అడ్డగోలు విభజనకి వ్యతిరేకంగా యావత్ సీమాంధ్ర దేశంలో ఎప్పుడూ లేని విధంగా వుద్యమిస్తోంది. అధికారం వుందన్న్న అహంకారంతో ఏమి చేసినా చెల్లిపోతుందనే భావనతో అధిష్టానం తల పెట్టిన విభజన ప్రతిపాదన వారికే తల కొరివి గా మారే పరిస్థితి వచ్చింది. అబద్ధపు ప్రచారాలతో హైకమాండు ని తప్పుదోవ పట్టించి విభజన వూబి లోకి దించిన ఘనత తెలబాన్లదే. గుండె ఘోష చేసిన తాటాకు చప్పుళ్ళు ముందు టపాలో చూసాం. ఇప్పుడు కోటి రత్నాల వీణ వాయిస్తున్న అబద్ధపు ప్రచారాలేమిటో చూద్దాం :
http://kotiratanalu.blogspot.in/2013/09/blog-post_2692.html
1) ఉన్నపళంగా పొమ్మంటే ఎక్కడికి పోతాం:
ఇదొక అసత్యపు, అర్ధం లేని, మూర్ఖపు వాదన. కాస్తో కూస్తో రాజకీయ ప్రగ్నానం ఉన్నవాళ్ళు ఎవ్వరైనా నవ్వుకునే వాదన. రాష్ట్రం విభజించబడ్డంతమాత్రాన హైదరాబాద్‌లోని సీమాంధ్రులను ఎవ్వరూ ఎక్కడికీ వెళ్ళమనడం లేదు, వారు కూడా ఎవ్వరు ఎక్కడికీ వళ్ళారని వారికీ తెలుసు. అసలా మాటకొస్తే హైదరాబాదులో ఏళ్ళతరబడి ఉంటున్నవారికెవరికీ వదిలి వెల్లాలనే భయం లేదు. కాకపోతే హైదరాబాదు సీమాంధ్ర సెటిలర్ల తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు భావిస్తున్న లగడపాటి లాంటి కొందరు సీమాంధ్ర నాయకులు, కొందరు స్వయంప్రకటిత మేధావి సంఘాధ్యక్షులూ ఇలాంటి అపోహలు కల్పిస్తున్నారు. మద్రాసునుండి విడిపోయినంతమాత్రాన అక్కడి తెలుగువారందరూ మద్రాసు నగరం విడిచి ఆంధ్రాకు రాలేదు. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మాత్రం ప్రభుత్వాలు వేరవుతాయి కనుక సహజంగా సీమాంధ్ర నేటివిటీ ఉన్నవారు సీమాంధ్ర ప్రభుత్వంలో పనిచేయాల్సి ఉంటుంది. వారికి కూడా పదేళ్ళు ఉమ్మడి రాజధాని కనుక హైదరాబాదులో ఉండే వెసులుబాటు ఉంది.
కాస్తో కూస్తో రాజకీయ ప్రజ్ఞానం వున్న ఎవరికైనారాష్ట్రం విడి పొతే సీమాంధ్రులు ద్వితీయ శ్రేణి పౌరుల వలె మనుగడ సాగించాలన్న కఠోర వాస్తవం అర్ధమౌతుంది. తెలంగాణా ప్రకటన వచ్చిన మరుక్షణం ముఖ్య మంత్రి అంతటి వాడినే టిఫిన్ సెంటర్ పెట్టుకోమన్నాడు తెలబాన్ నాయకుడు.ఇంక సామాన్య సీమాంధ్ర పౌరుడి గతి ఏమిటి ? మద్రాసు నగర అభివృద్ధిలో తెలుగు వారి పాత్ర ఎంతో వుంది. అయినా కొత్తగా తెలుగు రాష్ట్రం ఏర్పడినప్పుడు - కొత్త రాష్ట్రమే కొత్త రాజధాని చూసుకోవాలన్న ఇంగిత జ్ఞానంతో ఆంధ్రులు వ్యవహరించి ఎన్నో కష్ట నష్టాలకోర్చి మొదట కర్నూలు ఆ తరువాత హైదరాబాదు లో తమ రాజధాని ఏర్పాటు చేసుకొన్నారు. అంతే తప్ప సమిష్టి కృషితో అభివృద్ది చెందిన రాజధానిని కాజేద్దామని ఎప్పుడూ అనుకోలేదు.
2) ఉమ్మడిగా అభివృద్ధి చేసుకున్నాం, ఇప్పుడు మొత్తంగా మీరే కొట్టేస్తే ఎలా?
1956లో తెలంగాణ, ఆంధ్రా కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ నిధులు (హైదరాబాదుతో సహా) తెలంగాణాలో, ఆంధ్రా నిధులు ఆంధ్రాలో ఖర్చు పెట్టాలి. ఆనిబంధన పాటించినట్టయితే ఎలాంటి పంచాయితీ ఉండేది కాదు. కానీ వాస్తవానికి తెలంగాణ నిధులు ఆంధ్రాకు తరలించబడ్డయి తప్ప ఆంధ్రా నిధులు హైదరాబాద్ రాలేదు. కనుక ఆంధ్రావారు తమ సొమ్ముతో హైదరాబాద్ బాగుపడ్డది అనే అపోహ తొలగించుకుంటే మంచిది. ఇక ఇక్కడికొచ్చి ఒక ఇళ్ళు కట్టుకున్నా, ఒక కంపెనీ పెట్టినా అది వారి సొంత లాభానికి తప్ప సిటీని అభివృద్ధిచెయ్యడం కోసం కాదు. ఆంధ్రా వ్యాపారులకంటే ఎన్నోరెట్లు ఎక్కువగా మల్టీనేషనల్స్ ఇక్కడ పెట్టుబడి పెట్టారు. వారు పెట్టింది లాభాలకోసమే, తెలంగాణవస్తే వాల్ల లాభాలకు ఢోకా లేదని తెలుసుకనుక వారెవ్వరూ చింతించట్లేదు. హైదరాబాదులో వచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, మెట్రో రైలు లాంటి ప్రాజెక్టులు అన్నీ ఇక్కడి జనాభా అవసరానికి అనుగుణంగా సహజంగా ఇతర మెట్రోసిటీల లాగానే వచ్చిన ప్రాజెక్టులు. వాటికి పెట్టుబడులు బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ ప్రకారం ఆయా కంపెనీలు పెట్టడమో, లేక అంతర్జాతీయ బ్యాంకులద్వారా ఋణాలు సేకరించడం ద్వారానో జరిగింది. ఆ అప్పులు ఎలాగూ తెలంగాణ రాష్ట్రానికే వస్తాయి కనుక ఈప్రాజెక్టులగురించి కూడా సీమాంధ్రులకు చింత అవసరం లేదు.
