కేంద్రం ప్రతిపాదించిన అడ్డగోలు విభజన ప్రతిపాదనకి వ్యతిరేకంగా రెండు నెలలుగా జీతాలు కూడా లేకుండా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. తమ స్వంత ఇంటి నుంచి గెంటి వేసిన విధంగా విభజన ప్రతిపాదించినా కూడా అధిష్టానానికి ఎదురు చెప్పే దమ్ము లేని మన సీమాంధ్ర ఎంపీలు - రెండు నెలల కాలంలో కూడా తమ రాజీనామాలని సైతం ఆమోదింప జేసుకోలేక పోయారు. హరికృష్ణ రెండు నిమిషాల్లో చేయగలిగిన పని రెండు నెలల సమయంలో కూడా చేయలేక పోయారు. అయితే ప్రగల్భాలు పలకటంలో మాత్రం ఏ మాత్రం తక్కువ లేదు వారికి! రాజీనామాల ఆమోదానికి స్పీకరు దే విచక్షణాదికారం ! అలాగే కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో కూడా కేంద్రానిదే విచక్షణాదికారం ! కానీ ఆ అధికారాలని వారు దుర్వినియోగం చేస్తున్నప్పుడు అడ్డుకొనే మార్గమే తెలీదా మన ఎంపీ లకి ?
కేంద్రం లో యూ పీ ఏ ప్రభుత్వానిది బొటా బొటి మెజారిటీ.. ఒక్క పది మంది ఎంపీలు రాజీనామా చేసి బయటకి వచ్చి వుంటే కేంద్రం అంత దూకుడుగా ఉండ గలిగేదా ? దొంగ దెబ్బ తీసినట్లు టేబుల్ పాయింట్ చర్చ ద్వారా తెలంగాణా నోట్ పెట్టగలిగి ఉండేదా ?
పొరుగు రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ కి ఉన్న జ్ఞానం కూడా మన వారికి లేక పోవటం బాధాకరం. నిద్ర పోతున్న వారిని లేపగలం కానీ నిద్ర నటించే వారిని లేపడం కుదరని పని. హై కమాండ్ పట్ల ఎంపీలకి విశ్వాసం వుండటం తప్పు కాదు. కానీ అంతకన్నా సుప్రీం కమాండ్ అయిన - తమని ఎన్నుకొన్న ప్రజలు, ఉద్యోగులు రాజీనామాలు చేయమని శాసిస్తుంటే - పదవులు పట్టుకొని వేళ్ళాడుతూ కూడా తమది సమైక్య వాదమే అంటూ నమ్మబలుకుతున్న వారంతా తెలుగు జాతి ద్రోహులే ! చిరుద్యోగులకి ఉన్న నిబద్ధత కూడా తమ ప్రాంతం పట్ల లేని వారందరూ తప్పని సరిగా చరిత్ర హీనులు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
అవును. 19 మంది సీమాంధ్ర కాంగ్రెస్ MPలు తిన్నగా రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళి మేము రాజీనామా చేస్తున్నాము. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నాము అని వ్రాసి ఇస్తే అధిష్టానం దిగి వస్తుంది.
ReplyDeleteఇన్ని లక్షల మంది ఉద్యోగులు, కోట్లమంది ప్రజలు ఇన్ని కష్టాలు పడుతూ ఉద్యమాలు చెయ్యక్కర్లేదు.
బాగా చెప్పారు ! ఒక ప్రజా ప్రతినిధి అన్న వాడికి కొన్ని లక్షల మంది యొక్క వాణి వినిపించే అవకాశం వుంటుంది. ఆ స్థాయిలో ఉన్నఎంపీ లు అధిష్టానం గీసిన గీటు దాటకుండా రాష్ట్రపతి దగ్గరికి తమ భార్యలని పంపిస్తే ఉపయోగం ఏమి వుంటుంది ? ఎంపీ లు క్రియా శీలకంగా వుంటే ఉద్యోగులకి, ప్రజలకి ఈ కష్టాలెందుకు ? కీలక సమయంలో అచేతనంగా ఉండి పోతూ విభజనకి పరోక్షంగా సహకరిస్తున్న సీమాంధ్ర ఎంపీ లు అందరూ తెలుగు జాతికి వెన్ను పోటు పొడుస్తున్న బ్రూటస్ లే అవుతారు !
