Monday, October 14, 2013

ఒక సభకి భద్రతనీయలేని వారు సీమాంధ్రులందరికీ ఇస్తారా ?


వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 19 న తల పెట్టిన సమైక్య శంఖారావం సభకి పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల వంక చూపి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు తెలియ చేసారు.  అలాగే సెప్టెంబర్ 7 న జరిగిన ఏపీ ఎన్జీఓ ల సభకి సైతం సవా లక్ష ఆంక్షలతో అతి తక్కువ సమయం మాత్రం అనుమతి ఇచ్చారు.  కానీ ఈ మధ్యనే జరిగిన తెలంగాణా గర్జన సభకి మాత్రం ఎటువంటి ఆంక్షలు లేకుండా ముందుగానే అనుమతులిచ్చేసి ఎంతైనా గర్జించుకోమన్నారు. ప్రస్తుతానికి సమైక్య రాష్ట్రంగా ఉన్నఆంద్ర ప్రదేశ్ రాజధాని లో తమ వాణిని వినిపించే హక్కుని అందరికీ సమానంగా కలిగించాలన్న కనీస స్పృహ ప్రభుత్వానికి లోపించింది. సమైక్య వాదుల సమావేశం అంటే చాలు - నానా విధమైన అడ్డంకులు, దాడులు  చేస్తూ  అరాచకం సృష్టిస్తున్న వేర్పాటు వాదులని కట్టడి చెయ్యకుండా - శాంతియుతంగా సభ జరుపుకుంటామనే సమైక్య వాదుల పైనే ఆంక్షలు, అనుమతి నిరాకరణలు కొన సాగించటం అసమంజసం.  ఇక్కడ ప్రభుత్వం గానీ, వేర్పాటువాదులు గానీ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే....హైదరాబాద్ అన్నది తెలుగు వారందరి రాజధాని.  అది ఏ ఒక్కరి గుత్త సొత్తు కాదు. సభలు సమావేశాలు జరుపుకునే హక్కు అన్ని ప్రాంతాల వారికి వుంటుంది.  అయితే ఈ విషయం కోర్టులు చెప్తే తప్ప వినిపించుకొనే దశలో ప్రభుత్వం కూడా వుండటం శోచనీయం. ఎన్జీఓ ల సభకు కోర్టు అనుమతి కావలిసి వచ్చింది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ సభకి అనుమతి కోసం సంప్రదిస్తే కోర్టు గడువు విధిస్తే తప్ప కనీసం నిరాకరిస్తున్నామన్న సమాధానం సైతం ఇవ్వలేని చేవ లేని స్థితిలో ప్రభుత్వం వుంది.  సమైక్య వాదుల సభ అంటే చాలు,  అడ్డుకొని తీరతామన్న వేర్పాటు వాదుల ఆగడాల పై ఇలా చేతులెత్తేస్తున్న ప్రభుత్వం  - రాష్ట్రం విడిపోతే సీమాంధ్రులందరికీ భద్రత ఎలా కల్పిస్తుంది?  

17 comments:

  1. ratram vidipote undedi ee prabutvam kadu ra ,raakaasa ramanna.

    ReplyDelete
  2. raShtraM viDipOtE hyderabaad lO seemaaMdhrulaki bhadrata koravaDutuMdannadi satyadooraM kaadu. aMdukE hyderabad lO maaku kooDaa hakku uMdanukunE vaaraMtaa samaikya andhra kOrukuMTunnaaru. kOrukOvaali kooDaa. aMtEkaani digvijay vachchi vaallani kaapaadutaadanukOvaDam moorkhamE avutuMdi.

    ReplyDelete
  3. "ఎన్జీఓ ల సభకు కోర్టు అనుమతి కావలిసి వచ్చింది"

    Totally wrong. Andhra NGO's got permission very easily from police itself. On the contrary, most Telangana meetings (excepting recent meeting) got permission with a lot of difficulty, often through SHRC.

