Saturday, August 31, 2013

ఉద్యోగులు-కార్మికులు అందుకోండి అభినందనలు ...

ఉల్లిపాయ ధర సెంచరీ కొట్టటానికి సిద్ధంగా వుంది .  సామాన్యుడి బతుకు దుర్భరమై పోయింది.  పెట్రోలు ధర సెంచరీ కొట్టటానికి సిద్ధంగా వుంది.  సామాన్యుడితో పాటు మధ్య తరగతి జీవుల నడ్డి విరుగుతోంది.  డాలరు మారకం కూడా సెంచరీ కి పరుగు పెడుతోంది.  తద్వారా దిగుమతుల భారం పెరుగుతోంది.  సరిహద్దుల్లో దాదాపు ప్రతి వారం పాకిస్తాన్, చైనాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి.ఇవే గాక సవాలక్ష సమస్యలు ముందున్నాయి.  వీటన్నిటికీ పరిష్కారం చూపాల్సిన కేంద్రం ముఖ్యమైన సమస్యలని గాలికి వదిలేసి తగుదునమ్మా అంటూ  అడ్డ గోలుగా తెలుగు రాష్ట్ర విభజనకి  సై అంటోంది. అదీ ఏక పక్షంగా కేవలం ఒక్క ప్రాంతానికే అనుకూలంగా ప్రతిపాదన చేసి సీమాంధ్రని అగ్నిగుండంగా మార్చింది.    రాష్ట్రంలోను, రాష్ట్రం బయట కూడా కొత్త సమస్యలని ఉత్పన్నం చేస్తోంది. వాస్తవానికి దేశంలో అనేక చోట్ల ప్రత్యెక రాష్ట్రాలకి ఉద్యమాలు ఉన్నాయి.   ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే  ఆ రాష్ట్ర విభజన కోసం శాసన సభలో తీర్మానం సైతం జరిగి కేంద్రం వద్ద పెండింగ్ లో వుంది.  విభజనకి ముందుకి వచ్చిన రాష్ట్రాన్ని వదిలి పెట్టి ఇక్కడ  శాసన సభ ఒప్పుకోక పోయినా విభజన చేసి తీరతామనటంలో ఔచిత్యం ఏమిటో అర్ధం కాదు.  మన రాష్ట్రాన్ని ముక్కలు చేసి తీరతామంటున్న ఇదే దిగ్విజయ సింగ్ ఉత్తర ప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఎస్సార్సీ  కావాలంటాడు.   ఆంధ్ర ప్రదేశ్ ని కేకు ముక్కలా కోసేయాలని ఉత్సాహ పడే చిదంబరం తమ తమిళనాడు విభజన గురించి మాట్లాడితే 'ఆ ప్రతిపాదన మొగ్గలోనే తుంచేయాలని' సెలవిస్తాడు.  ఈ అరాచకాన్ని ప్రశ్నించాల్సిన   సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు తమ పదవులు వదలి పెట్టకుండా అధిష్టానం కనుసన్నల్లో నడుచుకుంటూ తమను ఎన్నిక చేసిన ప్రాంతాలకి ద్రోహం చేస్తున్నారు.
 మొదటే పేర్కొన్నట్లు ప్రస్తుతమున్న దుర్భర పరిస్థితుల్లో సగటు వేతన జీవికి లేదా కార్మికునికి ఒక నెల జీతం రాక పొతే ఎంత కష్టం ?   అయినా సరే అడ్డగోలు విభజన సహించేది లేదు అంటూ ఉద్యమంలోకి  దూకిన రాష్ట్ర ఉద్యోగులని, ఆర్టీసీ కార్మికులని చూసి రాజకీయ నాయకులు సిగ్గు తెచ్చుకొవాలి.  ఏ నాయకుల - జాక్ ల సహాయం లేకుండా స్వచ్చందంగా గత నెల రోజులుగా  జరుగుతున్న ఉద్యమం  కేంద్రానికి దడ పుట్టిస్తోంది అనటంలో సందేహం లెదు.  విభజన పై వెనక్కి  తగ్గేది లేదు అంటూ బీరాలు పలుకుతున్న కేంద్రం మెడలు వంచేలా,  సమైక్య రాష్ట్ర సాధనకై మొక్కవోని దీక్షతో నిబద్ధత తో ముందుకు సాగుతున్న ఉద్యోగులూ - కార్మికులూ...  అందుకోండి  సమైక్యాంధ్ర  శుభాభినందనలు.  