DeleteCurrent Govt. strength: 281 out of 539. If 19 SA-Cong MPs resign Govt. strength will become 281-19 i.e. 262. Total members will be 539-19 i.e. 520. UPA with outside support will still have a majority of 2 MP's. Tight but doable, especially with TRS, Majlis & other small groups. If required, UPA can coopt JD-U (and dump RJD).
DeleteThis is for Govt. to survive no confidence motion. The Telangana bill has no such problems as BJP will support it.
You can't be in denial mode forever
ReplyDeleterecently i heard interview of Purandhareswari. She is saying we are helpless. She is talking like a normal housewife not a LEADER representing lakhs of people. Why all our MPs are teathless
ReplyDeleteSeemandhra udhyamamu oka paniki malaina udhyamamu ani vallaku telusu. aa udhyamamu kosamu valla rajakeeya bavishyatthu endhuu nashanamu chesukovaali.
ReplyDeleteaina meeru MP la kanna medhaavu laa..
edo 4 rathalu raasinatha mathrana medhaavi ayiporu.
vallu anni surveys chesukunnaru. prajaala nadi telusukunnaru.
andhuke raajinaamalu cheyyamu ani kurchunnaru.
only vere party ni support chesevalle ela aina e govt ni padagotti thamaku anukulamu chesukovaali ani panikimaalina udhyamamu ni rechhagoduthunnaru.
అది సరే ఎప్పుడూ తెలుగు జాతి ఆత్మ గౌరవం గురించి తొడలు చరుచుకునే నందమూరి ఫేమిలీ ఎంటీ సైలెంట్‌గా ఉంది. పురధేశ్వరి అయితే తెలుగు వారి కోసం విదేశాల్లో కూడా తొడ గొట్టిందని విన్నాం. మరి ఇప్పుడేంటీ చప్పుడు చెయ్యడం లేదు? . మీరు సైలెంట్‌గా ఉండండని రాజగురువు నుండి ఏమైనా ఆదేశాలు వచ్చాయా వీళ్ళ ఫేమిలీకి
ReplyDeleteమందుబాబు గారు చాలా బాగా చెప్పారు, మందు దొర గారి ప్రియ శిష్యులుగా!!
ReplyDeleteMP ల కన్నా మేధావులా అని అడుగుతున్నారు!!, అసలు కోస్తా, సీమ ప్రాంతాలలో మేధావులులే లేరని మీ "మేతావి" దొర గారు చెప్పింది మీక్కు తెలియదా సారూ!
ఎదో నాలుగు రాతలు వ్రాసినంత మాత్రాన మెధావి అయిపోరు, బలే సెల్విచ్చారు, అది చచ్చి మరె దెయ్యం లాగా బ్లాగులలో తిరుగుతూ కోటి "ఏడుపులు" ఏడుస్తున్న "చీ"కాంతా చారికి, "ఏడుపుగొట్టు" రాగాలు, అక్షర అబ్ద్దాల వార్కి చెప్పండి మందు బాబుగారు దయచేసి, ఆ మాత్రం తెలియక ఎదో మెధావులని feel అవుతున్నట్లున్నారు, ఎటూ దొర గారు పోయిస్తున్న మందు మీతో నే కూకొని తాగుతున్నట్లున్నారు గా ఆ బ్యాచ్ అంతా!
ఇక బొత్స బాబు, పురంధరేశ్వరీ లకు రాబొయే రోజులలో కాబోయే ప్రముఖ నాయకులుగా అవుతామన్న ఆశ ఉంది కాబట్టి నోరుమూసుకొని కూకొన్నారు,
ఆ ఆశ ఉన్నంతవరకూ మందు బాబు ఎందుకు తెలంగాణా అని అసెంబ్లీ లో అనలేదా, నాగం దగ్గరనుండి, జైపాల్ రెడ్డి వరకూ సమైక్యం అనలేదా!!