    ReplyDelete
    Replies
    1. జై ,
      ఇండోర్ మీటింగ్స్ ప్రతి రోజూ పెట్టుకుంటారు , వాటికి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు కదా. జాక్ ప్లాన్ ఎలా ఉంటుందంటే ప్రభుత్వం కానీ పోలీస్లు కానీ అనుమతి నిరాకరించేలా అందరినీ బయట పోగేసి మీటింగ్ ప్లాన్ చేయాలి. వీలైతే ఏదైనా పగలగొట్టాలి, ఆంధ్ర వాళ్ళని మాత్రం కచ్చితంగా శాంతి యుతంగా, రాజ్యాంగబద్ధంగా,న్యాయంగా బండ బూతులు తిట్టాలి, దోపిడీ దారులు అని ముద్ర వేయాలి , తెలంగాణా వాళ్ళ రక్తం ఉడికేలా మాట్లాడాలి. మళ్లీ మీటింగ్ కి అనుమతి నిరాకరించాలి. అప్పుడు అది చూపించి నానా యాగీ చేసి మళ్లీ తెలంగాణా వాళ్ళందరినీ రెచ్చగోట్టాలి. అది జాక్ కాని, తెరాస కానీ ప్లాన్. అది నిర్విఘ్నంగా కొనసాగింది మీటింగ్ పెట్టాలనుకున్న ప్రతిసారి. గుర్తుంచుకోవాల్సిన అంశం, సమైక్య వాదులు ఎప్పుడూ తెలంగాణా మీటింగ్స్ ని అడ్డుకోలేదు, ఎందుకు పెడుతున్నారు అని అడగలేదు ఏమి చేసినా నోరు మూసుకుని కూర్చున్నారు

      కానీ సమైక్య వాదులు ప్రెస్ మీట్ పెట్టినా కూడా విలేకరులే దాడి చేసిన సంస్కృతి మాత్రం తెలబానులదె. ఎన్ని సార్లు పరకాల ప్రభాకర్ వాళ్ళ మీద దాడి చేశారు? APNGO సభ కి ఎన్ని అడ్డంకులు పెట్టారు. కనీసం గుక్కెడు మంచి నీళ్ళు దొరక్కుండా చేసారే, హైదరాబాద్ లో ఉన్న సమైక్య వాదులు ఎప్పుడైనా మీ సభలకి ఆటంకం కలింగించారా. తెలంగాణా వాళ్ళకి తప్ప వేరే వాళ్లకి కనీసం ప్రెస్ మీట్ లేదా ఇండోర్ మీటింగ్ పెట్టుకునే హక్కు కూడా లేదా? దీన్నే తెలబానిసం అంటారు.

      మళ్లీ పొద్దున్న లేస్తే ప్రతి ఒక్కడూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం , శాంతి, హక్కులు న్యాయం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వాడే.

      కొసమెరుపు : ఇలా అంటే మా గడ్డ మీద మాకు వ్యతిరేకంగా సభకు ఎలా అనుమతిస్తాం అని అడ్డ దిడ్డంగా మాట్లాడే వాడు తెరాస విశ్వ విద్యాలయం లో తెలబానిసం కోర్స్ లో పట్టా పొందినట్టే. ఇక ఊరి మీద పడి టన్నుల కొద్దీ విషం చిమ్మొచ్చు బండఘోష లాగా, విషపు వీణ లాగా

      Delete
    2. రామన్న గారూ, ఈమధ్య కాలంలో జరిగిన సకల జనుల భేరి & బతుకమ్మలు మినహాయిస్తే ప్రతీసారీ కోర్టు లేదా మా.హ.సం. జోక్యం లేనిదే తెలంగాణా సభలకు ప్రభుత్వం ఒక పట్టాన అనుమతి ఇవ్వలేదు. ముందస్తు అరెస్టులు, బైండొవర్లు సర్వ సాధారణంగా ఉండేవి. జాక్ సభలను వదిలేసి ఎబీవీపీ వైద్య గర్జనకు కూడా అనుమతులు మానవ హక్కుల సంఘానికి వెళ్లి తెచ్చుకోవాల్సిన దుర్గతి పట్టింది.

      ఆంద్ర ఉద్యోగుల సభకు ప్రభుత్వం అతి సునాయాసంగా అనుమతి ఇచ్చింది. ఈ విషయం మీరు ఒప్పుకోక తప్పదు. తెలంగాణా వ్యతిరేక ఉద్యోగులు పోలీసులు పెట్టిన ఒక్క ఆంక్షనయినా పాటించలేదు సరికదా నల్లజండాలతో నిరుసన తెలిపిన వ్యక్తులను చితకబాదారు.

      Delete
    3. జై

      వెళ్లి నీ తోటి తెలబనులకి చెప్పుకో ఈ కబుర్లన్నీ.

      ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పు

      1. ఇప్పటి వరకు సమైక్యవాద సభలు ఎన్ని జరిగాయి ? తెలంగాణావాదుల సభలు ఎన్ని జరిగాయి?
      2. ఇప్పటివరకు తెలంగాణా వాదుల పై వాళ్ళ మీటింగ్ కి వచ్చి సమైక్యవాదులు ఎన్ని సార్లు అడ్డంకులు సృష్టించారు? ఎన్ని సార్లు దాడులు చేసారు? సమైక్యవాదులపై వాళ్ళ మీటింగ్ కి వచ్చి తెలంగాణా వాదులు ఎన్ని సార్లు అడ్డంకులు సృష్టించారు? ఎన్ని సార్లు దాడులు చేసారు?

      ఈ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పుకోండి చాలు మీ కళ్ళు అవే తెరుచుకుంటాయి. అప్పటికీ విషయం అర్థం కాలేదనుకో మళ్లీ చర్చల్లో వేలేట్టకు.

      ఇక APNGO లు ఒక్క షరతు పాటించలేదా? అస్సలు ఆ షరతులు ఎందుకు పెట్టాలి. అయినా చాలా వరకు పాటించారు. తెలంగాణా ఉద్యోగులు సభలు పెడితే ఇలాగె షరతులు ఉంటాయా. ఉన్నా పాటిస్తారా? కనీసం కళ్ళ ముందు శాంతియుతంగా జరిగిన సభని ఒప్పుకోండి.
      ఇక జరిగింది రెండు సంఘటనలు ఒకటి కానిస్టేబుల్ , ఇంకోటి ఇంకో వ్యక్తి నిరసన తెలపడం. సమైక్యవాదులు జరుపుకుంటున్న సభలో ఎందుకు వెళ్లి గలభా చేయాలి తిక్క కాకపోతే. అదే తెలంగాణా సభకి వచ్చి ఇలా చేస్తే ఊరుకుంటారా? రెండోది కానిస్టేబుల్ ని కొట్టింది ఉద్యోగులు కాదు. తోటి పోలీస్ లు.

      పిచ్చి కాకపోతే నిజాం హాస్టల్ నుండి లొల్లి , బంద్ కి పిలుపునిచ్చి గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకకుండా చేయడం ఇవన్నీ కన్పించట్లేదా నీకు. అవునులే కన్పించవు.

      తెలబానుల కాన్సెప్ట్ ఒకటే బాస్. ఏదో పిచ్చి పని చేయాలి. దాన్ని అడ్డుకున్నా, కనీసం అది తప్పు అని చెప్పినా నానా యాగీ చేయాలి. అదే ఎదుటోడు వంద మంచి పనులు చేసినా వాటిని వక్రంగా చూపించి నానా యాగీ చేయాలి అంతే. నడుస్తుంది నడిపించండి.

      Delete
  4. ఆకాశ రామన్న గారూ,
    లేఖల గురించి మీరు వేసిన టపాలో నేనొక కామెంటు వేశాను.కొంచెం చూస్తారాకొన్ని సాంకేతికమయిన అంశాల గురించి ప్రస్తావించాను.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్య చూసాను. అయితే రాజ్యంగ నిపుణులు ఎవరూ నాకు తెలియదు. సాంకేతిక పరమైన విషయాలకి వస్తే కేంద్రం రాజకీయ పక్షాల లేఖల ఆధారంగా రాష్ట్ర విభజన ప్రతిపాదన సాగించట్లేదు. ఆర్టికిల్ 3 కింద ఉన్న విచక్షణాదికారంతోనే ముందుకు సాగుతోంది. రాజకీయ పక్షాల లేఖల ప్రస్తావన అన్నది కేవలం ప్రజలని మభ్య పెట్టటానికి - ఇంకా ప్రతి పక్షాల నోరు మూయించటానికే.. అయితే ఒక్కటి మాత్రం నిజం. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు లో పాస్ అవ్వటం అన్నది ఏ ఆహార భద్రత బిల్లు లేదా ఎఫ్ డీ ఐ బిల్లు పాస్ అయినట్లు మాత్రం కాదు. రాజ్యాంగ ప్రక్రియ లో మొదటి మెట్టు అయిన కాబినెట్ నోట్ నే దొడ్డి దారిలో గట్టేక్కించిన కేంద్రానికి విభజన బిల్లు గట్టేక్కించటం అంత తేలిక కాదు..బిల్లు పెడితే ఓడిస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్న సీమాంధ్ర ఎంపీ లు అసలు ఆ బిల్లు పెట్టె పరిస్థితి రాకుండా చెయ్యటం గురించి ఎందుకు ఆలొచించరు ?

