Sunday, September 29, 2013

సుష్మా స్వరాజ్ శుష్క ప్రసంగం !

మహబూబ్ నగరులో జరిగిన ప్రజా గర్జన సభలో మాట్లాడుతూ  ఒక్క చుక్క రక్తం చిందకుండా మూడు రాష్ట్రాలు ఇచ్చేసామని గొప్పలు చెప్పుకున్నారు సుష్మా స్వరాజ్.   అయితే  తాము ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాల నేపధ్యానికీ,  ప్రస్తుత ఆంద్ర ప్రదేశ్ విభజన నేపధ్యానికి వున్న తేడా ఆవిడకి తెలియకపోవటం ఆశ్చర్యం.   

1) 2000 సంవత్సరంలో ఎన్డీఏ మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయటానికి ముందు  ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాటి శాసన సభల్లో విభజన కోసం ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపటం జరిగింది.  అంతే కానీ రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో నిమిత్తం లేకుండా దొడ్డి దోవన కేంద్రం స్వంతంగా వాటిని ఏర్పాటు చేయడమనే  దుష్ట సాంప్రదాయం అమలు జరగలేదు. 

2) మూడు రాష్ట్రాల విషయంలో కూడా విభజన జరిగిన రెండు ప్రాంతాల పరస్పర అంగీకారంతోనే విభజన ప్రక్రియ జరిగింది తప్ప ఏదో ఒక ప్రాంత ప్రయోజనాలకి కొమ్ము కాస్తూ రాష్ట్రాలని ఏర్పాటు చెయ్యలేదు. 

3) విభజన వల్ల ఏర్పడ్డ మూడు కొత్త రాష్ట్రాలే కొత్త రాజదానులని ఏర్పాటు చేసుకున్నాయి తప్ప  సంపూర్ణంగా అభివృద్ది చెందిన రాజధాని ని కాజేస్తూ తల్లి రాష్ట్రాన్నేతన్ని తగలేసే విధంగా   ఏ ఒక్క రాష్ట్రమూ ఏర్పాటు చేయబడలేదు.  

విభజనల నేపధ్యంలో ఇన్ని వైరుధ్యాలు వున్నా కూడా  చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయటంలో వారికే పేటెంటు హక్కు వున్నట్లు మాట్లాడుతున్న సుష్మా స్వరాజ్ గారు వారు ఏర్పాటు చేసిన రాష్ట్రాల వైభోగం ఎలా వుందో ఒక్కసారి  పునః పరిశీలించుకుంటే బాగుంటుంది.   వరదల సమయంలో ఉత్తరాఖండ్ చేతులెత్తేసింది. పూర్తిగా బయటనుంచి వచ్చిన సాయంతోనే వరద బాధితులకి సహాయం అందింది. చత్తీస్ ఘడ్ లో సల్వాజుడుం, కాంగ్రెస్ నాయకులని నక్సలైట్లు ఊచకోత కోసినా అడిగే దిక్కు లేదు.. ఇంక జార్ఖండ్ సంగతి చెప్పక్కరలేదు. 13 సంవత్సరాల కాలంలో 5 మంది ముఖ్య మంత్రులు 9 సార్లు గద్దెనెక్కడమే గాక మధ్యలో 3 సార్లు రాష్ట్రపతి పాలనకు గురి అయ్యింది. నిజానికి  భారత దేశంలో ఇప్పుడు చిన్న రాష్ట్రాలు అన్నది failed concept.  ఇక భారత దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు  అన్నది రాజకీయ నాయకులకి పునరావాస కేంద్రాలుగా తప్పితే ప్రజలకి ఎంత మాత్రం ఉపయోగం లేనే లేదు. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సీమాంధ్ర ఉద్యమ ఉధృతికి కాంగ్రెస్ తోక ముడిచినట్లే  బీజేపీ కూడా పంధా మార్చుకోక తప్పదు.  మార్చుకోని పక్షంలో సుష్మా స్వరాజ్  డిసెంబరు నెలలో గర్జనలు, భేరీలు, నగారాల తో  ఉద్యమానికి సిద్ధం కావచ్చు. 

సమైక్య ఉద్యమం లో అధిష్టానం కోవర్టులు ఎవరు ?


తెలంగాణా ఇస్తే అభ్యంతరం లేదు అంటూ కేంద్రానికి బ్లాంక్ చెక్ ఇచ్చింది చంద్ర బాబే! రాష్ట్ర విభజనకి పూర్తి బాధ్యత తెలుగు దేశం పార్టీ దే ! ఇప్పుడు చంద్ర బాబు ఎన్ని యాత్రలు, పర్యటనలు చేసినా సీమాంధ్రులు నమ్మరు
  --  కాంగ్రెస్,  వైఎస్ఆర్ కాంగ్రెస్     

అధిష్టానం ఏం నిర్ణయించినా సరే అని ముందు చెప్పి ఇప్పుడు విభజన ప్రతిపాదన జరిగిన  ఇన్ని రోజుల తరువాత సమస్యలు ఏకరువు పెట్టటంలో అర్ధం ఏమిటి ?  ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం ఆడిస్తున్న గేమ్ ప్లాన్ లో భాగమే.. కేంద్రం ఆడమన్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి ఆడుతున్నారు..
 -- వై ఎస్ ఆర్ కాంగ్రెస్,  టీడీపీ   

సమైఖ్యాంధ్ర ముసుగులో జగన్ కేంద్ర కాంగ్రెస్ కి రాష్ట్ర విభజనకి సహకరిస్తున్నారు.  అందుకే సీమాంధ్ర శాసన సభ్యుల సంఖ్యని తగ్గించే ఆలోచనతో తమ పార్టీ శాసన సభ్యుల రాజీనామాలు ఆమోదింప జేసుకొనే ప్రయత్నం చేసారు.
  -- టీడీపీ,  సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు  

 గత అరవై రోజులుగా సీమాంధ్ర ప్రాంతం మొత్తం ఏక ధాటిగా సమైక్యం కోసం మహోగ్రంగా వుద్యమిస్తుంటే -   ప్రజల ఆశలు, ఆకాంక్షలకి అనుగుణంగా వారికి మార్గ దర్శనం చేయ వలసిన ప్రధాన రాజకీయ పక్షాలు వ్యవహరిస్తున్న తీరు ఇది!

గత రెండు నెలలుగా జీతాలు లేకుండా ఉద్యోగులు/కార్మికులు, విద్యాలయాలు నడవకుండా విద్యార్ధులు, ఇంకా పాలనా పరమైన సౌకర్యాలు అందక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ కూడా - కేవలం రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న స్ఫూర్తితో వుద్యమిస్తుంటే - ప్రధాన పార్టీలకి చెందిన నాయకులు మాత్రం పదవులని అంటి పెట్టుకొని రాజీడ్రామాలు ఆడుతున్నారు. (హరికృష్ణ మినహాయింపు).  ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో కేంద్రం సాంప్రదాయ పద్ధతులకి తిలోదకాలు ఇచ్చి దొడ్డి దారిలో ఐనా రాష్ట్రాన్ని విభజించి పారేయాలని కుట్రలు పన్నుతున్న దశలో ఈ రాజకీయ పార్టీలు/నాయకులలో ప్రజల పక్షాన నిజాయితీగా ఎవరు నిలబడతారు అన్నది ప్రశ్నార్ధకమే !   రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండానే జరుగుతున్న ఉద్యమం దెబ్బకి కేంద్రం తోక ముడిచింది అన్నది స్పష్టం.  ఇటువంటి కీలక సమయంలో ఏ పార్టీకి చెందిన నాయకుడైనా రాజీనామా ఆమోదింప జేసుకొని ముందుకి వస్తే వారిని ఉద్యమం లో భాగస్వాములని చెయ్యాలే తప్ప సారధ్యం అప్పగించరాదు. ఒకసారి ఉద్యమ సారధ్యం రాజకీయుల చేతిలోకి వెళ్లిందంటే అంతే సంగతులు.. ఖచ్చితంగా శల్య సారధ్యం వహించి  పుట్టి ముంచేయటం  ఖాయం.  ఈ విషయం దృష్టిలో వుంచుకొని ఉద్యోగులు, ప్రజలు కూడా రాజకీయుల ప్రమేయం లేకుండా స్వంత మార్గంలోనే ముందుకు సాగితే సమైక్య రాష్ట్ర సాధన తధ్యం... విజయోస్తు ! 

Saturday, September 28, 2013

అపశ్రుతులు పలుకుతున్న వీణ !