ఇటువంటి అబద్ధపు అసత్య గోబెల్స్ ప్రచారాలతోనే ఉద్యమాన్ని నడిపెసారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక చదివి అర్ధం చేసుకున్న వాళ్ళెవరూ ఇటువంటి వ్యాఖ్యానాలు చెయ్యరు. కేంద్రం కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదికని పార్లమెంటులో చర్చకి పెట్టి వుంటే దేశం మొత్తానికి నిజాలెమిటో తెలిసేవి. రాజధాని హోదాలో వచ్చిన ఆదాయాన్ని, సౌకర్యాలని తమ ఖాతాలో వేసుకొని తక్కిన రాష్ట్రాన్నంతా తామే పోషిస్తున్నట్లు చేస్తున్న అబద్ధపు ప్రచారాలన్నీ వట్టివే అని శ్రీ కృష్ణుడు తేల్చేసాడు.
3) హైదరాబాదు లాంటి మరో రాజధానిని నిర్మించుకోవాలంటే ఎన్నేళ్ళు పట్టాలి?
నాలుగొందల ఏళ్ళు పడుతాయి. ఎందుకంటే హైదరాబాదు కూడా నాలుగొందల ఏళ్ళతరువాతనే ఇలాగుంది. కాకపోతే ఒక రాజధానికి ఇంతపెద్ద నగరం అవసరం లేదు. గుజరాత్ లాంటి ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రానికి కూడా ఉన్న రాజధాని అతిచిన్న నిగరం. నిజానికి ఒక ప్రణాలిక లేకుండా ఇలా పెరిగిన ఈహైదరాబాదు నగరంలో లాభాలకంటే నష్టాలే ఎక్కువ. దీనికంటే చిన్న చిన్న నగరాలు ఎక్కువ అభివృద్ధి చేసుకుంటే సుఖంగా ఉంటుంది. సీమాంధ్రలో ఎలాగూ అనేక చిన్న నగరాలు ఉన్నాయి.
హైదరాబాదు నగరం వయసు 400 ఏళ్ళు. కానీ 350 సంవత్సరాల తర్వాత ఎలా వుంది .. మిగిలిన 50 ఏళ్లలో ఎలా మారింది అన్నది చెప్పనక్కరలేదు. ఆ వివరాలు కూడా శ్రీ కృష్ణ కమిటీ నివేదిక 6 వ అధ్యాయంలో వివరంగా వున్నాయి. హైటెక్ సిటీ వచ్చిన తరువాత ఐటీ రంగంలో బెంగళూరు ని హైదరాబాదు తలదన్నిన విషయం అందరికీ తెలుసు. అంతర్జాతీయ కంపెనీలెన్నో బెంగళూరు ని కాదని హైదరాబాదులో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసాయి. రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న సాఫ్ట్ వేర్ రంగ ఎగుమతుల్లో 98 శాతం కేవలం హైదరాబాదు నగరం నుండే జరుగుతున్నాయి అని శ్రీ కృష్ణ కమిటీ నివేదిక తేల్చింది. అయినా లాభాల కంటే నష్టాలే ఎక్కువ వున్నప్పుడు హైదరాబాదు గురించి అంత మంకు పట్టు ఎందుకు? అక్కడే వుంది అసలు మతలబు!
4) ఉద్యోగావకాశాలన్ని హైదరాబాదులోనే ఉన్నాయి
ఐటీ, ఫార్మా రంగాల్లో హైదరాబాదులో ఉన్న అవకాశాలగురించి ఈఏడుపు. అయితే ప్రైవేటు ఉద్యోగాలకు ప్రభుత్వ ఉద్యోగాళ్ళా నేటివిటీ నిబంధనలేవీ లేవు. మబవాళ్ళెందరో రోజూ బెంగుళూరు, నోయిడాల్లాంటి నగరాల్లో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. కనుక రేపు వేరే రాష్ట్రమయినా హైదరాబాదుకు సీమాంధ్ర యువకులు వచ్చి ఉద్యోగాలు వెతుక్కోవచ్చు. ఇక్కడ సీమాంధ్రలో లాగా ఫాక్షనిజం రౌడీయిజం లేవు కనుక ఎవరైనా ప్రశాంతంగా బతుకొచ్చు. అందుకే ఈనగరం అభివృద్ధి చెందింది
ఇక్కడ ఫాక్షనిజం, రౌడీయిజం లేక పోవచ్చు. కానీ వెర్రి తలకెక్కిన వేర్పాటు వాదం, సీమాంధ్రుల పట్ల వల్ల మాలిన విద్వేషం పుష్కలంగా వున్నాయి. ఒక తాజా ఉదాహరణ - ప్రస్తుతానికి సమైక్యంగా వున్న ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అనుమతితో, తమ రాజధానిలో, జరపదలుచుకున్న సమావేశం పట్ల తెలబాన్లు ప్రవర్తిస్తున్న తీరు! సాక్షాత్తూ కేంద్రమే తెలంగాణా ఇవ్వటానికి పరుగులు పెడుతున్న సమయంలో తమ నిరసన తెలపటానికి చిన్న ఉద్యోగులు జరుపుకొనే సమావేశం పట్ల తెలబాన్లు చూపిస్తున్న కక్ష సాధింపు ధోరణి వారి భవిష్యత్ కార్యాచరణ ని చెప్పకనే చెపుతోంది. బందులు, రహదారి దిగ్బంధనాలు ప్రకటించటమే గాక తన్నులు తంతామని కూడా ఓయూ జేఏసీ బరితెగించి చెప్పింది. ఇదేనా కడుపులో పెట్టుకొని చూసుకోవడమంటే?
5) ఆదాయంలో డెబ్బై శాతం హైదరాబాదునుండే!
రాష్ట్ర ఆదాయంలో ఎక్కవ భాగం హైదరాబాదు నుండి రావడం ఇప్పుడు మొదలు కాలేదు, 1956 నుండే ఉంది. ఆ ఆదాయం చూసే అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్ర నాయకులు వచ్చి తెలంగాణను కలుపుకున్నారు. అయితే ఇప్పుడొస్తున్న ఆదాయంలో కూడా ఎక్సైజ్, సేల్స్ టాక్స్ లాంటి ఆదాయాలు ఆఫీసు ఆంధ్రాలో ఉన్నా హైదరాబాదు కిందే వాస్తాయి. అయితే రాష్ట్ర విభజన తరువాత అవి సీమాంధ్ర అక్కౌంటు కిందికి వస్తాయి కనుక ఆదాయం గురించి చింత పడాల్సిన అవసరం లేదు.
