విభజన పై కేంద్రం ఇంత ముందుకు వెళ్ళాక కూడా ఇంకా సమైక్యం పట్టుకుని వేళ్ళాడాలా అంటూ ఎంతో అమాయకం నటిస్తూ ప్రశ్నిస్తున్నారు కేంద్ర మంత్రి పురందేశ్వరి ! ఇటువంటి ఆషాడ భూతుల వల్లే కేంద్రం ఇంత ముందుకు వెళ్ళిందన్న సంగతిని ఆమె మరచి పోయారేమో గానీ ప్రజలు మరచి పోలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం ప్రకటించిన వెంటనే రాజీనామా చేయమని ప్రజలంతా ముక్త కంఠంతో డిమాండ్ చేసినా కూడా పదవిని వదిలి పెట్టకుండా కాలక్షేపం చేసి - మూడు నెలల తరువాత తగుదునమ్మా అంటూ ప్రజలని ఏమార్చాలని చూడటం ఆవిడ అమాయకత్వం. రాష్ట్రపతి దాకా వెళ్ళిన ఆర్డినెన్సు ని సైతం చించి వేసిన అధిష్టానం ప్రజల అభీష్టానికి విరుద్ధంగా జరుగుతున్న విభజన విషయంలో వెనుకడుగు వెయ్యక పోవటానికి ఇటువంటి ప్రజా ద్రోహులైన నాయకులే కారణం. అన్ని పార్టీలు నిర్ణయం తెలిపాకే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని సెలవిస్తున్న ఆవిడ గారికి అసలు కాంగ్రెస్ పార్టీలోనే విభజన పట్ల ఏకాభిప్రాయం లేదన్న సంగతి గుర్తు లేదా? స్వంత పార్టీకి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి నే విశ్వాసంలోకి తీసుకోలేక పోయిన కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల అభిప్రాయాల వంకతో విభజన ప్రక్రియ ని కొనసాగించటం మూర్ఖత్వం. తనని ఎన్నుకున్న ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కూడా సీమాంధ్రని ఉద్ధరిస్తున్నట్లు మాట్లాడుతున్నపురందేశ్వరి కి, ఆవిడ పార్టీకి 2014 ఎన్నికల్లో తగిన గుణ పాఠం ప్రజలు చెప్పటం ఖాయమే !
తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీ లో తాకట్టు పెట్టారని నాటి కాంగిరెస్సు పెద్దలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి అఖండమెజారిటీ ని సాధించిన అన్నగారి ఆత్మ ఈ ముద్దుల బిడ్డ ను చూసి ఘోషిస్తూ వుంటుంది..
ReplyDeleteనిజమె.. చంద్ర బాబు వెన్ను పోటు కన్నా ఈ పురందేశ్వరి చేస్తున్న తెలుగు జాతి ద్రోహమే ఆయన ఆత్మని క్షోభింప జేస్తూ ఉంటుంది...
Deleteసీమంధ్ర ప్రజలు ఇప్పటికైనా మేలుకొని తెలుగు జాతికి ద్రోహం చేసిన కాంగ్రెస్ కి (పిల్ల కాంగ్రెస్ కి కూడా) రాష్ట్రం లో నూకలు చెల్లకుండా చేయాలి.
ReplyDelete