Friday, October 29, 2010

రాజీవ్ భజన ఇక చాలు!

తిక్క (వరపు) సుబ్బ రామి రెడ్డి పది కోట్లిచ్చినంత మాత్రాన ప్రజలకు ఆమోదమవుతుందో లేదొ అన్న కనీస ఆలోచన కూడా లేకుండా సర్కారు తెలుగు లలిత కళా తొరణం పేరుని రాజీవ్ లలిత కళా తొరణంగా మారుస్తూ ఏకంగా జీ.ఓ. ఇచ్చెయటం దారుణం. ఇప్పటికే మన రాష్ట్రంలో వున్న ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయానికి మన తెలుగు ప్రధాని పీ.వీ. పేరు కాకుండా రాజీవ్ కి అంకితమిచ్చేశాం.  మన తెలుగు ప్రధానికి మాత్రం ఆ విమానాశ్రయానికి దారి తీసే ఒక రొడ్డుకి ఆయన  పేరు పెట్టెసి చేతులు దులుపుకున్నాం. చెన్నై, ముంబై, అహ్మదాబాద్, కోల్ కతా ఇంకా మరే విమానాశ్రయాన్ని వుదాహరణగ తీసుకున్నా ఆయా రాష్ట్రాలకు చెందిన స్థానిక నాయకులవొ లేదా చారిత్రక పురుషుల పేర్లు వాటికి పెట్టారు. మరి మనకెందుకీ భావ దారిద్ర్యం?  సరే, జరిగిన పొరపాటుకి ఏమీ చేయలెం.  కానీ ఇంకా కక్కుర్తిగా అల్రెడీ నామకరణం జరిగి పొయిన వాటికి కూడా ఇందిర/రాజీవ్ పేర్లు జత పరచాలని చూడటం ఖచ్చితంగా మన చేత కాని తనాన్ని అవహెళన చేయటమే అవుతుంది.  తెలుగు లలిత కళా తొరణాన్ని రిపేరు చేయించ దలుచుకుంటే ప్రభుత్వం వద్ద పది కోట్ల రూపాయలు లేకుండా పోయాయా?  ఏ స్వార్ధం, పరమార్ధం లేకుండానే తిక్క(వరపు) సుబ్బ రామి రెడ్డి వంటి వ్యాపారి పది కోట్లు ఇచ్చేస్తాడా? ప్రభుత్వం ఇప్పటికైన మేలుకొని ఏదో కన్నీటి తుడుపుగా తీసేసిన తెలుగు అన్న పదం జత చేయటం గాకుండా "తెలుగు లలిత కళా తొరణం" పేరుని యధా తధంగా వుంచాలి.  సీ.పీ.ఐ. నాయకుడు నారాయణ చెప్పినట్లు రోశయ్య ప్రభుత్వానికి అంత కోరికగా వుంటే రాష్ట్రం లోని సులాభ్ కాంప్లెక్సులు అన్నిటికీ ఇందిర/రాజీవ్ ల పేర్లు పెట్టుకుంటే ఎవరికీ ఏ అభ్యంతరం వుండ బోదు.

3 comments:

  1. మనం బాధపడకూడదు అండీ
    33 MPసీట్లు పెట్టుకుని కీలక మంత్రి పదవులు దక్కక పోయినా అధిస్తానం మీద గోల చెయ్యకుండా అమ్మవారి భజనలు చేస్కుంటున్న వారు బాధ పడాలి

    ReplyDelete
  2. ఎదవ ఏడుపులాపండెహె

    ReplyDelete
  3. raajakeeyam rachha kekkindi samanyula bathuku sanka naakindi janam bathukullo velugu nimpaleni e luchha nayakulu perlu maatram maarustharanta thhuuu...veella bathukulu cheda......

    ReplyDelete