6) ఆంధ్రప్రదేశ్ రాజధాని కనుకనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది
ఇదొక పచ్చి అబద్దం. 1956లోనే హైదరాబాదు దేశంలో ఐదవ పెద్దనగరం. మిగతా పెద్ద నగరాలు ఏరేటులో అభివృద్ధి చెందాయో హైదరాబాదు కూడా అంతే ( కాస్త తక్కవే) రేటులో పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి కాకుండా ఇన్నాళ్ళూ తెలంగాణ రాజధానిగా ఉన్నా హైదరాబాదు ఇలాగే ఉండేది. కర్నూలు ఆంధ్ర రాజధానిగా కొనసాగిన అది సుమారు అలాగే ఉండెది, కాకపోతే కాస్తడబ్బొచ్చిన తరువాత డేఋఆలకు బదులు బిల్డింగులు కొన్ని కట్టేవారేమో.
నగర అభివృద్ధి రాజధాని వలన అవదు. వ్యాపార అవకాశాలు, కొత్తవారిని చేర్చుకోవడంలో ప్రజల కలుపుగోలుతనం, భౌగోళిక స్థితిగతులు లాంటి వాటిపైన అభివృద్ధి చెందుతుంది. అలాగే ఐటీ,ఫార్మా కంపెనీలు టాలెంట్ పూల్ లభ్యమయ్యేదగ్గరే ఏర్పడతాయి. అవన్నీ హైదరాబాదుకు ఉన్నాయి గనుకే హైదరాబాదు అభివృద్ధి చెందింది.
అన్నింటితోబాటు హైదరాబాదు చుట్టు పక్కల కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు సరిపడే స్థలం ఉంది. అది ఆంధ్రా సిటీల్లో దొరకదు.
1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు చేసినపుడు తెలంగాణా ప్రాంతాన్ని 5 సంవత్సరాలు ప్రత్యేకంగా వుంచి ఆ తరువాత ఆ రాష్ట్ర శాసన సభ అనుమతితో ఆంధ్రలో విలీనం చేయమని ప్రతి పాదన జరిగింది. అయితే ఐదేళ్ళు కూడా ఆగకుండా బేషరతుగా వెంటనే విలీనానికి వచ్చి ఇప్పుడు హైదరాబాదు స్వయం సమృద్ధం అయ్యాక పొమ్మంటే అర్ధమేమిటి? ఇంకా ఆదాయం విషయంలో కూడా శ్రీ కృష్ణ కమిటీ నివేదికే సమాధానం. రాజదానికి వచ్చే ఆదాయాన్ని తమ ప్రాంత ఆదాయంగా పరిగణించటం వాపుని చూసి బలుపు అని భ్రమించటమే! అసలు ఆదాయ వనరులు, నదీ జలాల పంపిణీ వంటి ముఖ్యమైన పంపకాలు చెయ్యకుండా కేంద్రం విభజన ప్రతిపాదించటమే మూర్ఖత్వం. 23 జిల్లాలతో కూడిన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అన్న హోదా లోనే హైదరాబాదు కి ఈ ఆదాయం , అభివృద్ది సంప్రాప్తించాయి. 1956 లోనే కాదు 2009 వరకు కూడా హైదరాబాదు దేశంలో 5 వ పెద్ద నగరం. మరి ఈ రోజు పరిస్థితి ఏమిటి? వేర్పాటు వాదుల విద్వంసక చర్యలతో మనకు రావలసిన వ్యాపారాలు, పరిశ్రమలు ఎన్నో గుజరాత్ కి తరలి పోయాయి. అభివృద్ధిలో దశాబ్దాల వెనక్కి వెళ్లి పోయాం. ఏమైనా రాజధాని విషయంలో మరోసారి మోస పోవటానికి సీమాంధ్రులు సిద్ధంగా లేరు.
Hyderabad meeda unna asha ki "Samikya Udyamam" ani peru
ReplyDeleteAtleast okkarina ee telabanula aagadalni prajala mundu unchutunnaru. Santosham.
ReplyDeleteoorukunte vallu cheppede nijam anukuntaru. Adi kadu idi ani chepte vithanda vaadam chestaru. ee telabanulatho ela cheyalo artham kaavatledu.
okka vishapu chukka chalu kadivedu palu paadavataniki annattu, okka KCR mana telugu jathini cheelchagaligadu. adi mana level.
ఈ మధ్య తరచుగా వింటున్నది, సీమంధ్ర వాళ్ళు కేవలం హైదరాబాద్ కోసమే సమైక్య ఉద్యమం చేస్తున్నారు అని.
ReplyDeleteవాళ్ళకి ఈ సమాధానం
అయ్యా, మేము తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలి అనే అనుకుంటున్నాం ఎందుకంటే ఒక్క KCR చేత మళ్లీ తెలంగాణా వేర్పాటు వాదానికి బీజం పడింది అది తెలంగాణా వాదుల మనస్సులో విష వృక్షం లా పెరిగింది అంతే కానీ ప్రజల్లో స్వచందంగా వచ్చింది కాదు అని నమ్ముతున్నాం కాబట్టి. కానీ ఇంక కుదరదు ఎవరి దారి వాళ్ళదే అన్నప్పుడు మాత్రమె మా న్యాయబద్దమయిన వాటా కోసం అడుగుతున్నాం.
దీనిని తెలంగాణా వాదులు వాళ్ళ సొంత స్టైల్ లో తిమ్మిని బమ్మిని చేసి హైదరాబాద్ కోసమే సమైక్యం అంటున్నారు అని విష ప్రచారం చేస్తూ తెలంగాణా ప్రజలని నమ్మిస్తున్నరు.
kindha mee dosthu lu itchinaa solution chusthe teilaydam ledaaa meeru endhuku vudhyamma chesthunnaro
DeleteOkka KCR kadu nayana. CBN, Jagan & Congress leaders( Who are fighting for Samikya Andra) are also responsible for this
Deleteఏంటి CBN, గజ దొంగ గజన్ సారీ జగన్, కాంగ్రెస్ లీడర్స్ తెలంగాణా వాళ్ళకి సీమాంధ్రుల మీద విద్వేషాన్ని నూరి పోస్తున్నారా రోజూ? ఊరుకోండి సార్.
