ఏనాడో అమెరికాలో వాటర్ గేట్ కుంభ కోణం జరిగింది. దాన్ని అమెరికన్లు మర్చి పోయి కూడా వుంటారు. కానీ మన భారతీయ మీడియా మాత్రం మర్చి పోదు. తాజాగా మన దేశంలో జరిగిన బొగ్గు గనుల కుంభ కోణానికి 'కోల్ గేట్" అని పేరు పెట్టి నిత్యం మన మీడియా జపిస్తోంది. అలాగే సినిమా రంగానికి సంబంధించి కూడా అదే వరుస! సినిమా రంగానికి హాలీవుడ్ ప్రసిద్ది చెంది ఉండ వచ్చు.. అంత మాత్రాన మన హిందీ చలన చిత్ర రంగాన్ని "బాలీవుడ్" అని ఉటంకించక పొతే ఉనికి ఉండదా? పోనీ ఈ పైత్యం అక్కడితో ఆగిందా అంటే అదీ లేదు. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ అంటూ అన్ని భాషలకీ విస్తరించేసింది! ఇంతగా ఐడేన్టిటీ క్రిసిస్ లో కొట్టు మిట్టాడటం అవసరమా? పాశ్చాత్య నాగరికతలు కళ్ళు కూడా తెరవని దశలో, ఉజ్వలమైన ఆర్య నాగరికత పరిఢవిల్లిన దేశమేనా మనది?