ఉరి తీయబోయే ఖైదీని సైతం నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడగటం సంస్కారం, సాంప్రదాయం. (ఆ కోరిక తీరుస్తారా లేదా అన్నది వేరే సంగతి) కనీసం ఆ సంస్కారం కూడా లేకుండా సీమాంధ్రుల భవిష్యత్తు ఏమై పోతుందో అన్న ఆలోచన చేయకుండా అడ్డగోలు విభజనతో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రుల పై భస్మాసుర 'హస్తం' పెట్టింది. 50 సంవత్సరాలకు పైగా అనుబంధం పెంచుకోవటమే గాక తమ ఆర్ధిక వనరులు సమీకరించి, రక్తం చెమట చిందించి, మేధస్సులు రంగరించి సర్వతోముఖంగా అభివృద్ది చేసిన హైదరాబాదు నగరాన్ని అప్పనంగా తెలంగాణ కి ధారపొయమంటే సీమాంధ్రుల గుండె మండదా? పరిశ్రమలైన, వ్యాపారాలైనా, విద్యా సంస్థలైనా, ఇతరత్రా అన్ని రంగాల్లోనూ ఇన్నేళ్ళలో రాష్ట్రంలో అభివృద్ది అంతా హైదరాబాదు చుట్టూ కేంద్రీకృతమై వున్నది అన్నది వాస్తవం. అవుటర్ రింగు రోడ్డైనా, అన్ని హంగులతో వున్న అంతర్జాతీయ విమానాశ్రయమైన, ఇంకా మెట్రో రైల్ పదకమైనా ఆంధ్ర ప్రదేశ్ లో మరెక్కడా కాక ఇక్కడే ఎందుకు అమలు పరచారు? ఎందుకంటే ఈ వసతులన్నీ 23 జిల్లాల వారికీ పనికి వస్తాయని,ఉపయోగపడతాయని! అటువంటి హైదరాబాదు నగరానికి సరైన ప్రత్యామ్నాయం చూపకుండా విభజించేయటం దారుణం. ఇదే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నిర్ణయించిన పక్షంలో తెలంగాణా ప్రాంతానికి పెద్ద "ప్యాకేజీ" ఇవ్వకుండా వుండే వారా? కనీసం అటువంటి ప్యాకేజీ సైతం ప్రస్తావించకుండా తన్ని తగలేసిన చందంగా విభజన చేయటం అమానుషం. విభజన తప్పని సరి అని నిర్ణయించినప్పుడు రెండు ప్రాంతాల వారికీ సమ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ కేవలం రాజకీయ కారణాలతో, సీమాన్ధ్రలో తమకు ఠికానా లేదని గ్రహించి, సవతి తల్లి ప్రేమ చూపిన కాంగ్రెస్ అధిష్టానం వైఖరి అత్యంత గర్హనీయం.
అవును
ReplyDeleteNee bonda ra Nee bonda
ReplyDeleteఆ, ఆ, అలానే, నీ బొందే. ఏవరు కాదన్నారు ?
Delete:)
నిజమే. విడదీయకుంటే తెలంగాణాకి బారీ ప్యాకేజి వచ్చేది. సీమాంధ్రకు ఏమి ఇవ్వకపోవడం అమానుషమే. అయితే తెలంగాణాకైనా సీమంధ్రకైన ప్యాకేజి ఇచ్చేది ఎవరు? కేంద్రమా లేక రాష్ట్రమా? రాష్ట్రమైతే ఆ అవకాశం ఇంకా వుంది అనుకోవచ్చ?
ReplyDeleteఏది ఏమైనా రాష్ట్రానికి 45% ఆదాయం ఉన్న హైదరాబాదును, ఇంత కాలం అభివృద్ది చేసిన దానిని ఇప్పుడు మీది కాదు అంటే చాల కష్టంగా వుంటుంది. సీమంధ్ర అభివృద్ది చెందడం ఇంకా కలలో మాట. ముక్యంగా ఎలాంటి వనరులు లేని 4 జిల్లాల రాయలసీమ నెగ్గుకు రావడం చాల కష్టం. మల్లి ఇంకో విభజనకు ఆస్కారం ఇవ్వకుండా ఇకనైనా అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుంది.
Rightly said.
