Wednesday, September 28, 2011

పిట్ట కదల పిట్టల దొర!

తెలబాన్ దొర రెండు వారాల్లో తెలంగాణా అని ప్రకటించి రెండు నెలలు గడిచి పోయింది. మరి ఈ రెండు నెలల్లో తెలంగాణా ఎందుకు రాలేదో వివరించాల్సింది పోయి, ఈ రోజు మరో పిట్ట కధ  వినిపించారు.  అనంతపూర్, కర్నూల్ ల తో కలిపిన తెలంగాణా వస్తుందట! అదీ కేంద్రం అసదుద్దీన్ తో రాయబారం చేసిందట!  ఎవరిని ఏమార్చటానికి ఈ పిట్ట కధలు చెప్తాడో తెలీదు. తమది సమైక్య వాదమే అని కుండ బద్దలు కొట్టిన మజ్లిస్ నాయకునితో రాష్ట్ర విభజన కోసం కేంద్రం ఎలా రాయబారం పంపుతుందో బుర్రలో గుజ్జు ఉన్న వారెవరికీ అర్ధం కాదు.   తెలబాన్ నాయకునితో తాను రాష్ట్ర విభజన విషయం చర్చించనే లేదని అసదుద్దీన్ ఆ తరువాత ఖండించటం కొస మెరుపు.  కల్ల బొల్లి కబుర్లు చెప్పినట్లు ఋజువు అయ్యాక కూడా సిగ్గుతో తల దించుకోకుండా... తల తెగి పడ్డా సరే, తల లేని (హైదరాబాద్) తెలంగాణా ఒప్పుకోం అంటూ బీరాలు పలకటం కామెడీ గాక మరేమిటి??   ఇటువంటి పొలిటికల్ బఫూన్ ల సారధ్యంలో అలజడి చేస్తున్న అమాయక తెలంగాణా ప్రాంత ప్రజలని చూసి జాలి పడటం తప్ప మరేమీ చేయలేం.

Tuesday, September 27, 2011

లగడపాటి హైదరాబాద్ రాకూడదా?









ద్వాపర యుగంలో శిశుపాలునికైనా వంద తప్పుల వరకు సహించి శ్రీకృష్ణుడు దండన విధించాడు. కానీ ఈ కలి యుగంలో తెలబాన్ల దురంతాలకు లెక్క అన్నదే లేక పోతోంది.   సాక్షాత్తు దేశ రాజధానిలో విధుల్లో ఉన్న ఉద్యోగిని ఒళ్ళు మదంతో చితక బాదిన  తెలబాన్ మేనల్లుడి పై ఈ రోజు వరకు చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. అలాగే మన రాష్ట్ర రాజధానిలో విధుల్లో ఉన్న ఆంద్ర ప్రాంత రవాణా శాఖ అధికారి పై దాడి చేసిన తెలబాన్ల పై చర్యలు తీసుకొనే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. కనీసం దాడికి గురైన ఆ అధికారిని పరామర్శించటానికి కూడా వెళ్ళకూడదా? పరామర్శ కి వచ్చిన ఎంపీ లగడపాటి రాజ గోపాల్ ని  ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు. అందులో తప్పు లేదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత వారిదే కదా! మరి అదే ముందు జాగ్రత్త, కార్యాచరణ-- తెలబాన్లు దాడులు చేస్తున్నప్పుడు, ఆస్తులు ద్వంసం చేస్తున్నప్పుడు ఎందుకు వుండదు?? ముందుగా చెప్పి మరీ ధ్వంస రచన చేస్తున్న తెలబాన్లని కట్టడి చేయడంలో ఈ జాగ్రత్త ఎందుకు పాటించరు??? సరే, పోలీసుల విషయం వదిలేస్తే, లగడపాటి హైదరాబాద్ రావటమే పాపమన్నట్లుగా తెలబాన్ మూకలంతా రవాణా శాఖ కార్యాలయం దగ్గర చేరి రచ్చ చేయటం అత్యంత మూర్ఖత్వం. హైదరాబాద్ తమ స్వంత ఆస్తి అయినట్లుగా ఎవరు హైదరాబాద్ రావాలో, ఎవరు రాకూడదో నిర్దేశించ బూనటం ముదిరిన పైత్యానికి ప్రతీక.  తెలంగాణా విషయంలో సరైన లెక్క రాసిన శ్రీకృష్ణుని నివేదికకి ఆతీ గతీ లేదు.  కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి శ్రీకృష్ణుడు ఇచ్చిన అత్యుత్తమ పరిష్కారం అమలు దిశగా చర్యలు చేపట్టాలి.

