మనకి పాత సినిమాలలో గుమ్మడి నటించిన పాత్రలు జ్ఞాపకం ఉన్నాయా ? 16 రీళ్ల సినిమాలో 14 రీళ్ల వరకు పెద్ద మనిషి పాత్ర - ఆ తరువాత ఒక్కసారి గా విలన్ అవతారం ఎత్తి ప్రేక్షకులని ఆశ్చర్య పరచే వారు గుమ్మడి ! ఆ విధంగానే గత నాలుగేళ్ళుగా జరుగుతున్న వేర్పాటువాద ఉద్యమం లో ప్రత్యక్షంగా పాల్గొనకుండా హస్తిన లోనే తెర వెనుక పావులు కదుపుతూ పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న జైపాల్ రెడ్డి తెలంగాణా ఏర్పాటుకు ప్రకటన వెలువడగానే ముసుగు తొలగించి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ లోకి వచ్చేసారు! వేర్పాటు వాదమే ప్రాతిపదికగా వున్నపార్టీలు,వ్యక్తులు ఎటువంటి డిమాండ్లు చేసినా ఆశ్చర్యం వుండదు కానీ ఇప్పటి వరకు పెద్ద మనిషిగా చెలామణీ ఐన జైపాల్ రెడ్డి గారు జీఓఎంకి ఇచ్చిన తమ నోట్ తో చిన్న బుద్ధిని బయట పెట్టుకున్నారు. తెలంగాణా ప్రాంత వాసిగా తమ ప్రాంతానికి కావలసిన సౌకర్యాలు అడగటం తప్పు కాదు కానీ అదే సమయం లో సీమాంధ్ర బలి అయి పోయినా పరవాలేదన్న రీతిగా ఆయన ప్రసంగించిన తీరు ఆక్షేపణీయం. ఒక రాష్ట్ర రాజధాని అన్నది ఆ ప్రాంత ప్రజలందరి హక్కు. అందులో ఎవరి దయా దాక్షిణ్యం అన్నది ఉండే ప్రసక్తే లెదు. హైదరాబాదు కి వున్న మౌలిక వసతులు గానీ, వైద్య, విద్యా పరమైన వసతులు గానీ ఏవి ఏర్పడినా అవి 23 జిల్లాలతో కూడిన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హోదాలో వచ్చినవే !వాటిని వినియోగించుకోవటానికి 23 జిల్లాల వారికి సర్వ హక్కులు ఉంటాయి. ఇప్పుడు అడ్డగోలుగా ఉన్న పళంగా రాష్ట్ర విభజన ప్రతిపాదించిన పక్షంలో హైదరాబాదుకి దీటుగా ప్రత్యామ్నాయ రాజధాని/వసతులు ఏర్పడే వరకు హైదరాబాదు అన్నది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి హక్కు. ప్రత్యామ్నాయ రాజధాని వచ్చే వరకు పదేళ్ళ కాల పరిమితిని కేంద్రం ప్రస్తావిస్తే అదే చాల ఎక్కువ అన్నట్లు తోటి తెలంగాణా కేంద్ర మంత్రులతో కలిసి వ్యాఖ్యానించటం ఆయన దురహంకారాన్ని సూచిస్తుంది. అంతే గాక ఏ దురుద్దేశ్యం లేక పొతే జీఒఎమ్ కి ఇచ్చిన నోట్ ని రహస్యంగా ఎందుకు ఉంచుతారు ? ఇక హైదరాబాదు నుండి భద్రాచలం వరకు దేనిని వదలరు కానీ రాబోయే తెలంగాణకి ఉండబోయే విద్యుత్ కొరతని మాత్రం సీమాంధ్ర భర్తీ చేయాలట ! ఇంతకన్నా మూర్ఖ వాదన ఎక్కడైనా ఉంటుందా ? తన రాజకీయ జీవిత చరమాంకంలో జైపాల్ రెడ్డి గారు తన అల్ప బుద్ధిని బయట పెట్టుకొని తాను కూడా అవకాశ వాదినే అని నిరూపించుకున్నారు.
వీడు మానసిక వైకల్యం కూడా వుందని నిరూపించుకున్నాడు.జీవితమంతా తిట్టిన తిట్టు తిట్టకుండా, సిగ్గు ఎగ్గు లేకుండా అదే పార్టీలో చేరి పదవుల కోసం ఊడిగం చేస్తు,కుక్క బుద్ది చూపించుకున్నాడు. ఏ రోజు ఎవరికి సహయం చేసిన పాపాన పోని కుంటి గుంట నక్క
ReplyDeletehe is just a politician.
ReplyDeletehe is not just apoliticean. very bad politician. handicaap for body is padonable. but fo mind quite disgusting.
