Sunday, September 22, 2013

పంజరంలో చిలుక ప్రజాభీష్టాన్ని నొక్కేస్తోందా ?

లోక్ సభలో యూపీఏ ప్రభుత్వానికి వున్నది బొటా బొటి మెజారిటీ.. ఎఫ్ డీ ఐ బిల్లు లేదా ఆహార భద్రతా బిల్లు మొదలైనవన్నీ గట్టేక్కించు కోవటానికి నానా తంటాలు పడింది యూపీఏ.  ఇంత స్వల్ప మెజారిటీ తో ఉన్న ప్రభుత్వం తెలంగాణా పై అంత గట్టి నిర్ణయం ఎలా తీసుకుంది ?  స్వంత పార్టీ లోనే ఏకాభిప్రాయం లేకుండా విభజనకి అంత మొండిగా ఎలా సాగుతోంది?
 సీమాంధ్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు వారి సతీ మణులని  రాష్ట్రపతి దగ్గరకి సమైక్య రాష్ట్రం కోసం విజ్ఞప్తితో పంపారే గానీ వారెందుకు వెళ్ళలేదు?  తమని గెలిపించిన ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా అడ్డగోలుగా విభజన ప్రతిపాదన జరిగినపుడు ఇదే మంత్రులు-పార్లమెంటు సభ్యులు రాష్ట్రపతి వద్దకి వెళ్లి రాజీనామాలు ఇచ్చేస్తే  ప్రభుత్వం సంక్షోభంలో పడదా?  మెజారిటీ లేక ప్రభుత్వమే కూలితే ఇంక విభజన బిల్లు వచ్చే పనే లేదు.  అయినా సీమాంధ్ర మంత్రులు-పార్లమెంటు సభ్యులు అంత  ధైర్యం ఎందుకు చేయలేక పోతున్నారు ?   కారణం ఒకటే కనిపిస్తోంది.  అదే సిబీఐ !  సుప్రీం కోర్టు భాషలో కేంద్ర ప్రభుత్వం అనే పంజరంలోని చిలుక !
 ములాయం సింగ్ బయట నుండి మద్దతు ఇచ్చినా, సీమాంధ్ర నాయకులు కిమ్మనకుండా అధిష్టానానికి సలాం కొట్టినా సీబీఐ  భయమే కారణం అయి ఉండవచ్చు.  సీమాంధ్ర మంత్రులు, నాయకులు అందరికీ స్వంత వ్యాపారాలు, తరాలకి సరి పడ్డ ఆస్తులు వున్నాయి.  అధిష్టానాన్ని ఎదిరించి పోరాడిన జగన్మోహన రెడ్డి పరిస్థితి చూసాక సీమాంధ్ర నాయకులకి జడుపు జ్వరం వచ్చినట్లుంది.  అందుకే నియోజవర్గాల్లో ప్రజలు తరిమి తరిమి కొడుతున్నా హస్తినలో దాక్కుంటున్నారే తప్ప అధిష్టానాన్ని ఎదిరించే సాహసం చెయ్యట్లేదు... దీని వల్ల వాళ్ళ స్వంత ప్రయోజనాలు కాపాడుకున్నా,  సీమాంధ్ర ద్రోహులుగా చరిత్ర హీనులుగా మిగిలి పోతున్నారన్న విషయం వారు మర్చి పోతున్నారు.  జీతాలు అందక పోయినా మొక్కవోని దీక్షతో 45 రోజులుగా ఉద్యమిస్తున్న ఎన్జీఓ లకి వున్న నిబద్ధత కూడా సీమాంధ్ర రాజకీయులకి లేక పోవటం సిగ్గు చేటు..                 

15 comments:

  1. @తరాలకి సరి పడ్డ ఆస్తులు వున్నాయి

    ఆ సంపాదన చూసే,మిగతా వాళ్ళకు అసూయ..(అసలు ఈ ఉద్యమాలకి బీజం కూడా అక్కడే పడి ఉంటుంది)పైగా అధికారం లో మనోళ్ళ పార్టీలుంటే చాలా పనులు వీజీ..గా చేయించుకోవచ్చు..ఇదంతా ఎదుటి వాళ్ళకు కడుపు రగిలిపోయే పరిస్థితి..స్టూడియోలూ,దియేటర్లూ,పెద్ద పెద్ద మాల్సూ,కోట్ల రూపాయల వ్యాపారాలు...ఇవ్వన్నీ గడించినోళ్ళు బాగానే ఉన్నారు...ప్రైవేట్ కంపెనీల్లో, ఏడెనిమిది వేల రూపాయల ఉద్యోగం చేసుకునే అవకాశం, హైద్రాబాద్ లో ఇక ఉండదేమో నన్నది...సామాన్యుని భాద..

