్ర ఉద్యోగులు మాత్రం రాజధానిలో ఏ కార్య కలాపాలు నిర్వహించకూడదన్న మాట!  ఉద్యోగులు వెనక్కి తగ్గక పోవటంతో  పోటీ ర్యాలీ ని ప్రకటించేసి దానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని గలాటా మొదలు పెట్టారు.  గతంలో మిలియన్ మార్చ్ పేరుతొ శాంతియుతంగా ర్యాలీ చేస్తామని ప్రభుత్వాన్ని మభ్య పెట్టి టాంకు బండు విగ్రహాలు కూల్చిన చరిత్ర వారికి వుంది! అటువంటప్పుడు ప్రభుత్వ అనుమతి వస్తుందని ఎలా అనుకున్నారు?  అంతేనా...  సభని జరగనివ్వబోమంటూ బంద్ లు , రైల్వే స్టేషన్ దిగ్బంధనాలు, రహదారి దిగ్బంధనాలు మరెన్నో మరెన్నో ప్రకటించేశారు.  ఓయూ  జెఏసి సభ్యులైతే సభకి వచ్చిన వారిని తంతామని టీవీ కెమెరాల సాక్షిగా బెదిరింపులు చేసేసారు.   అసలు మనం ప్రజాస్వామ్య దేశం లో వున్నామా - తాలిబాన్ రాజ్యంలో వున్నామా?   ఎన్ని బెదిరింపులు చేసినా ఉద్యోగులు వెనక్కి తగ్గక పోవటం తో చివరికి సభని ఎలాగైనా ఆపి తీరాలన్న పట్టుదలతో తెలబాన్లు  హైకోర్టు తలుపు తట్టారు.    అయితే ఎన్జీవో ల సభకి అనుమతినిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలబాన్లకి చెంప  పెట్టు !     కోర్టు తీర్పు సంగతి ఎలా వున్నా ఇక్కడ గమనించ వలసిన సంగతి - తెలబాన్ల అసహనం.... తెలంగాణా రాకముందే ఇన్ని వేధింపులు చేస్తున్న వారు రాష్ట్రం విడి పోయాక సీమాంద్రులను, సీమాంధ్ర ఉద్యోగులను బతకనిస్తారా? 

Thursday, September 5, 2013

కోటి రత్నాల అబద్ధపు ప్రచారం !

అడ్డగోలు విభజనకి వ్యతిరేకంగా యావత్ సీమాంధ్ర దేశంలో ఎప్పుడూ లేని విధంగా వుద్యమిస్తోంది. అధికారం వుందన్న్న అహంకారంతో ఏమి చేసినా చెల్లిపోతుందనే భావనతో  అధిష్టానం తల పెట్టిన విభజన ప్రతిపాదన వారికే తల కొరివి గా మారే పరిస్థితి వచ్చింది.  అబద్ధపు ప్రచారాలతో హైకమాండు ని తప్పుదోవ పట్టించి విభజన వూబి లోకి దించిన ఘనత తెలబాన్లదే.  గుండె ఘోష చేసిన తాటాకు చప్పుళ్ళు ముందు టపాలో చూసాం.  ఇప్పుడు కోటి రత్నాల వీణ వాయిస్తున్న అబద్ధపు ప్రచారాలేమిటో  చూద్దాం :

http://kotiratanalu.blogspot.in/2013/09/blog-post_2692.html

1) ఉన్నపళంగా పొమ్మంటే ఎక్కడికి పోతాం:
ఇదొక అసత్యపు, అర్ధం లేని, మూర్ఖపు వాదన. కాస్తో కూస్తో రాజకీయ ప్రగ్నానం ఉన్నవాళ్ళు ఎవ్వరైనా నవ్వుకునే వాదన. రాష్ట్రం విభజించబడ్డంతమాత్రాన హైదరాబాద్‌లోని సీమాంధ్రులను ఎవ్వరూ ఎక్కడికీ వెళ్ళమనడం లేదు, వారు కూడా ఎవ్వరు ఎక్కడికీ వళ్ళారని వారికీ తెలుసు. అసలా మాటకొస్తే హైదరాబాదులో ఏళ్ళతరబడి ఉంటున్నవారికెవరికీ వదిలి వెల్లాలనే భయం లేదు. కాకపోతే హైదరాబాదు సీమాంధ్ర సెటిలర్ల తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు భావిస్తున్న లగడపాటి లాంటి కొందరు సీమాంధ్ర నాయకులు, కొందరు స్వయంప్రకటిత మేధావి సంఘాధ్యక్షులూ ఇలాంటి అపోహలు కల్పిస్తున్నారు. మద్రాసునుండి విడిపోయినంతమాత్రాన అక్కడి తెలుగువారందరూ మద్రాసు నగరం విడిచి ఆంధ్రాకు రాలేదు. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మాత్రం ప్రభుత్వాలు వేరవుతాయి కనుక సహజంగా సీమాంధ్ర నేటివిటీ ఉన్నవారు సీమాంధ్ర ప్రభుత్వంలో పనిచేయాల్సి ఉంటుంది. వారికి కూడా పదేళ్ళు ఉమ్మడి రాజధాని కనుక హైదరాబాదులో ఉండే వెసులుబాటు ఉంది.