      Delete
    2. I have provided the necessary clarification at that post.

      Delete
  5. తెలంగాణా ప్రజలు కుట్రలు,కుహకాలు తెలియని శాంతికాముకులని మొత్తం దేశానికంతటికీ పూర్తిగా తెలుసు!ఇక్కడ నివసించే సీమాంధ్రులకు ఎలాంటి విపత్తు లేదు!

    ReplyDelete
    Replies
    1. nijame.. alaage andhra rayalaseema migatha bhaarata desam anthaa samaanya prajalu alaativaare.. ikkada undadaaniki evadi bharosaa avasaram ledu ee desam naadi ee raashtram naadi.. that's all!

      Delete
    2. సూర్యప్రకాష్ అపకారి గారూ, మీరంత శాంతీ కాముకులో కుట్రలూ కుహకాలూ తెలియని వారే అయితే ఈ క్రింది ప్రశ్నలకి జవాబు చెప్పండి.

      1.విడిపోవటానికి కారణంగా మీకు జరిగాయని చెబుతున్న అన్యాయాల్ని ముందు ముందు చట్టసభల్లో జరగబోయే చర్చల్లో సమర్ధవంతంగా నిరూపించగలరా?యెందుకంటే మీరు అన్యాయాలు జరిగాయంటున్నారు నిజమే కానీ, నేను యెవరు మీకు అన్యాయం చేసింది? మీరు దోషిగా నిలబెడుతున్నదెవర్ని అని నేను యెన్నిసార్లు అడిగినా ఆ ప్రశ్నని మాత్రం దాటవేసి మిగిల్న వాటికి మాత్రం జవాబు చెప్పటం, లేదా నాకు చిలిపితనం అంటగట్టేసి తప్పించుకోవటం చేస్తున్నారు.ఒక అజ్ఞాత నన్ను పేరు పెట్టి సంబోధిస్తూ మీరు యేదైనా పార్టీకి పనిచేస్తున్నారా అని అవమానకరంగా మాట్లాడాడు.అటువంటి తీవ్రమైన అరోపణ చెయ్యదల్చుకున్న మనిషి అజ్ఞాతంగా ఉండటం నన్ను అవమానించినట్లేగా?తన ప్రశ్నలకి నేను జవాబు చెప్పాక నా ప్రశ్నలకి జవాబు చెప్పకపోవటం మరీ తీవ్రమయిన విషయం. మాకు అన్యాయం జరిందంటున్న వాళ్ళుగా మీకు యెవరు అన్యాయం చేశారో స్పష్తంగా చెప్పాల్సిన బాధ్యత మీదే గదా.సాక్ష్యధారాలు లేని అరోపణలకి విలువ ఉండదని చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతాడు.ముద్దాయిల పేర్లని ప్రకటించని అరోపణా పత్రాలూ అంతేనని మీకు తెలియదా?నేరం చేసినవాడు తను నేరం చేశానని ఒప్పుకుంటాడా అని దీర్ఘాలు తీసేవాళ్ళు అసలు నేరస్తుదు దొరకడని దొరికినవాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారా? విభజనకి యేకాభిప్రాయం అఖ్ఖర్లేదని అంతర్జాతీయ న్యాయసూత్రాలు చెబుతున్నాయంటున్నారు. అయితే, నువ్వు నీ చేతికర్రని యెంత గిరగిరా తిప్పుకున్నా అది నీ ఇష్తం. యెవడన్నా అడ్డుపెడితే నీ తరపున నేను పోట్లాడతా, నీ స్వేచ్చకి అడ్డుపడుతున్నాడు గాబట్టి. కాని నీ చెతికర్ర యెవడి ముక్కు కైనా తగిలితే మాత్రం వాడి తరపున నీతో పొట్లాదతా నన్నది కూడా అంతర్జాతీయ న్యాయసూత్రాల్లో ఉంది కదా.డిల్లీ అనే న్యాయమూర్తి నించి తీర్పు తెచ్చుకున్నామంటున్నారు, కానీ ఖచ్చితమైన అరోపణాపత్రమేదీ తీసుకోకుండా, సాక్ష్యాధారాల్ని పరిశీలించకుండా, పతికక్షుల వాదనల్ని వినకుండా కేవలం మాకన్యాయం జరిగిందని మీరంటున్న మాటనే సార్వకాలిక సత్యంగా ఒప్పేసుకుని తీర్పుని మీకనుకూలంగా ఫిరాయించేసిన ఆ తీర్పుకి చట్టబధ్ధత ఉంటుందా?

