"ఒక పంచాయితీని విభజించాలంటే ఆ పంచాయితీ తీర్మానం అవసరం లెదు. మంత్రి హోదాలో నేను విభజించెయ వచ్చు. రాష్ట్ర విభజన కూడా అంతే. కేంద్రం రాష్ట్రాన్ని శాసన సభ తీర్మానం లేకపోయినా విభజించెయ్య వచ్చు. "
విచిత్రమైన ప్రకటనల కి మారు పేరు ఐన పంచాయితీ రాజ్ మంత్రి జానా రెడ్డి గారు తాజా గా ఇచ్చిన ప్రకటన ఇది !
ఇక్కడో విషయం ప్రస్తావించాలి. హైదరాబాదు నగర పరిసరాల్లోని 17 గ్రామ పంచాయితీలని హైదరాబాద్ నగర పాలక సంస్థ లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ వుత్తర్వులకి వ్యతిరేకంగా ఆయా పంచాయితీలు హైకోర్టుని ఆశ్రయించగా విలీనాన్ని కొట్టి వేస్తూ గత నెలలో న్యాయ స్థానం తీర్పు వెలువరించింది.
ఈ తీర్పు వెలువరించిన సందర్భంలో న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు గమనించాలి. పంచాయితీల విలీనం విషయంలో నిర్ణీత విధి విధానాలను అనుసరించటంలో ప్రభుత్వం విఫలమైందని, ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే విలీన ప్రక్రియని పూర్తి చేశారని న్యాయ మూర్తి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వుత్తర్వులని కొట్టి వేశారు. మరి ఇప్పుడు పంచాయితీ రాజ్ శాఖా మంత్రి గా జానా రెడ్డి గారు తనకున్న అధికారాన్ని వినియోగించి కోర్టు వుత్తర్వులకి విరుద్ధంగా ఆ పంచాయితీలని హైదరాబాదు నగర పాలక సంస్థలో విలీనం చేయ గలరా ?
రాష్ట్ర విభజన విషయమైనా అంతే ! అక్కడ విలీనం - ఇక్కడ విభజన అదే తేడా... నిర్దిష్టమైన సంప్రదాయాలు పాటించకుండా, శాసన సభ తీర్మానం లేకుండా, ప్రజాభీష్టానికి విరుద్ధంగా, ఏక పక్షంగా సాగుతున్న విభజన ప్రక్రియ కి కూడా ఇదే గతి పట్టక తప్పదు.
రాష్ట్ర విభజన విషయమైనా అంతే ! అక్కడ విలీనం - ఇక్కడ విభజన అదే తేడా... నిర్దిష్టమైన సంప్రదాయాలు పాటించకుండా, శాసన సభ తీర్మానం లేకుండా, ప్రజాభీష్టానికి విరుద్ధంగా, ఏక పక్షంగా సాగుతున్న విభజన ప్రక్రియ కి కూడా ఇదే గతి పట్టక తప్పదు.
jaffa jaan pal reddy
ReplyDeleteసదరు మాజీ అమాత్యులవారు రాబోయే తెలంగాణాకు కాబోయే ముఖ్యమంత్రినని కలలు గంటూ... ఇలాంటి పెద్దమనిషుల తీర్పులని చాలా గంభీర వచనాలతో ఘోషిస్తూ అలరిస్తున్నాడు.. భలే జానయ్య కామెడీ జనాలకి..
ReplyDelete# ప్రజాభీష్టానికి విరుద్ధంగా,
ReplyDeleteప్రజలంటే కేవలం సీమాంద్రులే, వారు చెప్పిందే రైటు. విభజన జరగదని పదేళ్ళ సంది చెపుతున్న. విభజన జరిగినంక కూడా అదే చెపుతా.
ఇక్కడ పంచాయితీ ప్రజలకు హైదరాబాదు పురపాలక సంగం లో కలవటం ఇష్టం లేదు, ఆ ఇష్టానికి విరుద్దంగా తీసుకున్న నిర్ణయం రద్దయిపోయింది. సీమంద్రతో కలవటానికి తెలంగాణకు ఇష్టం లేదు, దానికి వ్యతిరేకంగా తీసుకున్న ఆంధ్ర ప్రదేశ్ అనే నిర్ణయం రద్దు కాబోతుంది. లెక్క సరిపోయింది తుపాకి రావణ గారు.
