Thursday, February 18, 2010

ఇప్పటికి గ్రహింపు కి వచ్చిందా?




అసెంబ్లీని ముట్టదిన్చాలన్న ప్రయత్నం మానుకోవాలని మంత్రులు శ్రీధర్ బాబు, అరుణ విద్యార్ధులకు విజ్ఞప్తి చేసారట. చాలా సంతోషించాల్సిన విషయం. ఉద్యమంలో అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశం వుందని వారు తెలియచేసారు. ఆ సంగతి వారికి ఇప్పుడు తెలిసిందేమో కానీ, నాగం జనార్ధన్ రెడ్డిని యూనివర్సిటీలో చితక్కొట్టినప్పుడే రాష్ట్ర ప్రజలకు తెలిసింది. విద్యా సంవత్సరం కోల్పోతే ఉద్యోగాలు సంపాదించటానికి నానా కష్టాలు పడాలని హెచ్చరించారు. మరి విద్యార్ధులని రెచ్చగొట్టి వారిని వుద్యమంలోనికి లాగినపుడు ఈ గ్రహింపు ఏమయింది? మరీ విచిత్రం ఏమిటంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా ఉంటూ....తెలంగాణా వారిపై తెలంగాణా వారే దాడులు చేసుకోవడం ద్వారా ఏమి సందేశం ఇస్తారని విద్యార్ధులని ప్రశ్నించారు. అదే ప్రశ్న ఇప్పుడు ఆంధ్ర ప్రజానీకం వేస్తోంది. తెలుగు వారే తోటి తెలుగు వారి గురించి దుర్భాషలాడి, వారి పై దాడులు చేసి ఇన్నాళ్ళు ఏమి సాధించారు? ప్రపంచానికి ఏమి సంకేతం ఇచ్చారు?

2 comments:

  1. భారతీయులే తోటి భారతీయుల గురించి దుర్భాషలాడి, వారి పై దాడులు చేసి ఇన్నాళ్ళు ఏమి సాధించారు?
    మనుషులే తోటి మనుషుల...గురించి దుర్భాషలాడి, వారి పై దాడులు చేసి ఇన్నాళ్ళు ఏమి సాధించారు?...

    Wht kind of statments yaar... if yu dont have time... dont write it... if u do have, make some good points..

    ReplyDelete
  2. Anonymous,
    really you haven't understood that?!!!

    ( What an idiots are hanging around here.. can't understand a telugu sentance! )

    ReplyDelete