Deleteనేను కొంచెం ఆలస్యంగా నయినా ఒక కొత్తదారిలో మీ ముందుకు - అంటే, బ్లాగు యజమానిగా - వస్తున్నాను.ప్రస్తుతం ప్రచురించిన టపాలు వెంటనే జల్లెడ లోకి ప్రవహించే విధం తెలియడం లేదు గనక - వాటి లింకుల్ని ఇస్తున్నాను. మొదటి లింకు కవితాత్మకమయిన ఒక ప్రారంభం అయితే రెండవ లింకు తెలంగాణా ఉద్యమమ లోని వైరుధ్యాల చరిత్ర. చరిత్ర గనక ప్రస్తావన తొలిదశలో ఉంది. ప్రస్తుత కాలపు విషయాలను తర్చడం లేదు. కానీ ముందరి భాగాల్లో అవీ వస్తాయి. విభజనని వ్యతిరేకించే వాళ్ళూ సమర్ధించే వాళ్ళూ అందరికీ ఆహ్వానం. హుందా అయిన విమర్శలకి నేను తప్పకుండా జవాబిస్తాను. ఇన్నాళ్ళుగా వ్యాఖ్యలలో నాన్ను గమనించిన వారికి ఆ వ్యాసాలు యే స్థాయిలో ఉండబోతాయో తెలుసుగోగలరనే అనుకుంటున్నాను.
ReplyDeletehttp://kinghari010.blogspot.in/2013/11/blog-post.html
sree kaaram
http://kinghari010.blogspot.in/2013/11/1.html
ajnaana daaridryam
ఇప్పుడే అందిన వార్త. శ్రీశైలం ప్రాజెక్ట్ మొత్తం సీమాంధ్ర లోనే ఉందట. ఇంకా రంజుగా తయారయ్యింది ఈ విభజన. ఇప్పుడు తెలంగాణా వాదులే అనాలి విభజన వద్దు బాబోయ్ అని.
ReplyDeleteyenduvalla? ardham kaalaedu!
Deleteఇంకొక విషయం ఏమిటంటే, మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ పేరుని "సీమంధ్ర" గా మార్చాలని చెప్పాడు వీడు. అప్పనంగా హైదరాబాద్ లాకుంటున్నారు. మిగిలిన స్టేట్ పేరు కూడా వీడే డిసైడ్ చేస్తున్నాడు. ఏదో సామెత చెప్పినట్టు, వినే వాడు వెధవ అయితే చెప్పేవాడు చెలరేగు తాడంట. మన సెంట్రల్ మినిస్టర్స్ ఇంత డమాల్ గాళ్ళు కాబట్టే వీడు ఇలా చెలరేగుతున్నాడు. కేంద్రం బలం చూసుకొని ఇష్టం వచినట్లు మాట్లాడుతున్నాడు
ReplyDeleteకానీ ఇప్పుడు నిర్దేశించబడి చట్టబధధంగా వాడుతున్న దాని ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ అనే పేరు సీమాంధ్రకే ఉంటుంది. కొత్తగా యేర్పడే రాష్ట్రానికే కొత్తపేరుని వెతుక్కోవాలి. సాధికారికంగా జీ వో యం కూడా ఆంధ్ర ప్రదేశ్ ని పాతభాగానికే వాడుతున్నట్టు ఉంది. కాబట్టి మనం మన ప్రాంతాన్ని సీమాంధ్రా అనుకోనక్కర లేదు హాయిగా ఆంధ్రప్రదేశ్ అనే పిల్చుకోవచ్చు. కొత్త పేరుని వెతుక్కోవలసింది వాళ్ళే. రాజ్యాంగం ప్రకారం కూడా పాత పేరు విడిపోతున్న భాగానికి ఇవ్వరు. ఆంధ్ర ప్రదేశ్ అనే రాష్ట్రం పేరు మీద సర్వ హక్కులూ మనవే.
ReplyDeleteపచ్చ ముసుగు వేసుకుని పేట్రియాటిక్ రాతలు నువ్వు రాయట్లేదూ .. అలాగే
ReplyDeleteరాజకీయ నాయకులలో మేధావి,అనర్ఘళంగా ఆంగ్లంలో మాట్లాడగల వాగ్ధాటి గలవాడు,జయపాల్ రెడ్డి గారు! ఆయన అభిప్రాయాలను విస్పష్టంగా అరటిపండు వలచి నోట్లో పెట్టినట్లు నిర్ద్వంద్వంగా ప్రకటించగల మేధో నైశిత్వం గలవాడు,సీమాంధ్ర నాయకులకు వారి అభిప్రాయాలు చెప్పుకునే హక్కు కలదో ఆయన ఆలోచనలను చెప్పుకునే హక్కు ఆయనకు కలదు!ఆయన అంగవైకల్యాన్ని గెలిచేయడం మీ మానసిక వికలాంగత్వానికి ప్రబల నిదర్శనం!
ReplyDeleteI agree. Lets not comment on physical disability..
Delete