      2.ఆంధ్రోళ్ళు అట్టాంటోళ్ళు ఇట్టాంటోళ్ళు అనే ఈ చవకబారు మాటల్ని మీరు యధాలాపంగా వాడుతున్నారా లేక ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా?మీకు అన్యాయం జరిగిందని న్యాయపోరాటం చేస్తున్నప్పుడు అందులో భాగంగా మరొకరికి అన్యాయం చేసే ఈ వైరుధ్యాన్ని యెలా సమర్ధించుకోగలరు? మీరు మీకు జరిగినవిగా చెప్తున్న అన్యాయాలన్నిటికీ - దేశకాలాల్ని బట్టి చారిత్రక దృష్టితో చూస్తే - కాంగ్రెసు పార్టీయే కారణమని తెలుస్తుంది.పైగా ఆ అన్యాయాలు జరుగుతున్న కాలాల్లో మీ ప్రాంతపు శాసనసభ్యులు సభలోనే ఉన్నారు,మంత్రి వర్గంలోనూ ఉన్నారు, ముఖ్యమంత్రులుగానూ ఉన్నారు.అయినా సరే వాళ్ళు మీ ప్రాంతం వాళ్ళు కాబట్టి వాళ్ళ నొక్క మాట కూడా అనకుండా, ఆ నేరాలు చేసిన నేరస్తుడ్నే న్యాయమూర్తిగా నిలబెట్టి, "ఆంధ్రోళ్ళు" అని మీరంటున్న్ ప్రతిచోటా "కాంగ్రెసోళ్ళు" అని అనాల్సి ఉండగా, తిట్టాల్సిన వాళ్ళని వొదిలేసి తిట్టగూడని వాళ్ళని తిట్టటానికి కారణమేమిటి? ఒకప్పుడు "తెలంగాణాలో కవులున్నారా?" అని అన్నందుకు కించపడ్డామని చెబుతున్న మీరు చల్ల-మజ్జిగ లాంటి చెత్త మాటలతో సీమాంధ్రుల్ని కించపరచటాన్ని యెలా సమర్ధించుకుంటారు?ఇవన్నీ అనాలోచితంగా జరిగుతున్నవైతే క్షమాపణ చెప్పి ఆపెయ్యాలి. ప్రయత్న పూర్వకంగా చేస్తున్నవైతే పరిహారం చెల్లించి ఆపెయ్యాలి.మీరిప్పుడు ఈ రెంటిలో దేనికి సిధ్ధంగా ఉన్నారు?