నేటికి అరవై రోజులుగా సీమాంధ్ర లో సమైక్య రాష్ట్రం కోసం మహోగ్రంగా ఉద్యమం జరుగుతోంది. ఏ రాజకీయ నాయకుల-జాక్ ల తోడ్పాటు లేకుండా ప్రజలే స్వచ్చందంగా తమ రాష్ట్ర సమైక్యం కోసం సాగిస్తున్న ఉద్యమం న భూతో అని చెప్పాలి.  రోజూ కొన్ని లక్షల మంది వీధుల్లోకి వచ్చి వుద్యమించినా హింసాత్మక ఘటనలకు, రెచ్చ గొట్టే ప్రకటనలకు తావు లేకుండా తమకు తోచిన పద్ధతుల్లో శాంతియుతంగా నిరసన సాగిస్తున్న సీమాంధ్రుల గుండె మంట ఓ కామెడీగా కనిపిస్తోంది కోటి రత్నాల వీణకి!    

http://kotiratanalu.blogspot.in/2013/09/blog-post_27.html

అంతేలే మరి! ఉద్యమం అంటే వారి దృష్టిలో క్రింది విధంగా  వుండాలి...ఇతర పద్ధతులన్నీ వారికి కామెడీ గా కనపడటంలో ఆశ్చర్యం ఏముంది?

 

 
 


 


స్టార్ బ్యాట్ మన్ చెలరేగాడు !


అధిష్టానం అరాచకానికి సిఎం కిరణ్ చెక్ చెప్పారు. హైకమాండ్ ఆగ్రహిస్తే తక్షణం తన పదవి ఊడుతుందని తెలిసీ కిరణ్ కుమార్ రెడ్డి ధిక్కార స్వరం వినిపించారు.  తలుపులు మూసి కొడితే పిల్లి కూడా తిరగబడుతుందని నిరూపించారు.  మనది ప్రజాస్వామ్య దేశం... ఇక్కడ ప్రజలే సుప్రీం! అటువంటి  మన రాష్ట్ర ప్రజలకి తమ రాష్ట్ర భవిష్యత్తు ఏమిటో తెలియకుండా రెండు నెలల పాటు సుప్త చేతనావస్థలో ఉంచిన కేంద్రం అవివేక నిర్ణయం పై నిప్పులు  చెరిగారు ముఖ్య మంత్రి! సమైక్యాంధ్రకి ముఖ్యమంత్రి అంటూ వక్రంగా వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్ కి కూడా గూబ పగిలే సమాధానం ఇచ్చిన ముఖ్యమంత్రి అభినందనీయుడు. తెలుగు వారి రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని తెలుగేతర ప్రాంత నాయకులు అందరూ కత్తులు పట్టుకుని సిద్ధమైన సమయంలో ఈ స్థాయి ప్రతిఘటన అత్యంత ఆవశ్యకం.      అరవై రోజులుగా సీమాంధ్ర లో జరుగుతున్న ఉద్యమం పట్ల ఉదాసీనంగా వున్నట్లు నటిస్తూ అటు విభజన నోట్ వైపు కూడా అడుగు ముందుకు వేసే దమ్ము లేని కేంద్రానికి సరైన ఝలక్ ఇచ్చారు కిరణ్!  తమ స్వంత పార్టీ ముఖ్య మంత్రిని సైతం విశ్వాసంలోకి తీసుకోవటం చేతకాని  కేంద్రానికి విభజన దిశగా అడుగులు వేసే హక్కు ఎంత మాత్రం లేదు.  మెజారిటీ   ప్రజల అభిప్రాయాలకి విలువ ఇవ్వకుండా దొడ్డి దారుల్లోనైనా రాష్ట్రాన్ని విభజించెయాలని పంతం పడుతున్న కేంద్రానికి సరైన బుద్ది చెప్పాలి.   కేంద్రం ఆఖరి బంతి వేసేసిందని, మాచ్ ముగిసిపోయిందనీ వేర్పాటు వాదులు మురిసిపోతున్నారు. అయితే కేంద్రం వేసింది నో బాల్ అనీ, కేంద్రం హిట్ వికెట్ అయ్యిందనీ  అంపైర్లు (ప్రజలు) డిక్లేర్ చేస్తున్న విషయం  వారు గ్రహింపులో  వుంచుకుంటే  సంతోషం.

Thursday, September 26, 2013

ఇంట్లో ఈగల మోత ! : దిగ్విజయ్ సింగ్

ముఖ్య మంత్రిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలని సమానంగా చూడాలని సుద్దులు చెప్తున్న దిగ్విజయ్ సింగ్ తాను ఎలా ప్రవర్తిస్తున్నారో ముందు తెలుసుకోవాలి.  తెలంగాణా ప్రాంతానికి అనుకూలంగా విభజన ప్రతిపాదించటమే గాక సీమాంధ్ర నాయకుల విన్నపాలని సైతం పెడచెవిన పెడుతూ రోజుకో సారి తెలంగాణా తధ్యం అంటూ ఉత్తర కుమార ప్రతిజ్ఞలు చేసేస్తున్నారు. తాటాకు చప్పుళ్ళ లాంటి దిగ్విజయ్ మాటలని ఉద్యోగులు కూడా ఖాతరు చెయ్యటం మానేశారు!  విభజన ప్రతిపాదనతో ఎన్జీఓ ల భవిష్యత్తు అంధకార బంధురం చేసేసి - వారు ఉధృతంగా సమ్మెకి దిగాక - ఏమీ ఎరగని నంగనాచిలాగా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా, సమ్మె విరమించండి అని ప్రకటించటం విడ్డూరం!    సొంత రాష్ట్రం లో ఠికానా లేక కాంగ్రెస్ కోర్ కమిటీలో కాలక్షేపం చేస్తూ అమ్మ దయతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కి ఇన్ చార్జి గా నియమితులైన దిగ్విజయ్ సింగ్ కి రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన దగ్గరనించి చిత్త చాంచల్యం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తన సొంత రాష్ట్రంలో మొహాన తలుపు వేసి జ్యోతిరాదిత్య సింధియా విలేఖరుల సమావేశం నిర్వహిస్తే కిక్కురుమనని దిగ్విజయ్ తన ప్రతాపాన్ని సీమాంధ్ర నాయకుల పై మాత్రం చూపిస్తారు.
 ఒక పార్లమెంటు సభ్యురాలిని టంచ్ మాల్ అంటూ వెకిలిగా మాట్లాడిన పెద్ద మనిషి దగ్గరికి సీమాంధ్ర నాయకుల సతీమణులు వెళ్ళటం అర్ధం లేని పని. తన ప్రవర్తనకి తగ్గట్లే వారిని కూడా అవమానించి పంపాడాయన! మహిళల విషయం వదిలేస్తే మతం విషయంలోనూ దిగ్విజయ్ ది  అవాంచనీయ ధోరణే!  తాజాగా మధ్య ప్రదేశ్ లోనే బీజేపీ సమావేశానికి పదివేల బురఖాలు పంపిణీ అంటూ తల తిక్క వ్యాఖ్యానం చేసి పొలిసు కేసు ఎదుర్కుంటున్నారు. 

http://indiatoday.intoday.in/story/police-complaint-against-digivjaya-singhs-for-his-false-burqua-claims/1/311876.html

ఇంతటి ఘన చరిత్ర గల పెద్ద మనిషి ఆధ్వర్యంలో కేంద్ర కాంగ్రెస్ పార్టీ  నిర్ణయం ప్రకటించాక కూడా ముందుకి సాగే దమ్ము లేక త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లు రాష్ట్ర ప్రగతి తో దారుణమైన విధంగా ఆటలాడుకుంటోంది.  అసలు ఇంట గెలవలేని దిగ్విజయ్ రచ్చ గెలుస్తాడని కాంగ్రెస్ ఎలా భావించింది? తెలుగు వారి పట్ల కేంద్రం చూపుతున్న చిన్న చూపుకి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు పరాకాష్ట అని చెప్పాలి.  

Wednesday, September 25, 2013

సు మోటో గా చర్యలు తీసుకుంటే తెలబాన్లు అందరూ జైల్లోనే !