కాస్తో కూస్తో రాజకీయ ప్రజ్ఞానం వున్న ఎవరికైనారాష్ట్రం విడి పొతే సీమాంధ్రులు ద్వితీయ శ్రేణి పౌరుల వలె మనుగడ సాగించాలన్న కఠోర వాస్తవం అర్ధమౌతుంది. తెలంగాణా ప్రకటన వచ్చిన మరుక్షణం ముఖ్య మంత్రి అంతటి వాడినే టిఫిన్ సెంటర్ పెట్టుకోమన్నాడు తెలబాన్ నాయకుడు.ఇంక సామాన్య సీమాంధ్ర పౌరుడి గతి ఏమిటి ? మద్రాసు నగర అభివృద్ధిలో తెలుగు వారి పాత్ర ఎంతో వుంది. అయినా కొత్తగా తెలుగు రాష్ట్రం ఏర్పడినప్పుడు - కొత్త రాష్ట్రమే కొత్త రాజధాని చూసుకోవాలన్న ఇంగిత జ్ఞానంతో ఆంధ్రులు వ్యవహరించి ఎన్నో కష్ట నష్టాలకోర్చి మొదట కర్నూలు ఆ తరువాత హైదరాబాదు లో తమ రాజధాని ఏర్పాటు చేసుకొన్నారు. అంతే తప్ప సమిష్టి కృషితో అభివృద్ది చెందిన రాజధానిని కాజేద్దామని ఎప్పుడూ అనుకోలేదు. 

2) ఉమ్మడిగా అభివృద్ధి చేసుకున్నాం, ఇప్పుడు మొత్తంగా మీరే కొట్టేస్తే ఎలా?
1956లో తెలంగాణ, ఆంధ్రా కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ నిధులు (హైదరాబాదుతో సహా) తెలంగాణాలో, ఆంధ్రా నిధులు ఆంధ్రాలో ఖర్చు పెట్టాలి. ఆనిబంధన పాటించినట్టయితే ఎలాంటి పంచాయితీ ఉండేది కాదు. కానీ వాస్తవానికి తెలంగాణ నిధులు ఆంధ్రాకు తరలించబడ్డయి తప్ప ఆంధ్రా నిధులు హైదరాబాద్ రాలేదు. కనుక ఆంధ్రావారు తమ సొమ్ముతో హైదరాబాద్ బాగుపడ్డది అనే అపోహ తొలగించుకుంటే మంచిది.  ఇక ఇక్కడికొచ్చి ఒక ఇళ్ళు కట్టుకున్నా, ఒక కంపెనీ పెట్టినా అది వారి సొంత లాభానికి తప్ప సిటీని అభివృద్ధిచెయ్యడం కోసం కాదు. ఆంధ్రా వ్యాపారులకంటే ఎన్నోరెట్లు ఎక్కువగా మల్టీనేషనల్స్ ఇక్కడ పెట్టుబడి పెట్టారు. వారు పెట్టింది లాభాలకోసమే, తెలంగాణవస్తే వాల్ల లాభాలకు ఢోకా లేదని తెలుసుకనుక వారెవ్వరూ చింతించట్లేదు.  హైదరాబాదులో వచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, మెట్రో రైలు లాంటి ప్రాజెక్టులు అన్నీ ఇక్కడి జనాభా అవసరానికి అనుగుణంగా సహజంగా ఇతర మెట్రోసిటీల లాగానే వచ్చిన ప్రాజెక్టులు. వాటికి పెట్టుబడులు బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ ప్రకారం ఆయా కంపెనీలు పెట్టడమో, లేక అంతర్జాతీయ బ్యాంకులద్వారా ఋణాలు సేకరించడం ద్వారానో జరిగింది. ఆ అప్పులు ఎలాగూ తెలంగాణ రాష్ట్రానికే వస్తాయి కనుక ఈప్రాజెక్టులగురించి కూడా సీమాంధ్రులకు చింత అవసరం లేదు. 


ఇటువంటి అబద్ధపు అసత్య గోబెల్స్ ప్రచారాలతోనే ఉద్యమాన్ని నడిపెసారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక చదివి అర్ధం చేసుకున్న వాళ్ళెవరూ ఇటువంటి వ్యాఖ్యానాలు చెయ్యరు. కేంద్రం కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదికని పార్లమెంటులో చర్చకి పెట్టి వుంటే దేశం మొత్తానికి నిజాలెమిటో తెలిసేవి. రాజధాని హోదాలో వచ్చిన ఆదాయాన్ని, సౌకర్యాలని తమ ఖాతాలో వేసుకొని తక్కిన రాష్ట్రాన్నంతా తామే పోషిస్తున్నట్లు చేస్తున్న అబద్ధపు ప్రచారాలన్నీ వట్టివే అని శ్రీ కృష్ణుడు తేల్చేసాడు. 

3) హైదరాబాదు లాంటి మరో రాజధానిని నిర్మించుకోవాలంటే ఎన్నేళ్ళు పట్టాలి?
నాలుగొందల ఏళ్ళు పడుతాయి. ఎందుకంటే హైదరాబాదు కూడా నాలుగొందల ఏళ్ళతరువాతనే ఇలాగుంది. కాకపోతే ఒక రాజధానికి ఇంతపెద్ద నగరం అవసరం లేదు. గుజరాత్ లాంటి ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రానికి కూడా ఉన్న రాజధాని అతిచిన్న నిగరం.  నిజానికి ఒక ప్రణాలిక లేకుండా ఇలా పెరిగిన ఈహైదరాబాదు నగరంలో లాభాలకంటే నష్టాలే ఎక్కువ. దీనికంటే చిన్న చిన్న నగరాలు ఎక్కువ అభివృద్ధి చేసుకుంటే సుఖంగా ఉంటుంది. సీమాంధ్రలో ఎలాగూ అనేక చిన్న నగరాలు ఉన్నాయి. 

