Wednesday, August 7, 2013

ధృతరాష్ట్ర అధిష్టానం !

తమ పదవులని జలగల్లా వదలి పెట్టగ పోగా సీమాంధ్ర కేంద్ర మంత్రులు చేస్తున్న ప్రకటనలు చిర్రెత్తిస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన అడ్డగోలు విభజన ప్రతిపాదన తో సీమాంధ్ర ప్రాంతాలు అట్టుడుకుతుంటే తీరికగా వాస్తవ పరిస్థితులు అధిష్టానానికి 'నివేదిస్తారట!'. వీరు నివేదిస్తే గానీ అధిష్టానానికి రాష్ట్రంలో ఏమి జరుగుతోందో తెలియదు గాబోలు! సీమాంధ్ర ప్రజా ప్రతినిధులని, మంత్రుల్ని ప్రలోభాలతో/బెదరింపులతో లొంగదీసి - తెలబాన్ నాయకుడు ఫాంహౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్న సమయం చూసి - ప్రత్యెక రాష్ట్రాన్ని సమర్ధించే బీజేపీ ఏమరుపాటు గా వున్న సమయం చూసి - ప్రత్యెక రాష్ట్రం ఇచ్చే ఘనత కేవలం తమకు మాత్రమె వచ్చేలా జాగ్రత్త పడుతూ -- పర్ ఫెక్ట్ టైమింగు తో --- సీమాంధ్రుల గుండెల్లో పిడి బాకు దించేలా విభజన ప్రతిపాదన చేసిన అధిష్టానానికి తద్వారా రాష్ట్రంలో ఏం జరుగుతోందో / జరగబోతుందో తెలియదనుకోవాలా? అధిష్టానం పట్ల విధేయత ఉండటంలో తప్పు లెదు. కానీ తమ ప్రాంత ప్రయోజనాలకు, అభ్యంతరాలకు లేశ మాత్రం విలువనివ్వకుండా సవతి తండ్రి ప్రేమ చూపుతూ గడ్డి పోచల్లాగా తీసి పారేసినపుడు తిరగబడాల్సిన అవసరం ఖచ్చితంగా వుంది. ఈ సమయంలో కూడా తమ పదవులు,ప్రయోజనాలు కాపాడుకొనే విధంగా సీమాంధ్ర కేంద్ర మంత్రులు వ్యవహరిస్తుండ బట్టే తెలుగు జాతి అధిష్టానానికి లోకువై పోయింది. అభ్యంతరాలను లెక్క జేయక పోగా ఏమైనా చెప్పుకుంటే అంటోనీ కమిటీ కి చెప్పుకోండి అంటూ తూష్ణీ భావం తో అధిష్టానం పెద్దలు మాట్లాడుతుంటే తెలుగు జాతి గుండె రగిలి పోతోంది. ఆంటోనీ కమిటీ లో ఒక్కడైనా తెలుగు వాడు వున్నాడా? తెలుగు వారి పంచాయితీ ఇతరులు ఎందుకు తీర్చాలి?     విభజన ప్రకటనకి ముందు కూడా ఇలాగె నివేదికలు, రోడ్ మ్యాపులు అంటూ నాటకాలాడి తమ చిత్తం వచ్చినట్లు వ్యవహరించెసారు. మళ్ళీ అదే జరగదని నమ్మకమేమిటి? శ్రీ కృష్ణ కమిటీ లో తెలుగు వారు వున్నారా అంటూ కొందరు అతి తెలివిగా వాదిస్తున్నారు. శ్రీ కృష్ణ కమిటీ అన్నది వాస్తవాలని పరిశీలించి, పరిష్కారాలని సూచిస్తూ నివేదిక ఇవ్వాల్సిన కమిటీ మాత్రమె. కానీ నిర్ణాయక విధానాలు తీసుకోవాల్సిన కమిటీలో తెలుగు వారికి స్థానం లేకుండా రాష్ట్ర భవిష్యత్తుని, తద్వారా తెలుగు వారి ప్రయోజనాల్ని ఇతర ప్రాంతాల వారు నిర్దేశించాల్సి రావటం జీర్ణించుకోలేని విషయం. ఇంకా మళ్ళీ ఈ ఆంటోనీ కమిటీ కి నివేదికలు వాస్తవ పరిస్థితులు తెలియ జెప్పటానికి మన ప్రజా ప్రతినిధులు పూనుకుంటే వాళ్లకి మన జాతి ప్రయోజనాల పట్ల నిబద్ధత అనేదే లేదని భావించాల్సిందే. ఎందుకంటే కేంద్రానికి వాస్తవ పరిస్థితులు అన్నీ స్పష్టం గా తెలుసు. ఎవరూ ప్రత్యేకంగా చెప్పనవసరం లెదు. చేతనైతే ఆంటోనీ కమిటీ స్థానంలో రాష్ట్రం లోని మూడు ప్రాంతాల వారిని నియమించి అర్ధవంతమైన చర్చలు సాగించి సమస్యని పరిష్కరించేలా మన ప్రజా ప్రతినిధులు/మంత్రులు పొరాడాలి... అంటే తప్ప శుష్క నివేదికలు సమర్పించితే వాటిని బుట్ట దాఖలు చేసి కేంద్రం తన చిత్తం వచ్చినట్లు నిర్ణయిస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లెదు.