తెలంగాణా ని కేంద్రం ప్రకటించేసింది! ఇంక 100 రోజుల్లోనో / నెలల్లోనో ఎలాగూ వచ్చేస్తుంది. వేర్పాటువాదులు ప్రశాంతంగా ఉండవచ్చు కదా!  అన్యాయం జరిగింది సీమాంద్రులకి ! ఎక్కడో తంతే మూతి పళ్ళు రాలినట్లు - విడిపోతామన్నది వేర్పాటు వాదులు, రాష్ట్రాన్ని రాజధానిని కోల్పోమన్నది సీమాంద్రులని!  అడ్డగోలు నిర్ణయం ఏకపక్షంగా జరిగినప్పుడు ఉద్యమం తలెత్తటం సహజం. రాజకీయ నాయకులు మొహం చాటేసినా ప్రజలు,ఉద్యోగులు స్వచ్చందంగా సాగిస్తున్న ఉద్యమం పట్ల తెలబాన్లు ఉలికులికి పడుతున్నారు.  ప్రారంభమైన రోజు నుంచి శాంతియుతంగా, ఎటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు లేకుండా సాఫీగా జరుగుతున్న సమైఖ్యాంధ్ర ఉద్యమం పట్ల తెలంగాణా నాయకులు వ్యాఖ్యానాలు చేస్తున్న తీరు అభ్యంతరకరం. ముఖ్యంగా ఎన్జీఓ నాయకుడు అశోక్ బాబు గురించి వారు చేస్తున్న వ్యాఖ్యలు వారి ఓపలేని తనాన్నే సూచిస్తాయి. సేవ్ ఆంద్ర ప్రదేశ్ సమావేశం హైదరాబాదులో జరుపుకోవటానికి తెలబాన్లు ఎన్ని అడ్డంకులు కల్పించినా సమావేశాన్ని శాంతియుతంగా, అత్యంత సంయమనం పాటించి అశోక్ బాబు నడిపించిన తీరు జాతీయ మీడియా సైతం ప్రశంసించింది.  ఆ తరువాత జరిగిన హిందూపూర్ సభ వరకు కూడా అశోక్ బాబు ఎక్కడా తెలంగాణా నాయకులని తూలనాడింది లేదు.  కేవలం విభజన ప్రతిపాదన తెచ్చిన కేంద్రాన్ని విమర్శించాడు తప్ప తెలంగాణా ప్రాంత నాయకులని పల్లెత్తు మాట అనలేదు. పైపెచ్చు ఉద్యమాన్ని శాంతియుతంగా నడపాలని శ్రేణులని ఒకటికి పది సార్లు హెచ్చరిస్తూ ముందుకు సాగుతున్నారు. . మరి ఈనాడు హరీష్ రావు గారు అశోక్ బాబు పై సు మోటో గా చర్యలు తీసుకోవాలని సెలవిస్తున్నారు!  ప్రభుత్వం ఎస్మాని ప్రయోగించదని చెప్పటమే సు మోటో గా విచారించాల్సిన నేరమైతే - హరీష్ రావు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని నాలుక కోస్తానంటూ  పత్రికా ముఖంగా హెచ్చరించారు.   ఆయనే కాదు తెలంగాణా ఎన్జీఓ నాయకుడు సైతం అశోక్ బాబు నాలుక కోస్తానని ప్రకటించారు.  సెప్టెంబర్ 7 వ తేదీ సమావేశానికి వచ్చిన వాళ్ళని చితక బాదతామని ఉస్మానియా విద్యార్ధి నాయకుడు పిడమర్తి రవి టీవీ కెమెరాల సాక్షిగా బెదిరించారు.  ఇలా ఒకటా రెండా...చెప్పుకుంటూ పొతే తెలబాన్ నాయకుల నోటి దురుసుకి ఉదాహరణలు  కోకొల్లలు. సు మోటో గా న్యాయ వ్యవస్థలు చర్యలు తీసుకొని వుంటే ఈ పాటికి తెలబాన్ నేతలందరూ శ్రీ కృష్ణ జన్మ స్థానంలోనే వుండే వారు. అసలు రాష్ట్రం సమైక్యం గానే ఉందన్న ధీమా తో గత నాలుగేళ్ళుగా తెలబాన్లు చేస్తున్న అసత్య ప్రచారాలని ఖండించక పోవటం సీమాంధ్ర నాయకుల పొరపాటు. భావోద్వేగాల పేరుతొ ఎన్ని అవాకులు చెవాకులు పేలినా చూసీ చూడనట్లు వదిలెయ్యటం గ్రహ పాటు. మొగుణ్ణి కొట్టి మొగసాలకేక్కినట్లు సహనం సంయమనం చూపిన సీమాంధ్రుల పైనే సు మోటో చర్యలకి తెలబాన్ నాయకులు డిమాండ్ చెయ్యటం గురువింద గింజ సామెత ని గుర్తు చేస్తుంది. గతం గతః .. తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోదని సామెత!  ఇక ముందు తెలంగాణా నాయకులు వుట్టి పుణ్యానికి నోరు పారేసుకుంటే సంయమనం చూపాల్సిన పని లేదు.  న్యాయ బద్దంగా అడ్డు కట్ట వేస్తె కానీ వారి నోళ్లకి తాళం పడదు..            

Sunday, September 22, 2013

పంజరంలో చిలుక ప్రజాభీష్టాన్ని నొక్కేస్తోందా ?

లోక్ సభలో యూపీఏ ప్రభుత్వానికి వున్నది బొటా బొటి మెజారిటీ.. ఎఫ్ డీ ఐ బిల్లు లేదా ఆహార భద్రతా బిల్లు మొదలైనవన్నీ గట్టేక్కించు కోవటానికి నానా తంటాలు పడింది యూపీఏ.  ఇంత స్వల్ప మెజారిటీ తో ఉన్న ప్రభుత్వం తెలంగాణా పై అంత గట్టి నిర్ణయం ఎలా తీసుకుంది ?  స్వంత పార్టీ లోనే ఏకాభిప్రాయం లేకుండా విభజనకి అంత మొండిగా ఎలా సాగుతోంది?
 సీమాంధ్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు వారి సతీ మణులని  రాష్ట్రపతి దగ్గరకి సమైక్య రాష్ట్రం కోసం విజ్ఞప్తితో పంపారే గానీ వారెందుకు వెళ్ళలేదు?  తమని గెలిపించిన ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా అడ్డగోలుగా విభజన ప్రతిపాదన జరిగినపుడు ఇదే మంత్రులు-పార్లమెంటు సభ్యులు రాష్ట్రపతి వద్దకి వెళ్లి రాజీనామాలు ఇచ్చేస్తే  ప్రభుత్వం సంక్షోభంలో పడదా?  మెజారిటీ లేక ప్రభుత్వమే కూలితే ఇంక విభజన బిల్లు వచ్చే పనే లేదు.  అయినా సీమాంధ్ర మంత్రులు-పార్లమెంటు సభ్యులు అంత  ధైర్యం ఎందుకు చేయలేక పోతున్నారు ?   కారణం ఒకటే కనిపిస్తోంది.  అదే సిబీఐ !  సుప్రీం కోర్టు భాషలో కేంద్ర ప్రభుత్వం అనే పంజరంలోని చిలుక !
 ములాయం సింగ్ బయట నుండి మద్దతు ఇచ్చినా, సీమాంధ్ర నాయకులు కిమ్మనకుండా అధిష్టానానికి సలాం కొట్టినా సీబీఐ  భయమే కారణం అయి ఉండవచ్చు.  సీమాంధ్ర మంత్రులు, నాయకులు అందరికీ స్వంత వ్యాపారాలు, తరాలకి సరి పడ్డ ఆస్తులు వున్నాయి.  అధిష్టానాన్ని ఎదిరించి పోరాడిన జగన్మోహన రెడ్డి పరిస్థితి చూసాక సీమాంధ్ర నాయకులకి జడుపు జ్వరం వచ్చినట్లుంది.  అందుకే నియోజవర్గాల్లో ప్రజలు తరిమి తరిమి కొడుతున్నా హస్తినలో దాక్కుంటున్నారే తప్ప అధిష్టానాన్ని ఎదిరించే సాహసం చెయ్యట్లేదు... దీని వల్ల వాళ్ళ స్వంత ప్రయోజనాలు కాపాడుకున్నా,  సీమాంధ్ర ద్రోహులుగా చరిత్ర హీనులుగా మిగిలి పోతున్నారన్న విషయం వారు మర్చి పోతున్నారు.  జీతాలు అందక పోయినా మొక్కవోని దీక్షతో 45 రోజులుగా ఉద్యమిస్తున్న ఎన్జీఓ లకి వున్న నిబద్ధత కూడా సీమాంధ్ర రాజకీయులకి లేక పోవటం సిగ్గు చేటు..                 

Saturday, September 21, 2013

అరిచే కుక్క కరవదు !