హైదరాబాదు నగరం వయసు 400 ఏళ్ళు. కానీ 350 సంవత్సరాల తర్వాత ఎలా వుంది .. మిగిలిన 50 ఏళ్లలో ఎలా మారింది అన్నది చెప్పనక్కరలేదు. ఆ వివరాలు కూడా శ్రీ కృష్ణ కమిటీ నివేదిక 6 వ అధ్యాయంలో వివరంగా వున్నాయి. హైటెక్ సిటీ వచ్చిన తరువాత ఐటీ రంగంలో బెంగళూరు ని హైదరాబాదు తలదన్నిన విషయం అందరికీ తెలుసు. అంతర్జాతీయ కంపెనీలెన్నో బెంగళూరు ని కాదని హైదరాబాదులో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసాయి. రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న సాఫ్ట్ వేర్ రంగ ఎగుమతుల్లో 98 శాతం కేవలం హైదరాబాదు నగరం నుండే జరుగుతున్నాయి అని శ్రీ కృష్ణ కమిటీ నివేదిక తేల్చింది. అయినా లాభాల కంటే నష్టాలే ఎక్కువ వున్నప్పుడు హైదరాబాదు గురించి అంత మంకు పట్టు ఎందుకు? అక్కడే వుంది అసలు మతలబు! 

4) ఉద్యోగావకాశాలన్ని హైదరాబాదులోనే ఉన్నాయి 
ఐటీ, ఫార్మా రంగాల్లో హైదరాబాదులో ఉన్న అవకాశాలగురించి ఈఏడుపు. అయితే ప్రైవేటు ఉద్యోగాలకు ప్రభుత్వ ఉద్యోగాళ్ళా నేటివిటీ నిబంధనలేవీ లేవు. మబవాళ్ళెందరో రోజూ బెంగుళూరు, నోయిడాల్లాంటి నగరాల్లో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. కనుక రేపు వేరే రాష్ట్రమయినా హైదరాబాదుకు సీమాంధ్ర యువకులు వచ్చి ఉద్యోగాలు వెతుక్కోవచ్చు. ఇక్కడ సీమాంధ్రలో లాగా ఫాక్షనిజం రౌడీయిజం లేవు కనుక ఎవరైనా ప్రశాంతంగా బతుకొచ్చు. అందుకే ఈనగరం అభివృద్ధి చెందింది

ఇక్కడ ఫాక్షనిజం, రౌడీయిజం లేక పోవచ్చు. కానీ వెర్రి తలకెక్కిన వేర్పాటు వాదం, సీమాంధ్రుల పట్ల వల్ల మాలిన విద్వేషం పుష్కలంగా వున్నాయి. ఒక తాజా ఉదాహరణ - ప్రస్తుతానికి సమైక్యంగా వున్న ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అనుమతితో, తమ రాజధానిలో, జరపదలుచుకున్న సమావేశం పట్ల తెలబాన్లు ప్రవర్తిస్తున్న తీరు! సాక్షాత్తూ కేంద్రమే తెలంగాణా ఇవ్వటానికి పరుగులు పెడుతున్న సమయంలో తమ నిరసన తెలపటానికి చిన్న ఉద్యోగులు జరుపుకొనే సమావేశం పట్ల తెలబాన్లు చూపిస్తున్న కక్ష సాధింపు ధోరణి వారి భవిష్యత్ కార్యాచరణ ని చెప్పకనే చెపుతోంది. బందులు, రహదారి దిగ్బంధనాలు ప్రకటించటమే గాక తన్నులు తంతామని కూడా ఓయూ జేఏసీ బరితెగించి చెప్పింది. ఇదేనా కడుపులో పెట్టుకొని చూసుకోవడమంటే? 

5) ఆదాయంలో డెబ్బై శాతం హైదరాబాదునుండే!
రాష్ట్ర ఆదాయంలో ఎక్కవ భాగం హైదరాబాదు నుండి రావడం ఇప్పుడు మొదలు కాలేదు, 1956 నుండే ఉంది. ఆ ఆదాయం చూసే అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్ర నాయకులు వచ్చి తెలంగాణను కలుపుకున్నారు. అయితే ఇప్పుడొస్తున్న ఆదాయంలో కూడా ఎక్సైజ్, సేల్స్ టాక్స్ లాంటి ఆదాయాలు ఆఫీసు ఆంధ్రాలో ఉన్నా హైదరాబాదు కిందే వాస్తాయి. అయితే రాష్ట్ర విభజన తరువాత అవి సీమాంధ్ర అక్కౌంటు కిందికి వస్తాయి కనుక ఆదాయం గురించి చింత పడాల్సిన అవసరం లేదు. 

