యూపీఏ లొసుగు బైట పడింది. సీమాంధ్రకి చెందిన 13 మంది పార్లమెంటు సభ్యుల రాజీనామాలని రెండు నెలలుగా నాన్చి చివరికి వాటిని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ కార్యాలయం తెలియజేసింది. తిరస్కరణ కి కారణం ఏమైనా కానీ ఎంపీ ల సంఖ్య పైనే ప్రభుత్వ మనుగడ ఆధార పడి వుందని ఖాయమై పోయింది. తమని ఎన్నుకొన్న ప్రజల పట్ల నిజమైన నిబద్ధత కలిగి వుంటే - ఇప్పుడు వత్తిడి తెచ్చినట్లే రెండు నెలల క్రితమే సీమాంధ్ర ఎంపీ లు చేసి వుంటే - రాష్ట్ర విభజన విషయం కాబినెట్ నోట్ వరకు వెళ్లేదే కాదు. ఇప్పటికైనా మన ఘనమైన పార్లమెంటు సభ్యులకి జ్ఞానోదయం అయ్యిందా అంటే అదీ లెదు... అధిష్టానం తమని మోసం చేసింది .. అధిష్టానం తమకు గౌరవం అసలు ఇవ్వట్లెదు.. తమను అసలు సంప్రదించటమే లెదు.. రాజీనామాల ఆమోదానికి కోర్టుకి వెళతాం అంటూ కాల యాపన చేసే ప్రసంగాలే చెస్తున్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చే దాకా కాబినెట్ నోట్ పెట్టము అని హామీ ఇచ్చిన అధిష్టానం - మాట తప్పి దొంగ దారిలో నోట్ పెట్టిన నాడే నిలదీయాల్సిన వారు - నేటికి కూడా ఆ పని చెయ్యట్లెదు. అంతే గాక రాష్ట్ర విభజన పై వెనక్కి తగ్గేదే లేదని రోజుకో చోటా మోటా నాయకుడు టీవీ ల ముందు చెలరేగి పోతున్నా రోషం రాని వారు మన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ! తమని గౌరవించని - తమ అభిప్రాయాలకి విలువ ఇవ్వని - తమ లెక్కే లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్న పార్టీలో ఇంకా వారు కొనసాగటమెందుకో అర్ధం కాదు. సీమాంధ్రకి చెందిన 20 మంది పార్లమెంటు సభ్యులు రాష్ట్రపతి వద్దకి వెళ్లి - తమ ప్రాంత ప్రయోజనాలకి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం పై తమకి విశ్వాసం లేదని ఒక్క లేఖ ఇచ్చి వుంటే -- విభజన కై రాజ్యాంగ ప్రక్రియ ముందుకు సాగించే ధైర్యం కేంద్రం చేస్తుందా ? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. టక్కు టమార విద్యలు ప్రదర్శించి ప్రజలని ఏమార్చుదామనుకున్న వారికి 2014 ఎన్నికల్లో తగిన గుణ పాఠం చెప్పి తీరుతారు.
అనగూడని మాటే అయనా అనాల్సి వస్తోంది. ముందుకుగా ఇందుకు క్షమార్హుణ్ణి.
ReplyDeleteకోడలు నెలతప్పిందంటే అంతా హైకామాండ్ దయ అనే దాసానుదాసులు ఈ కాంగీ ఎం.పీ.లు. వీళ్లు చావనన్నా ఛస్తారు కానీ అధిష్ఠానం ముందు నోరెత్తే సాహసం చెయ్యలేరు. వీళ్ల మాటలన్నీ తుపాకీ రాముడి కబుర్లే. అమ్మ ముందే నోరెత్తలేని వాళ్లు రాష్ట్రపతి ముందు అమ్మకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చెయ్యడాన్ని గుజ్జున్న తల ఉన్నవాడెవ్వడూ ఊహించలేడు కూడా
అప్పుడే కొందరు మహానుభావులు సంబరాలు జరుపు కుంటున్నట్లు వార్త. దానికి కారణం వారి ఉద్దేశంలో ఆ అమ్మే. భవిష్యత్తులో ఆ అమ్మే దేశ విచ్చిన్నతకు కారకురాలుగా ముద్ర పడితే ఎవరూ ఆశ్చర్య పోనవసరం లేదు.
DeleteAndhras elected the spineless MPs. If at all division occurs, every voter belonging to Seemandhra shall take an oath that Congress Party to be wiped out forever from this land.
ReplyDeleteAfter agitating against Hindi, Tamils taught a fitting a lesson even to a legend like Kamaraj and that's the end of C. I am sure C will face the same problem in Rayalaseema & Kosta Andhra while in Telangana TRS won't even touch C with a bamboo pole! Of course, what C has done to A is irrepairable. It's a tragedy a gigantic proportions.
ReplyDeleteమీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేయండి
ReplyDeletehttp://blogvedika.blogspot.in/