దేశంలో ఇప్పుడు అనేక చోట్ల ప్రత్యెక రాష్ట్రం కోసం ఉద్యమాలు నడుస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఆ రాష్ట్ర్రాన్ని నాలుగు ముక్కలు చేయటానికి శాసన సభలో తీర్మానం కూడా జరిగి పోయింది. ఆ తీర్మానం సందర్భంలో - మన రాష్ట్రాన్ని కేకు ముక్కలా విభజించటానికి ఉత్సాహం చూపుతున్న ఇదే దిగ్విజయ సింగ్ 2011 లో ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల అధిపతిగా వున్నప్పుడు ఏమన్నారో ఇక్కడ చూడండి :
http://www.hindustantimes.com/India-news/NewDelhi/UP-bifurcation-Cong-wants-second-SRC/Article1-767062.aspx
ఉత్తర ప్రదేశ్ విభజనకైతే రెండో ఎస్సార్సీ కావాలట! ఆంధ్ర ప్రదేశ్ ని ముక్కలు చేయటానికి ఐతే ఏమీ అవసరం లేదా? శాసన సభ అంగీకారంతో కూడా పని లేకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేసేస్తామని ఉవ్విళ్ళూరుతున్న కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్లా ఇదే న్యాయం ఎందుకు పాటించదు? ఎందుకంటే ఆయా రాష్ట్రాల వ్యవహారాల్లో వేలు పెడితే కొర్రు కాల్చి వాత పెడతారు అక్కడి నాయకులు. ఆంద్ర ప్రదేశ్ విభజన విషయంలో శాసన సభ తీర్మానం జరగనేలేదు. కనీసం తెలంగాణా సమస్య అధ్యయనం కోసం వేసిన శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సైతం ఇంత వరకు ఏ చట్ట సభలోనూ చర్చకు రాలేదు. అయినా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి కేవలం ఆంధ్ర ప్రదేశ్ ని మాత్రమె ముక్కలు చేయాలని కాంగ్రెస్ ఎందుకు పరుగు పెడుతోంది ? ఇది కేవలం సీమాంధ్ర నాయకుల/కేంద్ర మంత్రుల చేతగాని తనం తప్ప మరేమీ కాదు. మనం అంత చేతకాని వాళ్ళం కాబట్టే గుజరాత్ నుండి గురువింద గింజ లాంటి నరేంద్ర మోడీ మన రాష్ట్ర రాజధానికి వచ్చి అన్న దమ్ముల్లా విడి పోమని ఉచిత సలహా ఇచ్చి వెళ్ళాడు. గుజరాత్ లోను సౌరాష్ట్ర ప్రత్యెక రాష్ట్రం కోసం ఉద్యమం ఎప్పటినుంచో ఉంది. మన నాయకులు ఎవరికైనా గుజరాత్ వెళ్లి గుజరాత్ సౌరాష్ట్రాలు అన్న దమ్ముల్లా విడి పోమ్మని చెప్పే ధైర్యం ఉందా ? స్వంత ఇంటి నుండి గెంటి వేసిన చందం గా అధిష్టానం విభజన ప్రతిపాదించినపుడు తిరగబడ వలసిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు ? తమ తమ స్వంత రాష్ట్రాల్లో ఠికానా లేక కాంగ్రెస్ కోర్ కమిటీ లో కాలక్షేపం చేస్తున్న సభ్యులతో కూడిన ఆంటోనీ కమిటీ ముందు సాగిల పడుతున్నారు. "అదియును నీ పతి ప్రాణంబు దక్క" అన్న రీతిలో కమిటీ చీదరిస్తున్నా కూడా పదవులు వదలి పెట్టకుండా రాష్ట్ర పరిస్థితులు నివేదిస్తూ తరించి పోతున్నారు. వీరు నివేదిస్తే గాని ఇక్కడి పరిస్థితులు కేంద్రానికి తెలియవా? మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో ప్రత్యెక వింధ్య ప్రదేశ్ కోసం ఉద్యమం వుంది. మన మంత్రులలో ఏ ఒక్కరైన దిగ్విజయ సింగ్ ని నీ రాష్ట్రం లో విభజన వాదం పరిష్కరించలెవు గానీ మా పంచాయితీ తీర్చే హక్కు నీకెక్కడ వుంది అని అడిగే దమ్ము ఉందా? అలాగే కర్నాటక-కేరళ సరిహద్దుల్లో తుళునాడు ప్రత్యెక రాష్ట్రం కోసం ఉద్యమం వుంది. దాని సంగతి ఏమిటి అని ఆ రాష్ట్రాలకి చెందిన వీరప్ప మొయిలీ, ఆంటోనీ లని అడిగే ధైర్యం ఉందా? కనీసం రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఎన్జీఒ లకు వున్న నిబద్ధత కూడా సీమాంధ్ర మంత్రులకు, నాయకులకు లేకపోవటం తెలుగు జాతి చేసుకున్న ఖర్మం !
super
ReplyDeleteWhere are the leaders for Telugu people. We do not have any leaders for Telugus. so we suffer for that.
ReplyDeleteendukandi inka BP penchukuntaru, chakkaga jai andhra anakunda.
ReplyDeleteThis going to be major problem across all regions..ppl will raise their voice soon, to dismantle central power..congress is starting this divide nature from top, it's going to impact on common man, next generation may not be interested on future growth..this is sign of fall for india..Peruguta viruguta korakey...