6) ఆంధ్రప్రదేశ్ రాజధాని కనుకనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది
ఇదొక పచ్చి అబద్దం. 1956లోనే హైదరాబాదు దేశంలో ఐదవ పెద్దనగరం. మిగతా పెద్ద నగరాలు ఏరేటులో అభివృద్ధి చెందాయో హైదరాబాదు కూడా అంతే ( కాస్త తక్కవే) రేటులో పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి కాకుండా ఇన్నాళ్ళూ తెలంగాణ రాజధానిగా ఉన్నా హైదరాబాదు ఇలాగే ఉండేది. కర్నూలు ఆంధ్ర రాజధానిగా కొనసాగిన అది సుమారు అలాగే ఉండెది, కాకపోతే కాస్తడబ్బొచ్చిన తరువాత డేఋఆలకు బదులు బిల్డింగులు కొన్ని కట్టేవారేమో.
నగర అభివృద్ధి రాజధాని వలన అవదు. వ్యాపార అవకాశాలు, కొత్తవారిని చేర్చుకోవడంలో ప్రజల కలుపుగోలుతనం, భౌగోళిక స్థితిగతులు లాంటి వాటిపైన అభివృద్ధి చెందుతుంది. అలాగే ఐటీ,ఫార్మా కంపెనీలు టాలెంట్ పూల్ లభ్యమయ్యేదగ్గరే ఏర్పడతాయి. అవన్నీ హైదరాబాదుకు ఉన్నాయి గనుకే హైదరాబాదు అభివృద్ధి చెందింది. 
అన్నింటితోబాటు హైదరాబాదు చుట్టు పక్కల కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు సరిపడే స్థలం ఉంది. అది ఆంధ్రా సిటీల్లో దొరకదు. 

1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు చేసినపుడు తెలంగాణా ప్రాంతాన్ని 5 సంవత్సరాలు ప్రత్యేకంగా వుంచి ఆ తరువాత ఆ రాష్ట్ర శాసన సభ అనుమతితో ఆంధ్రలో విలీనం చేయమని ప్రతి పాదన జరిగింది. అయితే ఐదేళ్ళు కూడా ఆగకుండా బేషరతుగా వెంటనే విలీనానికి వచ్చి ఇప్పుడు హైదరాబాదు స్వయం సమృద్ధం అయ్యాక పొమ్మంటే అర్ధమేమిటి? ఇంకా ఆదాయం విషయంలో కూడా శ్రీ కృష్ణ కమిటీ నివేదికే సమాధానం. రాజదానికి వచ్చే ఆదాయాన్ని తమ ప్రాంత ఆదాయంగా పరిగణించటం వాపుని చూసి బలుపు అని భ్రమించటమే! అసలు ఆదాయ వనరులు, నదీ జలాల పంపిణీ వంటి ముఖ్యమైన పంపకాలు చెయ్యకుండా కేంద్రం విభజన ప్రతిపాదించటమే మూర్ఖత్వం. 23 జిల్లాలతో కూడిన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అన్న హోదా లోనే హైదరాబాదు కి ఈ ఆదాయం , అభివృద్ది సంప్రాప్తించాయి. 1956 లోనే కాదు 2009 వరకు కూడా హైదరాబాదు దేశంలో 5 వ పెద్ద నగరం. మరి ఈ రోజు పరిస్థితి ఏమిటి? వేర్పాటు వాదుల విద్వంసక చర్యలతో మనకు రావలసిన వ్యాపారాలు, పరిశ్రమలు ఎన్నో గుజరాత్ కి తరలి పోయాయి. అభివృద్ధిలో దశాబ్దాల వెనక్కి వెళ్లి పోయాం. ఏమైనా రాజధాని విషయంలో మరోసారి మోస పోవటానికి సీమాంధ్రులు సిద్ధంగా లేరు. 

హైదరాబాదు కై "గుండె ఘోష "!


కేంద్రం ప్రతిపాదించిన ఏక పక్ష విభజన ప్రతిపాదనతో సీమాంధ్రుల గుండెలు రగులుతుంటే "గుండె ఘోష" చేస్తున్న వెటకారం! : 

http://telangaanaa.blogspot.in/2013/09/blog-post.html

ఆ గుండె ఘోష తాలూకు తాటాకు చప్పుళ్ళ   మర్మమేమిటో చూద్దాం: 


సమానంగా న్యాయం ఎలా చేత్తార్రా?
ఇప్పుడొక పండుందనుకో... దాన్ని సమానంగా రెండు ముక్కలు చేసి పంచడమే సమన్యాయం అంటే.
అంటే ఆ పండెవరిదయినా రెండు ముక్కలు చేయాలా?
అంటే?
ఆ పండు నీదనుకో. నేనొచ్చి అది నాదే అని వాదించాను. ఇద్దరం కోర్టు కెళ్ళాం. అప్పుడు కోర్టు సమన్యాయం ఎలా చేయాలి? ఆ పండు చెరిసగం కోసిస్తే సమన్యాయం అవుతుందా?
ఎలా అవుతుంది మావా? ఆ పండు నీది అయితే, అది నీకిస్తేనేగా సమన్యాయం అయ్యేది?

అదేరా నేను చెప్పేదీ! ఇప్పుడు చెప్పు హైదరాబాదు ఎక్కడుంది?
తెలంగాణలో!
మరి విడదీసి నప్పుడు అది తెలంగాణాకు చెందాలా, చెరిసగం పంచాలా?


నాలుగు వందల ఏళ్ల నగరం హైదరాబాదు! నగరం ఏర్పడ్డ 350 ఏళ్ళ వరకు ఎలా వుంది - గత 56 సంవత్సరాల్లో తెలుగు ప్రజలందరి సమిష్టి కృషితో ఇప్పుడెలా అభివృద్ది చెందింది అన్నది ఆలోచించకుండా భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో ఉన్నంత మాత్రాన విత్తు నాదే-ఫలము నాదే అంటే ఎలా కుదురుతుంది?