Deleteఈ తెలంగాణా- సీమాంధ్ర పటము
ReplyDeleteమీ బిర్యానీ కథ చాలా వివరణాత్మకంగా
ప్రతీ వారినీ ఆలోచింప జేసేలా ఉన్నవి !
వీటిని లోక్-సభ మరియు రాజ్యసభల లోని సభ్యులందరికీ
పంపించగలిగితే సీమాంధ్రుల సమస్య
వారికి సులువుగా స్పష్టముగా అర్థమవుతుంది !
If we are greedy about Hyderabad, then let the Great Telangan try to establish a new capital better than that leaving Hydearabad for us. Or at least let them try to estimate how much amount to return to Seemandhra if they want to retain Hyderabad and return our money which nobody can estimate. we have no selfish fools called leaders like KCR, kodandaram, etc. Ours is purely PRAJA UDYAMAM. Evvadainaa nijamaina prajagrahaaniki thala vanchaalsinde !!
ReplyDelete
ReplyDeleteThis might be better solution, New Hyderabad state
http://telugu.greatandhra.com/politics/sep2013/05e_hyd_ras.php
Seemandra people & Hyderabad people will be happy.
If central Govt take decision back. Problems will continue for next 5 years for Andra Padesh.
We need solution not problem shifting from one place to other.
Elaaguu jaragaboyedi ade ...
ReplyDeleteAndhra , telangana rashtraalu kotha rajadhaanululatho mari...hyderabad ane kotha rashtram.......idi maathram kachara kutumbaaniki jaageeru ga isthaaru...ta..
ఆ కోటిరత్నాలవీణ బ్లాగ్ పోస్ట్ లను మీరు అంత పట్టించుకుని ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరంలేదు సోదరా! సీమాంధ్రలో అసలు ఉద్యమమే జరగటంలేదంటూ బ్లాగ్ పోస్ట్ లో అతను చేసే వ్యాఖ్యలతోనే అతని వాదనలో ప్రామాణికత ఎంతో మీరు అర్ధం చేసుకోవచ్చు.
ReplyDeleteమీ టైమ్, ఎనర్జీ అలాంటి అల్పులకోసం వెచ్చించడం వృధా.
ikada andari comments chustunte merantha inka 2006 lo unnaranipistondi. kcr..visham..vishavruksham..verpatuvadulu..telabanlu..!! Nonsense. Asal mereppudu jivitam lo telangana vadula vadanalu vinna paapaana poledu anpostondi. inka ave ave childish vadanalu. ave crybaby attitudes. koncham nijamloki randi.koncham soyi loki randi.koncham sontha labham manukuni thotodi ki kuda oka chevvu padeyandi.
ReplyDeleteతెవాదుల వాదనలు విన్నాం, వాళ్ల వదనాలు చూసాం. వాదనల్లో అబద్ధాలను, సీమాంధ్రులను తిట్టే తిట్లనూ విన్నాం. మేము ఏం చేసినా రైటే, మీరు ఏం చేసినా తప్పే అనే తలమాసిన, దిక్కుమాలిన ముష్టివాదనలు తప్ప, దోపిడీదారులు, దౌర్జన్యకారులు, వలసవాదులు అటూ బూతుకూతలు తప్ప, మరోటి ఉందా వాళ్ళ వాదనల్లో?
Deleteసొంత లాభం మానుకోవాలా? అన్నీ వదిలేసుకుని అవతలికి పోండని తెవాదులు అంటూంటే సొంత లాభం మానుకుని తెవాదికి తోడుపడాలా, భలే! అవున్లెండి, తెవాదులు విశ్వకల్యాణం కోసం, ప్రపంచశాంతి కోసం వేర్పాటు ఉద్యమం చేస్తున్నారు కదా, అందుకని సీమాంధ్రులేంటి, మొత్తం ప్రపంచమంతా తిండీతిప్పలు మానుకుని మీకు తోడపడాలి.
ఊరుకోండి సార్, నవ్వొస్తోంది.
సీమాంధ్రుల వైపు వేలు చూపించేముందు మీవైపు చూస్తున్న నాలుగు వేళ్ళకు సమాధానం చెప్పండి. ఆ తరవాత చెప్పండి మీ నీతులు.
telanaga vadulavi abddalaa :)
Deleteనీరు పల్లమెరుగు, తెవాది అబద్ధమే ఎరుగు!
Deleteనీరు పల్లమెరుగు, సమైక్యవాది దోపిడే ఎరుగు!
Deleteనీరు పల్లమెరుగు, సమైక్యవాది దోపిడే ఎరుగు!
Deleteఅదెట్టా సారూ. నేను సమైక్యవాదిని. నేను ఏమేమి దోచానో చెప్పు చూద్దాం. నోరు ఉంది కదా అని సీమంధ్ర వాళ్ళందరినీ దొంగలు , దోపిడీదారులు అంటే అన్యాయం గదా సారూ. మీ కళ్ళు ఎలాగో మూసుకుపోయినాయి. మిగిలిన వాళ్ళ కళ్ళు కూడా మూయాలని ఎందుకు సారూ అంత పట్టుదల?. పోనీ తెలంగాణా వాదే డిప్యూటీ cm గా ఉన్నాడు కదా? సీమంధ్ర వాడు ఎవడెవడు ఎంత దొంగ తనం చేసిండో , ఎంత దోపిడీ చేసాడో లెక్కలు తీయించమను. అందరికీ శిక్ష వేసి పడేద్దాం. ఊరికే అబద్ధాలు విద్వేషాలు ప్రచారం చేయకండి సార్. ఎదైనా విషయం ఉంటె మాట్లాడండి. పడి కట్టు మాటలు వదిలేసి.
Deleteనోరు ఉంది కదా అని తెలంగాణా వాళ్ళను తెలబాన్లు అబద్దాల కారులు అంటే ఎలా? ఇంతకూ ముందు వేసిన కమిటి లు అన్ని మీ దోపిడిని నిర్దారించినవే కదా, ఇందులో కొత్తేముంది? అందుకే అంటాం. డిప్యూటి సిఎం ల అధికారాలు అందరికి తెలిసిందే. తెలంగాణాలో దొంగతనంగా ఉద్యోగాలు చేస్తున్న సిమాన్ద్రులు ఎవ్వరు లేరు, 610GO పని అయిపొయింది అని ఒక గవర్నమెంటు ఆర్డర్, ఎవని ప్రాంతంలో ఎంత ఆదాయం, ఎంత ఖర్చు అనే దానిపై ఒక అధికారిక ప్రకటన చేయించాగాలరా? సిఎం మివోడే కదా, ఒక్క రోజు పని అది.