13 comments:

  1. ippudunna rajakeeya partylani bahishkarinchi samaikyandhra ki kattubade kotta party ni full majoirty tho gelipinchali. mukhyanga congress candidates ki deposits kooda ravoddu seemandhra lo. kani prajalaki antha telivi undani anukonu.

    ReplyDelete
  2. మిత్రమా! ఒక విషయం గ్రహించాలి నువ్వు.సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటు కు రాజీనామా చెస్తే ఒక ఇబ్బంది ఉంది.పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు ఈ ఎంపీ లు లేకపొతే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చెయ్యొద్దా మరి? వీళ్ళు రాజీనామాలు చేసి ఇక్కడ రోడ్ల మీద తిరుగుతుంటే అక్కడ అధిష్టానం బిల్లును యెలాంటి కష్టం లేకుండా పాస్ చెయించుకునే అవకాశం ఉంటుంది కదా!
    అందుకే ఇక్కడ కార్మికులు, ఉద్యోగులు మిగతా మన జనం తమ వంతు నిరశన చూపిద్దాం... ఎంపీలను అక్కడ పార్లమెంటులో తమ బాద్యథ వెలగబెట్టమంతే సరి!
    ఇక్కడ ఉపన్యాసాలు దంచడం తప్ప వాళ్ళు చేసెదెమీ లెదు... ఏమంటావ్?

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పిన విషయం బాగానే ఉంది. అయితే ఇక్కడ ఇంకో సంగతి ఆలోచించాలి. తమ స్వంత ఇంటి నుండి గెంటి వేసిన రీతిలో విభజన ప్రతిపాదించినా కూడా అధిష్టానాన్ని పల్లెత్తు మాట అనలేని సాత్త్విక స్వభావులు మన కేంద్ర మంత్రి పుంగవులు, పార్లమెంటు సభ్యులు! ఇటువంటి వారు తెలంగాణా బిల్లుని అడ్డుకుంటారని, వ్యతిరేకంగా వోటు వేస్తారని మనం ఆశించటం అత్యాశే అవుతుంది. అంతే కాదు. ముందు ముందు మన రాష్ట్ర శాసన సభలో తెలంగాణా కోసం తీర్మానం జరిపే సమయంలో వ్హిప్ జారీ చేస్తే ఏం చేయాలి అని ఇప్పటినుంచి దిగులు పెట్టుకొనే వాళ్ళు పదవుల్లో వున్నా, ఊడినా కూడా ఒకటే. అదే సీమాంధ్ర కి చెందిన పార్లమెంటు సభ్యులందరూ గుంప గుత్తగా రాజీనామాలు చేసేస్తే (రాజీ డ్రామాలు కాదు - నిజం రాజీనామా) ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. అప్పుడు ఇంక బిల్లు పెట్టె ప్రసక్తే లెదు. ఆ తర్వాత రాబోయే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ కి గుణ పాఠం చెప్తారు .

      Delete
  3. కాంగ్రెస్ కాకపోతే వచ్చే బిజెపి తెలంగాణ ఇవ్వదని గ్యారంటీ ఏమిటి?

    ఎప్పటికైనా జరగవలసినదానిగురించి ఇంతగా చింతించడం అనవసరం. భారతదేశం, పాకిస్తాన్‌లలా విడిపోవడం రెండు రాష్ట్రాలకు, ఆయా ప్రజలకు మంచిదికాదు. చదువుకున్నవాళ్ళైనా ఆలోచించాలి. హైదరాబాదుకోసం ఇంత రచ్చ అనవసరం.