న్యాయంగా తెలంగాణాకే ఇవ్వాలి. కాని మన జమీందార్లు అక్కడ పెట్టుబడులు పెట్టి బిజినేసులు పెట్టుకున్నారు కదా? అయ్యేమై పోవాల?
ఏమై పోతాయి? న్యాయంగా సంపాదించుకుంటే వాళ్ళకే ఉంటాయ్. దొంగ సొత్తు అయితే తెలంగాణా గవర్నమెంటు జప్తు చేస్తది.

2009 తరువాత ఇటువంటి తెలబాన్ రాళ్ళ దెబ్బలకి భయపడే రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలు, వ్యాపారాలు గుజరాత్ కి తరలి పోయాయి.  దొంగ సొత్తుతొ వ్యాపారాలు చేస్తున్న మాట నిజమైతే 100 మందికి పైగా వున్న తెలంగాణా ప్రాంత శాసన సభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఇన్నాళ్ళూ ఏం చేస్తున్నారు?  చోద్యం చూస్తూ కూచున్నారా? ఇప్పుడే తెలిసిందా దొంగ సొత్తు అని ?     


మరి మలక్ పేటలో ఇస్త్రీ చేసుకుని బతుకుతున్న మన మద్దులేటిని ఎలగొడతారట గదా?
పొట్టలు గొట్టేవాన్ని ఎలగోడతారంటే నమ్మొచ్చు, కాయ కష్టం చేసుకుని బతికేవాన్ని ఎవరేమంటార్రా?

కాయ కష్టం చేసుకుని బతికే వాణ్ని ఏమీ అనరు.  కానీ ఉద్యోగులని మాత్రం వెళ్ళ గొడతారు.  చివరికి ముఖ్యమంత్రి అయినా సరే కర్రీ పాయింటు పెట్టుకొని బతకాలి ఇక్కడ! 
   

అయినా సరే! హైదరాబాదు వాళ్లకు వదిలి పెట్టాలంటే బాధేస్తుంది బాబాయ్!
 ఒరే! తిరుపతి వెంకటేశుడికి కోట్ల ఆస్తి జమ పడింది కదా? అదంతా ఒక్క ఆంధ్రోల్లదేనా?
ఎందుకవుద్ది? తెలంగాణా వాళ్ళు, తమిళులు, కన్నడులు, ఉత్తర భారద్దేశం వాళ్ళు కూడా వచ్చి కానుకలు వేస్తారు కదా?
మరి మా ఆస్తులు ఇక్కడ పొగడ్డాయి కాబట్టి తిరుపతి మాదే అని ఎవరైనా అంటే ఎలాగుంటది?

బుద్ది, జ్ఞానం వున్న వాడు చెప్పే మాటలు కావు ఇవి! తిరుపతి మాదే - ఇతర ప్రాంతాల వారు రాకూడదు అని ఎవరైనా ఎప్పుడైనా అన్నారా? దేవుని హుండీకి ప్రజల ఆస్తులకీ ఏమైనా సంబంధం ఉందా ? దేవుని సొమ్ములో ప్రభుత్వ జోక్యం ఎప్పుడైనా ఉందా? తి తి దే పాలక మండలి ఆధీనంలో ధర్మ ప్రచారానికై భగవంతుని సొమ్ము వినియోగిస్తారు... అంతే తప్ప తక్కిన తక్కిన విషయాలతో దేవును సొమ్ముని పోల్చి చూడటం దైవాపరాధమే! 

రక్తం మరుగుద్ది? నాలుగు తన్నాలనిపిస్తది?
మరి హైదరాబాదు కావాలంటే వాళ్ళకే మనిపిస్తది?
నిజమే బాబాయ్!!

ఇది మాత్రం నిజమే! సీమాంధ్రుల రక్తం మరుగుతోంది. నాలుగు తన్నాలని కూడా అనిపించినా విజ్ఞత అడ్డు వచ్చి కేంద్రంతో న్యాయ పోరాటం చేస్తున్నారు సీమాంధ్రులు.. సత్యమేవ జయతే !

ఉద్యోగుల సమావేశం పై ఉలుకెందుకు ?