52 రోజులుగా సీమాంధ్ర ప్రాంతమంతా ఊరు వాడ ఏకమై చేస్తున్న మహోద్యమం తో కేంద్రానికి కాలు చెయ్యి ఆడటం లేదు.  అడ్డగోలు విభజన ప్రతిపాదించి అడుసు తొక్కిన కాంగ్రెస్ ఇప్పుడు కాళ్ళు ఎలా కడుక్కోవాలో తెలీక సతమతమవుతోంది. చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలమన్న బీజేపీ కూడా తాము రాష్ట్రాలు ఇచ్చినపుడు ఎటువంటి గొడవలు జరగలేదని, ఇప్పుడు సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించకుండా ముందుకు వెళ్ళటం కష్టమే అని సన్నాయి నొక్కులు మొదలు పెట్టింది.  కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వక పొతే తాము ఇచ్చి తీరతామని చెప్పిన బీజేపీ కూడా మడమ తిప్పెయ్యటంతో కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా అయ్యింది.     ఆంధ్రులని ఆరంభ శూరులుగా జమ కట్టి  ఎక్కువ కాలం   వుద్యమించలెరన్న తప్పుడు అంచనాతో ఏకపక్ష విభజనకి ఒడి గట్టిన కేంద్రం, ఇప్పుడు   పరువు కాపాడుకోవటానికి టీవీల ముందు  రోజుకో  నాయకునితో  తెలంగాణా పై వెనక్కి తగ్గేది లేదన్న ఉత్తర కుమార ప్రతిజ్ఞలు చేయిస్తోంది.  ఓటి కుండకి మోతలెక్కువ అన్నట్లు  వెనక్కి వెళ్ళలేం అని ఎంత మంది కాంగ్రెస్ నాయకులు చెప్తుంటే --  అంత ముందుకి సమైక్య ఉద్యమం ఉరకలేస్తోంది ! రాజకీయ నాయకుల ప్రమేయం అన్నది లేకుండా కేవలం ప్రజలు, ఉద్యోగులు స్వచ్చందంగా నడిపిస్తున్న ఇటువంటి ఉద్యమం న భూతో అనే చెప్పాలి.  
నిజంగా కాంగ్రెస్ కి తెలంగాణా ఇచ్చే ఉద్దేశ్యమే వుంటే విభజన ప్రతిపాదన ఏకపక్షంగా చేసేదే కాదు!  సీమాంధ్ర లో ఉద్యమం వస్తే బలగాల సాయంతో అణచి వేసి విభజన పై ముందుకు సాగుదామనుకున్న కేంద్రానికి  -  ఎటువంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా కొనసాగుతున్న సమైక్య ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా పాలుపోవట్లేదు.. పదవులని వదలి పెట్టకుండా సీమాంధ్ర నాయకులు మొహం చాటేసినా కూడా నాయకత్వ లేమి అన్నది కనపడకుండా సాగుతున్న ఉద్యమ ఉధృతికి కేంద్రం తల వంచక తప్పదు.    జూలై 30 ప్రకటనకి ముందు 15 రోజుల్లో చక చకా పావులు కదిపేసి  నిర్ణయం ప్రకటించేసిన కాంగ్రెస్ 52 రోజులైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ప్రవర్తించడం ఖచ్చితంగా వెనకడుగు వేయడమే!  కేంద్రం మెడలు వంచి విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేలా ఉద్యమించే సత్తా తెలుగు వాని సొంతం.  ఆ మంచి రోజు ఎంతో దూరంలో లేదనటంలో ఏ మాత్రం సందేహం లేదు..     

Wednesday, September 18, 2013

కోదండ రాం కామెడీ !

పనేమీ చేయకుండానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకుంటున్న జీతం  ఒంటికి ఎలా పడుతున్నదని తెలంగాణా జెఏసి చైర్మన్ కోదండరాం ప్రశ్నించారు!  దయ్యాలు వేదాలు వల్లించటం, గురువింద గింజ తన వెనుక నలుపు ఎరగదు వంటి సామెతలు కోదండరాం కు బాగా వర్తిస్తాయి. విద్యార్ధులకి విద్యా బుద్ధులు నేర్పాల్సిన అధ్యాపక వృత్తి లో వున్న ఆయన గత నాలుగేళ్ళుగా   తన ఉద్యోగానికి ఏమి న్యాయం చేసారో ముందు చెప్పాలి. పూర్తి కాలం ఉద్యమానికే కేటాయిస్తున్నప్పుడు తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఉద్యమంలో పాలు పంచుకుంటే హుందాగా వుండేది!  కానీ ఏ పనీ చెయ్యకుండా నెలకు లక్ష రూపాయల జీతం తీసుకుంటూ మరో పక్క ముఖ్య మంత్రి  ప్రజలకి సమాధానం చెప్పాలనటం విచిత్రం !  

అయినా,  జాగో-భాగో   అంటారు. తరిమి కొడతాం అంటారు. నాలుకలు కోస్తాం అంటారు. విగ్రహాలు పగల కొడతారు.  శాసన సభ్యులని చితక కొడతారు. తేరగా జీతాలు తీసుకుంటారు.  ఉద్యమం ముసుగులో ఏమి చేసినా తప్పు కాదు అన్నది తెలబాన్ల ప్రాధమిక సూత్రం !  ఆ సంగతి మర్చి పోయి ఏదేదో రాసేశాను.. మన్నించాలి !       


Tuesday, September 17, 2013

ఏది ఉద్యమం?


రాజకీయ నాయకుల్లో అజాత శత్రువు ఎవరంటే జేపీ!  జేపీ అంటే నిఖార్సైన మేధావి .. నిజాయితీకి మారు పేరు!   తెలంగాణా ప్రాంతపు శాసన సభ్యుడైనా,ఏనాడూ కూడా ఒక ప్రాంతానికి అనుకూలంగా ప్రవర్తించకుండా  సహేతుకంగా మాట్లాడే వ్యక్తి అనటంలో ఎటువంటి సందేహం లేదు.  గతంలో అసెంబ్లీలో  కేవలం గవర్నరు ప్రసంగం అడ్డుకోవటం సరి కాదు అన్నందుకే తెలబాన్లు శాసన సభ ప్రాంగణంలో ఆయనకు చేసిన సన్మానం ఇది.. ఈటెల రాజేందర్ కారు డ్రైవర్ ఆయన పై చేయి చేసుకున్నా అది భావోద్వేగంతో తన్నడమే తప్ప తప్పేమీ కాదని వెనకేసుకొచ్చారు.  పైగా ఈ సన్మానం ఆయనకి జరగాల్సిందే అని సెలవిచ్చారు.. 

http://timesofindia.indiatimes.com/city/hyderabad/JP-deserved-attack-says-TRS-MLA/articleshow/7518703.cms  


మరి ఇప్పుడు సమైక్య ఉద్యమం ఉధృతంగా వున్న సమయంలో ఆయన  కర్నూలు, అనంతపురం వచ్చి జనాలను జాగృతం చేస్తానంటూ చేపట్టిన తెలుగు తేజం కార్యక్రమానికి కూడా సమైక్య సెగ తగిలింది.  అయితే సమైక్య వాదులు తెలబాన్ల వలే  ఆయనను  కొట్టలేదు కానీ తమ నిరసన  గట్టిగా తెలియజేసి వెనుకకి మరలేలా చేసారు.   



ఏది అసలైన ఉద్యమం ?  ఏది అసలైన ఉద్యమ స్ఫూర్తి?  సీమాంధ్రులది పెయిడ్ ఉద్యమం అంటూ నీచంగా మాట్లాడుతున్న తెలబాన్లకి అలా అనే హక్కు అసలు ఉందా? 

Monday, September 16, 2013

విభజన సెగతో విష పరిణామం !


రాష్ట్ర విభజన ప్రతిపాదన దశలో ఉండగానే దాని విష పరిణామాలు మొదలై పోయాయి.  రాష్ట్రంలో వున్న కల్లోల పరిస్థితిని సాకుగా చూపి హిందూపూర్ కి రావలసిన ఐఐఎస్ సి  కాంపస్ ని కర్నాటక ఎగరేసుకు పోయింది.

http://www.sakshi.com/news/andhra-pradesh/division-fire-iiasc-out-65726

అసలు రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాలుగా వేర్పాటు వాదుల ఆగడాలతో ప్రైవేటు రంగంలో రావలసిన సంస్థలు/వ్యాపారాలు ఎన్నో గుజరాత్ కి తరలి పోయాయి.  ఇక ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మన రాష్ట్రం పై శీతకన్ను వేయటం మొదలు పెట్టాయి.   పరిస్థితి ఇలాగే కొన సాగితే తిరుపతి ని తమిళ నాడు -  వైజాగ్ ని ఒరిస్సా తన్నుకు పోయినా ఆశ్చర్యం లేదు ! 

Saturday, September 14, 2013

విచక్షణాధికారం దుర్వినియోగం చేసి మరీ తెలంగాణా ఇవ్వాలా ?

