శభాష్ "ఉండవల్లి"
అన్ని ప్రాంతాల వారికి ఆమోద యోగ్యమైన పరిష్కారం చేస్తాం అని మాయ మాటలు చెప్పి అందుకు విరుద్ధంగా సీమాంధ్రుల నెత్తిన పిడుగుపాటులాగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అడ్డగోలు రాష్ట్ర విభజన సరి కాదని తేలి పోయింది. అధిష్టానం నోరు నొక్కినా కూడా, ప్రతిపాదన వచ్చిన తొమ్మిదవ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి జూలు విదిల్చి ఒక సమస్య పరిష్కారం కోసం అనేక సమస్యలను ఆహ్వానించటం సరి కాదని కుండ బద్దలు కొట్టేసారు. పదవ రోజు రెండు కళ్ళ చంద్ర బాబు ఒక కంటిలో పడ్డ కారాన్ని తుడుచుకునే ప్రయత్నంలో ప్రధానికి లేఖ రాసి సీమాంధ్రుల అభ్యంతరాలు పరిశీలించకుండా ఏక పక్షంగా విభజన అంగీకరించేది లేదని తెల్చెసారు. పదకొండవ రోజు కావూరి/ఉండవల్లి కలుగులోంచి బైటకి వచ్చి తాము కూడా రాష్ట్ర విభజనని సమర్ధించబోమని ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బహుధా ప్రశంసనీయం. ఆవేశంగా మాట్లాడినా, తెలబాన్ నాయకుని లాగే సంయమనం కోల్పోకుండా కీలెరిగి వాత పెట్టిన రీతిగా ఆయన చేసిన ప్రసంగం మెచ్చ తగింది. అంటోనీ కమిటీ ల్లాంటివి ఎన్ని వచ్చినా - రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నాయకుల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగందే విభజన ప్రతిపాదన ముందుకు కదలదు అన్నది స్పష్టమై పోయింది. అయితే అసలే గాయపడి వున్న సీమాంధ్ర ప్రజలకి - ఉద్యోగులకి ఆప్షన్ లేదనటం, ముఖ్య మంత్రిని టిఫిన్ సెంటర్ పెట్టుకోమనటం వంటి తెలబాన్ నాయకుని వ్యాఖ్యలు పుండు మీద కారం జల్లినట్లు వుంటాయి. నదీ జలాలు,ఆదాయ వనరుల పంపిణీ, హైదరాబాదు భవిష్యత్తు వంటి అన్ని అంశాలలో మూడు ప్రాంతాల వారి పరస్పర అంగీకారం వచ్చాకే విభజన కార్యక్రమం కొనసాగించాలి. అంత వరకు యధాతధ స్థితి కొనసాగించటం కేంద్ర తక్షణ కర్తవ్యం.
"నదీ జలాలు"
ReplyDeleteThe central govt. has no powers to distribute river waters. River Baords Act (the only law under Entry 56) only provides for advisory boards.
The only options are 1) agreement between states or 2) tribunal under ISD Act.
Agreement can't be signed unless Telangana is formed. Andhra can raise a dispute with Telangana only after the latter is formed. In any case KWDT-II decision is yet to be gazette. A new tribunal can't be setup till then.
The best thing is to wait till Telangana is formed.
నదీ జలాల పంపకానికి కేంద్రానికి అధికారం లేదు కానీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించటానికి అధికారం ఉందా? మీరు చెప్పినట్లే ట్రిబ్యునల్స్ తేల్చాల్సిన వ్యవహారాలని ఆంటోనీ కమిటీ తీరుస్తుందని చెప్పటం అహంకారం మాత్రమె కాదు... అధికార దుర్వినియోగం ఇంకా కోర్టు ధిక్కారం కూడా అవుతుంది. ఇంక ట్రిబ్యునల్ ముందుకు వెళ్ళటం కోసం కొత్త రాష్ట్రాన్నే ఏర్పాటు చేయాలనటం హాస్యాస్పదం. అసలు విభజన ప్రతిపాదనే వివాదాస్పదంగా మారినప్పుడు ఇవన్నీ వడ్ల గింజలో బియ్యపు గింజలె..