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రం ప్రకటన చేసింది. కేంద్ర ప్రకటన మాత్రమె జరిగింది. ఇంకా రాష్ట్రం ఏర్పాటు కాలేదు. రాష్ట్ర ఏర్పాటు కోసం జరగ వలసిన రాజ్యాంగ ప్రక్రియ ఇంకా చాలా వుంది. అందు వల్లనే రాష్ట్ర విభజన పై కోర్టు ముందుకి వెళ్ళిన రెండు కేసులని కొట్టి వేయటం కూడా జరిగింది. ప్రస్తుతానికి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగానే వుంది. పాలనలో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం వుంది.  ఈ పరిస్థితిలో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు చర్చించుకోవటానికి తమ రాజధాని నగరం లో ఒక సమావేశం పెట్టుకుంటే తెలబాన్ గుంపులకి ఉక్రోష మెందుకో అర్ధం కాదు.  సమావేశం జరగనివ్వమంటూ హెచ్చరికలు చెయ్యటంతో పాటు ముందురోజు నుండి 48 గంటల బంద్ ప్రకటించేశారు! పోటీ గా శాంతి ర్యాలీ అంటూ చేయబోతే పోలీసు అనుమతి ఇవ్వలేదని నానా యాగీ చేస్తున్నారు.  గతంలో మిలియన్ మార్చ్ పేరుతొ ప్రశాంతంగా ర్యాలీ చేస్తామని మభ్య పెట్టి టాంకు బండ్ పై విగ్రహాలు కూల్చిన చరిత్ర వారిది!  ఇటువంటి చరిత్ర వున్న వారికి అనుమతి వస్తుందని ఎలా భావిస్తారు?     ఈ రోజు  సాక్షాత్తూ కేంద్రమే తెలంగాణా ఏర్పాటుకు శర వేగంతో చర్యలు జరుపుతున్నప్పుడు ప్రశాంతంగా ఉండకుండా ఇలాంటి  రెచ్చగొట్టే చర్యలు చెయ్యబట్టే సీమాంధ్రుల-ఉద్యోగుల ఆందోళనలు   మిన్నంటుతున్నాయి.  ఓ పక్క విద్వేషాగ్నిని ఎగదోస్తూ  విభజనకి సహకరించాలని కోరటం తెలబాన్లకే  చెల్లింది.  కీలకమైన ఈ సమయంలో సంయమనం పాటించి సహకరించక పొతే విభజనకి సీమాన్ధ్రులు ఒప్పుకుంటారా?  నిజం చెప్పాలంటే ఇప్పటి వరకూ తెలబాన్లు జరిపిన ఉద్యమం వారికి ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం  కోసం కాదు.    సీమాన్ద్రులకి ప్రత్యెక రాష్ట్రం ఇచ్చి తమ ప్రాంతం నుండి గెంటి  వేయాలని జరిగిన ఉద్యమం అది.   కేంద్రం కూడా  సీమాంధ్ర కి సరైన న్యాయం చెయ్యకుండా విభజన ప్రతిపాదించినప్పుడు నిరసన లు తెలిపే హక్కు అన్ని వర్గాల వారికీ వుంటుంది.  నిరసనలు తెలపటానికి కూడా అనుమతించమంటూ రగడ సృష్టిస్తే  విభజన ప్రక్రియ ముందుకు సాగటం అసంభవం... 

Wednesday, September 4, 2013

తెలబాన్ దురహంకారం - సీమాంధ్ర సంస్కారం!

సీమాంధ్రులని కడుపులో పెట్టుకొని చూసుకొంటాం అంటున్న తెలబాన్లు రాష్ట్రం రాక ముందే ఎలా ప్రవర్తిస్తున్నారో నిన్నటి  టపాలో  చూసాం .



నెత్తి మీద విభజన కత్తి  వేళాడుతున్నా, రాజధానిలో సీమాంధ్రుల కి అవమానం జరిగినా  సహనం కోల్పోకుండా సీమాంధ్రులు చూపిన సంస్కారం ఇది! 


ఎవరు ఎవరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటారో స్పష్టమై పోయింది కదా!       

Tuesday, September 3, 2013

తెలబాన్ మోడల్ పాలన!


తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రం ప్రకటన చేసింది.  కేంద్ర ప్రకటన మాత్రమె జరిగింది.  ఇంకా రాష్ట్రం ఏర్పాటు కాలేదు.   రాష్ట్ర ఏర్పాటు కోసం జరగ వలసిన రాజ్యాంగ ప్రక్రియ ఇంకా చాలా వుంది.  అందు వల్లనే రాష్ట్ర విభజన పై కోర్టు ముందుకి వెళ్ళిన రెండు కేసులని కొట్టి వేయటం కూడా జరిగింది.   ప్రస్తుతానికి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగానే వుంది. పాలనలో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం వుంది.  అయితే తెలబాన్ల కి ఈ విషయాలేమీ పట్టవు.  వారి  దృష్టిలో కాంగ్రెస్ ఒకే అంటే తెలంగాణా వచ్చేసినట్లే!  అందుకే అప్పుడే స్వంతంగా నియామకాలు కూడా చేసేస్తున్నారు.  ప్రభుత్వ ఉత్తర్వులతో పదవిలో నియమితులైన వ్యక్తులని కుర్చీనుంచి లాగి వేసి తమకి నచ్చిన వ్యక్తులకి నియామకం ఇచ్చేసి పూల బొకేలతో, మిఠాయిలతో అభినందనలు చెప్పేస్తున్నారు. 

http://www.sakshi.com/news/andhra-pradesh/telangana-versus-medical-jac-at-osmania-hospital-62480

 ఈ పని చేసింది ఏ చదువు రాని  వాడో  లేదా రాష్ట్రం ఇంకా రాలేదన్న విషయం తెలియని వాడో అనుకుంటే పొరపాటే!  మేధావి వర్గానికి చెందిన వైద్యులే ఈ పని చేసింది!  మేధావులే ఇలా వుంటే ఇంక సామాన్య తెలబాన్ల సంగతి ఏమిటి?  సీమాంధ్రులని కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్న నాయకుల మాటల పై భరోసా ఎలా వుంటుంది?  కోడిని కోసి - చికెన్ గా చేసి కడుపులో పెట్టుకుంటారు.  అలా కడుపులో పెట్టుకుంటారేమో  అన్న అనుమానం వస్తోంది ఈ సంఘటనలు చూస్తుంటే!              

Monday, September 2, 2013

విషం చిమ్మిన వీణ!

