Wednesday, February 17, 2010

తెలంగాణా రాజకీయుల సొత్తా?




కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి సమైక్యంగా వుంటే మంచిదని సలహా ఇచ్చారు. అంతే....తెలంగాణా (తీవ్ర) వాదులు ఆయన పై దుర్భాషలు మొదలు పెట్టేసారు. కంచి పీఠంలో కూర్చుని పూజలు చేసుకునే ఆయనకి తెలంగాణా పై మాట్లాడే హక్కు లేదట! ఇంకా ఆయన దిష్టి బొమ్మలు తగలపెట్టతాలూ, తెలంగాణలో తిరగనివ్వమని బెదిరింపులూ, స్కందగిరి ఆలయంలో కార్య కలాపాలు స్తంభింప చేస్తామన్న హెచ్చరికలూ షరా మామూలుగా ఫాలో అయ్యాయి. అసలు ఒక విషయం అర్ధం కాదు. ఈ దేశం లో భావ ప్రకటన స్వేచ్చ అనేది అందరికీ సమానమే. చిరంజీవికి కానీ,మోహన్ బాబుకి కానీ, కంచి స్వామివారికి కానీ తమ ఆభిప్రాయాలు చెప్పే హక్కు వుంది. అలా చెప్పినంత మాత్రం చేత వారిని నానా దుర్భాషలాడటం, వారికి తెలంగాణా రాజ్య బహిష్కరణ విధించడం వంటివి సహించరాదు. ప్రత్యెక రాష్ట్రం రాక ముందే ఇలా పెట్రేగుతున్న వారు, ఒక వేళ తెలంగాణా వస్తే..గిస్తే.. ఇతర ప్రాంతాల వారిని ఎలా కాల్చుకు తింటారో చెప్పకనే చెపుతున్నారు. అయినా కంచిలో పూజలు చేసుకొనే స్వామికి తెలంగాణా పై మాట్లాడే హక్కు లేనపుడు....యూనివర్సిటీల్లో చదువుకొనే విద్యార్దులకీ, అక్కడ పాఠాలు చెప్పుకొనే ప్రోఫెసర్లకీ కూడా వుండకూడదు. కానీ జరుగుతున్నదేమిటి? తెలంగాణా కేవలం రాజకీయ సమస్య కాదు. సామాజిక సమస్య కూడా. సమాజం లో అన్ని వర్గాల వారికి తమ అభిప్రాయం చెప్పుకొనే హక్కు ఉందన్న ఇంగిత జ్ఞానం కూడా ఈ రాజకీయులకు లేదా?

3 comments:

  1. ఆ ఇంగిత జ్ఞానం ఈ రాజకీయులకే ఉంటే దేశం ఇంత దరిద్రంగా ఎందుకు తయారవుతుంది.

    ReplyDelete
  2. మీతో 100 % ఏకీభవిస్తున్నాను. రాష్ట్రంలోనున్న 95 % శాతం ప్రజల మనసులోమాటను చాలా బాగా చెప్పారు.

    ReplyDelete
  3. అంతెందుకండి...మీరు ఇప్పుడు హైదరాబాద్ కి వెళ్ళి ఒక్కసారి తెలంగాణ జిందాబాద్ అనండి....అంతే....మీకు తెలంగాణ రాష్ట్ర పౌరుడి హక్కు ఇస్తారు...కావాలంటే ఒకసారి ట్రై చెయ్యండి......

    ReplyDelete