ReplyDeletedevelopment from below!అభివృద్ధి పల్లె నుంచి పట్టణానికి ప్రాకాలి!గ్రామ రాజ్యమే రామరాజ్యమన్నాడు గాంధిజీ!గ్రామీనాభివ్రుద్దే దేశాభివృద్ధి!ముఖ్యమంత్రులు ౧౯౯౧ ప్రపంచీకరణ తర్వాత హైదరాబాద్ మీదే దృష్టి కేంద్రీకరించి తెలంగాణా జిల్లాలను పూర్తిగా అలక్ష్యం చేసారు!ఎకరాలకు ఎకరాలు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అస్మదీయులకు తన స్వప్రయోజనంకోసం తేరగా ధారాళంగా ధారాదత్తం చేసాడు!అతను చేసిన మేలు కంటే కీడు ఎక్కువ!మన ముఖ్యమంత్రులందరిలో హైదరాబాద్ ను ఒక vision తో తీర్చి దిద్దినవాడు చంద్రబాబు నాయుడు!అందుకే అతన్ని తెలంగాణా వాళ్ళుకూడా ఇష్టపడతారు!సీమాంధ్ర ను అతను అద్భుతంగా తీర్చి దిద్దగలడు!మీకు హైదరాబాద్ లా మీ రాజధానిని అందంగా మలచగల రూపశిల్పులున్నారు!కేంద్రం ఎంతో పెద్ద ప్యాకేజి కింద బాగా డబ్బిస్తుంది!ఇంకా ఎందుకు దిగులు?మీరు హైదరాబాద్ ను అడగడమంటే మా గుండెకాయను అడగడం!మా ప్రాణాలను అడగడం!
ReplyDeleteహైదరాబాదు మీ గుండె కాయ మాత్రమె కాదు.. మన తెలుగు వారందరి గుండె కాయ! ఆ నగరాన్ని సీమాంధ్రులు ప్రత్యేకంగా అడిగేదేమీ లెదు. దాని పై సర్వ హక్కులు తెలుగు వారందరికీ వుంటాయి. అయితే గుండె కోత పెట్టినట్లు విభజన ప్రతిపాదించటంతో సీమాంధ్ర రగులుతోంది. మీరు చెప్పినట్లే అభివృద్ది అంతా హైదరాబాదు చుట్టూ కేంద్రీకరించారు. అదే విషయం నేను పై టపాలో రాసాను. అయితే కేవలం తెలంగాణా జిల్లాలని మాత్రమే అలక్ష్యం చేశారన్నది సరి కాదు. హైదరాబాదు తప్ప రాష్ట్రంలోని అన్ని ఇతర ప్రాంతాల్లో అభివృద్ది నామ మాత్రం . వెనుకబాటు తనమే ప్రాతిపదికగా తీసుకుంటే తెలంగాణా కన్నా వెనుకబడిన ప్రాంతాలు సీమాంధ్ర లో ఎన్నో వున్నాయని శ్రీ కృష్ణ కమిటీ నివేదిక తేల్చి చెప్పింది. అటువంటప్పుడు మీరు చెప్పిన ఎంతో పెద్ద ప్యాకేజీ కింద డబ్బులు కేటాయించి అన్ని ప్రాంతాల్లోని వెనుక బడిన ప్రాంతాలని వృద్ది పరచటం శ్రేయస్కరమా లేక అవే ప్యాకేజి డబ్బులని, ఇంకా మీరు చెప్పిన రూప శిల్పుల మేధా సంపత్తిని కేవలం కొత్త రాజధాని నిర్మాణానికి వ్యర్ధపరచటం మంచిదా? హైదరాబాదు ఈ రోజు వున్న స్థితి కి రావటానికి 50 ఏళ్ళు పట్టింది. ఒక వేళ సీమాంధ్ర లో కొత్త రాజధాని నిర్మించి అభివృద్ది పరచినా ఇదే సమస్య పునరావృత్తం కాదని నమ్మకమేమిటి? అప్పుడు మళ్ళీ ఇంకో విభజన చేయాలా ?
Deleteramanna gaaru ee buddhi rajakiya peddaallaku ledu
ReplyDeletekanisam hyderabad nu ummadi raja dhani cheste chaalu, leda union territory , leda 2nd capital muditlo edaina ok ne
neeku buddhi ledani neebondani yeppudo telusu
ReplyDeleteprati telugu vaadu tana oorilo, jillalo anni vasatullekapoyinaa..mana raajadhaani hyderabad ni maatram prapancha sreni nagaramgaa teerchididdaali anukunnaru. Anni rangaallo desam lo hyderabad ni modata nilapaalani gata 50 yellugaa sraminchaarannadi satyam. ilaa penchi pedda chesina nagaram tanani vellipomante gunde kota migaladaa..? raashtram lo anni praantaala prajalaku hyd paina hakkulunnayi. 1956 lo andhra raashtram erpadeTappudu raajadhaani kurnool nundi hyd maarchadam jarigindi. Ade jaragakundaa kurnool raajadhaani ga unnatlaaite vibhajinchamani adigevaaraa?