దేశంలో ఎన్నో చోట్ల ప్రత్యెక రాష్ట్ర ఉద్యమాలు వుండగా కేవలం రాజకీయ సమీకరణాలు దృష్టిలో వుంచుకొని తెలుగు జాతిని అడ్డగోలుగా విభజించటానికి తెగబడిన కాంగ్రెస్ పై యావత్ సీమాంధ్ర భగ్గుమంటోంది. రాజకీయ పార్టీలకి అతీతంగా విభజన వ్యతిరేక పోరు సలుపుతోంది. విడాకులు మంజూరు చేసేటప్పుడు రెండు పార్టీలకి సమ న్యాయం చూపాలన్న కనీస ధర్మం విస్మరించి - సీట్లు,వోట్లే పరమావధిగా ప్రతిపాదించిన విభజన సీమాంధ్రుల గుండె మండించింది. సీమాంధ్రుల గుండె చప్పుడు వినిపించిన నా బ్లాగు పోస్టుల పై కోటి రత్నాల వీణ విషం చిమ్మింది :

http://kotiratanalu.blogspot.in/2013/09/blog-post.html

ఆ వీణ చిమ్మిన విష గుళికలు - వాటికి విరుగుడు మాత్రలు కింద చదవండి : 

పక్కనున్న సగటు సీమాంధ్ర మనిషి కాస్త చిరాకుపడ్డాడు. ఊరుకో రామన్నా! విడిపోతామని అక్కడి జనాలు తెగేసి చెబుతుంటే కలిసి ఉండమనడం ఏం న్యాయం? పైగా అందుకోసం ఈపదమూడు జిల్లాల జనాలను ఒక్కొక్కరినీ వచ్చి అడుగుతారా ఎక్కడయినా? అఖిలపక్షం పెట్టి అడిగినప్పుడు మన నాయకులే కేంద్రం ఏనిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారు కదా? అయినా కలిసిఉడడానికి ఏకాభిప్రాయం కావాలి గానీ విడిపోవడానికి ఎందుకు? వద్దంటున్నా నాతోనే కలిసుండమనే ఆసిడ్ ప్రేమికునిలాగుంది నీవరస. 

" అధికార పార్టీగా ఒక న్యాయ మూర్తి హోదాలో ఉన్న కేంద్ర నిర్ణయం సమంజసంగా వుంటే నిజంగానే అన్ని పార్టీల వారు కట్టుబడే వారు. మరి నేడు కాంగ్రెస్ కి తన స్వంత పార్టీలోనే అదుపు చేయలేనంత వ్యతిరేకత వస్తోంది అంటే నిర్ణయం సమంజసంగా లేనట్లే కదా? విడి పోవడానికి ఏకాభిప్రాయం ఎందుకు అంటున్నారు. విడి పోదల్చుకున్న వారు స్వంతం గా విడి పోయి అభివృద్ది చెందుతాం అంటే అందరికీ సంతోషమే. కానీ ఉమ్మడిగా అభివృద్ది చెందిన రాజధానిని పట్టుకు పోతాం అంటే దానికి ఏకాభిప్రాయం తప్పని సరి." 

స.సీ.మ.: మన రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారం కేంద్రానికి ఆహక్కు ఉంటుంది. అదే లేకపోతే దోపిడీకి గురయేప్రాంతానికి న్యాయం జరిగేది ఎట్ల? ఎక్కడైనా దోచుకునేవాడు విభజనకు ఒప్పుకుంటాడా? 

"ఇది ఒక విష ప్రచారం. దగా, దోపిడీ అన్నది జరిగినన మాట వాస్తవమైతె అది ఒక్క రోజులో జరిగేది కాదు. మరి అరవై ఏళ్ళు గా సీమాంధ్రులు దోచుకుంటున్న మాట వాస్తవమైతే ఇన్నేళ్ళుగా తెలంగాణా ప్రాంతానికి వున్న 100 కి పైగా శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఏం చేస్తున్నారు?"

స.సీ.మ.: ఆవిషయం తెలిసిందే కదా. మన సీమాంధ్ర నాయకులకు ప్రజల బాగుకంటే వాళ్ళ వ్యాపారాలూ, కబ్జారాజకీయాలూ, పదవులూ,వోట్లూ ముఖ్యం. పదవులకోసం, అక్కడి ప్రాంతంలో వోట్లకోసం కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటారు, వ్యాపారాలకోసం సమైక్యత కావాలంటారు. అలాంటోళ్ళగురించి పట్టించుకునేదెందుకు? అయినా పక్కోడు విడిపోయి నాబాగు నేను జూసుకుంటానంటే నీకెందుకు కడుపుమంట?

"నిజమె. అందుకే రాజకీయ నాయకులని పక్కన  పెట్టి మరీ ప్రజలు అడ్డగోలు విభజన ప్రతిపాదనకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఎ పార్టీలు - జాక్ ల అండ లేకుండా స్వచ్చందంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పైన చెప్పినట్లు పక్కోడు విడి పోయి బాగు పడతానంటే సంతోషమే... అయితే ఉమ్మడి ఆస్తిని కాజేసి బాగు పడతానంటే ఎలా కుదురుతుంది?"

"ఛ! ఊరుకో!! హైదరాబాదు మన గుండెకాయ ఏమిటి? మన గుండెకాయ అయితే అదెందుకు తెలంగాణ మధ్యలో ఉంది? నీ కథ బాగానేఉందిగాని పాత్రలు తారుమారు చేస్తున్నవు. మనమేమన్నా కలిసినప్పుడు హైదరాబాదును తీసుకెళ్ళామా, విడిపోతే అది మనకు చెందడానికి?కలిసిఉన్నా, విడిపోయినా హైదరాబాద్ తెలంగాణలోనే ఉంటుంది, దాన్ని కాజేయడానికి వారు కుట్ర జెయ్యడమేమిటి నీపిచ్చిగానీ?మనదిగానిదాన్ని ఆశపడకుండా మనకో రాజధానిని ఏర్పాటుచేసుకుంటే మనకే లాభం."