14 comments:

  1. ఆకాశ రామన్న గారు, కాటికి కాళ్ళు చాపిన కావూరి గారికి తన అంతిమ యాత్రలో తుపాకులు గాలిలోకి పేల్చే నలుగు కానిస్టేబుళ్ళు మాత్రమే చాలు అనుకుంటున్నాదు, ఏమి చేస్తాం చెప్పండి. కావూరి తప్పుడు మనిషని, ఆయన గురించి తెలంగాణా ప్రజలు ఎప్పుడో చెప్పారు. కావూరిని కె టి ఆర్ కలిసినపుడు రాష్ట్రం త్వరలో విడిపోనున్నదని ఆ ఇద్దరికి తెలుసు. మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం.

    ReplyDelete
  2. "తెలుగు వారి పంచాయితీ ఇతరులు ఎందుకు తీర్చాలి?"

    సరే మనమే తెల్చుకున్దామా? తెలంగాణా రాష్ట్రానికి ఒప్పుకోండి. మీకు అనుమానాలు/డిమాండ్లు వగైరా ఏమయినా ఉంటె చెప్పండి. అంతేతప్ప తెలంగాణకు అడ్డు చెప్పకండి

    ReplyDelete
    Replies
    1. మనమే (అంటే మీరు నేను కాదు.. మన తెలుగు వాళ్ళే) తేల్చుకోవాలనే నేను చెప్పింది. కానీ వాదనలు జరగక ముందే తీర్పు మీరు ఇచ్చేస్తే ఎలా? అప్పుడు మీది వాదన అవదు, మొండి పట్టు అవుతుంది లేదా కేంద్రం మీ పక్షాన ఉందన్న అహంభావమన్నా అవుతుంది.

      Delete
    2. OK, look forward to one or both of the following:

      1. Conditions for Telangana formation
      2. Andhra offers to avoid bifurcation

      Delete
    3. Jai,
      Andhra already gave lot of offers and favors.
      Take it mulki rules, 6 point formula, 14F etc.

      If we say telagana is developing in united AP, T-vadis start saying "we were developed before state formation. we had usmaniya hospital, usmaniya university, excess income etc". If you had all that, why did you need mulki rules, president orders, 6 point formulas. Why did telangana people need special treatment?

      Some other times, same T-vadis say most of the state income is coming from telangana. If most of the income is coming from telangana, does it not mean that telangana is developed?

      I am confused why it needs to be bifurcated at all.

      Look at all the things that T-vadis do. They are the ones who are dictating and they are the ones who say seemandhra people are dictating us. In the state capital, how many T meetings were held and how many seemandhra meetings were held?

      Delete
  3. Anon, all these "offers" have been rejected already.

    Telangana people don't have to convince Andhras for separation. Unity is a different ball game: you can't be united by force.

    "most of the state income is coming from telangana. If most of the income is coming from telangana, does it not mean that telangana is developed"

    The problem is not about income but expenditure. What is the use of generating income when it subsidizes other regions? After bifurcation we will both able to spend our own revenues.