      Delete
    3. 3.ఆర్టికిల్ 3తో ఒక్క దెబ్బకి ప్రత్యెక రాష్ట్రం వొచ్చేస్తుందని మీరనుకుంటున్నారా?కేంద్రం విడుదల చేసిన ప్రణాళిక ప్రకారమే చూసినా 12 దశలు ఉన్నాయి.అందులోని యే దశకీ నిర్ణీతమైన కాల పరిమితి లేదు.ప్రకటన జరిగిన 15 రోజుల్లో రావలసిన నోట్ రావటానికి యెంతకాలం పడుతుందో తెలియని పరిస్తితి ఉంది ఇవ్వాళ.రెండో దశ దగ్గిరే ఇంత అనిశ్చితంగా ఉంటే ఆ 12 దశలూ యెప్పటికి పూర్తవుతాయి.(ఈ కామెంటు అసలు పోశ్ట్ చేద్దామనుకోలేదు.ఇప్పుడు టేబుల్ నోట్గా వొచ్చింది. అయినా పరిస్తితిలో తేడా లేదు గనక యధాతధంగా వేస్తున్నాను).తొమ్మ్మిదేళ్ళుగా మీ ఉద్యమానికి అడ్డం రాని సీమాంధ్ర ప్రజలు ఇప్పుడెందుకు ఇలా అడ్డం పడ్డారో మీకూ తెలుసు. విభజన ప్రకటన జరగ్గానే ఒప్పుకోలు తో కూడిన నిశ్శబ్దం అందరిలోనూ ఆవరించటం మీకూ తెలుసు. ప్రకటన తెచ్చుకుని మీ కలని సాకారం చేసుకోవటానికి సీమాంధ్ర ప్రజల నుంచి కూడా సహకారం తీసుకునే స్నేహపూర్వకమైన ధోరణిని మీ నుంచి ఆశించారు.ఇక్కడా బ్లాగుల్లో నేను కూడా అదే చెశాను. ఉద్యమం వేడిలో - ఇన్నేళ్ళుగా ఉద్యమిస్తున్నా ఆశించిన ఫలితం దక్కని అయోమయం ఉన్నప్పుడు ఉద్రేకంలో - అంటున్నారని నేనూ పట్టించుకోలేదు. మీ స్థానంలో ఉంటే మీరే కాదు నేను కూడా అలాగే మాట్లాదతానేమో. మీరు కానీ నేను కానీ, ఇవ్వాళ సీమాంధ్రలో మీకు వ్యతిరేకంగా ఉద్యమం చెస్తున్నవాళ్ళు గానీ జడదారుల మేమీ కాదు. కానీ మీ ఉద్యమ ఫలితంగా మీ కలలు సాకారమయ్యే తొలి అడుగు పడిన తర్వాత కూడా అలాగే ఉండకండని,ఓడి పోయిన వాళ్ళని గిలిచిన వాళ్ళు అపహాస్యం చెయ్యకూడదని,వాళ్ళలో మీరు నిన్నటి రోజున యేర్పరిచిన భయాల్ని పోగొట్టి భవిష్యత్ కార్యాచరణకి కావలసిన సానుకూల వాతావరణాన్ని యేర్పర్చాల్సిన బాధ్యత మీదేనని మాత్రమే నేను మీకు చెప్పింది.దానికే నాకు - మీరు యేదైనా పార్టీకి పనిచేస్తున్నారా?మీరు కాంగ్రెసు ద్వేషియా? అనే ప్రతిస్పందన వచ్చింది.సానుకూలంగా స్పందించమనే సూచనల్ని కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నట్టుగా యెందుకు భావిస్తున్నారు మీరు? (కొత్తగా ఇప్పుడు షిందే గారు చెబుతున్న దాని బట్టి అస్లు యెక్కడా వోటింగుతో పని లేని పద్దతిని కాంగ్రెసు యెంచుకుందని తెలిసింది. తెలంగాణా ఇవ్వదానికి అవసరమయితే రాజ్యాంగ సవరనలు చెయ్యదానికి కూడా సిద్ధమయ్యేలా ఉంది. కానీ అలాంటివి జరుగుతాయా?ఆహార బిల్లునే వ్యతిరేకిస్తారని తెలిసిన వాళ్ళందరూ వోటు చెయ్యడానికి వీలు లేని పరిస్తితిలో ఉంది కాంగ్రెసు.)

      4.ఒకప్పుడు తెలంగానాలో కవులున్నారా అనే మాటకి కించపడ్డామని చెబుతున్న మీర్రు చల్ల-మజ్జిగ లాంటి తప్పుడు మాటల్ని మాకు అంటగట్టి కించపర్చటాన్ని యెలా చెయ్యగలుగుతున్నారు? రేపటి రోజున చట్టసభల్లో జరగబోయే చర్చల్లో ఇలాంటివి మరిన్ని రావొచ్చు. ఈ తిట్ల సెగ తగిలిన సీమాంధ్ర సభ్యులు వ్యతిరేకంగా వోటు చేస్తే అక్కడ తీర్మానం వీగిపోతే అప్పటి పరిస్తితి యేమిటి? అక్కడ జరిగే వోటింగుకి యెలాంటి ప్రాధాన్యమూ లేదా? అసలు వోటింగునే యెత్తేయ్యించుకోవటానికి ముందే హామీని పుచ్చుకున్న గ్యారెంటీ యేదైనా ఉందా? లేక అహార బిల్లుని ఫిరాయించుకున్నట్టు తెలంగాణా యేర్పాటుని వ్యతిరేకించే వాళ్ళందరినీ బహిష్కరించేసి సభలో ఉన్న వాళ్ళతోనే "మమ" అనిపించుకునే వ్యూహం ముందే రెడీ అయిపోయి ఉందా? లేని పక్షంలో యెదటి వాళ్ళ మనోభావాల గురించీ యేమాత్రమూ ఆలోచించని ఇలాంటి నిర్లక్ష్య ధోరణికి కారణమేమొటి? మాటి మాటికీ గతాన్ని తవ్వుకుని ప్రయోజనం లేదు.గతంలో యేం జరిగిందన్నది మర్చిపోయి ప్రకటన జరిగిన తర్వాత రాజ్యాంగ బధ్ధమైన వవహారాలన్నె సజావుగా జరిగేటందుకు కావలసిన వాతావరణాన్ని ప్రతిష్టించటం కోసం పడాల్సిన తొలి అడుగు మీ వైపు నుంచే పడాలి.ఆ తొలి అడుగు యెప్పుడు?