తెలంగాణా (వి)నాయకులయినా, కోస్తా, సీమ (వి)నాయకులయినా వాళ్లకు ఉపయోగపడుతుందనుకొంటే ఏ వాదానికయినా రేడీనే!!
అందులో తేడాలు ఏమీ లేవులెండి మందుబాబు గారు!!
సీమాంధ్ర ఎంపిలు చేసిన రాజీనామాలను ఆమోదింప జేసుకుంటే వెంటనే సాధించగలిగే ప్రయోజనం ఏమీ లేదు!కీలకసమయంలో పార్లమెంట్ లో తమ వాణిని ధాటిగా వినిపించాలికదా!నందమూరి హరికృష్ణ గారు రాజీనామాచేసి ఏమి సాధించారో చెప్పగలరా!వార్తలలో లేకుండా పోయారు!ఆయన మళ్ళీ రాజ్యసభ సభ్యులు కాగలరా?సీమాంధ్ర ఎంపీల రాజీనామాలపై ఒత్తిడి చేయడం ఎంతమాత్రం తగదు!ఎప్పుడు ఒదిగి ఉండాలో,ఎప్పుడు రాజీనామా ఆమోది౦పజేసుకోవాలో సీమాంధ్ర ఎంపీలకు తెలియదా?అసలే వాళ్ళు అమిత గడుసువాళ్ళు!
ReplyDeleteగడుసు వాళ్ళు కాదు..నిలువెల్లా స్వార్ధం మూర్తీభవించిన పిశాచాలు వాళ్ళు ! వారందరూ రాజీనామాలు ఆమోదింప జేసుకుంటే ప్రయోజనం ఎందుకు వుండదు? సీమాంధ్ర ఎంపీల రాజీనామాలతో ముందస్తు ఎన్నికలు వస్తాయని శరద్ పవార్ వంటి సీనియర్ నాయకుడే జోస్యం చెప్పాడు. ముందస్తు ఎన్నికల పరిస్థితే వస్తే ప్రస్తుత యూపీఏ ప్రభుత్వమూ వుండదు.. తద్వారా తెలంగాణా బిల్లు కూడా వుండదు..హరి కృష్ణ వార్తల్లో లేకుండా పొవటమన్నది ఆయన స్వయంకృతం... ఆ స్థానంలో ఏ లగడపాటి లేదా ఉండవల్లి వుండి వుంటే పరిస్థితి వేరే విధంగా వుండేది !
Deleteతెలంగాణా వారికి ఆంధ్రా రాజకీయ నాయకుల తెలివితేటలపై అపారమైన నమ్మకం ఉన్నట్లు ఉంది. సూర్య ప్ర కాష్ గారు వాళ్లు వాళ్ల వ్యాపారంలో చురుగ్గా ఉంటారు . ప్రజల సమస్యలను పరిష్కరించే విషయానికి వస్తె కనీస నిబద్దతే లేదు, ఇక ఎంత తెలివి ఉంటే ఎమి చేసుకోను? పులుసు కాచుకోవల్సిందె! ఆంధ్రా వాళ్లంతా నాయకూల వలన , దివాలతీసి నెత్తిన చెంగు వేసుకొన్నాం అని చెప్పినా, తెలంగాణా వారికి అర్థంకాదేమో! తెలంగాణా ప్రాంత ప్రజలలో సామాజిక చైతన్యం అన్న ఉన్నాది, ఆంధ్రా ప్రాంతం వారి దగ్గర సినేమా పిచ్చి ,కోడి పందాల పిచ్చి, కుల గజ్జి చైతన్యం తప్పించి ఎమీ లేదు.
Delete
ReplyDeleteఎటు చూసినా ఒకటే కారణం కనిపిస్తోంది..
అందరు దొరికిన కాడికి బొక్కి అడ్డంగా దొరికి పోయినట్టున్నారు..
ఎక్కడ సోనియమ్మ సీబీఐ కేసులేడతదేమో అని మూసుక్కూర్చున్నారు...
కావూరి, సుబ్బిరామిరెడ్డి, కోమటిరెడ్డి.. ఒకరేంటి..హేమాహేమీలందరూ ఉన్నారు..