    ReplyDelete
    Replies
    1. రాజధాని ఆదాయాన్ని తమ ప్రాంత ఆదాయంగా పరిగణించటం వాపుని చూసి బలుపు అని భ్రమించటమే అవుతుంది. అసలు సమస్య ఇప్పుడు అదే! కర్నూలు రాజధానిగా వుండిన పక్షంలో ఆ ప్రాంతానికే ఇంతటి అభివృద్ది, ఆదాయం ఖచ్చితంగా వచ్చి ఉండేవి. అప్పుడు మనం 'పోరు తెలంగాణా' కాకుండా 'పోరు రాయలసీమ' ఉద్యమాన్ని చూసి వుండే వాళ్ళం. అన్ని ప్రాంతాల వనరులతో అభివృద్ది చెందిన రాజధానిని వున్న పళంగా వదిలెయమనటం మింగుడు పడని వ్యవహారం. సీమాంధ్రులు హైదరాబాదులోనే ఉండవచ్చని ఉదారంగా అనుమతులిచ్చేస్తున్నారు తెలంగాణా నాయకులు. నిజమె... అక్కడే కాదు, చెన్నై, ముంబై మరెక్కడైనా నివసించే హక్కు అందరికీ వుంది. అయితే తమ రాజధాని లో ఉంటున్నామన్న 'ఎమోషనల్ టచ్' లేకుండా వుండ గలరా? ఏమైనా విభజన తప్పనిసరి అయిన పక్షంలో హైదరాబాదుకి దీటుగా అన్నివిధాల ప్రత్యామ్నాయ రాజధాని ఏర్పడే వరకు ఆ నగరాన్ని సీమాంధ్రులు (రాజధానిగా) వదలిపెట్టటం జరగని పని.

      Delete
    2. pakkodi kashtham, sommu, knowledge upyoginchi oka joint venture profitable ayinatarvatha , idi maade, why should we convince, why should we ask? ani anate, daani pakkodi sotthu dobbadam antaaru. idi only gudumba, gochi, dappu gaallu matrame alochinchagalaru. idi typical telaban, LTTE culture. deenik pratipadika donga lekkalu, abhaddaalu repeated ga cheppadam, like hitler did against the jews (who are hard working even now they are in the foremost in all the fileds) mana chetakanitananni, mana lack of hard work, initiative, intelligence veetiki, pakka vaadini dweshichadam, vaadu develop ayithe, adi manade ani claim cheyyadam idantha typical nazi culture. donga lekkalaki adi vudyogala, neella, amara veerula ani leadu anni abhaddalae. roju illeki aravadam veella naijam. ippudu kothga Nizam ni pogadadam. Nizam veellani dari daapulloki kooda raanivvalaedu. he had employed people in all the higher places from different partsbof the world, but not these gochi, dudumba, dppu gaallu. because, he knew pretty well about these people, their intelligence levels, trustworthiness etc. now they are grandly claiming Hyderabad, aplace into which these telabans were never allowed except for the fringes.

      Delete
  4. 1. ఒక సమస్యకి పరిష్కారం అనుకున్నది కొత్త సమస్యల్ని సృష్టించేదిగా ఉంటే, కొంతకాలం తర్వాత మళ్ళీ సమస్య మొదటికొస్తుందేమో అనిపించేటట్లు ఉంటే అది నిజమైన పరిష్కారం అనిపించుకుంటుందా? ఇప్పుడు ప్రత్యేక తెలంగణా రాష్ట్ర ప్రతిపాదన మొదలవ్వగానే గుర్ఖాలాండు గొడవ మొదలు పెట్టింది. మిగతా వాళ్ళు కూదా నేడో రేపో మొదలు పెదతారు.నిజంగా విభజన వల్లనే వెనుకబటుతనం పోతుందా? ఇప్పటికి ఉత్తరాదిన విడిపొయిన రాష్ట్రాలలో అలాంటి గుణాత్మకమైన మార్పులు జరిగాయా?