ReplyDeletetelugu jaathi ani gontu chinchukuni maatladutuunav....... mari saati telugu vallaina telanganaa vallaku jarigina nastalu enduku cheppavu............vallaku emainia piccha vidipovadani...... vallaku anyayam jarigindani anukuntene kada vallu verupadalani korukunataru........... okka sari aina vallu enduku pratyeka rastam adugu tunnaro alocinchava........
ReplyDeleteతెలంగాణ ప్రజలు విభజన కోరుతున్నప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం అనడం తప్పు. ఇక సీమాంధ్రుల ఆత్మగౌరవం సంగతి - అదే ఉంటే మీతో కలిసిఉండడం మాకు పడదు వద్దుమొర్రో అంటే జలగల్లా పట్టి ఉంటామని ఎందుకంటారు?
ReplyDeleteఇంకెక్కడ తెలుగువారి ఆత్మగౌరవం?
ReplyDeleteఅది NTR తోనే పోయింది.
Kalisi undadam enduku padadu? Antaa maake ane swaartham, moorkhathvam, amaanaveeyam thappa!!!
ReplyDeleteతెలంగాణా వారి ఆత్మగౌరవం,స్వయం పాలన కోసం తెలంగాణా రాష్ట్రాన్ని విడకొడుతున్నారు!అందులో తప్పేముంది?ఇది అర్ధ శతాబ్ది ఉద్యమ ఫలితం!ఎందఱో అమరవీరుల ప్రాణ త్యాగఫలం!కేంద్ర మంత్రులకు జరగబోతున్నది ముందే తెలుసు!తెలంగాణా,ఆంధ్రసీమ రాష్ట్రాలు రెండు స్వయం పాలనతో ఉంటే నష్టమేమిటి అని వారికి అనిపించి ఉంటుంది!వారే కాదు కాంగ్రెస్ వారందరూ అధిష్టానం ఏమి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి విధేయంగా ఉ0టామని ముక్తకంటం తో అప్పుడు చెప్పారు కదా!దానికి కేంద్ర సీమాంధ్ర మంత్రులు కట్టుబడి ఉన్నారు!మిగతా వాళ్ళు లేరు!అంతే తేడా!!
ReplyDeleteఅపకారి
Deleteఈది కాంగ్రెస్ తీర్మానలతో జరిగిపోయే విభజన కాదు, పార్లమెంటులో తీర్మానం అనే కేరట్ చూపించి తెలంగాణా గాడిదపై రాహుల్‌ని సవారి చేయడమే. మెదక్‌లో రాహువు పోటీ చేస్తాడన్న వార్తలొస్తున్నాయి. ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్. బిజెపి తీర్మానంలో సవరణలు చేయాలన్న మిషతో ఓటు వేయదు, లేదా గందరగోళం చేసి వాయిదా. పర్యవసానం తెలంగాణ న ఘర్ కా న ఘాట్ కా. నీ పాదం మీద పుట్టుమచ్చగా సోణెమ్మా అని ఇంకో 30ఏళ్ళు పాడుకోవాల్సిందే తెలంగాణకు పట్టిన గతి.
mee guddi ashalu kaka pothe emm savaranalu vuntai basu dintlo
Deleteఅధిష్టానం ఎత్తులు, పైఎత్తులు, మనసు ముందే నీకు తెలిసిపోయిందంటావా, అపకారి? కాంగ్రేసులో దూకి సికింద్రాబాదులో పోటీ సేయరాదూ?
ReplyDeleteTelugu jaathi gouravaniki rashtrala sankyaku ntr ku sambandame ledu. ntr kuda rendu rashtralanu cheyalani lekha rasadu. adi patrikallo kuda publish chesaru. Ntr di kevalam rajakiyam matrame. basha jathi gouravam gurinchi telusukovalante dravida udyamanni chusi nerchukogalaru. ntr uththa verri cinema abhimanam meda edigina talent less nayakudu. Alage UP ni AP ni inkedanno polchatam mee avagahana rahityam. leda natana.
ReplyDeleteur 100 % corect andhraa vayavasaya lo vachina dhanamu tho akkadi busvmaya vargamulo modati sthanmu lo vunaa kamma samjika varaganiki front face mathrame NTR (pedda joker ).
Deleteఎన్టీఆర్ ఏమన్నారు లేదా రాజశేఖర రెడ్డి ఏమన్నారు అన్నది ఇప్పుడు సమస్య కాదు. ప్రజలేమంటున్నారు ? నాయకులని పక్కనపెట్టి మరీ నెల రోజులుగా ఉద్యమిస్తున్న ప్రజల అంతరంగం గమనించకుండా చనిపోయిన నాయకుల మీద బురద జల్లుకుంటూ కాలక్షేపం చేస్తున్న రాజకీయులందరూ జోకర్లె . ప్రజలని పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం రాజకీయ పార్టీల అభిప్రాయాలతో రాష్ట్ర విభజన అనేది జరిగే పని కాదు .
Deleteprajalanu pooorthiga pakkaku pettaledu. Telangana prajala koriki akankshala merake nirnayam jarigindi. andhra prajale pooooorthi prajalu anukune me ahambava abijatyaniki na degara samadanam ledu. kani rajakiya party la chetha prajalu ippinchukunna nirnayam idi. telugu jaathi chaarithraka porataniki gana vijayam labinchina sandarbam idi.
ReplyDelete