రాజకీయ పార్టీలు అంగీకరించాయన్న నెపంతో ఆంధ్ర ప్రదేశ్ విభజనకి కేంద్రం పూనుకోవటం మూర్ఖత్వం.  అసలు స్వంత పార్టీలోనే విభజన పట్ల ఏకాభిప్రాయం లేని కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల లేఖలని నమ్మి విభజన ప్రతిపాదన పై దూకుడుగా ముందుకు వెళ్ళటం ఖచ్చితంగా కేంద్రానికి వున్న విచక్షణాధికారాలని దుర్వినియోగం చెయ్యటమే!  రాష్ట్ర  శాసన సభ అంగీకారంతో సంబంధం లేకుండా ఆర్టికిల్ 3 కింద తనకు వున్న విచక్షణాధికారంతో రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే అది భవిష్యత్తులో ఎన్నో దుష్పరిణామాలకి దారి తీస్తుంది.   దీన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో కేంద్రం లో  రాబోయే ప్రభుత్వాలు తమకు నచ్చని రాష్ట్రాలని ముక్కలు చేసి బలహీనం చేసేస్తే అడిగే వాళ్ళెవ్వరు? కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధింపు, ఇంకా గవర్నర్లకి వుండే విచక్షణాదికారాలని వివేచనతో ఉపయోగించాలి కాని పిచ్చోడి చేతిలో రాయిలాగ వాడకూడదు. రాష్ట్రంలో గత 45 రోజులుగా జరుగుతున్న సమైఖ్యాంధ్ర ఉద్యమం దెబ్బకి దాదాపు అన్ని రాజకీయ పార్టీలు పునరాలోచనలో పడ్డాయి. లేఖలు ఇచ్చిన కొన్ని పార్టీలు యూ టర్న్ కూడా తీసుకున్నాయి.  అయినా రాజకీయ పార్టీల
నిర్ణయాలు రోజుకో విధంగా మారిపోతుంటాయి.  ఈ రోజు విభజనకి అనుకూలంగా లేఖలు ఇచ్చిన పార్టీలు రేపు వాటిని వెనక్కి తీసుకుంటే జరిగి పోయిన విభజన ని కేంద్రం వెనక్కి తేగలదా?    ప్రస్తుతానికి  ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ తమ రాష్ట్రాన్ని 4 ముక్కలు చేయాలని తీర్మానం  చేసి  కేంద్రానికి పంపించింది.   అంటే విభజనకి ఒక దశ ముందులో  ఉన్న ఆ ప్రతిపాదన పక్కన పెట్టి  --  విభజనకి ప్రతిపాదనకే వ్యతిరేకంగా మహోగ్రంగా ఉద్యమిస్తున్న ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కేంద్రం ముందుకి వెళ్ళటంలో ఔచిత్యం ఏమిటి?  రాజకీయ  సమీకరణాలే  పరమావధిగా మొండి గా ముందుకి సాగుతున్న కేంద్రం ప్రజాభిప్రాయమే ఫైనల్ మానిఫెస్టో అని ఎప్పుడు తెలుసుకుంటుంది? 

Tuesday, September 10, 2013

వినాయకుడి భూలోక యాత్ర !


వినాయక చవితి రోజు  మన రాష్ట్రమంతా తిరిగి  భక్తుల పూజలందుకొని భక్తులు ఇచ్చిన ఉండ్రాళ్ళు ఆరగించిన తరువాత  ఆ రాత్రి వినాయకుడు మూషికునితో -

మూషికా ప్రతి సంవత్సరం భక్తులు ఇచ్చిన  ఉండ్రాళ్ళ తో భుక్తాయాసం వచ్చేది .. ఈ రోజు కడుపు నిండినట్లు కూడా లేదు కారణ మేమిటి ? 

ఈసారి మన రాష్ట్రం లో 13 జిల్లాల్లో పూజలు సక్రమంగా జరగలేదు ప్రభూ 

కారణం ?

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏక పక్షంగా  అడ్డగోలుగా విభజించాలన్న కేంద్ర ప్రతి పాదనతో  సీమాంధ్ర లోని 13 జిల్లాల ప్రజల గుండెలు మండుతున్నాయి ప్రభూ.. అందుకే ఈ రోజు కూడా తమరి పూజ ని మమ అనిపించి మళ్ళీ ఉద్యమం లో పాల్గొన్నారు .. 

నా పూజ కన్నా కూడా ఉద్యమానికి ప్రాదాన్యమిచ్చారంటే  వారి బాధ, వేదన గమనించ దగ్గదే! ఇంతకీ వారి ఉద్యమం ఎందుకు ?

వేర్పాటు వాదులు కేంద్రం తో కుమ్మక్కు అయ్యి వుట్టి పుణ్యానికి రాష్ట్రాన్ని విభజించాలని చూడటమే గాక ఉమ్మడిగా అభివృద్ది చెందిన  రాజధాని ని కూడా కాజేయాలని కుట్ర పన్నుతున్నారు ప్రభూ .. 

అసంభవం .. వారి కోరిక నెరవేరదు ..  ఇంతకీ వారి నాయకులు ఏమి చేస్తున్నారు ? 

ఈ ఉద్యమానికి నాయకులెవరూ లేరు ప్రభూ.. ప్రజలే స్వచ్చందంగా పాల్గొంటున్న ఉద్యమం ఇది!

అవునా ,, మరి సీమాంధ్ర రాజకీయ నాయకులు ?

వారు తాయిలాలు అందుకొని డిల్లీ లో దాక్కున్నారు  ప్రభూ ... 

అవునా .. అయితే తదుపరి ఎన్నికల్లో వారందరికీ డిపాజిట్లు కూడా దక్కకూడదని నా శాపం !  ఇంకా ?

నాయకుల అండ లేక పోవటంతో ఉద్యోగులే ఉద్యమానికి సారధ్యం వహిస్తున్నారు ప్రభూ ...

భళా వుద్యోగులారా మీకు నా శుభాశీస్సులు.. అవును మూషికా ఈమధ్య ఉద్యోగులు రాజధానిలో సమావేశం జరిపారని విన్నాను... 

అవును ప్రభూ .. ఆ సమావేశానికి వేర్పాటు వాదులు బందులు జరిపి , బస్సుల మీద రాళ్ళేసి, దిగ్బందనలు చేసి ఇంకా చాలా అడ్డంకులు కల్పించాలని చూసారు ప్రభూ.. చివరికి సభా ప్రాంగణం లో కూడా ఒక రక్షక భటునికి పైసలు ఆశ  చూపి రసాభాస చేద్దామని ప్రయత్నించారు ప్రభూ ..      

 అదేమిటి? ఉద్యోగులు సభ జరుపుకునేది వారి రాజధానిలోనే కదా ? 

అవును ప్రభూ ... 

ఆ సమావేశానికి ప్రభుత్వ అనుమతి, హైకోర్టు అనుమతి వున్నాయి కదా ?

ఉన్నాయి  ప్రభూ ...   

సమావేశం శాంతియుతంగానే జరిపారు కదా ?

అవును ప్రభూ ... 

మరి వేర్పాటు వాదులకి ఎందుకు అంత  ఉక్రోషం ? 

అందుకే వారిని తెలబానులు అంటారు ప్రభూ ... 

ఆహా.. ఈ వేర్పాటువాదుల ఆగడాలు ఇక ఎంత మాత్రం సహించకూడదు.. దీనికి విరుగుడు ఏమీ లేదా మూషికా?

ఎందుకు లేదు ప్రభూ... ఈ సమస్యకి తగిన ఉపాయం శ్రీ కృష్ణుల వారు ఎప్పుడో ఆలోచించి ఉంచారు. ఎటొచ్చీ ఆ ఉపాయాన్ని అమలు పరచే మంచి బుద్ది తమరు కేంద్రానికి ప్రసాదించాలి... 

తధాస్తు .... 

(Idea courtesy :  కోటి రత్నాల వీణ) 

శ్రీ కృష్ణ కమిటీ నివేదికే కర దీపిక కావాలి !


జస్టిస్ బీ ఎన్ శ్రీకృష్ణ ! 

నిబధ్ధతకి,  నిర్భయత్వానికి,  నిష్పాక్షికతకి మారు పేరు !



1992 లో బొంబాయి అల్లర్ల పై కేంద్రం విచారణ కమిషన్ వేయాలని నిర్ణయించినపుడు సీనియర్ న్యాయమూర్తు లెందరో ఆ బాధ్యత స్వీకరించటానికి నిరాకరిస్తే ధైర్యంగా ముందుకి వచ్చి నిష్పాక్షికంగా విచారణ పూర్తి చేసిన కార్య శీలి! 
   
సాఫ్ట్ వేర్ రంగం  హవా కొనసాగుతున్న సమయంలో - ఐటీ రంగ ఉద్యోగాలు తప్ప తక్కినవన్నీ దండగ అని భావింప బడుతున్న రోజుల్లో 6 వ పే కమిషన్ అధ్యక్షుడుగా బాధ్యత స్వీకరించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి గౌరవ ప్రదమైన జీత భత్యాలు ప్రకటించిన యదార్ధ వాది  ఆయన ! 