    2. తెలంగనా వాదులకి తెలుసో లేదో గాని విభజన నిర్ణయం జరిగాక సమైక్యాంధ్ర ఆందోళనల వెనక రాష్త్ర స్థాయి కాంగ్రెసు పెద్దలే ఉన్నారనేది యెమి చెబుతున్నది? ఇస్తారేమో అన్నప్పుదు హడావుడి చెసి ఇవ్వరని ధీమాగా ఉన్నప్పుదు ఆగిపోవటంలా నత్త నదక నడిచే ఉద్యమానికి చురుకు తెప్పించటం కొసమే వాళ్ళు ఈ ప్రకటన చేసారు. దాన్ని వేడెక్కించి ఆ బూచిని చూపించి విభజనని యెన్నికల తర్వాతకి వాయిదా వెయ్యటం కోసం అక్కడి పెద్దన్నలూ ఇక్కడి చిన్నన్నలూ కలిసి ఆడుథున్న దొంగాట ఇది.

    3. అవును అది మాకూ తెలుసనే తెలంగణా వాదులకి నేనొక సూటి ప్రశ్న వేస్తాను. ఇట్లాంటి కాంగెసుతో కచరా గారు యెందుకంత మమేకమయ్యారో, రాష్ట్రం రావటమంటూ జరిగితే అది కాంగ్రెసు వల్లనే అని నొక్కి చెప్పారో నిన్న గాక మొన్న రాష్ట్రం ఇస్తే కాంగ్రెసులో కలిసి పోవడానికి గూడా సిద్దపడ్దారో మీరు తేల్చుకొవల్సి వొస్తుంది.

    4. మొత్తం సమస్యని మొదటి నుంచీ చివరి వరకూ రాగద్వేషాల కతీతంగా చూస్తే అటు తెలంగాణా వాదులూ ఇటు సమైక్య వాదులూ చేస్తున్న పొరపాటు ఒకటి కనిపిస్తున్నది. సమస్యకి మూలం యెమిటో ఇద్దరిలో యెవరూ పసిగట్ట లేదు. ఒక సమస్యని మూలాన్ని వెదక్కుండా పైకి కనబడే చిహ్నాల్ని మాత్రమే చూసి మూలం దగ్గిర ఒక్క దెబ్బతో పడిపొయే విషవృక్షాన్ని ఆకుల మీద యెన్ని దెబ్బలేసినా లాభమేముంది?

    5. తెలంగానా వాదులకి తప్పనిసరిగా జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఒకటి వేస్తున్నా.ఈవ్వాళ మా వెనకబాటుతనానికి ఆంధ్రోళ్ళు కారణం, ఇన్నేళ్ళుగా మమ్మల్ని నిర్లక్ష్యం చేసారు గనక విడిపోవటమే సరైనదంటున్నారు. విడిపొయిన ఒక నాలుగేళ్ళ తర్వాత ఒక మూదు జిల్లాలు మాత్రమే ముందుకెళ్ళి మిగతావి ఇంకా వెనకబడి ఉంటే, వాళ్ళు ఇలాంటి వాదన తోనే మాకు వేరే రాష్త్రం కావాలని అడిగితే వెంటనే అప్పటి మీ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చేస్తారా?

    ReplyDelete
  5. 6. అలా సాగదీస్తూ పోతే యెక్కడాగుంతుంది? విదిపోవడం ద్వారానే బాగుపడగలగటం నిజమైతే ప్రతి జిల్లా ఒక రాష్తంగా విదిపోవాల్సి ఉంటుంది.నిజంగానే రాష్త్రం విడిపోకుండానే మీకు కావలసిన స్వయం పరిపాలన అనేది సాగించుకోలేని విషయమేనా? ఇవ్వాళ పరిపాలనకి సంబంధించిన చట్రం యెలా ఉంది?కేంద్రంలో పార్లమెంటూ రాష్త్రాలలో అసెంబ్లీలూ ఉద్దరిస్తున్న ఘనకార్యమేమిటి? కేవలం కాగితాల మీదకి శాసనాల్ని యెక్కించటం. వాళ్ళు నిజంగా పనులు చెయ్యటానికి జిల్లా స్థాయి యంత్రాంగం మీదే ఆధార పడుతున్నారు.యెందుకంటే జిల్లాలకి భౌగోళికమైన,రాజకీయపరమైన మరియు సాంస్కృతికమైన సరిహద్దులు ఖచ్చితంగా వివాద రహితంగా యేర్పాటయి ఉన్నాయి.పనులు చెయ్యటానికి కావలసిన యంత్రాంగమంతా అక్కడ బలంగా ఉంది.

