Sunday, October 31, 2010

తెలుగు వాడు కన్నెర్ర జేస్తే?

ఏ వివాదాల జోలికి పొకుండా తన పని తాను చేసుకు పొయే తెలుగు వాడు కన్నెర్ర జేస్తే ఏం జరుగుతుందో తాజాగా జరిగిన తెలుగు లలిత కళా తోరణం వుదంతం నిరూపించింది. అలాగే ఈ మధ్య కొన్ని వేర్పాటు వాద శక్తులు పిచ్చి ప్రేలాపనలు చేస్తూ మంచి తనాన్ని చేతకాని తనంగా భావించి చిందులేస్తున్నాయి. లేక పొతే "జాక్" అనబడే పిపీలకం రాష్త్రావతరణ దినోత్సవాల్లొ పాల్గొనగూడదని మంత్రులని బ్లాక్ మెయిల్ చేయటమేమిటి?  బాబ్లీ గొడవ విషయమై గుంపుగా వెళ్ళిన ప్రజా పతినిధులనే తన్ని తగలేసింది మహా రాష్ట్ర ప్రభుత్వం! అటువంటిది,  బంతి వెరే కోర్టులొ వున్నప్పుడు కోర్టు తీర్పు వచ్చే వరకు యధా తధ స్థితి కొనసాగాలన్న ఇంగితం లేకుండా తైతక్కలాడుతున్న ఈ జాక్ లని, ఇతర కొతి కొమ్మచ్చి గ్రూపుల్ని అణచడం ప్రభుత్వానికి పెద్ద పని కాదు.  అయినా సంయమనం వహిస్తున్న ప్రభుత్వ మంచి తనాన్ని అలుసుగా తీసుకొని రాష్ట్రావతరణ పండుగనే బహిష్కరించ బూనడం నిస్సందేహంగా జాతి ద్రొహమే! ప్రస్తుతానికి రాష్ట్ర విభజన అన్నది అప్పుడే తేలే విషయం కాదు. శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టు ఇవ్వాలి--దాన్ని అన్ని వర్గాలు విశ్లేషించి ఆమోదించాలి--ఆ పై కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి. అంత వరకూ యధా తధ స్థితి కొన సాగాలి. అందుకు అడ్డు వచ్చిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వం వెనుకాడకూడదు.  అందరికీ సమైక్య ఆంధ్ర ప్రదెశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు !  

Friday, October 29, 2010

అమర జీవి పట్ల అపరాధం..సహించకూడదు..

మనకి నచ్చని రాజకీయ నాయకుల దిష్టి బొమ్మల్ని తగలేయటం అన్నది నిరసన తెలపడంలొ అందరూ ఆమోదించే పధ్ధతి. అయితె ఇది బ్రతికి వుండి స్వార్ధ,సంకుచిత రాజకీయాలు నడిపే వారికే పరిమితం కావాలి. కానీ తెలుగు వారికి స్వంత రాష్ట్ర సాధనకై నిస్వార్ధంగా ప్రాణ త్యాగం చేసిన అమర జీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఈ రొజు దుండగులు తగల పెట్టటానికి ప్రయత్నించటం వికృత రూపం తాల్చిన తెలబాన్ ఆగడాలకి నిలువెత్తు నిదర్శనం.    స్వంత రాష్ట్రం రాకుండానే విగ్రహాలపై ఇంతలా తెగ బడ్డ వారు రేపు ఖర్మ కాలి తెలంగాణ వస్తే ఇతర ప్రాంతాల వారిని బ్రతకనిస్తారా?  తండ్రిని మించిన తనయుడిలా రెచ్చగొట్టే ప్రకటనలు చేసి ఈ అమానుషం జరగడానికి కారకుడైన కె.టీ.ఆర్. ని తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. 

రాజీవ్ భజన ఇక చాలు!