    ReplyDelete
  2. ధనం మూల మిదం జగత్....మీరూ హైదరాబాదులో ఎన్నో బంగారు అవకాశాలు చేజిక్కించుకున్నారు...తెలంగాణా వాళ్ళ నోళ్ళుకొట్టి...కడుపుకొట్టి! ఇంకా పొందాలనే దురాశతో తెలంగాణా విభజనను వ్యతిరేకిస్తూ...సమైఖ్...యాంధ్ర దొంగేడుపులేడుస్తున్నారు...! ఎవనికి తెలియని దొంగనాటకాలివి?

    అక్రమార్కులకు మా ఉసురు తప్పక తాకితీరుతుంది! దురాశావాదులారా...తస్మాత్ జాగ్రత...జాగ్రత!

    మంచివాళ్ళకు మంచి...చెడ్డవాళ్ళకు చెడు జరుగుగాక!

    జై తెలంగాణా! జై జై తెలంగాణా!!

    ReplyDelete
    Replies
    1. "మీరూ హైదరాబాదులో ఎన్నో బంగారు అవకాశాలు చేజిక్కించుకున్నారు...తెలంగాణా వాళ్ళ నోళ్ళుకొట్టి...కడుపుకొట్టి"

      అవే పడి కట్టు పదాలు. ఇంకా ఎన్ని రోజులు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. సీమాంధ్ర వాళ్ళ లాగా మీరు కష్టపడి బంగారు అవకాశాలు చేజిక్కించుకొండి. ఎవరొద్దన్నారు.పైగా హైదరాబాద్ మీకు దగ్గరలోనే ఉంది కదా. ఏడుపెందుకు. చాత కాకపోతే మూసుకుని కూర్చోండి.

      "అక్రమార్కులకు మా ఉసురు తప్పక తాకితీరుతుంది"
      అక్రమార్కులకు మీ ఉసురే కాదు మా ఉసురు కూడా తాకి తీరుతుంది. వాళ్లకి తెలంగాణా, సీమ, ఆంధ్ర తేడా లేదు. అందరినీ దోచుకొవడమే అజెండా

      Delete
    2. This comment has been removed by a blog administrator.

      Delete
  3. మొత్తానికి సీమాంధ్ర నాయకులు అవినీతి పరులని, హైదరాబాదును దోచుకొన్నారని ఒప్పుకొన్నావు బ్రదర్! ఇట్లాంటి అవినీతి పరులని మేమెందుకు మొయ్యాలి? మా తెలంగాణ మాకు కావాలి! మా హైదరాబాద్ మాకు కావాలి!!
    జై తెలంగాణ!!!

    ReplyDelete
    Replies
    1. అవును తెలంగాణా నాయకులు పెద్ద పత్తిత్తులు మరి. రాజకీయ నాయకుడు ఎవడైనా ఒకటే బ్రదర్ (JP, రాఘవులు లాంటి వాళ్ళు మినహాయించి) ఇలా మనం మనం కొట్లాడుకుందాం. ఈ నాయకులు తెలంగాణా, ఆంధ్ర తేడా లేకుండా కింద ఉన్న గోచి గుడ్డ కూడా లాక్కుంటారు.

      ఏంటి హైదరాబాద్ మీదా? నిజాం ఏమైనా రాసిచ్చిండా నీకు . ఈ తెలంగాణా గోలంతా అందుకేగా. బాగా అభివృద్ది చెందిన హైదరాబాద్ ని కొట్టేసి తేరగా తిని బతుకుదామని.

      Delete
    2. హైదరాబాద్ హైదరాబాదిలది. నువ్వు హైదరాబాదీ అయితే నిన్ను ఎవడూ బయటకి పొమ్మనడు. బయటోడు వచ్చి రుబాబు చేస్తా అంటేనే ఇబ్బంది.