Sunday, September 25, 2011

ఏమిటీ చావు గోల?

"తెలంగాణా వచ్చుడో - కే సి ఆర్ సచ్చుడో"  - తెలబాన్ నాయకుడు 

"తెలంగాణా ఇవ్వక పొతే ఇక్కడినుంచి దూకి చస్తా.."
 - ఒక అమాయక తెలబాన్ గొర్రె 



"తెలంగాణా రాకపోతే మొదట చచ్చేది నేనే"  - కే.కేశవరావు

"ఈ తెలంగాణా రాదు - వీళ్ళెవరూ చావరు. దిక్కు మాలిన ఉద్యమం....నా చావుకొచ్చింది.."
 - అమాయక తెలంగాణా పౌరుడు

Saturday, September 24, 2011

తెలబాన్ తొండ ముదురుతోంది!

ఒకటా రెండా.. పది రోజులుగా తెలంగాణా వాసులకి ఊపిరి సలపట్లేదు. సకల జనుల సమ్మె పేరుతొ తెలబాన్ నాయక గణం  ఆడిస్తున్న నాటకంలో సామాన్య పౌరుడు సమిధ అవుతున్నాడు. అవును. నిజం... కేవలం సామాన్య పౌరుడే ఇక్కట్ల పాలవుతున్నాడు తప్ప నాయక గణానికి వచ్చిన చిక్కేమీ లేదు.  రెండు రోజులు ఆటో నడపక పొతే కడుపు మండేది ఎవరికి? నెలాఖరులో జీతాలు అందక పొతే చిరుద్యోగుల పరిస్థితి ఏమిటి? సమ్మె వల్ల జరిగిన నష్టం పూడ్చటానికి ప్రభుత్వం చార్జీలు పెంచితే బలయ్యేది ఎవరు?  ప్రత్యెక రాష్ట్రం వస్తే సగటు బడుగు జీవికి ఒరిగేదేమిటి? ఏమీ లేదు...కానీ నాయక గణం, వారి బంధు వర్గాలకి మాత్రం పదవుల పండగే!   కేవలం నాయకుల పదవుల పందేరం కోసం అమాయక తెలంగాణా ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. హోర్డింగులెక్కుతున్నారు.  ఎంత కాలం సాగాలి ఈ నాటకం? పిల్లిని కూడా తలుపులు మూసి కొడితే తిరగ బడుతుంది.  తెలబాన్లు పన్నిన చక్ర బంధంలో ఇరుక్కుని సతమతమవుతున్న అమాయక తెలంగాణా పౌరుడు కూడా సత్యం గ్రహించి తెలబాన్ సైన్యాన్ని చితక బాదే రోజు దగ్గరలోనే వుంది.  ఇప్పటి వరకు ఆడిన నాటకం చాలక ఇంకా గుజ్జర్ల తరహా ఆందోళన అంటూ కొత్త అంకాలకి తెర లేపే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికీ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తూ కూచుంటే అరాచకత్వం పెచ్చరిల్లి సగటు పౌరుని జీవనం దుర్భరం అవుతుంది.  తెలబాన్ తొండ ముదిరి టెర్రరిష్టు ఊసర వెల్లి అవక ముందే ప్రభుత్వం మేలుకొని ఉద్యమం పై ఉక్కు పాదం బిగించాలి. 