ReplyDeleteతెలంగాణకు ఇష్టం లేదని ఎవరు చెప్పారు మిత్రమా? కేవలం కొద్ది మంది రాజకీయ నిరుద్యోగులు మాత్రమే ప్రత్యేక తెలంగాణ అంటూ లల్లాయి పాటలు పాడుతున్నారు. మెజార్టీ తెలంగాణ ప్రజలు కలిసి ఉండాలనే కోరుకుంటున్నారన్న విషయాన్ని మీరు కావాలనే విస్మరిస్తున్నారు. హైదరాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో తెలంగాణ వాదం ఎక్కువగా ఉందా? సమైక్యవాదం ఎక్కువగా ఉందా? ఒకసారి పరిశీలించండి. తెలంగాణ వాదం ఎంత బలహీనమైందో తెలుస్తుంది.
DeleteNaaku telugu typing antha gaa raadhu. dayachesi e post ni evarinaa prachurincha galaru.
ReplyDeleteE pramadhamu lo ok nyamurthy thana kuthurini pogottukunnaru. idi entho baadha kaliginche vishyamu.
AA nyayamurthy ( devudiki) naa vinnapamu.
dayachesi athanu e case ni court lo veyyagalaru.
" Daya chesi mruthi chendina vaariki pariharamu govt tharapuna chellincha kudadhu"
endhukantee.. ivani manamu chesina thappulee.. andharu chaduvukuna vallame... bus lo unnavallau andharu sw engineers..
1. Asalu bus lo okkade driver unnadu ani telisina bus endhuku kadalanichharu. evvaru okkarinaa e question adigaaraa.
2. bus lo 3 seats ki okka sutthe lenappudu endhuku objection cheppaledhu. avi untene meemu bus kadilinsthamani cheppithe.. andhari future baagundedhi kadhaa.
3. madhyalo vere prayanikulani ekisthunte endhuku okkaru kuda matladaledhu. objection cheppaledhu.. ( maaknedhuku lee ane nirlakshyamu). ippudu ade nirlakshyamu pranaalu teesindhi.
4. bus ekkaa.. meeku ac bus volvo door ela teruvaalo telusaa.. eppudinaa e driver ainaa emergency situations lo emi cheyyalo.. chepparaaa.
5. Bus speed gaa pothunnatlu anpinchinappudu evvarinaa objection endhuku cheppaledhu. oka ganta thondaraga veladhamani chustheee antha lokanne vidichi vellaru.
6. pryanikula perulu raase sheet lo name.. address number raayamantaaru .( number ante emergency situation lo contact number raayaru. valla fancy numers raastharu)
6. enni saarlu meetho travels vaalu niralkshyamugaa pravartinchaaru.. evvarinaa adige vallku support gaa unnaraa..
7. shirdi pramadhamu tharuvatha ilane oka varamu hadavudi chesi.. malli marichipoyaaru.. i know.. agan same incident wil happen agaian..
inkaa ila chaala unnayi.
gauravaneeyulina nyamurthy gaaru. govt ichhe 15lakhs meeku kuthuru .. inkaa puttaboye manmado/manumaraalo kante ekkuva kaadhua.. but andhari kosamu poraadandi.
inni thappulaaaa..
andharu.. chinna pillalu.. youth.. manchi bavishyatthu unnvaaallu.. vallaku pariharamu kaadhu nyamau kaavali.
type chesthunte kandalo neellu vasthunnayi.
plzz... poradandi.. inka enallu..
nenu edo congress ki telugudeshamu.. ko telanganaki. samikhyandra ki poradamntelshu.. ee vishyamu meedha nyamau kaavali..
inka ennnallu.