ఇటువంటి ఘన చరిత్ర కలిగిన జస్టిస్ శ్రీకృష్ణ గారికి  2010 లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణా సమస్య మూలాలు కనుగొని తగిన పరిష్కారాలు సూచించే బాధ్యతని అప్ప చెప్పింది.  వివిధ రంగాలకి చెందిన మరో నలుగురు మేధావుల తో కలిపి ఒక కమిటీ ని ఏర్పాటు  చేసింది. ఈ కమిటీ 8 నెలల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పర్యటించి,  రాష్ట్రంలోని అన్ని వర్గాలకి చెందిన  ప్రజల నుండి, అన్ని రాజకీయ పార్టీలనుంచి అభిప్రాయాలు, విజ్ఞాపనలు స్వీకరించింది. అలా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి , విశ్లేషించి ఒక సమగ్రమైన నివేదికని కేంద్ర హొమ్ శాఖకి సమర్పించింది.    


కమిటీ తన నివేదికలో తెలంగాణా సమస్యని మూలంనుంచి చర్చించటమే గాక ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా 6 అమలు చేయదగ్గ పరిష్కారాలు సూచించింది. అంతే  కాదు.. దగా, దోపిడీ, వెనుకబాటు తనం అంటూ తెలంగాణా వుద్యమకారులు చెప్పుకొస్తున్నవన్నీ పచ్చి అబద్ధాలే అని సంఖ్యా వివరాలతో సహా కుండ బద్దలు కొట్టింది.  తెలబాన్లు చేస్తున్న అబద్ధపు గోబెల్స్ ప్రచారాలని ఏనాడూ సరిగా ఖండించని సీమాంధ్ర రాజకీయ నాయకులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు కనీసం ఈ కమిటీ నివేదికని పార్లమెంటులో చర్చకి తీసుకు వచ్చేలా వత్తిడి తీసుకు రాక పోవటం వారు చేసిన పెద్ద  తప్పు. పార్లమెంటు లో ఈ నివేదికని  చర్చకి పెట్టి వుంటే తెలంగాణా వాదంలో వున్న డొల్ల తనం దేశం మొత్తానికి తెలియడమే కాక దేశంలో మరిన్ని చోట్ల వున్న వేర్పాటు ఉద్యమాలని సమర్ధంగా ఎదుర్కోవటానికి కూడా కేంద్రానికి వెసులుబాటుగా వుండేది. ఇంక కమిటీ సూచించిన  ఆరు పరిష్కారాలలో హైదరాబాదుతో కూడిన తెలంగాణ ని ఇస్తూ సీమాంధ్ర కి ప్రత్యెక రాజధాని తో  ప్రస్తుత రాష్ట్రాన్ని రెండుగా విభజించమని కూడా ఒక సూచన వుంది.  అయితే ఎప్పుడు ఈ సూచన అమలు పరచాలో కూడా ఖచ్చితంగా తెలిపింది.  విధి లేని పరిస్థితుల్లో - రాష్ట్రంలోని మూడు ప్రాంతాల పూర్తి అంగీకారంతో మాత్రమె అమలు జరపాలని సూచించింది.  ఒక వేళ అలా  చెయ్యక పొతే జరిగే అనర్దాలని కూడా సవివరంగా  చర్చించింది.  కానీ ఇప్పుడెం జరిగింది ?  కాంగ్రెస్ పార్టీ తన సీట్ల - వోట్ల రాజకీయం కోసం ముందు వెనుకలు ఆలోచించకుండా అడ్డగోలు విభజన ప్రకటించేసింది.  ఫలితం - సీమాంధ్ర 40 రోజులుగా అగ్ని గుండం అయ్యింది.  శ్రీ క్రిష్ణుడు చెప్పిన అనర్ధాలన్నీ అక్షరం పొల్లు పోకుండా జరుగుతున్నాయి.  అయినా కేంద్రం కళ్ళు తెరిచిందా? లేనే లేదు.  ఉయ్యాల లో పిల్లాణ్ణి పెట్టుకొని ఊరంతా వెతికినట్లు శాస్త్రీయంగా సమగ్రంగా ఉన్న శ్రీ కృష్ణ కమిటీ నివేదికని బుట్ట దాఖలు చేసి - ఆంటోనీ కమిటీ, అఖిల పక్ష కమిటీ అంటూ సమస్య ని సాగదీస్తూ ఆంధ్ర ప్రదేశ్ ని రావణ కాష్టం చేస్తోంది.  ఇప్పటికైనా మించి పోయింది లేదు. ఎవరు ఔనన్నా కాదన్నా - రోజుకొకరు డిల్లీ నుండి తెలంగాణా నోట్  తయారవుతోందని బీరాలు పలుకుతున్నా - సీమాంధ్ర ఉద్యమానికి దడిసి కేంద్రం వెనుకడుగు వేసిందన్నది వాస్తవం. తెలంగాణా ప్రకటించాక కూడా లోక్ సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతున్నప్పుడు తెలంగాణా ప్రాంత సభ్యులు అడ్డంకులు కల్పిస్తున్నారంటే వారి వాదనలన్నీ డొల్ల అని తేలి పోతోంది.   కనుక సీమాంధ్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ని పార్లమెంటు లో చర్చించ కుండా తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్టకూడదని అధిష్టానం పై వత్తిడి తీసుకు రావాలి. సమస్య పరిష్కారానికి ఇదే ఏకైక మార్గం. 

Monday, September 9, 2013

ఇదెక్కడి (తెలబాన్) న్యాయం ?

ఎన్జీవోల సభ జరిగిన రోజు ఎల్బీ స్టేడియం బైట నిజాం కాలేజీ విద్యార్ధులని పీక కోసేస్తానని ఒక సీమాంధ్రుడు  హెచ్చరించాడంటూ తెలంగాణా మీడియా అదే పనిగా ప్రచారం చేసేస్తోంది. 

http://www.youtube.com/watch?v=O0Ws3BGK9AU

ఆ సీమాంధ్రుడు (?) ఎందుకలా అన్నాడో - అలా అనటానికి ముందు నిజాం కాలేజీ విద్యార్ధులు ఏమైనా అన్నారేమో వంటి విషయాలు ఎవరికీ పట్టవు.  కానీ గల్లీ నుండి డిల్లీ స్థాయి నాయకులందరూ ఘోరం జరిగి పోయిందని గుండెలు బాదేసుకుంటూ ఆ వ్యక్తి పై పోలీసు కేసులు బనాయించేశారు.  సైగలు  చేయటమే పోలీసు కేసు పెట్టేంత పెద్ద నేరమైతే..... 

https://www.youtube.com/watch?v=SJL_5iYUMY8

పై వీడియో లో  00.35  -  01.13  సమయంలో ఒక ఓ యూ జేఏసీ విద్యార్ధి నాయకుడు ఏమన్నాడో వినండి..         
టీవీ కెమెరాల సాక్షిగా " ఏపీ ఎన్జీవో లు దిగ్బంధనాన్ని ధిక్కరించి సమావేశానికి వస్తే తంతాం.  తన్ని తీరతాం. చెప్పేది వినకుండా బందు ని ధిక్కరించి లోనికి వస్తే తెలంగాణా వారి చేతిలో చావు దెబ్బలు తప్పవు" అని ప్రకటించిన విద్యార్ధి నాయకుణ్ణి సమావేశం రోజు ముందస్తు అరెస్టు చేసారో లేదో కూడా తెలియదు.  పోలీసులు,  కోర్టులు సు మోటో గా కేసులు ఎందుకు బుక్ చెయ్యవు? తెలంగాణా వారికొక న్యాయం - బైటి వారికొక న్యాయం అమలు జరుగుతోందా?       అలాగే  సమావేశం లో గలాటా చేసిన పోలీసు కి,  బైట గలాటా చేసిన మరో విద్యార్ధి నాయకుడి కి దెబ్బలు తగిలాయని ఆక్రోశిస్తారే తప్ప తాము  బస్సు ల పై చేసిన దాడులని , అందులో గాయ పడ్డ ఆంధ్రా ఎన్జీవో ల గురించి గురువింద తెలబాన్లు ఎందుకు మాట్లాడరు?

Sunday, September 8, 2013

తెలబాన్ పైత్యం!


