కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు మరోసారి చాణక్య నీతిని ప్రదర్శించాయి. శ్రీ కృష్ణ కమిటీ ని ఏర్పాటు చేసాక కూడా తెలంగాణా ఉద్యమాన్ని తామే హైజాక్ చేసేద్దామన్న అత్యుత్సాహంతో రాజీనామాల డ్రామా ఆడిన టీ.ఆర్.ఎస్. కి స్పీకర్ తగిన బుద్ది చెప్పారు. ప్రతిభావంతుడు, అత్యంత వివాదరహితుడుగా పేరున్న జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ గురించి..దిక్కు మాలిన కమిటీ, గడ్డి పీకుతుందా లాంటి పరుష వ్యాఖ్యలు చేయటమే కాక, తమ చేతిలోని కీలు బొమ్మ ఐన జే.ఎ.సి. కన్వీనర్ చేత రాజీనామాల హుకుం జారీ చేయించటం టీ.ఆర్.ఎస్. నియంతృత్వ పోకడలకు నిదర్శనం. పైగా రాజీనామా చేయని వారిని తెలంగాణా ద్రోహులుగా వర్ణిస్తూ వారి ఇళ్ళ పై పేడ,పిడకలు కొట్టించటం జే.ఎ.సి. సమిష్టి ధర్మానికే విరుద్ధం. అందుకే రాజీనామాలు చేయకుండా కాంగ్రేసు వారు, కాంగ్రెసుతో లింకు పెట్టి కోదండరాం కి లేఖలు ఇచ్చి తెలుగు దేశం వారు చాణక్య నీతిని చూపారు. స్పీకర్ కూడా ఈసారి ఏ మాత్రం ఆలస్యం లేకుండా టీ.ఆర్.ఎస్. వారి పది రాజీనామాలూ ఆమోదించేసి వారికి ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో తమ వాణిని వినిపించే అవకాశం లేకుండా చేసారు. ఐదేళ్ళ పాటు తమ బాగోగులు చూడమని ప్రజలు అసెంబ్లీకి పంపితే...పదవులు మాకు తృణప్రాయం అంటూ స్వంత ఎజెండాలతో ఏడాది కూడా తిరక్క ముందే రాజీనామా చేసి పారేశారు. అటువంటిది వాళ్ళు రేపు మళ్ళీ ఉప ఎన్నికల్లో నిలబడితే...మీరందరూ మాకు తృణప్రాయం అని ప్రజలు వారిని తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉంది.
Yes. You are Right.
ReplyDeleteకిరణకుమార్ రెడ్డి మంచిపని చేశాడు. తెరాసకు తెరాస(తెలంగాణా రాదనే సత్యం) త్వరలోనే తెలిసి వస్తుంది.
ReplyDelete"ప్రతిభావంతుడు, అత్యంత వివాదరహితుడుగా పేరున్న జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ గురించి..దిక్కు మాలిన కమిటీ, గడ్డి పీకుతుందా లాంటి పరుష వ్యాఖ్యలు చేయటమే కాక, తమ చేతిలోని కీలు బొమ్మ ఐన జే.ఎ.సి. కన్వీనర్ చేత రాజీనామాల హుకుం జారీ చేయించటం టీ.ఆర్.ఎస్. నియంతృత్వ పోకడలకు నిదర్శనం."
ReplyDeleteI am not supporting any one here..
Did they say these words on shri krisha ? ..
Didn't they speak about committee's guidelines & time limit ?
If shri krishna is great thats OK but wht does this has to do with TRS talks about committee's guidelines & time limit ?
Why are making false logics.
నాయుడు గారూ, శ్రీక్రిష్ణని తిడితే ఒకటీ, కమిటీని తిడితే ఒకటీ కాదు. రెండూ ఒకటే. ఇంక, కమిటీ గైడ్ లైన్స్, కాల పరిమితి గురించి మాట్లాడటానికి కే.సి.ఆర్. ఎవరు? అది కేంద్ర ప్రభుత్వం లేదా స్వయంగా ఆ కమిటీ డిసైడ్ చెయ్యాలి. లాజిక్ లేకుండా మాట్లాడుతున్నది ఎవరో అందరికీ తెలుసు. కే.సి.ఆర్. చర్యలన్నీ కేవలం తన ఉనికిని కాపాడుకోవాలన్న ఆరాటమే తప్ప తెలంగాణా కోసం నిజమైన పోరాటం కాదని ఈ పాటికే స్పష్టం ఐ పోయింది.
ReplyDelete