    7. ఆ జిల్లాలకి రాజకీయపరమైన స్వయం పరిపాలన ఇవ్వదం కొసమే జిల్లా ప్రజా పరిషత్తులనే వ్యవస్థని ప్రతిపాదించారు. వాటికి యెన్నికలు జరుగుతున్నాయి,కార్యాలయాల్ని సమకూర్చారు, చాలా హడావుడి చేసారు - అఖరికి ఇవ్వల్సిన శసనాధికారం మాత్రం ఇవ్వకుందా చేటపెయ్యల్లగా వాటిని నిలబెట్టినందువల్ల ఆ యెన్నికలకయ్యే ఖర్చంతా వృధా అయిపోతున్నది. అవి అసమర్ఢులకి రాజకీయ పునరావాస కేంద్రాలు గా మిగిలిపొయినాయి.

    8. తెలంగణా వాదులు ఆ పది జిల్లల కోసమూ, సమైక్య వాదులు ఆ హైదరబాదు ఒక్కదాని కొసమూ గాకుండా జిల్లాలకి స్వయం ప్రతిపత్తి కోసం ఉమ్మడిగా పోరాడితే మొత్థం 23 జిల్లాల వాళ్ళూ బాగుపదతారు కదా! అధికార వికేంద్రీకరణ కోసమనే ఒక వ్యవస్థని ప్రతిపాదించి కూడా దాన్ని పూర్తిగా యెందుకు అమలు చెయ్యలేదో తెలుసా?అధికారం కేంద్రీకృతమవడం వల్ల లాభపడే వాళ్ళు ఆ అధికారాన్ని వికేంద్రీకరిస్తే తమ లాభం గూబాల్లోకి వొస్తుందని తెలియదం వల్ల అలా వికేంద్రీకరణని తొక్కి పట్టి ఉంచారు.రెందు రాష్త్రాలు గా విడిపోతే ఇలాంటి అధికార కేంద్రం దగ్గిర గుమిగూడి సొంతానికి దండుకునే వాళ్ళు మాత్రమే బాగుపడతారు.

    9. అవినీతి మచ్చ లేని వాళ్ళూ మంత్రులు గా కొందరు మంచి పేరు తెచ్చుకున్న మంచి వాళ్ళూ తమ జీవితానుభవాల్ని గురించి చెబుతూ వాళ్ళు జిల్ల పరిషత్ చైర్మన్లు గా ఉన్నప్పటి అనుభవాల్ని యెకరువు పెట్టగా నేను చదివాను.అనుభవాలు అంటే పని చేసిన అనుభవాలు కాదు - జిల్లా అంతా కలయ దిరిగి యెమి చెయ్యాలో తెలిసి కూదా పని చెయ్యటానికి అధికారాలు లేని దరిద్రాన్ని గుర్తు చేసుకోవటమే. మంత్రిగా ఉన్నప్పటి అధికారాలు అప్పుడే ఉంటే యెంతో కాలం కలిసొచ్చేదనే నిట్టూర్పులే.ఇవ్వాళ ఇంకొ దరిద్రం కూడా కనబడుతూ వినబడుతూ ఉంది. వెనకబడిన జిల్లాల వాళ్ళు రాష్త్ర ప్రభుత్వాల్ని మేము కాస్త బాగుపడాలి బాబూ మా జిల్లా నించి ఒకరిని మంత్రిని చెయ్యండని దేబిరించటం.అంటే ఒక జిల్లా బాగుపడాలంటే ఆ జిల్లా వాడు మంత్రివర్గంలో ఉండాలన్నమాట. అంటే మొత్తం ర్రాష్త్ర పరిధి లో అలోచించాల్సిన మంత్రి తన సొంత జిల్లాని గురించి మాత్రమే అలొచించటం అనేది అందరికీ న్యాయమే అనిపిస్తున్నదన్నమాట.