తమ అడ్డాగా భావించే రాజధాని నడిబొడ్డున ఏపీ ఎన్జీవో లు నిర్వహించిన సమావేశం విజయవంతం అవటంతో తెలబాన్లు ఉక్రోషం పట్టలేక పోతున్నారు.  వారు చేసిన  బంద్ విజయవంతమైనా  సభని నిలువరించలేక పోవటంతో పైత్యం ప్రకోపించింది.   వివరాల్లోకి వెల్తే :


పైత్యం 1 :  ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా  ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారం ఎటువంటి హింసాత్మక సంఘటనలకి తావు లేకుండా ప్రశాంతంగా సభ నిర్వహించినందుకు   ఎన్జీవో లని యావత్ దేశం అభినందిస్తోంది.  కానీ ఉద్యోగులు తమ రాజధానిలో సమావేశం జరుపుకోవటమే మహాపరాధంగా తెలబాన్లకి కనిపిస్తోంది. సమావేశ ప్రాంగణం మలినం అయిందంటూ పాలతో శుద్ది చేసామంటూ తమ మనస్సులో ఎంత మాలిన్యం వుందో బయట పెట్టేసారు..  ఈ పని చేసింది ఏ చదువు రాని  వారో, అనామకులో కాదు.  విజ్ఞులైన న్యాయవాదులు! గత వారం వైద్యులు ఎలా ప్రవర్తించారొ ముందరి టపాల్లో చూసాం.  మేధావి వర్గాలకి చెందిన వారే పొడ గిట్టదన్నట్లు ప్రవర్తిస్తుంటే ఇంకా సామాన్య తెలబాన్ ల సంగతి ఏమిటి ?  రాష్ట్రం విడి పొతే సీమాంధ్రుల ని. సీమాంధ్ర ఉద్యోగులని బతకనిస్తారా ? 


పైత్యం 2 :  ఎన్జీవో ల సభని జరగనివ్వబోమని హెచ్చరికలు చేసారు. ఉద్యోగులని రానివ్వకుండా చెయ్యటానికి బంద్ లు దిగ్బంధనాలు ప్రకటించారు.  ఓయూ  ప్రబుద్దులైతే తంతామని కూడా హెచ్చరించారు.  ఇన్ని ఉద్రిక్తతల మధ్య సభ జరుగుతున్న సమయంలో బుద్ది-జ్ఞానం వున్న వాడు ఎవడైనా సభా ప్రాంగణం లో జై తెలంగాణా అంటాడా? అది కూడా రక్షణ బాధ్యతల్లో ఉన్న ఒక పోలీసు బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తే అర్ధమేమిటి?  ఇదే పని మిలియన్ మార్చ్ సమయంలో సీమాంధ్ర వ్యక్తి ఎవరైనా చేస్తే టాంకు బండు విగ్రహాల మాదిరి ముక్కలై పోడా ? ఎంతో  సంయమనం పాటించిన ఎన్జీఓ లు ఏ మాత్రం రెచ్చి పోకుండా ఆ పోలీసుని సభా ప్రాంగణం నుండి పోలీసుల ద్వారానే బయటకు క్షేమంగా  పంపించారు.  అదే పెద్ద మహాపరాధమై పోయింది తెలబాన్ నాయకులకి!  భావోద్వేగంతో అలా ప్రవర్తించిన ఆ పోలీసుని అదే వేదిక పైకి తీసుకొని వెళ్లి సన్మానిస్తే వారికి ఇంపుగా వుండేదేమో?


పైత్యం 3 :  సభ పూర్తి స్థాయి లో విజయవంతం అవటంతో దిక్కు తోచని తెలబాన్లు చివరికి తెలంగాణా వాళ్లు సంపూర్ణంగా సహకరించ బట్టే సభ సజావుగా జరిగిందని ప్రకటించేశారు. సభ నుండి తిరిగి వెళ్ళే వారికి పూలు పండ్లు ఇవ్వమని శ్రేణులని ఆదేశించారు. ఆ ఆదేశాలని శ్రేణులు ఇలా పాటించాయి !          

Saturday, September 7, 2013

శభాష్ ఎన్జీఓస్ !



  చిరుద్యోగులు సాధించారు!  రాజకీయ నాయకులు కలలోనైనా చేయలేనిది చేసి చూపించారు.... సంకల్ప శుద్ధి వుంటే ఏమైనా సాధించ వచ్చని నిరూపించారు.  రాజధాని నడి  బొడ్డులో సమైక్య శంఖారావం పూరించారు. పరిమిత సమయంలో  ఎన్నో ఆంక్షల మధ్య సభ నిర్వహించుకోవాల్సిన పరిస్థితుల్లో,    సభా  నిర్వహణకి తెలబాన్లు ఎన్ని ఆటంకాలు కల్పించినా కూడా - బంతిని నేలకేసి కొడితే లేచినట్లుగా వేర్పాటు వాదులకి చెంప పెట్టుగా  సమైక్య వాణి వినిపించారు.
 ఇచ్చిన మాటకి కట్టుబడి ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా సంయమనం పాటించి సభా మర్యాద అంటే ఏమిటో తెలియజెప్పారు.   తెలబాన్లు ఎంతగా రెచ్చ గొట్టాలని చూసినా  సభలో ద్వేషం, విద్వేషం అన్న పదాలకి తావు లేకుండా సూటిగా సుత్తి లేకుండా తమ కార్యకమాన్ని నడిపించి భళా అనిపించుకున్నారు.  పాలించమని ప్రజలు పార్లమెంటుకు పంపితే విభజిస్తున్న కేంద్ర దురాగతాన్ని ముక్త కంఠం తో ఖండించారు.  హైదరాబాదు ఏ ఒక్కరి సొత్తు కాదు - తెలుగు వారందరిదీ అని ఎలుగెత్తి చాటారు.  ఇంతటి ఘనత సాధించిన ఏపీ ఎన్జీవో నాయకులు, సభ్యులు అందరికీ సమైక్యాంధ్ర శుభాభినందనలు.....         

Friday, September 6, 2013

కుక్క కాటుకి చెప్పు దెబ్బ !

ఒక రాష్ట్రం లోని ప్రభుత్వ ఉద్యోగులు - ప్రభుత్వ అనుమతి తో - తమ రాజధాని నగరంలో - ఒక సమావేశం జరుపుకోదలుచుకుంటే -  దానికి హైకోర్టు కూడా అనుమతి మంజూరు చెయ్యాలా ?  సిగ్గు చేటు !   అసలు ఉద్యోగులు హైదరాబాదులో సమావేశం అని ప్రకటించిన మరుక్షణం నుండే తెలబాన్లు శివాలెత్తడం మొదలు పెట్టారు.  హైదరాబాదు తమకి అడ్డా అయినట్లు సీమాంధ్ర లో  ఎక్కడో సమావేశం పెట్టుకోమని ఫత్వా జారీ చేసేసారు.   ఎక్కడో గుజరాత్ నుండి వచ్చిన నరేంద్ర మోడీ సభ జరుపుకుంటే వారికి అభ్యంతరం లేదు కానీ మన రాష్ట్ర ఉద్యోగులు మాత్రం రాజధానిలో ఏ కార్య కలాపాలు నిర్వహించకూడదన్న మాట!  ఉద్యోగులు వెనక్కి తగ్గక పోవటంతో  పోటీ ర్యాలీ ని ప్రకటించేసి దానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని గలాటా మొదలు పెట్టారు.  గతంలో మిలియన్ మార్చ్ పేరుతొ శాంతియుతంగా ర్యాలీ చేస్తామని ప్రభుత్వాన్ని మభ్య పెట్టి టాంకు బండు విగ్రహాలు కూల్చిన చరిత్ర వారికి వుంది! అటువంటప్పుడు ప్రభుత్వ అనుమతి వస్తుందని ఎలా అనుకున్నారు?  అంతేనా...  సభని జరగనివ్వబోమంటూ బంద్ లు , రైల్వే స్టేషన్ దిగ్బంధనాలు, రహదారి దిగ్బంధనాలు మరెన్నో మరెన్నో ప్రకటించేశారు.  ఓయూ  జెఏసి సభ్యులైతే సభకి వచ్చిన వారిని తంతామని టీవీ కెమెరాల సాక్షిగా బెదిరింపులు చేసేసారు.   అసలు మనం ప్రజాస్వామ్య దేశం లో వున్నామా - తాలిబాన్ రాజ్యంలో వున్నామా?   ఎన్ని బెదిరింపులు చేసినా ఉద్యోగులు వెనక్కి తగ్గక పోవటం తో చివరికి సభని ఎలాగైనా ఆపి తీరాలన్న పట్టుదలతో తెలబాన్లు  హైకోర్టు తలుపు తట్టారు.    అయితే ఎన్జీవో ల సభకి అనుమతినిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలబాన్లకి చెంప  పెట్టు !     కోర్టు తీర్పు సంగతి ఎలా వున్నా ఇక్కడ గమనించ వలసిన సంగతి - తెలబాన్ల అసహనం.... తెలంగాణా రాకముందే ఇన్ని వేధింపులు చేస్తున్న వారు రాష్ట్రం విడి పోయాక సీమాంద్రులను, సీమాంధ్ర ఉద్యోగులను బతకనిస్తారా? 