Thursday, September 22, 2011

(తెలబాన్) పైత్యానికి పరాకాష్ట!


పై ఫోటో చూడండి. ఆలయాన్ని వదిలేసి   ఆడుతున్న అర్చకులని చూస్తె ఎవరికైనా ఏమనిపిస్తుంది? వెర్రి కుదిరింది రోకలి తలకి చుట్టమనే కదా! దేవుడికి కూడా ప్రాంతీయ భేదాలు అంట గడుతూ ఆర్జిత సేవలు నిలిపి వేశారంటే వేర్పాటు వాద పైత్యం ఎంత ప్రకోపించిందో అర్ధం చేసుకోవచ్చు.  నర నరానా వేర్పాటు వాద విద్వేషాన్ని నింపుకున్న తెలబాన్లు సమీప భవిష్యత్తులో, సీమలో ఉన్నాడని తిరుపతి వెంకన్నను, కోస్తాలో వుందని బెజవాడ దుర్గమ్మను కూడా బహిష్కరిస్తారేమో?  పాలకుల పట్ల ధిక్కారం చూపవచ్చు. తప్పు లేదు. కానీ దేవుని పట్ల ధిక్కారమా? సహించరాదు. తెలంగాణా ప్రాంతంలో ఉన్న అన్య మతస్తులెవరైనా ఇలా చేసారా?  ఆ మాత్రం ఇంగిత జ్ఞానం వారికి లోపించటం శోచనీయం.  ఇటువంటి విపరీత ధోరణులని కట్టడి చేయటంలో చేతకాని ప్రభుత్వమెలాగూ చేతులెత్తేసింది. ఇంక ఆ దేవుడే రక్షించాలి మన తెలుగు జాతిని, తెలుగు జాతి పరువు ప్రతిష్టల్నీ!!

Wednesday, September 21, 2011

తెలబాన్ల వ్యూహాత్మక తప్పిదం!

తెలబాన్ నాయకుడు మళ్ళీ ఆమరణ దీక్ష చేస్తాననగానే భూన బొంతారాలు దద్దరిల్లి పోతాయన్నంత హడావిడి చేసి ఆయన చేత దీక్ష పట్టే ఆలోచన విరమింప చేసి తెలబాన్ శ్రేణులు వ్యూహాత్మక తప్పిదమే చేసాయి.  మచ్చ లేని చంద్రుని లాంటి చంద్ర శేఖరుడు గతంలో దీక్ష చేసినప్పుడు సీమాన్ధ్రులు ఎన్నెన్ని అభాండాలు, ఆరోపణలు చేశారు!  దొంగ దీక్ష అన్నారు..టీపీఎస్ తో చేశాడన్నారు...ఉద్యమానికి అంత సీన్ లేదన్నారు...రోశయ్య ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చిందన్నారు..ఇలా ఒకటా రెండా...నోరూ వాయి లేక నీరసించిన నాయకుడిపై నిలువెల్లా ఆరోపణలు చేసి రాష్ట్రం రాకుండా అడ్డుకున్నారు. అటువంటప్పుడు వచ్చిన అవకాశం వినియోగించుకొని దీక్ష చేసి అందరి నోళ్ళు మూయిన్చాల్సింది పోయి ఇతర పక్షాల నాయకులు మిన్ను విరిగి మీద పడి పోతుందని హడావిడి చెయ్యగానే  తూచ్ అని మానేయటం తప్పిదమే.  మీడియా అప్రమత్తంగా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో దొంగ దీక్షకి అవకాశమే లేదు.  మీడియా కాపు కాసి, ఆయన చేత మంచి నీళ్ళుకూడా తాగించకుండా దీక్ష
 చేయించేది.  తద్వారా తెలంగాణా ప్రాంత పొట్టి శ్రీరాములుగా అవతరించే సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకున్నారు.  
 అయితే ఒకటి మాత్రం నిజం. ఈ దీక్షా ప్రతిపాదన-విరమణ నాటకంతో ఇతర పక్షాల నాయకుల్ని ఏమార్చి..సూటిగా చెప్పాలంటే వాజమ్మల్ని చేసి, ఉద్యమానికి తానే ఏకైక దిక్కు అన్న విషయాన్ని తెలబాన్ నాయకుడు చెప్పకనే చెప్పాడు.   ఇంక సమ్మె చేసిన ఉద్యోగులందరికీ వడ్డీతో సహా జీతాలు, అందరికీ  కార్పోరేట్  విద్య,  అందరికీ  ఉద్యోగాలు  అంటూ హిరణ్యాక్ష వరాలు ప్రసాదించేసిన నాయకుని ఆధ్వర్యంలో ఉద్యమించి,  ప్రత్యెక రాష్ట్రం సాధించి, సుఖ శాంతులతో మెలగడమే తెలంగాణా ప్రాంత ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.  

