Monday, September 19, 2011

సమ్మె కోరల్నించి కోర్టులే కాపాడాలి!



హైదరాబాద్ : సకల జనుల సమ్మె పై  సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశాఖకు చెందిన నారాయణ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. సకల జనుల సమ్మె చట్టవిరుద్ధమని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. సమ్మెతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని నారాయణ పిటిషన్ లో తెలియచేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్ధానం టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, టీఎన్జీవో అధ్యక్షుడు స్వామిగౌడ్, తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ లతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
=======================================================
కనీసం ఒక వారం తర్వాత అయినా విజ్ఞత గల పౌరుడొకడు కోర్టు తలుపు తట్టాడు. వారం రోజుల నుంచి తెలంగాణా ప్రాంత ప్రజలు సకల జనుల సమ్మె పేరుతొ ఇబ్బందుల పాలు అవుతున్నారు. సింగరేణి బొగ్గు సరఫరా లేక తగ్గిన విద్యుత్ ఉత్పత్తి కారణంగా తక్కిన రాష్ట్ర ప్రజలు కూడా విద్యుత్ కోతని అనుభవిస్తున్నారు.  యావత్ రాష్ట్ర పజానీకాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్న తెలబాన్ ఉద్యమ సారధుల చిత్త శుధ్ధి ఎంత? తెలబాన్ నాయకుడు తన ఎంపీ పదవిని వదలడు కానీ తక్కిన అందరినీ రాజీనామాలు చేయాలని హుకుం లు జారీ చేస్తుంటాడు. అలా చేయని వారిని తెలంగాణా ద్రోహులుగా ముద్ర వేసి ఆ ప్రాంతంలో తిరిగే హక్కుని కాల రాస్తాడు. రెండు వారాల్లో తెలంగాణా వస్తుందని పిట్ట కధలు చెప్పి రెండు నెలలు అయినా ఆ ఊసే ఎత్తడు కానీ నాలుకలు కోస్తా లాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు మాత్రం క్రమం తప్పకుండా చేస్తాడు. ఇంక తెలబాన్ జేఎసి నాయకుడు మరీ ఘోరం. తన ప్రొఫెసర్ పదవిని, జీత భత్యాల్నీ లేశ మాత్రం వదలడు కానీ విద్యార్ధుల చదువులు నాశనం చేస్తూ వారి భవిష్యత్తుతో ఆటలాడుతున్నాడు. స్వామి గౌడ్ సరే సరి! ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగిగా చేరి, ఉద్యోగ సంఘాల నాయకుడినన్న అహంకారంతో తనకు మాలిన ధర్మంగా వేర్పాటు ఉద్యమాన్ని తలకెత్తుకున్నాడు.   రాష్ట్ర ప్రభుత్వమేమో అధికారం నిలుపుకోవటమే ధ్యేయంగా తెలబాన్ శాసన సభ్యులని,మంత్రుల్ని,చివరికి ఉద్యోగుల్ని కూడా  కట్టడి చేయలేక చేతులెత్తేసింది.  వీరందరికీ నోటీసులిచ్చి వారం సమయం ఇవ్వటం కూడా అనవసరం. సకల జనుల సమ్మె వల్ల సాధించేది ఏమీ లేదని స్వయంగా అధికార పార్టీ కి చెందిన తెలంగాణా ప్రాంత ఎంపీ రేణుకా చౌదరి కుండ బద్దలు కొట్టేసారు.  స్వంత ప్రయోజనాల్ని కొంత కూడా పక్కన పెట్టకుండా తెలబాన్ నాయక గణం ఆడిస్తున్న సమ్మె డ్రామాలో వెర్రి గొర్రెలు అవుతున్నది సామాన్య ప్రజలే!  ప్రజలకి ఇప్పుడు కావలసింది పెరిగిన ధరల నుండి విముక్తే గానీ ప్రత్యెక రాష్ట్రం వస్తే వారి సమస్యలు తీరవు. గోరు చుట్టు పై రోకటి పోటులా ఈ సమ్మెలు వారి బ్రతుకుల్ని మరింత దుర్భరం చేస్తున్నాయి.   కనుక కోర్టులు కూడా సామాన్య ప్రజల ఇబ్బందులని దృష్టిలో వుంచుకొని ఇటువంటి సమ్మె డ్రామాలని సత్వరం నిషేధించాలి. ప్రభుత్వం కూడా అధికార లాలస వీడి, తెగువతో వ్యవహరించి పని దొంగల భరతం పట్టాలి. 

10 comments:

  1. we are ready to suffer . comparing how much we are loosing with Andhra this is nothing...
    thank you for worrying regading us but please please don't worry about no more... we will take care

    JAi Telangana Jai Jai Telangana

    ReplyDelete
  2. @ Anonymous above..
    నేను వెర్రి గొర్రెలు అన్న పదం వాడింది నీలాంటి వాళ్ళ గురించే....

    ReplyDelete
  3. >>వారం రోజుల నుంచి తెలంగాణా ప్రాంత ప్రజలు సకల జనుల సమ్మె పేరుతొ ఇబ్బందుల పాలు అవుతున్నారు. <<

    your creativity adurs

    ReplyDelete
  4. Already Telangana leaders have succeeded recently in getting two or three amendments for the injustice done to telangana employees through agitations. Why dont they try in the same way to remove the anomalies still existing by conducting agitations instead of fighting for separate telangana, which affects the rights of people from other regions and also the overall goodwill of telugu speaking people.

    ReplyDelete
  5. సమ్మెతో ఇబ్బందులకు గురి అవుతున్నామని మా మీద ఎవరూ నక్కజిత్తుల సానుభూతి చూపించక్కర్లేదు

    ReplyDelete
  6. You computer so you are writing any post.. but you don't know any thing.... please close your blog that will help all seemandhra people

    ReplyDelete
  7. సమ్మెవల్ల కొన్ని గాడిదలు తాము ఇబ్బంది పడానికే డిసైడైపోతే మనంచేసేదేమి లేదు, వాటికి అది అలవాటైన విషయమేకాని, సామాన్య ప్రజలు, దేశం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి అనేది బాధాకరమైన పాయింట్. :P

    ReplyDelete
  8. మూర్ఖుల విషయాలు పట్టించుకోవద్దు...మూర్ఖుల జోలికి వెళ్ళద్దు... అని మీకు ఎవరూ చెప్పలేదా ? Aakasa Ramanna గారూ ?

    ReplyDelete
  9. విశాఖ సమ్మె వ్యతిరేక వీరుడు నారాయణ గాడికి ఇవే తెగులు ప్రజల జోహార్లు, తెగులు నల్లి ముద్దు బిడ్డ నారాయణ గాడికి అంధదేశ ప్రజల మూర్ఖాభివందనాలు.

    భారత సంవిధానంలో సమ్మె హక్కు ఉందా లేదా అనే విషయం తెలుసుకోకుండా పిచ్చి వాదనలకు దిగిన ఓ మేతావీ, ఇదే స్పూర్తితో ముందుకు సాగిపో. అన్ని సమ్మెలనుండి దేశాన్ని కాపాడు. నీ వెంట గొర్రెల లాగ వంట పాడడానికి రామన్న లాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు.

    ReplyDelete
  10. వెర్రి పుష్పం(xxxx) అంటే yes Sir అనే వాళ్ళే తెలంగాణ వాదులు. వాళ్ళ తాతలు ఈ భూమిని కొన్నట్లు మాది మాకివ్వండి అని అడుగుతున్నారు.

    ReplyDelete