    ReplyDelete
    Replies
    1. చదువుకున్న వాళ్ళం కనుకనే ఆలోచించాలి.
      ఒక రాష్ట్రాన్ని విభజించటం అంటే మ్యాపు మధ్యలో గీత గీసినట్లో లేదా కేకు ముక్కని కోసినట్లో కాదు. రెండు ప్రాంతాల పరస్పర అంగీకారం ఉంటేనే అది సాధ్య పడుతుంది. ప్రజల అంగీకారం లేనప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ గానీ విభజన ప్రక్రియని కొనసాగించలేవు. తెలుగు రాష్ట్ర విభజనకి ప్రజల అంగీకారం లేదు అన్న దానికి గత 32 రోజులుగా సీమాంధ్ర లో ఏ రాజకీయ నాయకుల - జాక్ ల సహాయం లేకుండా స్వచ్చందంగా జరుగుతున్న ఉద్యమమే తార్కాణం. తెలంగాణా లో సమస్య లేదు అని నేను చెప్పను. అయితే ఆ సమస్యకి మూల కారణం ఏమిటి అన్నది కనుక్కొని దానికి చికిత్స చేయాలి తప్ప సెంటిమెంటు వుంది కదా అని విభజనలు చేస్తూ పొతే దానికి అంతే వుండదు. తెలంగాణా సమస్యకి మూల కారణాలు ఏమిటి, దానికి అత్యుత్తమ పరిష్కారాలు ఏమిటి అన్నవి శ్రీ కృష్ణ కమిటీ నివేదికలో శాస్త్రీయంగా వివరించ బడ్డాయి. కేంద్రం ఆంటోనీ కమిటీలు-అఖిల పక్ష కమిటీల నాటకాలు కట్టి పెట్టి శ్రీ కృష్ణ కమిటీ నివేదిక పై పార్లమెంటులో చర్చకి పెడితే -- కేవలం తెలంగాణా మాత్రమె కాదు -- దేశంలో వున్న ఇతర వేర్పాటు వాద సమస్యలకి కూడా కొంత పరిష్కారం దొరికే అవకాశం వుంది.

      Delete
  4. "తెలుగు రాష్ట్ర విభజనకి ప్రజల అంగీకారం లేదు"

    ==> ఏ ప్రజలు, ఇన్నిరోజులు వీళ్ళెక్కడున్నారు?

    "అయితే ఆ సమస్యకి మూల కారణం ఏమిటి అన్నది కనుక్కొని దానికి చికిత్స చేయాలి"

    ==> ఇన్నిరోజులు ఏంచేసారు/చేస్తున్నారు?

    ReplyDelete
    Replies
    1. 1) నీ ఇంట్లో దొంగతనం జరిగితేనే కదా నువ్వు పోలీసు స్టేషన్ గుమ్మం తొక్కుతావు.. లేని పక్షంలో ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటావు కదా. ఇప్పుడు జరిగింది అదే ! రాజ్యాన్ని,రాజధానిని కాజేసే ప్రయత్నం జరుగుతోంది కాబట్టే ఇన్నాళ్ళూ ఇళ్ళల్లో వున్న ప్రజలు బైటకు వచ్చారు.
      2) ఈ ప్రశ్న అడగాల్సింది తెలంగాణా ప్రాంత నాయకులని!
      సీమాంధ్రులు దగా చేసారు, దోపిడీ చేసారు అని విష ప్రచారం సాగిస్తున్న వారు -- నిజంగానే దగా/దోపిడీ జరిగివుంటే -- తెలంగాణా ప్రాంతానికి చెందిన వందకు పైగా శాసన సభ్యులు, పదిహేను మంది పార్లమెంటు సభ్యులు ఇన్నేళ్ళూ ఏం చేసారు?

      Delete
  5. "నీ ఇంట్లో"

    హహహ, సహనం తక్కువ

    ఇన్నాళ్ళుగ తెలంగాణ ప్రజలు వేరే రాష్ట్రం కావాలని అడుగుతుంటే, తెలంగాణ ఇవ్వడానికి మాకేమీ అభ్యంతరం లేదని, తె.రా.స తో పొత్తుపెట్టుకున్న పార్టీలని గెలిపించిన ఆంధ్ర ప్రజలకి అప్పుడూ తెలీదా, ఆ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణ ఇవ్వవలసి వస్తుందని, అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకు?

    ReplyDelete
    Replies
    1. రోజుకో యూ టర్న్ తీసుకొనే పార్టీలు ఇచ్చిన లేఖల ఆధారంగా తెలంగాణా ప్రకటించామన్నది కాంగ్రెస్ ఇప్పుడు ఆడుతున్న కపట నాటకం. స్వంత పార్టీలోనే ఏకాభిప్రాయాన్ని పొందలేని కాంగ్రెస్ ఇతర పార్టీల లేఖల ఆధారంగా ఒక రాష్ట్ర విభజన వంటి ముఖ్యమైన విషయాన్ని నిర్ణయించేయటం మూర్ఖత్వం. అయినా ప్రజాస్వామ్యం లో ప్రజల నిర్ణయమే అంతిమం. ఈ రోజు సీమాన్ధ్రలో జరుగుతున్న ఉద్యమం వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు. పార్టీల పొత్తులతో, మానిఫెస్టో లతో ప్రజలకి సంబంధం లెదు. కేవలం వారికి వోట్లు వేసినంత మాత్రాన వారి మేనిఫెస్టో లని అంగీకరించినట్లు కాదు. ప్రజల నిర్ణయమే ఫైనల్ మేనిఫెస్టో! కేంద్రం తన నిర్ణయాన్ని వెనుకకి తీసుకోక తప్పదు...