      Delete
    3. తెలంగాణా ప్రాంత రాజకీయ నాయకుల లో కూడా వ్యాపారస్తులు వున్నారు. తరాలకి సరి పడ్డ ఆస్తులు వున్న వాళ్ళు వున్నారు. వారందరూ దోపిడీ చేసి సంపాదించారని సీమాంధ్రులు ఎన్నడూ అనలెదు. స్పందించాల్సిన సమయంలో సీమాంధ్ర రాజకీయ నాయకులు స్పందించలేదని రాసాను కానీ వారు అవినీతి పరులని, హైదరాబాదుని దోచుకున్నారని నేను ఎక్కడా రాయలేదు. ఇటువంటి అసత్య ప్రచారాలతోనే ఉద్యమాలు నడిపేశారు. అవినీతి పరులని ఎవరూ మోయక్కర్లేదు. ఆస్తులున్న వారందరినీ అవినీతి పరులే అనేసుకుంటే ఎలా ? మీ తెలంగాణా మీకు కావాలంటే తీసుకోండి ... కానీ అందరి హైదరాబాదు మాత్రం తేరగా కాజేద్దామంటే అది జరగని పని..

      Delete
    4. దోచుకోవడం కాదురా తెలబాన్ వెధవా.... తెలివి తేటలతో, వారి ప్రతిభా సామర్థ్యాలతో పైకి వచ్చారు. మీలాగా చదువు సంధ్యల్ని వదిలేసి బేవార్సుగా తిరుగుతూ పక్కోళ్లపై ఏడ్చే వాళ్లు కాదు సీమాంధ్రులు. ఈ మధ్యనే ఎక్కడో చదివా నిజాం నవాబులకు, పాకిస్తానీ తురకలకు పుట్టిన అక్రమ సంతానమే మీరని... హహహ

      Delete
    5. ఒరే అనామకా!
      హైదరాబాదును నాకు నిజాం రాసివ్వలేదు. నువ్వే దాన్ని మద్రాసు రాష్ట్రం నుండి నెత్తి మీద పెట్ట్కొని మోసుకొచ్చినవ్.... సిగ్గు లేకపోతే సరి!

      Delete
    6. పోరా స’మెక్కు’ సాలెగా! ఒక పక్క సొంతంగా బతకలేమని చెప్పుకొంటున్న మీ కు తెలివి తేటలెక్కడివిరా? మీరు ఎప్పుడూ పరాన్నభుక్కులు. మీరు బ్రిటీషోళ్ళకు, ఎల్టీటీయీలకు పుట్టిన హిజ్రాగాళ్ళు.... హిహిహిహీ!

      Delete
  4. అవే పడి కట్టు పదాలు.అవే పడి కట్టు పదాలు ..అవే పడి కట్టు పదాలు..


    నిజంగా ఈ సినిమాటిక్ పదాలు కిక్ నిస్తాయ్!ఊపునిస్తాయ్!మొన్నొకాయన...కాలిపోతూ మాంసం ముద్దలు ముద్దలు గా పడుతుంటే..పిడికిళ్ళు బిగించే ఉంచాం..జైకొట్టాం అంటూ...కాల్చుకు చస్తే..మహా గొప్ప అన్నట్టు కీర్తిస్తూ మాట్లాడ్డమ్ చూస్తుంటే...ఊన్మాదం అంటే ఎలా ఉంటుందో కళ్ళకు కనిపించింది.....వీళ్ళ మానసిక పరిస్థితి ఏమిటి?ఇంతటి విపరీత మనస్థత్వాన్ని పెంచుకుంటున్న వీళ్లు...ఇక ఇమడగలరా?ఇదే పరిస్థితి మరిన్ని చోట్ల రాజకీయనాయకులు సృష్టిస్తే...ఈ దేశం ఏమవుతుంది?

    ReplyDelete
  5. అరె వా.... జగన్ అక్రమాస్థులకేసులో10ఇంట 8కేసులలో క్విడ్ ప్రోకో ఆధారాలు లభించలేదని న్యాయమూర్తికి cbi మెమో ఇచ్చింది... ycpకి పండగే పండగ... ఏం చిలకండి చాలా గొప్ప చిలక ఇది. హవ్వ హవ్వ... అవినీతిని రాజమార్గంలో చట్టబద్దం చేసేసింది CBI

    ReplyDelete
  6. కాంగ్రెస్ మార్క్ స్కెచ్ ఇది. తెలంగాణా లో తెరాస ని కలుపుకోవడం సీమంధ్ర లో ysrcp ని కలుపుకోవడం అనే స్కెచ్. సీమంధ్రులు జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఉన్న చిప్ప కూడా మిగలదు.

    ReplyDelete