ReplyDeleteabba cha raktam chemata inkemaina chindinchara? paisal ekkadivi babu?
ReplyDelete1947 nunche HYDERABAD 5th biggest capital in INDIA.
same now also 5th. ee raktam chemata chindinchatam bhari davilaagulu vaddu idi cinema kadu.
source : http://andhrajyothy.com/ContentPage.jsp?story_id=34377&category=read_this_now
ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందన్న ఆనందంలో నాటి మన నేతలు అసలు సంగతుల్ని వదిలేశారు. ఆస్తుల పంపకం సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినవి విరిగిన కుర్చీలు, పనికిరాని బల్లలు, తుప్పుపట్టిన రోడ్డు రోలర్లే. ఇక, కర్నూలును రాజధానిగా చేసుకునేందుకు కేంద్రం తగినన్ని నిధులు ఇస్తామని, తమిళనాడు ప్రభుత్వం నుంచి కూడా కొంత ఇప్పిస్తానని హామీ ఇచ్చింది. కానీ అవేవీ సరిగ్గా జరగలేదు. దీనికి తోడు 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, రాజధాని హైదరాబాద్‌కు మారిన తరువాత, ఇక నిధుల అవసరమేముందని కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం చేతులెత్తేశాయి. కేంద్రం అరకొర విదిల్చింది తప్ప.. ముందు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా పక్కనబెట్టేసింది.
@ . వెనుకబాటు తనమే ప్రాతిపదికగా తీసుకుంటే తెలంగాణా కన్నా వెనుకబడిన ప్రాంతాలు సీమాంధ్ర లో ఎన్నో వున్నాయని శ్రీ కృష్ణ కమిటీ నివేదిక తేల్చి చెప్పింది....
ReplyDeleteఅన్నాయ్...నీకర్ధం కాదే??ఏదో సెప్పి ఎదో దొబ్బేద్దారని...కాకపోతే..ఎనకపాటు తనం...నిరుద్యోగం..ఇక్కడే ఉన్నాయ్!!ఎనకాల సానా కధుందన్నాయ్!!ఏబై ఏల్ల క్రితమ్ అక్కడ భూములు కొన్నోల్ల మీద కాణ్ణించి ...బతుకు తెరువు ఎతుక్కున్న పెతీ ఓడూ దోపిడీ ఓడే..ఒక్క కేసీఆర్ తప్ప!!పెపంచంలో 2013 లో కూడా ఇలాంటి మాటలు ఆడీ ఓణ్ణి ఏమంటారన్నాయ్?
manam telangana vallu udyamaalu chestunappudu spandinchalsindi. kani ala cheyaledu. ipudu edchi prayojanam ledu. ipatiki inkaa kcr mede edustunnam. nijaniki kcr telangana vallake kadu yavath telugu jathi ki garvakaaranam.
ReplyDeleteతెలంగాణా వాళ్ళు ఉద్యమించే సమయానికి రాష్ట్రం సమైక్యంగానే వుంది . అందుకే కెసీఆర్ లాంటి వేర్పాటు వాదులకి తప్ప ఉద్యమం నడిపే అవసరం ఎవరికీ రాలేదు . కానీ ఈ రోజు కేవలం కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాల వల్ల వుత్తి పుణ్యానికి విభజన ప్రతిపాదనని భరించాల్సి వచ్చింది . కెసీఆర్ సీమాన్ద్రులకి కూడా గర్వ కారణమే ! ఎందుకంటే ఉద్యమ జ్వాలకి పెట్రోలుని అందిస్తోంది ఆయనే కదా !
Deleteem matladaro ardam kaledu. samaikyam ga ubdi kabatte pratyeka udyamam chesaru. lekapote enduku chestaru! sarle. Ika uthi punyaniki em kadandi..vandalaadi mandi tyagala nu chellinchukune ee rendu rashtralu sadhinchukunnam. Kcr vishayaniki vaste bavishyathulo..potti sriramulu ku rendu pranthalalo ippati varaku ela gouravamichamo..alane kcr ni rendu prantalu gouravinchali.
ReplyDelete