పార్లమెంటు సమావేశాల ప్రారంభ దినాన ఉభయ సభలని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో తెలంగాణా ప్రసక్తి లేదట! ఇప్పటికే హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటన(ల)తో తల బొప్పి కట్టించుకున్న కేంద్రం ఏకంగా రాష్ట్రపతి నోటనే ఆ ప్రస్తావన తెస్తుందని ఎలా ఆశించారో? పైగా పార్లమెంటులో తెలంగాణా కోసం బిల్లు పెట్టాలని మళ్ళీ రాగం మొదలు పెట్టారు. ఐనా రాజ్యాంగ బద్దంగా ఒక కమిటీ ఏర్పాటు అయి పని ప్రారంభించిన దశలో మళ్ళీ ఇటువంటి ఆందోళనలు చేయటం అర్ధ రహితం. చేతనైతే తమ వాదనలు కమిటీకి సమర్ధవంతంగా వినిపించి రిపోర్టు తమకి అనుకూలంగా తెప్పించుకోవాలి గానీ ఇటువంటి పిల్ల చేష్టల వల్ల తెలంగాణా రానే రాదు.
తిరిగే కాలూ, ఆడే నోరూ ఊరికినే ఉండవని సామెత. ఆ కమిటీ తన పని చేసేదాకా వీళ్ళు ఖాళీగా ఉండలేక ఇలాంటి పనులు చేస్తుంటారు.
ReplyDeleteఒకవేళ ఈ కృష్ణ కమిటీ కూడా ఫజల్ ఆలి కమీషన్ చెప్పినట్టుగానే తెలంగాణ వేరే రాష్ట్రంగా ఉండాలని చెప్పినా ఈ తెలివిలేని అమాయక ప్రజలు మరియు వారెన్నుకున్న మూర్ఖ నాయకులు ఏం పీకలేరు... శత్రువును తక్కువగా ఊహించుకోవడమే మొదటి తప్పు !!!
ReplyDelete