Deleteఉండవల్లిగారు తిమ్మిని బమ్మిని బమ్మినితిమ్మిని చేయగల మసిపూసిమారేడుకాయచేయగల గొప్పవక్త!కాని ఇపుడు కావలసింది మాటలు కాదు చేతలు!UPA నిర్ణయం ఏకగ్రీవంగా జరిగిపోయింది!డిసెంబర్ తొమ్మిది వరకు ఆరునూరయినా నూరుఆరయినా తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తీరుతుంది!వాస్తవాలను గమనించండి!సీమాంధ్ర ప్రజల సందేహాలను,భయాందోళనలను తీర్చడానికి ఆంటోని కమిటీ సిద్ధంగా ఉంది!దానిని కించపరచకుండా ఉపయోగించుకోండి!రక్తం పంచుకుపుట్టిన సోదరులలా ప్రాంతాలవారీగా వేరుపడి తెలుగువారిగా కలిసుందాం!
Deleteతిమ్మిని బమ్మిని చేయటం, మసి పూసి మారేడు కాయ చేయటమే గాక వాస్తవాలు వక్రీకరించటం ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టటం లో తెలబాన్ నాయకుడు దిట్ట. ఈ రోజు తెలుగు ప్రాంతాల మధ్య వున్న విద్వేషాలకి కేవలం ఆ ఒక్క నాయకుడే కారణం. అయినా నేను ఉండవల్లిని ప్రశంసించింది ఆయన ఏదో కొత్త విషయాలు చెప్పాడని కాదు. ఉద్రిక్త వాతావరణంలో ఆవేశంగా మాట్లాడినా కూడా ఎక్కడా సంయమనం కోల్పోకుండా సూటిగా నిక్కచ్చిగా మాట్లాడటమే గాక ఆవేశంలో, ఆందోళనలో వున్న సీమాన్ద్రులకి స్వాంతన కలిగించేలా ప్రసంగించారు. ఈ పరిస్థితుల్లో రెండు వైపులా కావలసింది ఇదె. అంతే కానీ ముఖ్యమంత్రి అంతటి వాడిని కర్రీ పాయింటు పెట్టుకొని మాకు పన్నులు కట్టుతూ బతకమనే ప్రగల్భాలు కాదు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారి పరస్పర అంగీకారంతో జరగ వలసిన రాష్ట్ర విభజనని ఏక పక్షంగా ప్రకటించేసి ఏకగ్రీవంగా నిర్ణయం జరిగి పోయిందంటే ఎలా కుదురుతుంది? ఇక సీమాంధ్రుల అభ్యంతరాలని వినటానికి సైతం ఖాళీ లేక అమ్మ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ కి వున్న హోదా ఏమిటి? చట్ట బద్ధత ఉందా? అన్ని ప్రాంతాల వారి వాదనలతో/అభిప్రాయాలతో కూడి అధికారికంగా ఏర్పాటైన శ్రీ కృష్ణ కమిటీ నివేదిక వుండగా మళ్ళీ ఈ కమిటీల నాటకాలెందుకు? ఉమ్మడిగా అభివృద్ది చెందిన రాజధాని నుంచి మెడ పట్టి గెంటిన చందంగా విభజన ప్రతిపాదించి మళ్ళీ సోదరులలా కలిసి వుండామంటూ సుద్దులు చెప్తే సర్దుకు పోవటం జరగని పని.
Deletebhale rules maatladutunnare telabanlu. what is so great about acts? they can be made and nmade at the will of the central government, when they can didvide states just like that without thinking about he consequences, just for the sake of their votes or just for the sake of a so called sentiment of handful of rowdies, goondas, and extortionsits. gudumba gochigallu dappulu vaayinchnattu, pakkodi meeda padi edavadam tappa vere emi cheyyani somberi, somarulu kosam state ivvaga lenidi, acts kooda marchavachchu.
ReplyDeletesreerama
అప్పడే ఉండవల్లికి వీరతాళ్లేసేకండి. ఇప్పడే అమ్మ విరచిత కొత్త నాటకం మొదలపెట్టాడు. ముగింపు చూడండి.
ReplyDeleteఅటు కెసిఆర్ కుటుంబమో లేక టి మేధావి వర్గమో, ఇటు ఉండవల్లో, మరో లగాడిపాటో లేక సీమాంధ్ర నాయకులో ఒక్కసారి తమ ప్రాంతానికి ఏమి మేలుచేసారో చూడండి. నాటక స్టేజీ క్రింద మనమూ, స్టేజీ మీద వారందరూ.. వారందరూ కలిసి "పరాభ్రహ్మా.." అని పాడకపోతే అడగండి. నాటకం చూసే మనకెందుకు తగాదాలు, నటుల అభిమాన సంఘాల వారిలాగా.