Deleteరామాయణమంతా విని సీత రాముడికి ఏమవుతుంది అన్నట్టుంది నీ కత
Deleteతెలంగాణా వాళ్ళందరూ తెలబానులు కాదు అని ఈ బ్లాగ్ లోనే ఎన్నో సార్లు చెప్పినారు. నువ్వు దాన్ని మీ సొంత పద్ధతి లో తిమ్మిని బమ్మిని చేసి తెలంగాణా వాళ్ళందరినీ తెలబానులు అంటావా ని ఒక ప్రశ్న. బానే తర్ఫీదు పొందవు సోదరా.
ఇక కమిటీ విషయానికి వస్తే లేటెస్ట్ గా శ్రీ కృష్ణ కమిటీ ఏమి తేల్చింది సోదరా? ఒకసారి సదువుకుని సెప్పరాదె. లేదూ తెలబానుల్లాగా మాకు నచ్చింది చెప్పిందే కమిటీ, శ్రీ కృష్ణ కమిటీ అలా చెప్పలేదు కాబట్టి అది కమిటీ కాదు అంటే ఇంక చెప్పేదేముంది సోదరా.
ఇక 610 GO , దొంగతనంగా ఉద్యోగం చేస్తున్న సీమంద్రుల గురించి అన్నావ్ బాగుంది. దాని కోసం పోరాటం చేసే వాళ్ళకి ఎవరికైనా మా మద్దతు ఉంటుంది. ఒక్కసారి ఖచ్చితమయిన లెక్కలు ఎవరో ఒకరు తీయాలి. అక్రమ పద్ధతుల్లో వచ్చిన వాళ్ళు ఉంటె వాళ్ళు వెనక్కి వెళ్ళే వరకు (వాళ్ళు సీమంధ్ర వాళ్ళు అయినా , తెలంగాణా జిల్లాల వాళ్ళు అయినా ) అందరం కలిసి పోరాటం చేద్దాం. దానికి సమైక్యవాదుల మద్దతు ఖచ్చితంగా ఉంటుందని నా అభిప్రాయం
ఆకాశం విరిగిపడ్డా రాష్ట్రం కలసి ఉండాలి అనుకునే మీరు ఆ ఖచ్చితమయిన లెక్కలు మీరే తియ్యోచ్చుగా, తియ్యరు, ఎందుకంటే బండారం బయట పడుతుంది కదా. గిర్ గ్లాని కమిటి ఆనాడే చెప్పింది, సమాచారం ఇవ్వటానికి డిపార్ట్మెంట్ లు సహకరించటం లేదు అని. ఎంద్కుకు సహకరించలేదు? ఆ రిపోర్ట్మీ మిద యాక్షన్ తిసుకోమంటే దొబ్బెయ్యమన్నాడు మీ చంద్ర బాబు. ఎందుకని? అప్పుడెప్పుడో 610GO వస్తే గిర్ గ్లాని కమిటి వచ్చేవరకు ఎందుకు పూర్తిగా అమలు కాలేదు? మేము అడిగితేనే అక్రమ పద్దతులలో వచ్చిన వాళ్ళను వెనక్కి పంపుతారా? అడగక పొతే అవసరం లేదా?
Deleteఇక నికృష్ట కమిటి ఏమి తెల్చిందంటే తెలంగాణా సిమాన్ద్రకు ఏమి తీసిపోదు అన్నాడు కదా, ఇంకా చెప్పాలంటే కొన్ని సిమాంద్ర ప్రాంతాలే వెనుక బడ్డాయి అన్నాడు కదా. సరే నాకొక సమాచారం ఇవ్వగలవా? రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంటు యునివర్సిటిలు ఉన్నవో ప్రాంతాల వారిగా (సిమాంద్ర, తెలంగాణా) చెప్పగలవా? అక్కడే తెలుస్తుంది నికృష్ట కమిటి నీచత్వం.
(2000 సంవత్సరం కంటే ముందు స్థాపించబడిన విశ్వవిద్యాలయాలు )
Deleteతెలంగాణా - 16 + 1 (NIT వరంగల్ - )
ఆంధ్ర - 3
రాయలసీమ - 5
సోర్స్ - http://en.wikipedia.org/wiki/List_of_institutions_of_higher_education_in_Andhra_Pradesh
ఇది తప్పు అనుకుంటే ఎక్కడి సోర్స్ నుండి తీసుకుని లెక్కలిచ్చినా పరవాలేదు. ఇప్పుడు చెప్పు విశ్వవిద్యాలయాల్లో తెలంగాణా ప్రాంతానికి అన్యాయం జరిగిందా?
(2000 సంవత్సరం కంటే ముందు స్థాపించబడిన విశ్వవిద్యాలయాలు )
Deleteతెలంగాణా - 16 + 1 (NIT వరంగల్ - if you consider)
ఆంధ్ర - 3
రాయలసీమ - 5
సోర్స్ -
http://en.wikipedia.org/wiki/ List_of_institutions_of_higher_education_in_Andhra_Pradesh
ఇది తప్పు అనుకుంటే ఎక్కడి సోర్స్ నుండి తీసుకుని లెక్కలిచ్చినా పరవాలేదు. ఇప్పుడు చెప్పు విశ్వవిద్యాలయాల్లో తెలంగాణా ప్రాంతానికి అన్యాయం జరిగిందా?
2000కు ముందు ఏర్పడినవే ఎందుకు తీసుకున్నారు? అయినా సరే
Delete2008 కు పూర్వం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అద్వర్యంలో ఏర్పడినవి
----------------------------------------------
HYD-7 (కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచినవి కూడా కలిపితే 10)
SA- 9 (కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచినవి కూడా కలిపితే కూడా 9)
TG- 2 (కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచినవి కూడా కలిపితే 3)
2008 కు పూర్వం (నికృష్ట కమిటి ఏమి చూసిందో ఏమో)
----------------------------------------------
HYD-8 (కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచినవి కూడా కలిపితే 11)
SA-21 (కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచినవి కూడా కలిపితే కూడా 21)
TG-6 (కేంద్ర ప్రభుత్వం చె ఏర్పడినవి కలిపితే 7)
ఇక ప్రస్తుత గవర్నమెంటు మెడికల్ కాలేజిలు చూస్తే
http://dme.ap.nic.in/dme_medcolleges.html
--------------------------------------------
HYD-2
SA-7
TG-1
ఈ లెక్కలు చూస్తుంటే ఎవరికయినా అర్థం అవుతుంది, ఆంధ్ర ప్రదేశ్లో అభివృద్ధి అంతా హైదరాబాదులో, లేక సిమంద్రలోనే అయ్యింది అని. మరి ఆ నికృష్ట కమిటి ఏమి చూసిందో ఏమో,.