    10. ఆ దరిద్రాలకీ ఈ శషభిషలకీ మూలం ఒక్కటే ననేది నాకు అనిపిస్తున్నది. జటిలమైన సమస్యలకి కూడ లోతెరిగి చూడకుందా దీర్ఘకాలిక పరిష్కారాలకి కాకుండా అప్పటికి నెత్తిన పడ్డ పెంటని వొదిలించుకుంటే చాలనే విధంగా అలోచించటమే.తెలంగాణా వాదుల కోరిక ప్రజలు సుఖపదే స్వయం పరిపాలన అయితే అది రాష్త్రంగా విదిఫొయినా జిల్లాలకి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం వల్లనే జరుగుతుంది. జిల్లాలకు పూర్తి అధికారాలిచ్చి అన్ని జిల్లాలనీ స్వయం పోషకంగా చెయ్యడం విదిపోకుండానే చేసుకొవచ్చ్చు.కాదు మాకు వేరే అధికార కేంద్రం కావలసిందే తింటే తింటారు తిననియ్యుండ్రి మావాళ్ళేగా మేమేమీ అనం అంటే నేనేమీ చెప్పలేను. ఒకసారి నేనే ఆ జవాబును వారినుంచి పొంది ఉన్నాను:-)

    ReplyDelete
  6. ఇక ఆఖరుగా రెండు మాటలు చెప్పి నా వాదనని ముగిస్తాను.ఒకనాడు దేశం కొత్తగా స్వతంత్రం తెచ్చుకున్న రోజున భాషాప్రయుక్త రాష్త్రాల పేరుతో మనం ఒక ఒరవడి దిద్దాం. అదే దారిలో మిగతా వాళ్ళూ నడిచారు. ఇవ్వాల మళ్ళీ అధికార వికేంద్రీకరణ సాధిస్తే మళ్ళీ మనం అందరికీ కొత్తదారి చూపించిన వాళ్ళ మవుతాం.నాకు చాలా బాధగా అనిపించే విషయం ఒకటి ఉంది. తెలంగణా వాదులు మా భాష వేరు అంటున్నారు. అది చాలా తప్పు.మనం ఆ రొజున వేరే వాళ్ళకి వొదిలేసిన రాష్త్రాల్లో ఉన్న వాళ్ళతో సహా అందరం తెలుగు వాళ్ళమే. నేను క్రిష్ణా జిల్లా వాడినే అయినా రాగద్వేషాలు లేని నిందు మనస్సుతో ఒక మాట చెబుతున్నా. క్రిష్నా జిల్లా నించి అధికార కేంద్రాన్ని అంటకాగి బాగా బలిసిన వాళ్ళు ఇతర జిల్లల వాళ్ళని చాలా హీనంగా చూసారు, చూస్తున్నారు,ఇకముందు కూదా వాళ్ళు సంస్కారం గలిగి ప్రవర్తిస్తారని నేననుకోవదం లేదు. వాళ్ళీ రోజున మా భాష నీటైనది అనుకోవడం సంస్కృతం తో అవసరమైన దానికన్న యెక్కువగా సంకరం అవ్వడం వల్ల వొచ్చిందే. తెలంగాణా లో మాట్లదేదీ, రాయల సీమలో మట్లాడేదీ, అంధ్రా జిల్లాల్లో మట్లాడేదీ అంతా తెలుగే. అన్నీ మాండలికాలు మాత్రమే.అవి వాదుక ఈజీ గా ఉండడం కోసం యేర్పడిన యాసలు మాత్రమే. ఉపనిషత్తులలో శ్రేయము ప్రేయము అని ఒక భావన ఉంది. దాని అర్ధమేమిటంటే శ్రేయం కలిగించేది ఇష్టమైనది కూదా అయితే వెంటనే తీసేసుకో - నిన్నెవరూ అపలేరు కూడ. ప్రియమైనది శ్రేయము కాదని తెలిసినప్పుదు తొందర పడగూడదు. అలా తీసుకుంటే తర్వాత నష్టం నీకే. అలాగే ఒకటి మనకు శ్రేయస్సు నిచ్చేది అయితే అప్పటికి ఇష్టం లేకపోతే బలవంతంగా ఇష్టం కలిగించుకోవలసిందే, యెందుకంటే అది నీకు మంచి చేస్తుంది గనక.ఈ ఉపనిషత్తుల సుత్తిని నా స్వంత అవసరానికి వేస్తున్నానండీ యేమనుకోకండేం:-) ఇంకోటి, పైన నేను చెప్పినవన్నీ నా వైపు నుంచి అన్ని జాగ్రత్తలూ తీసుకుని నా మాటల వల్ల అసలే వేడిగా ఉన్న వాతావరణం ఇంకా వేడెక్కని విధంగానే చెప్పినా తమకిష్టం లేని సంగతి కనబడ్దగానే నన్ను మాత్రం ద్వేషించకుండా ఉంటారని:-)