తిక్క (వరపు) సుబ్బ రామి రెడ్డి పది కోట్లిచ్చినంత మాత్రాన ప్రజలకు ఆమోదమవుతుందో లేదొ అన్న కనీస ఆలోచన కూడా లేకుండా సర్కారు తెలుగు లలిత కళా తొరణం పేరుని రాజీవ్ లలిత కళా తొరణంగా మారుస్తూ ఏకంగా జీ.ఓ. ఇచ్చెయటం దారుణం. ఇప్పటికే మన రాష్ట్రంలో వున్న ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయానికి మన తెలుగు ప్రధాని పీ.వీ. పేరు కాకుండా రాజీవ్ కి అంకితమిచ్చేశాం.  మన తెలుగు ప్రధానికి మాత్రం ఆ విమానాశ్రయానికి దారి తీసే ఒక రొడ్డుకి ఆయన  పేరు పెట్టెసి చేతులు దులుపుకున్నాం. చెన్నై, ముంబై, అహ్మదాబాద్, కోల్ కతా ఇంకా మరే విమానాశ్రయాన్ని వుదాహరణగ తీసుకున్నా ఆయా రాష్ట్రాలకు చెందిన స్థానిక నాయకులవొ లేదా చారిత్రక పురుషుల పేర్లు వాటికి పెట్టారు. మరి మనకెందుకీ భావ దారిద్ర్యం?  సరే, జరిగిన పొరపాటుకి ఏమీ చేయలెం.  కానీ ఇంకా కక్కుర్తిగా అల్రెడీ నామకరణం జరిగి పొయిన వాటికి కూడా ఇందిర/రాజీవ్ పేర్లు జత పరచాలని చూడటం ఖచ్చితంగా మన చేత కాని తనాన్ని అవహెళన చేయటమే అవుతుంది.  తెలుగు లలిత కళా తొరణాన్ని రిపేరు చేయించ దలుచుకుంటే ప్రభుత్వం వద్ద పది కోట్ల రూపాయలు లేకుండా పోయాయా?  ఏ స్వార్ధం, పరమార్ధం లేకుండానే తిక్క(వరపు) సుబ్బ రామి రెడ్డి వంటి వ్యాపారి పది కోట్లు ఇచ్చేస్తాడా? ప్రభుత్వం ఇప్పటికైన మేలుకొని ఏదో కన్నీటి తుడుపుగా తీసేసిన తెలుగు అన్న పదం జత చేయటం గాకుండా "తెలుగు లలిత కళా తొరణం" పేరుని యధా తధంగా వుంచాలి.  సీ.పీ.ఐ. నాయకుడు నారాయణ చెప్పినట్లు రోశయ్య ప్రభుత్వానికి అంత కోరికగా వుంటే రాష్ట్రం లోని సులాభ్ కాంప్లెక్సులు అన్నిటికీ ఇందిర/రాజీవ్ ల పేర్లు పెట్టుకుంటే ఎవరికీ ఏ అభ్యంతరం వుండ బోదు.

Thursday, October 28, 2010

సమైక్యాంధ్ర ప్రదేశ్ అవతరణ దినం సగర్వంగా జరుపుకుందాం..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్ని బహిష్కరించాలని తెలబాన్లు పిలుపునివ్వటం వారి మూర్ఖత్వానికి పరాకాష్ట. డిప్యూటీ స్పీకరుగా, కేంద్ర మంత్రిగా ఇంకా అనేక రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉంటూ ఇన్నేళ్ళుగా రాష్ట్రావతరణ దినోత్సవాల్లో అధికారికంగా పాల్గొన్న తెలబాన్ నాయకుడికి తాను ఇరవై మూడు జిల్లాలతో కూడిన ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ఇన్నాళ్ళు తెలియలేదా? వునికిని కాపాడుకొవటం కొసం గత సంవత్సరమే గుర్తు వచ్చిందా? అలాగే ఇన్నాళ్ళూ లెనిది ఒక్కసారిగా వారికి కొమరం భీం ఎందుకు గుర్తుకి వచ్చాడో? స్వర్గీయ ఎన్.టీ.ఆర్. టాంకు బండు పైన విగ్రహాలు పెట్టించినపుడు వారి నాయకుడు అధికార పార్టీలొనే వున్నాడు కదా? ఆనాడే అడిగి వుంటే ఎన్.టీ.ఆర్. కాదనే వారా?  ఇంత కాలం మిన్నకుండి ఇప్పుడు కొమరం భీం విగ్రహం పెట్టక పొతే మిగిలిన విగ్రహాల్ని పెల్చెస్తామనటం వెర్రి తనం. 1956 లో భాషా ప్రయుక్త రాష్ట్రాల  ఏర్పాటులో మొట్ట మొదటిగా  తెలుగు వారందిరినీ ఒక్కటిగా చేస్తూ ఏర్పాటైనది మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం.  అన్ని రంగాల్లొ అద్వితీయంగా వెలుగుతున్న మన తెలుగు వారిని మరోలా దెబ్బ కొట్టటం చేత గాక ఏనాడొ బ్రిటిషు వారు వుపయోగించిన విభజించు-పాలించు మంత్రాన్ని సాంబారు కెంద్ర మంత్రి ప్రయోగిస్తే మన వేలితో  మన కన్నే పొడుచుకున్నట్లు పరస్పరం కీచులాడుకొని ఇప్పటికే చాల చులకన ఐపొయాం.  ఇకనైనా కళ్ళు తెరిచి, వేర్పాటు వాద కాశ్మీరు వుగ్రవాదులకన్నా దారుణమైన పిచ్చి ప్రేలాపనలు చేస్తున్న తెలబాన్ల మాటల్ని పట్టించుకొకుండా....మన సమైక్య రాష్ట్ర అవతరణ దినం మనం సగర్వంగా జరుపుకుందాం.