2000కు ముందు ఏర్పడినవే ఎందుకు తీసుకున్నారు? అయినా సరే
Delete2000 కు పూర్వం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అద్వర్యంలో ఏర్పడినవి
----------------------------------------------
HYD-7 (కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచినవి కూడా కలిపితే 10)
SA- 9 (కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచినవి కూడా కలిపితే కూడా 9)
TG- 2 (కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచినవి కూడా కలిపితే 3)
2008 కు పూర్వం (నికృష్ట కమిటి ఏమి చూసిందో ఏమో)
----------------------------------------------
HYD-8 (కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచినవి కూడా కలిపితే 11)
SA-21 (కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచినవి కూడా కలిపితే కూడా 21)
TG-6 (కేంద్ర ప్రభుత్వం చె ఏర్పడినవి కలిపితే 7)
ఇక ప్రస్తుత గవర్నమెంటు మెడికల్ కాలేజిలు చూస్తే
http://dme.ap.nic.in/dme_medcolleges.html
--------------------------------------------
HYD-2
SA-7
TG-1
ఈ లెక్కలు చూస్తుంటే ఎవరికయినా అర్థం అవుతుంది, ఆంధ్ర ప్రదేశ్లో అభివృద్ధి అంతా హైదరాబాదులో, లేక సిమంద్రలోనే అయ్యింది అని. మరి ఆ నికృష్ట కమిటి ఏమి చూసిందో ఏమో,.
*read 2008 as 2000 in first heading of my previous comment.
1. అయితే హైదరాబాద్ తెలంగాణా కిందకి రాదా(in education)?
Deleteరాజధానిలో ఉన్నా, చాలా కాలేజీలలో తెలంగాణా వాళ్ళు లోకల్ మిగిలిన ప్రాంతాల వారు నాన్-లోకల్. I am the best example.
2. ప్రాంతాల వారీగా ఇచ్చినప్పుడు రాయల సీమ , ఆంధ్ర ప్రాంతాలల్లో ఉన్నవి వేరేగా ఇవ్వండి
3. ఈ లెక్కలు ఎక్కడి నుండి వచ్చాయో సోర్స్ ఇవ్వండి. అప్పుడు లిస్టు తో సహా ఇచ్చి సరి చూసుకోవచ్చు.
4. మీరు ఇచ్చిన మెడికల్ కాలేజీ లిస్టు చూసినా
తెలంగాణా - 3
ఆంధ్ర - 4
రాయలసీమ - 3
తేడా తెరాస చూపించిన రంగుల చిత్రంలో ఉంది బ్రదర్
5. అందరూ మొత్తుకుంటున్నది అదే హైదరాబాద్ మాత్రమే అభివృద్ది అయ్యింది మిగిలినవన్నిటిదీ ఇంచు మించు అదే బాధ అని. తెలంగాణా ఒక్కటే దీనికి మినహాయింపు కాదు. అటు శ్రీకాకుళం పోయిన ఇటు అనంతపురం కి పోయినా ఇటు మహబూబ్ నగర్ కి పోయినా ఇంచుమించు పరిస్థితి ఒకేలా ఉంది అనే చెప్పేది.
ఇక 2000 సంవత్సరమే ప్రాతిపదికగా ఎందుకు తీసుకున్నా అనేదానికి కారణాలు
Delete1. అప్పుడే తెలంగాణా ఉద్యమం మల్లి స్టార్ట్ అయ్యింది. ఆ ఉద్యమం స్టార్ట్ అయ్యే టైం కి ఉన్న పరిస్థితి చూస్తె వాళ్ళు అబద్దాలు ప్రచారం చేశారా , నిజాలు చెప్పారా తెలిసిపోతుంది. లేదూ ఇప్పటి పరిస్థితి ఎలా ఉందొ చూద్దాం అన్నా అభ్యంతరం లేదు.
2. 2000 తరువాత స్టార్ట్ అయిన విశ్వ విద్యాలయాలు ఇంకా స్టాండర్డ్స్ ని అందుకోలేదు.
1. హైదరాబాదు తెలంగాణా కిందికి వస్తే మరే హైదరాబాదు ఆదాయం, ఉద్యోగాలు తెలంగానవి మాత్రమే ఎందుకు కావు?
Delete1a. సిమాన్ద్రలో వారి ప్రాంతాలలో యునివర్సితిలు పెట్టుకుంటే, తెలంగాణాలో హైదరాబాదులోనే ఎందుకు పెడతారు? అంటే మేము అనేది కరెక్టే కదా.
2. తెలంగాణా దృష్టిలో రెండే ప్రాంతాలు అవి తెలంగాణా, సిమాంద్ర. ఒప్పందాలు జరిగినవి తెలంగాణా సిమాంద్ర మధ్యలోనే. సిమాన్ద్రలో ఎవరికయినా అన్యాయం జరిగితే మీరు మీరు చూస్కోండి, మాకు అనవసరం.
3. మీరు ఇచ్చిన సోర్సు నుండే నేను ఇచ్చిన లెక్కలు కూడా, మెడికల్ కాలేజి లెక్కలకు లింకు ఇచ్చాను.
4. నేను కెసిఆర్ ఇచ్చాడా లేక లగడపాటి ఇచ్చాడా అని చెప్పటం లేదు, కెసిఆర్ చెప్పాడనో లేక లగడపాటి చెప్పదనో దాని గురించి చర్చ అనవసరం. మెడికల్ కాలేజి డేటా రాష్ట్ర ప్రభుత్వ వెబ్ సైటు నుండి ఇచ్చినది, లింకు కూడా ఇచ్చాను.
5. ఏంటి హైదరాబాదు కాకుండా మిగిలినవి ఇంచుమించుగా అంతేనా? ఉనివెర్సితిలు తెలంగానలలో 6, సిమంద్రలో 21 ఉంటె అది ఇంచుమించుగానా సమానమా? మెడికల్ కాలేజిలు సిమాన్ద్రలో 7, తెలంగాణాలో 1 ఉంటె అది కూడా ఇంచుమించుగా సమానమా?