ReplyDeleteవైసార్ కొడుక్కి ఫాక్టరీ లైసేమ్సు ఇచ్చింది చంద్రబాబు, పై పై సిబిఐ విచారణ చేయించినది వైఎస్సార్. టిఆరెస్స్ సురభి గ్రూపు ఒకసారి వైఎస్స్ అన్నది మరో సారి టిడిపి అన్నది. బిజెపి గాలి గారు వైఎస్ గారి మానస పుత్రుడు. సోనియా అల్లుడి స్కేం కనపడని బిజెపి. రాష్ట్రానికో నాలిక పెట్టుకునే కమ్మ్యునిస్టులు. రాష్ట్రం లోనే డబల్ గేం ఆడుతున్న కాంగ్రెస్సు.
ఇన్న నాటకాలు, నాటక కంపెనీలు చూసిన తరవాతైనా జనం వేరు ఈ నాటక కంపనీలు వేరు అని తెలుస్తోనే ఉన్నది కదా. రాజకీయ నాయకుల కోరకు రాజకీయ నాయకులు చేత రాజకీయ నాయకులయొక్క నాటకాలు చూడండి, మైమరచి పోకండి.
undavalli = usaravelli. intakante cheppukovalsindemi ledu.
ReplyDelete@Akasa Ramanna:
ReplyDeleteDo you sincerely believe Telangana people don't want bifurcation? Can anyone support "unity" can be achieved without involving Telangana?
Kiran Reddy, Undavalli etc. are cheating Andhras by unnecessarily prolonging this agony. The best solution is for Andhra people to support the aspirations of Telangana statehood. Once you concede our legitimate right, we can discuss your concerns.
తెలంగాణా ప్రాంతంలో ప్రత్యెక రాష్ట్ర సెంటిమెంటు వున్న మాట వాస్తవం. అయితే సెంటిమెంటు వున్న చోట విభజన చేస్తూ పోవటం పరిష్కారం కానే కాదు. ఆ సెంటిమెంటు ఎందుకు రావలిసి వచ్చిందో మూలం నుండి పరిశీలించి చర్యలు తీసుకోవాలి కానీ డిమాండు వచ్చిన ప్రతి చోట విభజనే మందు కాదు.
DeleteCan anyone support "unity" can be achieved without involving Telangana?
మరి సీమాంధ్రుల అంగీకారం లేకుండా రాష్ట్ర విభజన సాధ్యపడుతుందా? తెలంగాణా ప్రాంతీయుల ప్రత్యెక రాష్ట్రం హక్కుని గౌరవించమని అన్నారు. కానీ ఆ హక్కుని గౌరవించే సమయంలో తమ ప్రాంతాలకి శత శాతం అన్యాయం జరుగుతుంటే సీమాంధ్రులు నెత్తిన గుడ్డ వేసుకొని నోట్లో వేలు పెట్టుకొని చూస్తూ కూచుంటారా?
gudumba gochi dappu gaallu vaalladi vallae kadukkoleka satabdala paatu vaadi kinda veedi kinda nee banchen kalmoktha ani bathiki, ippudu veellu vaere vaadi concerns choosedemiti. funny.
ReplyDelete@ Akasa Ramanna:
ReplyDeleteDon't underestimate sentiment. Even Andhra state was formed on sentiment.
You need agreement for unity. For division, it is desirable but not essential.
If Andhras want to stay united, they should convince Telangana instead of agitating.
"మన" రాజధాని హైదరాబాదు లో ఒక శుభ కార్యం కి వెళ్లి రావటంతో ప్రత్యుత్తరం ఇవ్వటంలో జాప్యం జరిగింది. రాష్ట్రంలో నలు మూలల వారికి రాజధానితో సంబంద బాంధవ్యాలు, అనుబంధాలు వుంటాయి అనటానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమె. కొత్త రాష్ట్రం ప్రకటించేసాం - పోయి ఇంకో రాజధాని వెతుక్కోండి అంటే అది అంత తేలికగా జరిగే పని కాదు.
Deleteఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది కానీ సెంటిమెంటు వల్ల కాదు. సెంటిమెంటు వుందని విభజన చేస్తూ పొతే దానికి అంతే ఉండదు. ఈ కింది బ్లాగులో మీ కామెంటు నేను చదివాను.
http://naalonenu-manju.blogspot.in/2013/08/blog-post_4433.html
మీరెన్ని ముక్కలైతే మాకెందుకు - మా తెలంగాణే ముఖ్యమని నిస్సిగ్గ్గుగా రాశారు. ఇక్కడే మీ (తెలంగాణా ప్రాంతీయుల) స్వార్ధపరత్వం బైట పడుతోంది. అసలంటూ మొదలు పెడితే కేవలం ఆంధ్రా ప్రాతమే కాదు - తెలంగాణా కూడా మళ్లీ పది ముక్కలు చేసే పరిస్థితులు వస్తాయి. (అలా రావాలని నా కోరిక కాదు - జరగబోయే నిష్టుర సత్యం).
రాష్ట్రం ఇన్నాళ్ళు సంయుక్తంగా వుంది కాబట్టి నదీ జలాలు, ఆదాయ వనరులు ఇంకా రాజధాని వంటి విషయాల్లో పంపిణీ అన్న ప్రసక్తి రాలెదు. అయితే ఎప్పుడైతే విభజన ప్రతిపాదన వచ్చిందో పంపకాలన్నీ సక్రమంగా వుంటే తప్ప ముందుకు సాగటం అన్నది సాధ్యం కాదు. న్యాయబద్ధంగా రావలసిన విషయాల కోసం ఎవరినీ బతిమాడాల్సిన లేదా బుజ్జగించాల్సిన అవసరం లేనే లెదు. వాటాల విభజన సక్రమంగా జరిగే వరకు రాష్ట్రం ఒక్కటిగానే వుండి తీరుతుంది.
"ముక్కలైతే మాకెందుకు - మా తెలంగాణే ముఖ్యమని నిస్సిగ్గ్గుగా రాశారు"
DeleteAnyone saying that the problems of others (whether it is Andhra or Assam) are more important than our own problems to me is a hypocrite.
"తెలంగాణా కూడా మళ్లీ పది ముక్కలు చేసే పరిస్థితులు వస్తాయి"
Let us not cross the bridge before coming to the river. If Telangana discriminates against Hyderabad, for example, I will be among the first to support separation.
"ఇంకా రాజధాని వంటి విషయాల్లో పంపిణీ అన్న ప్రసక్తి రాలెదు"
Please read the MP Reorganization Act, 2000. It is silent on capital formation.
PART - 1:
Deleteబోడి గుండుకి మోకాలికి ముడి పెట్టటమంటే ఇదే! మధ్య ప్రదేశ్ విభజనకి - ప్రతిపాదిత ఆంధ్ర ప్రదేశ్ విభజనకి హస్తి మశకాంతర వైరుధ్యం వుంది. కేవలం చత్తీస్ ఘర్ మాత్రమె కాదు గతంలో కొత్తగా వచ్చిన ఏ రాష్ట్రమైన తన రాజధానిని కొత్త చోట ఏర్పాటు చేసుకుంది కానీ ఉమ్మడిగా సంపూర్ణంగా అభివృద్ది చెందిన తల్లి రాష్ట్ర రాజధానిని హైజాక్ చేసి తల్లి రాష్ట్రాన్నే తన్ని తగలెయలెదు. అందుకే ఆ రాష్ట్ర ఏర్పాటుకి సంబంధించిన చట్టంలో రాజధాని ప్రస్తావన లెదు. ఇంకా చత్తీస్ ఘర్ అధికారిక వెబ్ సైట్ లో ఆ రాష్ట్ర ఏర్పాటు గురించిన సమాచారం ఏముందో ఇక్కడ చూడండి...
http://chhattisgarh.nic.in/profile/corigin.htm
Creation of Chhattisgarh
The Congress Government of Madhya Pradesh took the first institutional and legislative initiative for the creation of Chhattisgarh. On the 18 of March 1994, a resolution demanding a separate Chhattisgarh was tabled and unanimously approved by the Madhya Pradesh Vidhan Sabha. Both the Congress and the Bhartiya Janta Party supported the resolution. The election manifestos of the Congress and the BJP for both the 1998 and the 1999 parliamentary elections as well as the Madhya Pradesh assembly election of 1998 included the demand for creation of separate Chhattisgarh. In 1998, the BJP led Union Government drafted a bill for the creation of a separate state of Chhattisgarh from sixteen districts of Madhya Pradesh. This draft bill was sent to the Madhya Pradesh assembly for approval. It was unanimously approved in 1998, although with certain modifications. The union government did not survive and fresh elections were declared. The new National Democratic Alliance (NDA) government sent the redrafted Separate Chhattisgarh Bill for the approval of the Madhya Pradesh Assembly, where it was once again unanimously approved and then it was tabled in the Lok Sabha. This bill for a separate Chhattisgarh was passed in the Lok Sabha and the Rajya Sabha, paving the way for the creation of a separate state of Chhattisgarh. The President of India gave his consent to The Madhya Pradesh Reorganisation Act 2000 on the 25 of August 2000. The Government of India subsequently set the First day of November 2000 as the day on which the state of Madhya Pradesh would be bifurcated into Chhattisgarh and Madhya Pradesh. Many political observers have commented on the relatively peaceful manner in which the Chhattisgarh state has been created.