      Delete
    4. 5.తెలంగాణా విభజనకి సంబంధించి నేను యేది చెప్పినా - సత్య ధర్మ న్యాయ ప్రతిష్టితమైన నా గురు పరంపర, వ్యాస పరాశరాది షిర్డీ సాయినాధ పర్యంతం ఉన్న నా గురు పరంపర పాదాల సాక్షిగా - సత్యమే చెబుతున్నాను.భౌతిక పరమైన సత్యాల్ని నిరూపించటానికి ప్రయోగాలు చేస్తాము.సైధ్ధాంతిక పరమైన విషయాలకి తర్కమే గీటురాయి.తార్కిక పరమైన సత్యనిరూపణకి హిందూ ధర్మం లోని తర్క మీమాంసాదుల నుంచీ కమ్యూనిష్తుల గతి తార్కిక వాదం వరకూ అందరూ ఒప్పుకౌన్న పధ్ధతి వైరుధ్యాలు లేకపోవటం.ఆది నుంచీ నేటి దాకా నా కామెంట్లనీ దీనినే స్పష్తం చేస్తాయి. సీరియస్ విషయాల్లో చిలిపి తనం చూపించే అకటావికటపు మనస్తత్వం కాదు నాది. మిమ్మల్ని వెక్కిరించటం కానీ మీలో లేని లోపాల్ని అంటగట్టటం కానీ నేనెప్పుడూ చెయ్యలేదు.పైన అడిగీ ప్రశ్నలన్నీ మీరు మాట్లాడుతున్న మాటల్లోనివే, వాటిల్లొని వైరుధ్యాల్ని యెత్తి చూపించేవి మాత్రమే. ఇప్పుడు నాకు నేనుగా వేస్తున్న ప్రశ్న యేమిటంటే - తెలంగాణా సాధనకీ ఈ ద్వేషభాషకీ యేదైనా సంబంధం ఉందా? ఈ ద్వేషభాష లేని పధ్ధతి లో మీరు తెలంగాణాని సాధించుకోవటం కుదరదా? మీలోని వైరుధ్యాల్ని పరిష్కరించుకుని మీ వైఫల్యాలకి ఇతర్లని నిందించని పూర్తి న్యాయవంతమైన ఒక చక్కని రాజమార్గంలోకి తెలంగాణా ఉద్యమం యెప్పుడు ప్రవేశిస్తుంది?

      Delete
  6. Abbaaa...chaala saarlu cheppaanu.telangana prakatana anedi oka kutra maatrame, nijangaa raadu ani koncham viveka vantham gaa aalochisthe teliyadaa.......sudden gaa telangana meeda AMMA ki prema ekkadidi? enduku?
    prakatana cheyyamani arava thambi enduku thondara pettaadu? sare...ee dushta chatushtayaniki vibhajanakee sambandhan emitee...raashtravibhajana prokriya ennaallu paduthundi, minimum 30 months kante mundu inthaku mundu jarigaya, kalaparimithi nirnayinchina vaariki telivi leda.........aalochiste telangana vaariki telivi ledu ani congress marosari cheppindi kada.
    inka pedda naatakam.......2014 lo congress elaaguu raadani prapanchaaniki telusu.raaboye prabhutvaaniki veelainanni savaallu, chikkumudulu pette kusamskaaram lo bhaagam Telangana, aahaara bill vagairaa..
    please note.....
    telangana lo goppa samskruthi vundi, goppa kavi gaayaka kLaakaarulu vunnaaru. Prasthuta aavesaallo dayachesi vaarini kincha parachaddu.
    ilaati dusta sampradaayaaniki tera theesindi maatram
    ka cha raa ne. Anubhavishtaadu. Thadhyam