    నా మనసులో ఉన్న అసలైన భవిష్యత్తు చిత్రపటం యేమిటంటే "జాతీయ స్థయిలో కేంద్ర ప్రభుత్వమూ ప్రాంతీయ స్థాయిలో జిల్లా ప్రభుత్వాలూ" మాత్రమే ఉండి అవి డైరెక్టు కాంటాక్టులో ఉండాలని. అసలు రాష్ట్రాలే అంతర్ధానమై పొవాలని. జిల్లాలకి అరకొర అధికారాలిచ్చి రాష్ట్రాలనే అంతరువులు అలాగే ఉంటే అవి మళ్ళీ ఇప్ప్పటి దళారి పనులే చేస్తాయి.


    విభజనా? వికేంద్రీకరణా? యేది ఉత్తమం?

    ReplyDelete
  7. "హైదరాబాదుకి దీటుగా అన్నివిధాల ప్రత్యామ్నాయ రాజధాని"

    హైదరాబాదుతో దీటిగా ఉండే నగరాన్ని నిర్మించడం ఎవరి తరం కాదు. 400 పై చిలుకు ఏళ్ల కృషి ఫలితానికి ప్రత్యామ్నాయం వెంటనే రావాలని కోరుకోవడం గొంతెమ్మ కోరిక.

    Try for something less ambitious like Bhopal, Trivandrum or er Vizag. All 29 states don't have to have a capital like Hyderabad.

    ReplyDelete
    Replies
    1. మీరు అన్నది నిజం. హైదరాబాదు కి దీటుగా వుండే నగరాన్ని నిర్మించటం ఎవరి తరం కాదు.. ఇది మన తెలుగు వారందరికీ గర్వకారణం కూడా ... అయితే ఉమ్మడిగా అభివృద్ది చెందిన ఈ నగరాన్ని కొత్తగా ఏర్పడ బోయే (?) రాష్ట్రానికి విడిచి ఏ ద్వితీయ శ్రేణి నగరానికో తరలి వెళ్ళాల్సిన అగత్యం సీమాంధ్రులకి లేదు. ఈ అభివృద్ది అంతా 400 ఏళ్లలో జరిగిందా లేదా నలభై ఏళ్లలో జరిగిందా అన్నది అప్రస్తుతం. సీమాంధ్ర ప్రాంతంలో ఏదో ఒక నగరంలో పరిపాలనా భవనాలు, హై కోర్టు భవనాలతో పాటు ఒక హైటెక్ సిటీ + శంషాబాదు కి దీటైన అంతర్జాతీయ విమానాశ్రయం + ఒక మెట్రో రైల్ + ఆ నగరానికి ఒక ఔటర్ రింగు రోడ్డు ఎంత త్వరగా నిర్మించి ఇస్తే అంత వేగంగా హైదరాబాదుని తెలంగాణాకి అప్పగించటం జరుగుతుంది.

      Delete
  8. pakkodi sommu, kashtam, raktham tho nirminchina samapadinchina, manam somberulu, somarulu, gudumba gochigaalu ayina gaani free ga abhaddaalu cheppi, toti telabanlani kerosene, petrol posi tagalettesi donga amaraveerula lekklu choopi dobbeyyadam bhale maja ga vuntundi. Hyderabad chritra mottham chooste andulo telabanla patra emi leadu. endukantae gochi, gudumba gaallaki andulo pravesam nishiddham. veellu bayata adukku tinadamae. adi devlop chesndi appudu Nizam with andhra rayala seema income tho, ippudu develop chesindi seemandhra prajalu tama raktham, srama, knowledgew, taxes tho. endukanate gochi, gudumba gaallu eppudu taxes kattadam vantivi eragaru kada pakkodi meeda padi edvadam, vaadi asthi dobbadam daanni tagabettadam tappa.

    ReplyDelete