PART - 2 (CONTD..FROM ABOVE)
DeleteThere is no single factor responsible for the creation of Chhattisgarh. It is in fact a complex interplay of a combination of factors that paved the path for a separate state. The long standing demand and the movement for Uttarakhand and Jharkhand which led to the acceptance of separate states for these two regions, created a sensitive environment for the Prithak Chhattisgarh demand. Therefore, the creation of Chhattisgarh coincided with the creation of these two states and became a concurrent process. Another important factor leading to the creation of Chhattisgarh was that there was clear acceptance, within Chhattisgarh and outside that Chhattisgarh had a distinct socio-cultural regional identity that had evolved over centuries. A consensus had evolved and emerged on the distinctiveness of Chhattisgarh. The people of Chhattisgarh accepted this and saw Prithak Chhattisgarh as giving expression to this identity. A sense of relative deprivation had also developed in the region and people felt that a separate state was imperative for development to take place in the region. In a democratic polity, the people's demand has a high degree of legitimacy and weight. Therefore the people's demand voiced through democratic channels was heard and contributed immensely to the creation of Chhattisgarh.
The consensus regarding the distinctiveness of Chhattisgarh did not remain limited to its socio-cultural identity. All over Madhya Pradesh, the consensus on a need for separate Chhattisgarh was also carefully developed. This consensus cuts across geographical regions castes, classes and political parties. A strong reflection of this consensus was evident in the unanimous passing of the Chhattisgarh bill in the Madhya Pradesh Vidhan Sabha. This consensus is a pointer to the high degree of maturity of Madhya Pradesh polity and the smooth passage of the Prithak Chhattisgarh bill resulting in the peaceful and unanimous creation of a new state a tribute to this maturity.
18 మార్చ్ 1994 న పాలక-ప్రతిపక్షాల సంపూర్ణ మద్దతుతో మధ్య ప్రదేశ్ శాసన సభలో 'ఏకగ్రీవంగా' చేసిన ప్రస్తావన ఆధారంగా 2000 సంవత్సరంలో ఆ రాష్ట్రం ఏర్పాటు చేసినట్లు స్పష్టంగా చూడవచ్చు. అంతే కాదు - రెండు ప్రాంతాల వారి సంపూర్ణ అంగీకారంతో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసినట్లు అధికారిక వెబ్ సైట్ స్పష్టం చేస్తోంది.
ఆ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా? శాసన సభ తీర్మానం తో సంబంధం లేకుండా కూడా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగోట్టేయటానికి కేంద్రం పూనుకుంటే తెలుగు జాతి సహిస్తుందా? ఇది కేవలం సీమాంధ్రుల సమస్య మాత్రమె కాదు.. తెలుగు వారందరి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. తెలుగు వాడి రాష్ట్ర విభజన గురించి తెలుగు నాయకులు తప్ప అందరూ చిత్తం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మా సమస్యే మాకు ముఖ్యం - తోటి తెలుగు వాళ్ళు ఏమై పోయినా పర్లేదు అని భావించే వారు ఉండబట్టే కేంద్రం నాటకాలు ఆడగలుగుతోంది. ఇప్పుడు దేశంలో కేవలం తెలంగాణా మాత్రమె గాక చాలా చోట్ల ప్రత్యెక రాష్ట్ర ఉద్యమాలు ఉన్నా (ఉత్తర ప్రదేశ్ విషయంలో శాసన సభ తీర్మానం కూడా జరిగి పోయింది) అక్కడ ఎక్కడా వేలు పెట్టె సాహసం కేంద్రం చెయ్యదు. ఆంద్ర ప్రదేశ్ ని ముక్కలు చెయ్యటానికి మాత్రం అత్యుత్సాహం కనపరుస్తుంది. కారణం? మన వాళ్ళ చేతకాని తనమే!