1. హైదరాబాద్ ఆదాయం తెలంగాణాది మాత్రమె ఎందుకు కాదు అంటే అది రాష్ట్రం మొత్తానికి సంబంధించినది కాబట్టి (అలాగే సెంట్రల్ సంస్థలు ఢిల్లీ లో ఉన్నా కూడా ఆ ఆదాయం ఢిల్లీ ఒక్కటే తీసుకోదు. కేంద్రం అన్ని రాష్ట్రాలకి వాటా పంచి పెడుతుంది ). ఇక ఉద్యోగాల విషయానికి వస్తే ఒక లెవెల్ వరకు లోకల్ అప్లై అవుతుంది. మిగిలిన పోస్ట్ లు మెరిట్ మీద ఎవరైనా తెచ్చుకోవచ్చు. సెక్రటేరియట్ అంతా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు అనే ప్రచారం ఈ బాపతే. ఇక విశ్వ విద్యాలయాల్ల్లో ఉదాహరణ పైననే చెప్పాను లోకల్ , నాన్ లోకల్. అంతే కాదు అందికీ సంబంధించిన IIT, NIT , ISB, ఓపెన్ యూనివర్సిటీ లాంటివి కూడా హైదరాబాద్/తెలంగాణా లోనే పెట్టారు. దాని వల్ల తెలంగాణా వాళ్ళకి దగ్గరగా ఉండి , వేరే వాళ్ళకి అందుబాటులో లేకుండా పోయింది. దీని వల్ల తెలంగాణా కి లాభం వేరే ప్రాంతాల వారికి నష్టం.
Delete2. ఏమని ఒప్పందం జరిగింది ? కోస్తా ఆంధ్ర మరియు రాయల సీమ (సీమంధ్ర అనే పదం ఈ మధ్య పుట్టింది) లో ఎన్ని విశ్వ విద్యాలయాలు ఉంటాయో , హైదరాబాద్ కాకుండా మిగిలిన తెలంగాణా లో అన్ని విశ్వ విద్యాలయాలు పెడతామనా? అలా ఏదైనా ఉంటె రిఫరెన్స్ ఇవ్వండి ఇంక మూసేస్తాను. (అలా ఒప్పందం ఉండదని నీకు తెలుసు నాకు తెలుసు)
- ఇంకా నయం హైదరాబాద్ మినహాయించిన తెలంగాణా ఒకటి మిగిలిన దేశం మొత్తం ఒక యూనిట్ గా తీసుకుని తీయలేదు లెక్కలు.
- ఈ మీరు మేము ఏంటో. 500 పై చిలుకు సంస్థానాలు కలిసి 25 రాష్ట్రాలతో భారత దేశం ఏర్పడింది. అందరూ ఇలాగే మీకు మీరే మాకు మేమే అనుకుని ఉంటె ఈ పాటికి దేశాన్ని 500 రాష్ట్రాలు చేయాల్సి వచ్చేది. దేవుడి దయ వలన అన్ని రాష్ట్రాలలో కెసిఆర్ లేడు.
- ఇక ఎక్కడా లేని విధంగా తెలంగాణా కి స్పెషల్ రిజర్వేషన్లు ఇచ్చి మరీ ఒక రాష్ట్రాన్ని చేశారు. అప్పటికే అన్ని విధాలా తెలంగాణా అభివృద్ది లో ఉంది అని ప్రచారం చేస్తూ ఉంటారు తెలంగాణా వాదులు. మరి అంత అభివృద్ది ఉంటె రిజర్వేషన్ లు ఎందుకు. మిగిలిన వారితో కలిసి పోటీ పడొచ్చు కదా.
3. ఏంటి హైదరాబాద్ లో ఉన్న విశ్వ విద్యాలయాలు తెలంగాణా కిందకి రావా? రాయల సీమ, కోస్తా ఆంధ్రా లో ఉన్నవి అన్ని కలిపి తెలంగాణా లో ఉన్న వాటితో పోల్చాలా? ఇందాకే తెలంగాణా వాడైన నా స్నేహితుడితో చెప్తే కింద పడి నవ్వాడు. ఎవడాడు ఇంత అడ్డంగా మాట్లాడింది అని ( I am not kidding)
4. పైన ఇచ్చిన సమాధానమే.
5. దీనికి కూడా 3 వ సమాధానమే.
ఇప్పటికైనా విశ్వవిద్యాలయాల విషయం లో తెలంగాణా కి అన్యాయం జరగలేదు, ఇంకా చెప్పాలంటే మిగిలిన ప్రాంతాలకే అన్యాయం జరిగిందని ఇప్పటికైనా ఒప్పుకుంటావా?
Deleteమీ దగ్గర సమాచారం ఉంటె ఇంకో అంశంపై చర్చించొచ్చు
ఒకటి మాత్రం నిజం:
ReplyDeleteఅన్నేళ్ళుగా వాళ్ళు మాకు జరిగినయ్యని చెబుతున్న అన్యాయాలు చేసి ఈ మధ్యనే నీకు ఒక నయాపైసైనా ఇవ్వను నీ దిక్కున్న చోట చెప్పుకోమన్న పార్టీని ఊఎమాత్రం ఆత్మగౌరవం లేకుందా అంటకాగి తిట్టాల్సిన ఆ పార్టీ వాళ్ళని బతిమిలాడుకుని వాళ్ళు సాధించిందేమిటి? కేవలం ఒక ప్రకటన, అంతే. జాయి గొట్టి ముక్కల విడిపోవటానికి యేకాభిప్రాయం యెందుకు అని యెన్ని పిచ్చి కబుర్లు చెప్పినా ప్రకటన తర్వాత జరగబొయ్యే నదీ జలాల పంపకాలూ మిగతా తతంగాలూ ఒంటి చేతి చప్పట్ల లాగా సాధించుకోగలరా?
వాటిని కూడా అర్ధరాత్రి ఢిల్లీ పెద్దల చుట్టూ పడిగాపులు పడి బతిమిలాడుకుని తెచ్చుకోగలరా? అక్కది దాకా వొచ్చినప్పుడు ఉంటుంది అసలైన పందగ, ముసళ్ళ పండగ.
मेरे ऊपर रोनके अलावा आपको कुछ और काम धंधा नहीं है?