అంతేనా, తెదేపా వాళ్ళూ తక్కువ తినలేదు.. వాళ్ళు ఈ అవినీతిలో భాగస్వాములే...
ఈ మొత్తం వ్యవహారం మీద లో మంచి ఆర్టికల్ పడినిది: ఇక్కడ..
http://www.firstpost.com/india/andhras-mother-of-all-scams-why-jalayagnam-coalgate-1100605.html
ఇక బొత్సా గారి (మరియు ఇతర AP నేతల) అవినీతి ఈనాటిదా?
అపుడెప్పుడో సొమ్ములు పోనాయ్ ఏటిసేత్తాం అన్నప్పటినించి...
ఇప్పుడు తెలంగాణా ఐపోయింది ఏటి సేత్తాం అనేదాకా..
పురందేశ్వరిగారు మంత్రిపదవికి రాజీనామా చేశాను గాని ఏం.పి పదవికి రాజీనామా చేయలేదు!ఎంపి గా కొనసాగి విభజన తర్వాత సీమాంద్రకు రావలసిన నిధులు,నీళ్ళు,ఉద్యోగాలకోసం అవిశ్రాంత పోరాటం సాగిస్తారు!పల్లం రాజుగారు తెలంగాణా ఏర్పాటు అనివార్యంగా కనిపిస్తున్నది,ఈ తరుణంలో సీమాంధ్ర ప్రజల హక్కులకోసం ఎంపి పదవిలో ఉండి ఉద్యమిస్తారు!లగడపాటి రాజగోపాల్ గారు స్పీకర్ లేనప్పుడే అదును చూసి మరీ వెళ్లి తమ రాజీనామాను ఆమోది౦పజేసుకునే ప్రయత్నం చేసి వెంటనే యధావిధిగా మీడియా ను అడ్రస్ చేస్తున్నారు!యధాశక్తిగా ఎవరిప్రయత్నం వారు పట్టు విడువని విక్రమార్కులలాగా నిర్విరామంగా చేసేస్తున్నారు!కిళ్ళి రాణి గారు రాజీనామా చేస్తే విభజన ఆగుతుందంటే వెంటనే తక్షణ౦ చేసేస్తామన్నారు!ఇంకేం కావాలి?శరద్ పవార్ గారు చెప్పినట్లు రాజీనామాలు చేసే అవకాశం లేనే లేదు!అందరికీ ఏవేవో వ్యక్తిగత లిటిల్ లిటిల్ లిటిగేషన్లు ఉంటూనే ఉంటాయి!అది సరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే వెంటనే పార్లమెంట్ సభ్యత్వం రద్దవుతుంది కదా!కాని చేయరు!ఎందుకంటే కాంగ్రెస్ votebank ను వాళ్ళు వదలుకోలేరు!తెలంగాణా రాష్ట్రం ఏర్పాటును ఎవ్వరూ ఆపలేరు!
ReplyDelete
ReplyDeleteఅవ్వొచ్చు.
సుమతి శతక కర్త లెక్క ప్రకారం వీళ్ళంతా గొప్పోళ్ళు!!
Apkari కి ఉపకారము నెపమెన్నక సేయు వాడు నేర్పరి సుమతి!
అయ్యా అంతా మన భాగ్యం దౌర్భాగ్యం.
ReplyDeleteఎవరికి వారు రాలబొయే రాజధాని నిధులూనూ, కొత్త రాష్త్రం లో కాజేయ బోయే కాంట్రాక్టులనూ లెకాలేసుకుని మత్తులో జోగుతున్నారు.
ఎన్నికల కోసం కలవరిస్తున్నారు.
# సిగ్గు శరం లేని సీమాంధ్ర
ReplyDeletewell said
Seema andhrluni Tittatamena telangana samskaram.KCR lanti Vasool Rajalake siggu saram ledu.
ReplyDeleteప్రజలకు రోషము ఉంటే వాళ్ళ జీవితములో అసెంబ్లీ లో ,పార్లమెంటులో అడుగుపెట్టనివ్వ
ReplyDeleteకూడదు.