"అవును! హైదరాబాదు తెలంగాణ లోనే వుంటుంది. తెలంగాణా ప్రాంతంలోనే వుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఒక భాగమైన తెలంగాణా ప్రాంతంలోనే వుంది, వుంటుంది. ఐదేళ్ళ పాటు ఆగమన్నా ఆగకుండా బేషరతుగా ఆంధ్రలో తెలంగాణా ప్రాంతం విలీనమైనపుడు విశాల హృదయంతో సీమాంధ్రులు కర్నూలు రాజధానిని - గుంటూరు హైకోర్టు ని త్యాగం చేసి హైదరాబాదు కి ఇచ్చి తమ స్వంత రాజధాని అన్న అభిమానంతో అందరితో పాటు అభివృద్ధిలో పాలు పంచుకొన్నారు. అనుబంధాన్ని పెంచుకొన్నారు. మరి ఈ రోజు స్వయం సమృద్దమైన హైదరాబాదు నగరాన్ని సీమాంధ్రుల కి కాకుండా చేసి కాజేద్డామనుకొంటున్నది వేర్పాటు వాదులే!"

ఒకవేళ నువ్వన్నట్టు కాంగ్రేస్ సొంతప్రయోజనాలకోసమే విభజిస్తుందనుకో. విభజనవల్ల కాంగ్రేస్కు లాభం అంటే దాని అర్ధం ఏంటి? తెలంగాణలో ప్రజలు విభజన కోరుకుంటున్నారు, అదే సీమాంధ్రలో పెద్దగా వ్యతిరేకత లేదన్నట్టే కదా? ప్రజాభిప్రాయం అలాగుంటే విభజిస్తే తప్పేంటి? 

"కాంగ్రెస్ కి సీమాంధ్ర లో పెద్దగా వ్యతిరేకత లేక పొవటమేమిటో అర్ధం కాలెదు. ఏమైనా కొన్ని సీట్లు వస్తాయన్న అంచనాతో అడ్డగోలు విభజన ప్రతిపాదించిన కాంగ్రెస్ - తన అంచనాలు తప్పుతున్నాయని గ్రహించిన మరు క్షణం హ్యాండ్ ఇవ్వడం ఖాయం!"

సగటు సీమాంధ్రునికి చిరాకేసింది. "ఇదిగో ఆకాశరామన్నా. వింటున్నాగదా అని ఏంది నీ అరుపులు? ఆపు నీ బోడి డైలాగులు. తెలుగు జాతికి ఆత్మగౌరవలేదా అని అడుగుతున్నావు, మరి తెలాంగాణ ప్రజలు ఈతెలుగుజాతిలో భాగం కాదా? వారి ఆత్మగౌరవం సంగతేంటి? కెవలం మన అభిప్రాయమే మొత్తం జాతి అభిప్రాయనుకుంటే ఎలా? ఎందుకింత కుంచితబుద్ధి?" అంటూ ఒక్కసారి లెఫ్ట్ రైట్ ఇచ్చాడు.

"ఒక్కటిగా వున్న తెలుగు వారు బలపడితే కష్టమన్న దురాలోచనతో విభజించి సవారీ చేద్దామనుకుంటున్న కాంగ్రెస్ కుటిల రాజకీయానికి బలి అవ్వకూడదన్న ఇంగిత జ్ఞానం వేర్పాటు వాదులకి వుంటే ఆత్మ గౌరవం అన్న మాట అననే అనరు. ఇదే కాంగ్రెస్ పార్టీని గోర్ఖాలాండ్ విషయంలో వేలు పెట్టమనండి! మమతా బెనర్జీ తాట తీస్తుంది. సౌరాష్ట్ర గురించి మాట్లాడమనండి. మోడీ మక్కెలిరగ తంతాడు. అంతెందుకు.. విదర్భ సంగతి తెల్చమనండి .. దిగ్విజయ్ మాట్లాడితే ఒట్టు. కానీ ఆంద్ర ప్రదేశ్ ని ముక్కలు చేయటానికి మాత్రం ప్రతి వాడూ కత్తి పట్టుకొని సిద్ధమై పోతాడు. కారణమేమిటి? వేరే చెప్పాలా ? రెండు ముక్కలైన తెలుగు వారి ఆత్మ గౌరవం .."

ఆఖరు అస్త్రం కూడా వీగిపోవడంతో ఇక లాభం లేదని ఆకాశరామన్న మెల్లగా పలాయనం చిత్తగించాడు.

సమైఖ్యాంద్ర స్ఫూర్తి ని అంతర్జాల మాధ్యమం లో నాకు తెలిసిన విధంగా వ్యక్త పరుస్తున్నానే తప్ప ఎవరి పైన విద్వేషం కక్కే ఉద్దేశం నాకు లెదు. తెలుగు జాతి విడి పోకూడదన్న ఉద్యమానికి ఉడత సాయం మాత్రమె ఇది. పలాయనం చిత్తగించానని ఎవరైనా సంబరం చేసుకుంటే నాకూ సంతోషమే !