    ReplyDelete
  7. చరిత్ర లో, ఇలాంటి సమస్యలు తెచ్చిపెట్టి,తర్వాత ఏదో అద్భుతం జరగబోతుందని నమ్మ పలికి,ఏర్పడ బోయే కష్ట నష్టాలు ఎంత విడ మర్చి చెప్పిన వినకుండా వితండ వాదం చేసి...తర్వాత అవన్నీ నిజమయ్యాక...మూసుకుని పత్తా లేకుండా పోయే జనాన్ని ఇప్పుడు చూస్తున్నాం....తరువాత్తర్వాత ఈ వీణలూ ఉండవ్...స్టార్లూ ఉండరూ...గానాలూ రాగాలూ..ఉండవ్... పాకిస్థాన్ ను తన్నుకుపోయి మహా ఆదర్శ దేశాన్ని తయారుచేస్తానన్నారు...ఏమయ్యింది...ఆకాస రామన్న గారూ...వినాస కాలే విపరీత బుద్ది అంటారు...కాక పోతే అప్పటికే ఇర్రివర్సబుల్ డామేజ్ అయిపోద్ది..మనిషిని నాశనం చేసే వాటిల్లో అసూయ ఒకటి...కాకపోతే ఒకటి నిరూపణ అయ్యింది...ఒక పార్టీ పెట్టి...ఆర్గనజ్డ్ గా ప్లాన్ ప్రకారమ్ ఏమయినా చెయొచ్చు...డెమక్రసీ పేరుతొ... చక్కగా కవితలు వ్రాసుకుని బ్లాగ్ లోకం లో అహా..ఒహో...అనిపించుకోక ఎందుకు శంఖం ఊదుతారు మీరు?ప్రస్తుత కాల మాన పరిస్తితుల్లో తెలంగాణా పేరుతో చెప్పేవి చర్చకు నిలబడవు...అందుకే మాలా మాట్లాడతారు...మా దేముడికి దణ్ణం పెట్టరు...లాంటి ఆర్గ్యుమెంట్లు...స్రీకాకులం లో చాలా ప్రాంతాల్లో స్త్రీ లు జాకెట్ ధరించరని...తెలుగోళ్ళందరూ...మన నాగరికతా ..సంస్కృతీ ఒక్కటైతే..ఆంధ్రులైతే....జాకెట్లు...ధరించకూదదని శ్రీకాకులమోళ్ళు వాదిస్తే మనమేం చేయగలం?బుర్ర మీద గుడ్డేసుకోవడం తప్ప!!

    ReplyDelete
    Replies
    1. దారుణం ఏంటంటే బాసూ , అమెరికా లో సంవత్సరానికి $300K సంపాదించేవాడు కూడా ఇలాగే ఆలోచిస్తుంటే ఇంకా ఏమి చెప్పేది. వాడు కూడా మా అవకాశాలన్నీ ఆంద్ర వాళ్ళు దోచుకున్నారు అంటుంటే ఏమి చెప్పేది. ఎంత పద్దతిగా ప్రతి బుర్రలో విషాన్ని ఎక్కించారంటే చెప్పక్కర్లేదు. ఈ సో కాల్డ్ వీర తెలంగాణా వాదులంతా కనీసం వాళ్ళ ఊరి బాగు కోసం ఏమైనా చేశారా అంటే ఏమి ఉండదు మళ్ళీ.

      ఉదాహరణకి నాగం జనార్ధన్ రెడ్డి. ఈయన గారు 1983 నుండి నాగర్ కర్నూల్ నియోజక వర్గానికి దాదాపుగా 25 సంవత్సరాలు MLA గా ఉన్నాడు. అక్కడ అక్షరాస్యతా శాతం ఎంతో తెలుసా? 49.79%
      http://mahabubnagar.nic.in/Census-2011/Literacy/TotalLiteracy.pdf

      దీనికి ఎవరు బాధ్యులు నాగం జనార్ధన్ రెడ్డా? లేక సీమాంధ్ర ప్రజలా?

      ఈ మాత్రం కూడా ఆలోచించకుండా కేవలం జై తెలంగాణా అంటే నెత్తి మీద పెట్టుకుంటున్నారు అంటే చాలా బాధాకరం. దానికి తోడు ఇలాంటి వాటికి సీమాంధ్ర ప్రజలని బాధ్యులని చేసి బద్నాం చేయడం ఇంకా బాధాకరం.

      Delete