Deletewhat do you want to express here? ప్రశ్న సూటిగా ఉంది, అవునా? మూలాన్ని తగుల్తుంది.జవాబు చెప్పగలిగితే సూటిగా చెప్పు సుత్తి లేకుండా.
Deletemeeru vinaledu. vinte inkaa ila chinnapillalla kotlade vaaru kadu. max. ilanti e blog lono okariddarithono vadinchi thitti thitlu thini untarun anthe. Grow up
ReplyDeleteనదీజలాల పంపకం కేంద్రం చేస్తుందా? అవ్వ వింటే నవ్విపోతారు ఎవరయినా. అంతర్-రాష్ట్రీయ జలవివాదాల చట్టం ప్రకారం ఆ హక్కు ట్రిబ్యూనల్ కి మాత్రమె ఉంది. మేధావులు భారత సంవిధానం & చట్టాలు చదువుకోగలరని మనవి.
ReplyDeleteAPNGO సభ అంటే అంత ఉలుకెందుకో తెలంగాణా వాదులకి. పెట్టుడు ముక్కు ఊడి పోతుందనా .
ReplyDeleteపైన ఒకాయన ఏదో అన్నరు. కెసిఆర్, విషవృక్షం అది ఇది అన్నారు అని.
అయ్యా, ఒక్కసారి తెలంగాణా వాదులు అన్నవి చూడండి . దొంగలు, దోపిడీ దారులు, రక్తపాతం, etc. అంతెందుకు తెలంగాణా వాదులు అన్ని సభలు పెట్టుకున్నారు హైదరాబాద్ లో సమైక్యం వినిపిస్తాం అన్న వాళ్ళని ఒక్క సభ పెట్టుకోనిచ్చారా? పాపం విశాలంధ్ర మహా సభ వారు ప్రయత్నించిన ప్రతి సారి దాన్ని అడ్డుకోవడమే. అదే తెలంగాణా వాదుల సభని సీమంధ్రులు ఎప్పుడయినా అడ్డుకున్నార? ఇప్పుడు చెప్పండి. ఎవరు చెప్పేవి ఎవరు వినట్లేదు. గుండె మండుతోంది. చేసే ఎదవ పనులు అన్ని చేయడం మల్లి దొంగ ఏడుపులు ఏడవటం. లేకపోతే ఇప్పుడు APNGO సభ కి పోటా పోటీ ఎందుకు? మల్లి వివక్ష అది ఇది అని ఏడుపు ఎందుకు. కెలికి వాసన చూడటం అంటే ఇదె.
huh ipudu gundelu mandutunnaya? yem? manishulu nippantinchuni chastunapudu mandaleda mee gundelu? valu samaikya rashtra manushulu kademo!! Tankbund meda 4 yellu ga ma batukamma panduga nu prabutvam addukuntunapudu mandaledem ee gundelu? seemandhra lo mrps rally lu addukunnadi evaru? vijawada jai andhra sabha lanu ennadu addukoledu papam! Avnu kcr kachitam ga oke okka nijamaina nayakudu. maatalu annamata maatalu! meru pratyekandhra udyamam lo tamilulani enni thitlu thitaro gurtuleda? chudandi paatha patrika lu thiragesi. Udyamalannaka atuvantivi sahajam anna soyi undali. Akankshalanu addukuni vithamda vadaniki digi garshana nu pedda cheyoddanna ingitham undali! sry if i hurt u. ipatikaina ma badha ardam chesukondi.
ReplyDeleteవేర్పాటు వాదులు ఏమి లెన్స్ వేసి చూపిస్తే అది చూడండి మీరు.
Deleteతిక్క కాకపోతే బతుకమ్మ పండగ ట్యాంక్ బండ్ మీద చేసుకోకపోతే మీకు ముద్దా దిగదా? అక్కడ చేస్తేనే బతుకమ్మ పండగా? అది కూడా వందల మంది జనాల్ని వెంటేసుకోచ్చి ఒక సీన్ చేస్తేనే పండగా? ఏమి బుర్రల్రా బాబోయ్. మామూలుగా చేసుకుంటే ఎవరు వద్దన్నారు? గణేష్ ఉత్సవాలు అంత పెద్దగా చేస్తారు. దాంట్లో తెలంగాణా వాళ్ళు పాల్గొనరా? మరి దానికి పర్మిషన్ ఇచ్చి దీనికి ఎందుకు ఇవ్వరు. ఆలోచించారా(ఒక వేల నిజంగానే అడ్డుకుంటుంటే )? ట్యాంక్ బండ్ మీద పర్మిషన్ ఇస్తే, అసెంబ్లీ లో ఆడుతాం అంటారు. అప్పుడు నువ్వే వచ్చి మల్లి ఇదే లొల్లి చేసే వాడివి. 4 ఏళ్ళ నుండి మాకు అసెంబ్లీ లో పర్మిషన్ ఇవ్వలేదు అని. ఈ జాక్ కానీ, తెరాస లక్ష్యం కానీ ఒకటే. ఏదో ఒక తింగరి పని చేయాలి దానికి ప్రభుత్వం అడ్డుపడాలి. దాన్ని చూపించి ఇదిగో మనకి అన్యాయం జరుగుతుంది అని తెలంగాణా ప్రజల మనసులని కలుషితం చేయాలి అంతే. ఒకటి మాత్రం నిజం భయ్యా కొంచెం తెలివి ఉంటె మనల్ని విడగొట్టడం చాలా సులువు. అది బ్రిటిష్ వాడు అయిన , కెసిఆర్ అయినా.
ఇక మాట్లాడితే జై ఆంధ్ర ఉద్యమం గురించి మాట్లాడుతారు. ఇప్పటి గురించి మాట్లాడండి రా బాబూ అంటే ఎప్పుడూ మేము పుట్టక ముందు విషయాలు చెప్తారు. దానిని మాకెలా అంట గడ్తారు (అది తప్పు కాని కరెక్ట్ కానీ)? పోనీ సరే అప్పుడు ఆంధ్ర వాళ్ళు సెపరేట్ కావాలె అన్నారనుకో అప్పుడు ఒప్పుకుని ఉంటె అయిపోయేది కదా? ఈ గోల ఉండేది కాదు
బిర్యాని ఫొటొ చూసినంక యాదికచ్చినయ్
ReplyDelete1956కి ముంగటే మాది దేషంలో 4వ పెద్ద బొచ్చె
ఆంధ్రోళ్ల బువ్వ పెట్టకున్న, ఎవుడైనా ముష్టి యేసేటోడు
అంకే, మా బొచ్చె మాగ్గావాలె