వినాయక చవితి రోజు మన రాష్ట్రమంతా తిరిగి భక్తుల పూజలందుకొని భక్తులు ఇచ్చిన ఉండ్రాళ్ళు ఆరగించిన తరువాత ఆ రాత్రి వినాయకుడు మూషికునితో -
మూషికా ప్రతి సంవత్సరం భక్తులు ఇచ్చిన ఉండ్రాళ్ళ తో భుక్తాయాసం వచ్చేది .. ఈ రోజు కడుపు నిండినట్లు కూడా లేదు కారణ మేమిటి ?
ఈసారి మన రాష్ట్రం లో 13 జిల్లాల్లో పూజలు సక్రమంగా జరగలేదు ప్రభూ
కారణం ?
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏక పక్షంగా అడ్డగోలుగా విభజించాలన్న కేంద్ర ప్రతి పాదనతో సీమాంధ్ర లోని 13 జిల్లాల ప్రజల గుండెలు మండుతున్నాయి ప్రభూ.. అందుకే ఈ రోజు కూడా తమరి పూజ ని మమ అనిపించి మళ్ళీ ఉద్యమం లో పాల్గొన్నారు ..
నా పూజ కన్నా కూడా ఉద్యమానికి ప్రాదాన్యమిచ్చారంటే వారి బాధ, వేదన గమనించ దగ్గదే! ఇంతకీ వారి ఉద్యమం ఎందుకు ?
వేర్పాటు వాదులు కేంద్రం తో కుమ్మక్కు అయ్యి వుట్టి పుణ్యానికి రాష్ట్రాన్ని విభజించాలని చూడటమే గాక ఉమ్మడిగా అభివృద్ది చెందిన రాజధాని ని కూడా కాజేయాలని కుట్ర పన్నుతున్నారు ప్రభూ ..
అసంభవం .. వారి కోరిక నెరవేరదు .. ఇంతకీ వారి నాయకులు ఏమి చేస్తున్నారు ?
ఈ ఉద్యమానికి నాయకులెవరూ లేరు ప్రభూ.. ప్రజలే స్వచ్చందంగా పాల్గొంటున్న ఉద్యమం ఇది!
అవునా ,, మరి సీమాంధ్ర రాజకీయ నాయకులు ?
వారు తాయిలాలు అందుకొని డిల్లీ లో దాక్కున్నారు ప్రభూ ...
అవునా .. అయితే తదుపరి ఎన్నికల్లో వారందరికీ డిపాజిట్లు కూడా దక్కకూడదని నా శాపం ! ఇంకా ?
నాయకుల అండ లేక పోవటంతో ఉద్యోగులే ఉద్యమానికి సారధ్యం వహిస్తున్నారు ప్రభూ ...
భళా వుద్యోగులారా మీకు నా శుభాశీస్సులు.. అవును మూషికా ఈమధ్య ఉద్యోగులు రాజధానిలో సమావేశం జరిపారని విన్నాను...
అవును ప్రభూ .. ఆ సమావేశానికి వేర్పాటు వాదులు బందులు జరిపి , బస్సుల మీద రాళ్ళేసి, దిగ్బందనలు చేసి ఇంకా చాలా అడ్డంకులు కల్పించాలని చూసారు ప్రభూ.. చివరికి సభా ప్రాంగణం లో కూడా ఒక రక్షక భటునికి పైసలు ఆశ చూపి రసాభాస చేద్దామని ప్రయత్నించారు ప్రభూ ..
అదేమిటి? ఉద్యోగులు సభ జరుపుకునేది వారి రాజధానిలోనే కదా ?
అవును ప్రభూ ...
ఆ సమావేశానికి ప్రభుత్వ అనుమతి, హైకోర్టు అనుమతి వున్నాయి కదా ?
ఉన్నాయి ప్రభూ ...
సమావేశం శాంతియుతంగానే జరిపారు కదా ?
అవును ప్రభూ ...
మరి వేర్పాటు వాదులకి ఎందుకు అంత ఉక్రోషం ?
అందుకే వారిని తెలబానులు అంటారు ప్రభూ ...
ఆహా.. ఈ వేర్పాటువాదుల ఆగడాలు ఇక ఎంత మాత్రం సహించకూడదు.. దీనికి విరుగుడు ఏమీ లేదా మూషికా?
ఎందుకు లేదు ప్రభూ... ఈ సమస్యకి తగిన ఉపాయం శ్రీ కృష్ణుల వారు ఎప్పుడో ఆలోచించి ఉంచారు. ఎటొచ్చీ ఆ ఉపాయాన్ని అమలు పరచే మంచి బుద్ది తమరు కేంద్రానికి ప్రసాదించాలి...
తధాస్తు ....
(Idea courtesy : కోటి రత్నాల వీణ)
Excellent...
ReplyDeleteabaddalatho, osmania, nizam rowdy la tho, udhyamaanni ennaallu saagatheestaaro chuddam.
నా పూజ కన్నా ఉద్యమానికి ప్రాధాన్యత ఇచ్చారన్నావు కదా మరి సినిమాలు, మద్యసెవనలు పూర్తిగా మానేసి ఉంటారు కదా?
ReplyDeleteఅదేమీ లేదు ప్రభూ, బార్ల తలుపులన్నీ తెరిచే ఉన్నాయి. సినిమా కలెక్షన్లు దండిగా ఉన్నాయి.
మరి పిల్లల బళ్ల సంగతేమిటి?
ప్రభుత్వ పాథశాలలు మూసేసి గురువులు ఎంచక్కా సినిమాలు చూస్తున్నారు & సాయంకాలం మందు కొడుతున్నారు. ఎటొచ్చీ ప్రైవేటు బడులలోనే ఇబ్బంది. బడి యజమానులు పిల్లలతో రోడ్ల మీద విచిత్ర వేషధారణలు చేయుస్తున్నారు. మామూలు ప్రజలు ఎవరూ రాకపోయినా ఈ పిల్లలతోనే సభలు నింపుతున్నారు ప్రభూ.
మరి బస్సులు మూసేసారా?
ప్రభుత్వ బస్సులన్నీ మూట పడ్డాయి ప్రభూ. దీనితో కేసినేని, దివాకర్ వగైరాలకు బ్రహ్మాండమయిన లాభం. ఈ ఏడాది మీ లడ్డూల పాటలన్నీ వాళ్ళే పాడుతున్నారు.
e blaagu choosinaa emunnaadi garva kaaranam, samastam gotti gaadi mayam
Delete:-)
Deleteఆకాశరామన్నగారూ,
ReplyDeleteఒక చిన్న సూచన. ఈ జై గొట్టిముక్కల అనే వ్యక్తి రాసే రాతలను పట్టించుకోవద్దు. అతని రాతలను, వ్యాఖ్యలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఒక మానసికరోగికానీ, ఉన్మాదికానీ అయిఉంటాడని అనిపిస్తోంది. హేతుబద్ధత మచ్చుకైనా కనిపించని ఇలాంటివారి అడ్డగోలు రాతలకు స్పందిచటంవలన మన టైమ్, ఎనర్జీ వృధా అవుతుంది.
look at this post regarding universities. How senselessly one guy is arguing.
ReplyDeletehe wants to compare number of universities in Telangana (excluding hyderabad) with number of universities in kosta andhra + raayala seema (adding universities in those two regions)
What can we say?
http://andhraaakasaramanna.blogspot.com/2013/09/blog-post_5887.html