నేను ఆంధ్రజ్యొతిలో ఒక విశ్లేషణ చదివాను. అక్కడ ఉత్తరాదిన కనీసం పరువయినా నిలబడిన పక్షంలోనే తెలంగాణా ని మరికొంచెం ముందుకు తీసుకెళ్తారు తప్ప అక్కడ చంక నాకి పోతే లోక్ సభలో బిల్లు పెట్టి తెరాసా కచరాకి హుషారూ తమకి చిరాకూ తెప్పించే పని చెయ్యరని.
ReplyDeleteయెటూ కచరా గారు విలీనం చెయ్యనని బయట పడిపోయాడు గాబట్టి ముఖం మీదే నువ్వు తెరాసని విలీనం చేస్తానంటేనే గదా విభజన మొదలెట్టింది, నువ్వు మాట తప్పితే మేమూ మాట తప్పాం, యేం తప్పా అని అడిగితే గులాబీ నేత యే గర్జనలు చెయ్యగలడింక?
విభజన ప్రకటన యెలా జరిగిందో గుర్తుందా? తొమ్మిదేళ్ళుగా జరిగిన తెలంగాణా ఉద్యమాన్ని గురించి యే ప్రస్తావనా లేదు. తెలంగాణా ప్రజల ఆకాంక్షల్ని గురించి గానీ ఆత్మ బలిదానం చేసుకున్న కుర్రవాళ్ళ గురించి మెచ్చుకోలుగా ఒక్క సెంటిమెంటుతో కూడిన మాట లేదు.హఠాత్తుగా పత్రికల వాళ్ళని పిలిచి ఒక పెడసరపు మాట చెప్పేశాడు. గట్టిగా పత్రికల వాళ్ళు అడిగితే - "రాష్ట్రాన్ని విడగొట్టి ఇస్తే తెరాసని కాంగ్రెసులో కలిపేస్తానని కచరా వాగుదానం చేశాడు గాబట్టి ఇస్తున్నాం" అనే మరొక నీచమయిన మాట మాట్లాడాదు. యెక్కడా తెలంగణా ఉద్యమం పట్ల ఒక్క మంచి మాట లేదు.
ప్రపంచంలో న్యాయం కోసం చాలా మంది పోరాడి చాలా గౌరవమయిన పధ్ధతి లో సగర్వంగా సాధించుకున్నారు తప్ప ఇంత దిక్కుమాలిన ప్ధతిలో సాధించుకుంటూ కూడా సంబరపడుతున్న వాళ్ళు అనంత కాల చరిత్రలో నాకెక్కడా కనపడ్లేదు.మీరు చదివిన చరిత్రల్లో యెక్కదయినా ఉందేమో వెతికి చెప్పండి.
రాష్ట్రం విడిపోవటంలో తెలంగాణా ఉద్యమ ప్రమేయం యేమీ లేదు,సమైక్యంగా ఉంటే(పై విశ్లేషణ నిజమయ్యి) దానికి సమైక్య ఉద్యమ ప్రమేయమూ ఉండదు. ఇక్కడ యీన్ని సీట్లు గెలుస్తాం అనే కాకిలెక్కలూ, యెక్కడో ఉత్తారాదిన జరిగే యెన్నికల ఫలితాలూ మన రాష్త్ర భవిష్యత్తుని శాసించబోతున్నాయి.
చారిత్రకంగా దేశంలో జరిగిన అన్ని విశేష సంఘటనల్లోనూ ప్రముఖ పాత్ర నిర్వహించిన ఖ్యాతి గల ఆంధ్ర జాతి నేడెంత దుస్థితికి దిగజారింది. ఆలోచించిన కొద్దీ నిర్వేదం బరువు పెరగి పొతున్నది. మళ్ళీ - 'అమరావతీ సీమలోన దిగ్జయ స్థంభమెత్తించునాడు ' అనే స్పూర్తి చూడలేము గదా!
బుధ్ధిజీవు లంతా ఆలోచించండి:
యేది సత్యం యేద సత్యం
ఓ మహాత్మా ఓ మహర్షీ!
యేది గెలుపు యేది ఓటమి
యేది తెలుపు యేది నలుపు
యేది పాపం యేది పుణ్యం
యేది నీతి యది నేతి
ఓ మహాత్మా ఓ మహర్షీ!!!