      Delete
  6. సీమాంధ్రులు కాంగ్రెస్సుకు పరమభక్తులు,వీరాభిమానులు!అందుకే కాంగ్రెస్ ఆనక వారికి నచ్చచెప్పుకోవచ్చునని అనుకొని తెలంగాణా రాష్ట్ర నిర్ణయం తగిన ఎక్సర్సైస్ చేయకుండా ప్రకటించి వుండవచ్చు!అర్ధ శతాబ్దంగా సాగుతున్న ఉద్యమానికి,అమరవీరుల ప్రాణ త్యాగాలు దృష్టిలో పెట్టుకొని,నెలల్లో రాబోతున్న సాధారణ ఎన్నికలలో తెలంగాణా రాష్ట్రంలో అసాధారణ విజయాలు అందుకోవాలని నిర్ణయం ప్రకటించి ఉండవచ్చు!నిర్ణయం టైమింగ్ తప్పు కావచ్చు కానీ నిర్ణయం తప్పు కాదు!హైదరాబాద్ తెలంగాణా రాజధాని,గుండెకాయ!దానిని ఆశించడం ఎలా న్యాయం!తెలంగాణావాళ్లు తమ గుండెను పెరికేస్తుంటే అలా గుడ్లప్పగించి తమాషాగా చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా!అది సాధ్యం అయ్యే పని కాదు!

    ReplyDelete
    Replies
    1. సీమాంధ్రులే కాదు. మొత్తం తెలుగు వారు కాంగ్రెస్ ని నెత్తిన పెట్టుకొని మొయ్యటం తెలుగు జాతి చేసిన పెద్ద తప్పు.

      నా ముందరి టపా చదవండి: http://andhraaakasaramanna.blogspot.in/2013/08/blog-post_21.html

      కానీ ఆ తప్పుని కేవలం సీమాంధ్రులు మాత్రమె చేస్తున్నట్లు మీరు చెప్పటం ఆశ్చర్యం. అధిష్టానం చెప్పులు మోసిన ఘనత ఒక తెలంగాణా ముఖ్యమంత్రికి ఉందన్న చరిత్ర మర్చి పొతే ఎలా?

      "హైదరాబాద్ తెలంగాణా రాజధాని,గుండెకాయ!దానిని ఆశించడం ఎలా న్యాయం!తెలంగాణావాళ్లు తమ గుండెను పెరికేస్తుంటే అలా గుడ్లప్పగించి తమాషాగా చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా!అది సాధ్యం అయ్యే పని కాదు!"

      సీమాంధ్రులు చెప్పాల్సిన మాటలు మీరు చెప్పేయటం గడుసుతనం !

      "హైదరాబాద్ మొత్తం ఆంధ్ర ప్రదేశ్ కి రాజధాని,గుండెకాయ! దానిని ఆశించడం ఎలా న్యాయం! తెలంగాణావాళ్లు తమ గుండెను పెరికేస్తుంటే సీమాంధ్రులు అలా గుడ్లప్పగించి తమాషాగా చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా! అది సాధ్యం అయ్యే పని కాదు!"

      Delete
  7. Long back NTR used say, if all the six crore andhraites ask him to resign, then only he would resign. It's a paradox. He is one among those andhraites and he will not ask and hence he would never resign.

    Once people elect their reps, reps will represent people. Once you sign a doc, it is immaterial whether you agree to the content or not but you will be held responsible for signing it. Do you get it?

    ReplyDelete
  8. Long back NTR used say, if all the six crore andhraites ask him to resign, then only he would resign. It's a paradox. He is one among those andhraites and he will not ask and hence he would never resign.

    Once people elect their reps, reps will represent people. Once you sign a doc, it is immaterial whether you agree to the content or not but you will be held responsible for signing it. Do you get it?

    ReplyDelete