Monday, September 19, 2011

సమ్మె కోరల్నించి కోర్టులే కాపాడాలి!



హైదరాబాద్ : సకల జనుల సమ్మె పై  సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశాఖకు చెందిన నారాయణ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. సకల జనుల సమ్మె చట్టవిరుద్ధమని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. సమ్మెతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని నారాయణ పిటిషన్ లో తెలియచేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్ధానం టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, టీఎన్జీవో అధ్యక్షుడు స్వామిగౌడ్, తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ లతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
=======================================================
కనీసం ఒక వారం తర్వాత అయినా విజ్ఞత గల పౌరుడొకడు కోర్టు తలుపు తట్టాడు. వారం రోజుల నుంచి తెలంగాణా ప్రాంత ప్రజలు సకల జనుల సమ్మె పేరుతొ ఇబ్బందుల పాలు అవుతున్నారు. సింగరేణి బొగ్గు సరఫరా లేక తగ్గిన విద్యుత్ ఉత్పత్తి కారణంగా తక్కిన రాష్ట్ర ప్రజలు కూడా విద్యుత్ కోతని అనుభవిస్తున్నారు.  యావత్ రాష్ట్ర పజానీకాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్న తెలబాన్ ఉద్యమ సారధుల చిత్త శుధ్ధి ఎంత? తెలబాన్ నాయకుడు తన ఎంపీ పదవిని వదలడు కానీ తక్కిన అందరినీ రాజీనామాలు చేయాలని హుకుం లు జారీ చేస్తుంటాడు. అలా చేయని వారిని తెలంగాణా ద్రోహులుగా ముద్ర వేసి ఆ ప్రాంతంలో తిరిగే హక్కుని కాల రాస్తాడు. రెండు వారాల్లో తెలంగాణా వస్తుందని పిట్ట కధలు చెప్పి రెండు నెలలు అయినా ఆ ఊసే ఎత్తడు కానీ నాలుకలు కోస్తా లాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు మాత్రం క్రమం తప్పకుండా చేస్తాడు. ఇంక తెలబాన్ జేఎసి నాయకుడు మరీ ఘోరం. తన ప్రొఫెసర్ పదవిని, జీత భత్యాల్నీ లేశ మాత్రం వదలడు కానీ విద్యార్ధుల చదువులు నాశనం చేస్తూ వారి భవిష్యత్తుతో ఆటలాడుతున్నాడు. స్వామి గౌడ్ సరే సరి! ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగిగా చేరి, ఉద్యోగ సంఘాల నాయకుడినన్న అహంకారంతో తనకు మాలిన ధర్మంగా వేర్పాటు ఉద్యమాన్ని తలకెత్తుకున్నాడు.   రాష్ట్ర ప్రభుత్వమేమో అధికారం నిలుపుకోవటమే ధ్యేయంగా తెలబాన్ శాసన సభ్యులని,మంత్రుల్ని,చివరికి ఉద్యోగుల్ని కూడా  కట్టడి చేయలేక చేతులెత్తేసింది.  వీరందరికీ నోటీసులిచ్చి వారం సమయం ఇవ్వటం కూడా అనవసరం. సకల జనుల సమ్మె వల్ల సాధించేది ఏమీ లేదని స్వయంగా అధికార పార్టీ కి చెందిన తెలంగాణా ప్రాంత ఎంపీ రేణుకా చౌదరి కుండ బద్దలు కొట్టేసారు.  స్వంత ప్రయోజనాల్ని కొంత కూడా పక్కన పెట్టకుండా తెలబాన్ నాయక గణం ఆడిస్తున్న సమ్మె డ్రామాలో వెర్రి గొర్రెలు అవుతున్నది సామాన్య ప్రజలే!  ప్రజలకి ఇప్పుడు కావలసింది పెరిగిన ధరల నుండి విముక్తే గానీ ప్రత్యెక రాష్ట్రం వస్తే వారి సమస్యలు తీరవు. గోరు చుట్టు పై రోకటి పోటులా ఈ సమ్మెలు వారి బ్రతుకుల్ని మరింత దుర్భరం చేస్తున్నాయి.   కనుక కోర్టులు కూడా సామాన్య ప్రజల ఇబ్బందులని దృష్టిలో వుంచుకొని ఇటువంటి సమ్మె డ్రామాలని సత్వరం నిషేధించాలి. ప్రభుత్వం కూడా అధికార లాలస వీడి, తెగువతో వ్యవహరించి పని దొంగల భరతం పట్టాలి. 

Tuesday, September 13, 2011

సీమాంధ్రుల సంస్కారం...తెలబాన్ల అహంకారం....

"తెలంగాణా వచ్చే అవకాశం లేదు..రాయల సీమ అభివృద్ధికై కృషి మొదలు పెడదాం"...టీజీ వెంకటేష్  


"హైదరాబాదులో ప్రశాంతంగా నివసించే సీమాంధ్రుల పై దాడులు చేస్తే ఊరుకోం".. రాయపాటి సాంబశివ రావు
 

"మంత్రి టీజీ వెంకటేశ్.. ఆయనొక మంత్రా? ఎన్ని గుండెలు ? ఎందుకు మాట్లాడాలి? మళ్లీ పిచ్చి కూతలు కూస్తే నాలుక కోస్తా బిడ్డా!.. ‘కావూరి సాంబశివరావు కాకిలా ఒర్రుతడు. రాయపాటో కావూరో ఏదో ఒకపాటి.. వాళ్లు.. , వాడు.. ఆ సన్నాసి.. ఆరుగురి చావుకి కారణమైనవాడు మన విద్యార్థుల మీద మాట్లాడతడా?’"..కేసీఆర్


తాజాగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నాయకులు ఇచ్చిన ప్రకటనలు ఇవి. మరి తెలబాన్ నాయకుడు ఇప్పటికి ఎన్ని సార్లు తల నరుక్కున్నాడో, ఎన్ని సార్లు ప్రాణ త్యాగం చేసాడో లేదా ఎంత మంది నాలుకలు తెగ్గోసాడో లెక్క తెలీదు కానీ ఇలా రెచ్చగొట్టే ప్రకటనలు చేసేసి అజ్ఞాతంలోకి వెళ్లి పోవటం మటుకు చాలా సార్లు చూసాం. ఇప్పుడు ఇంక సకల జనుల సమ్మె పేరిట కొత్త నాటకానికి తెర లేపాడు. మరి నాటకం చివరి అంకం వరకు రంగంలో ఉంటాడో లేదా మధ్యలోనే మాయమై పోతాడో తెర పై చూద్దాం!