Thursday, September 5, 2013

కోటి రత్నాల అబద్ధపు ప్రచారం !

అడ్డగోలు విభజనకి వ్యతిరేకంగా యావత్ సీమాంధ్ర దేశంలో ఎప్పుడూ లేని విధంగా వుద్యమిస్తోంది. అధికారం వుందన్న్న అహంకారంతో ఏమి చేసినా చెల్లిపోతుందనే భావనతో  అధిష్టానం తల పెట్టిన విభజన ప్రతిపాదన వారికే తల కొరివి గా మారే పరిస్థితి వచ్చింది.  అబద్ధపు ప్రచారాలతో హైకమాండు ని తప్పుదోవ పట్టించి విభజన వూబి లోకి దించిన ఘనత తెలబాన్లదే.  గుండె ఘోష చేసిన తాటాకు చప్పుళ్ళు ముందు టపాలో చూసాం.  ఇప్పుడు కోటి రత్నాల వీణ వాయిస్తున్న అబద్ధపు ప్రచారాలేమిటో  చూద్దాం :

http://kotiratanalu.blogspot.in/2013/09/blog-post_2692.html

1) ఉన్నపళంగా పొమ్మంటే ఎక్కడికి పోతాం:
ఇదొక అసత్యపు, అర్ధం లేని, మూర్ఖపు వాదన. కాస్తో కూస్తో రాజకీయ ప్రగ్నానం ఉన్నవాళ్ళు ఎవ్వరైనా నవ్వుకునే వాదన. రాష్ట్రం విభజించబడ్డంతమాత్రాన హైదరాబాద్‌లోని సీమాంధ్రులను ఎవ్వరూ ఎక్కడికీ వెళ్ళమనడం లేదు, వారు కూడా ఎవ్వరు ఎక్కడికీ వళ్ళారని వారికీ తెలుసు. అసలా మాటకొస్తే హైదరాబాదులో ఏళ్ళతరబడి ఉంటున్నవారికెవరికీ వదిలి వెల్లాలనే భయం లేదు. కాకపోతే హైదరాబాదు సీమాంధ్ర సెటిలర్ల తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు భావిస్తున్న లగడపాటి లాంటి కొందరు సీమాంధ్ర నాయకులు, కొందరు స్వయంప్రకటిత మేధావి సంఘాధ్యక్షులూ ఇలాంటి అపోహలు కల్పిస్తున్నారు. మద్రాసునుండి విడిపోయినంతమాత్రాన అక్కడి తెలుగువారందరూ మద్రాసు నగరం విడిచి ఆంధ్రాకు రాలేదు. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మాత్రం ప్రభుత్వాలు వేరవుతాయి కనుక సహజంగా సీమాంధ్ర నేటివిటీ ఉన్నవారు సీమాంధ్ర ప్రభుత్వంలో పనిచేయాల్సి ఉంటుంది. వారికి కూడా పదేళ్ళు ఉమ్మడి రాజధాని కనుక హైదరాబాదులో ఉండే వెసులుబాటు ఉంది.

కాస్తో కూస్తో రాజకీయ ప్రజ్ఞానం వున్న ఎవరికైనారాష్ట్రం విడి పొతే సీమాంధ్రులు ద్వితీయ శ్రేణి పౌరుల వలె మనుగడ సాగించాలన్న కఠోర వాస్తవం అర్ధమౌతుంది. తెలంగాణా ప్రకటన వచ్చిన మరుక్షణం ముఖ్య మంత్రి అంతటి వాడినే టిఫిన్ సెంటర్ పెట్టుకోమన్నాడు తెలబాన్ నాయకుడు.ఇంక సామాన్య సీమాంధ్ర పౌరుడి గతి ఏమిటి ? మద్రాసు నగర అభివృద్ధిలో తెలుగు వారి పాత్ర ఎంతో వుంది. అయినా కొత్తగా తెలుగు రాష్ట్రం ఏర్పడినప్పుడు - కొత్త రాష్ట్రమే కొత్త రాజధాని చూసుకోవాలన్న ఇంగిత జ్ఞానంతో ఆంధ్రులు వ్యవహరించి ఎన్నో కష్ట నష్టాలకోర్చి మొదట కర్నూలు ఆ తరువాత హైదరాబాదు లో తమ రాజధాని ఏర్పాటు చేసుకొన్నారు. అంతే తప్ప సమిష్టి కృషితో అభివృద్ది చెందిన రాజధానిని కాజేద్దామని ఎప్పుడూ అనుకోలేదు. 

2) ఉమ్మడిగా అభివృద్ధి చేసుకున్నాం, ఇప్పుడు మొత్తంగా మీరే కొట్టేస్తే ఎలా?
1956లో తెలంగాణ, ఆంధ్రా కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ నిధులు (హైదరాబాదుతో సహా) తెలంగాణాలో, ఆంధ్రా నిధులు ఆంధ్రాలో ఖర్చు పెట్టాలి. ఆనిబంధన పాటించినట్టయితే ఎలాంటి పంచాయితీ ఉండేది కాదు. కానీ వాస్తవానికి తెలంగాణ నిధులు ఆంధ్రాకు తరలించబడ్డయి తప్ప ఆంధ్రా నిధులు హైదరాబాద్ రాలేదు. కనుక ఆంధ్రావారు తమ సొమ్ముతో హైదరాబాద్ బాగుపడ్డది అనే అపోహ తొలగించుకుంటే మంచిది.  ఇక ఇక్కడికొచ్చి ఒక ఇళ్ళు కట్టుకున్నా, ఒక కంపెనీ పెట్టినా అది వారి సొంత లాభానికి తప్ప సిటీని అభివృద్ధిచెయ్యడం కోసం కాదు. ఆంధ్రా వ్యాపారులకంటే ఎన్నోరెట్లు ఎక్కువగా మల్టీనేషనల్స్ ఇక్కడ పెట్టుబడి పెట్టారు. వారు పెట్టింది లాభాలకోసమే, తెలంగాణవస్తే వాల్ల లాభాలకు ఢోకా లేదని తెలుసుకనుక వారెవ్వరూ చింతించట్లేదు.  హైదరాబాదులో వచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, మెట్రో రైలు లాంటి ప్రాజెక్టులు అన్నీ ఇక్కడి జనాభా అవసరానికి అనుగుణంగా సహజంగా ఇతర మెట్రోసిటీల లాగానే వచ్చిన ప్రాజెక్టులు. వాటికి పెట్టుబడులు బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ ప్రకారం ఆయా కంపెనీలు పెట్టడమో, లేక అంతర్జాతీయ బ్యాంకులద్వారా ఋణాలు సేకరించడం ద్వారానో జరిగింది. ఆ అప్పులు ఎలాగూ తెలంగాణ రాష్ట్రానికే వస్తాయి కనుక ఈప్రాజెక్టులగురించి కూడా సీమాంధ్రులకు చింత అవసరం లేదు. 


ఇటువంటి అబద్ధపు అసత్య గోబెల్స్ ప్రచారాలతోనే ఉద్యమాన్ని నడిపెసారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక చదివి అర్ధం చేసుకున్న వాళ్ళెవరూ ఇటువంటి వ్యాఖ్యానాలు చెయ్యరు. కేంద్రం కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదికని పార్లమెంటులో చర్చకి పెట్టి వుంటే దేశం మొత్తానికి నిజాలెమిటో తెలిసేవి. రాజధాని హోదాలో వచ్చిన ఆదాయాన్ని, సౌకర్యాలని తమ ఖాతాలో వేసుకొని తక్కిన రాష్ట్రాన్నంతా తామే పోషిస్తున్నట్లు చేస్తున్న అబద్ధపు ప్రచారాలన్నీ వట్టివే అని శ్రీ కృష్ణుడు తేల్చేసాడు. 

3) హైదరాబాదు లాంటి మరో రాజధానిని నిర్మించుకోవాలంటే ఎన్నేళ్ళు పట్టాలి?
నాలుగొందల ఏళ్ళు పడుతాయి. ఎందుకంటే హైదరాబాదు కూడా నాలుగొందల ఏళ్ళతరువాతనే ఇలాగుంది. కాకపోతే ఒక రాజధానికి ఇంతపెద్ద నగరం అవసరం లేదు. గుజరాత్ లాంటి ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రానికి కూడా ఉన్న రాజధాని అతిచిన్న నిగరం.  నిజానికి ఒక ప్రణాలిక లేకుండా ఇలా పెరిగిన ఈహైదరాబాదు నగరంలో లాభాలకంటే నష్టాలే ఎక్కువ. దీనికంటే చిన్న చిన్న నగరాలు ఎక్కువ అభివృద్ధి చేసుకుంటే సుఖంగా ఉంటుంది. సీమాంధ్రలో ఎలాగూ అనేక చిన్న నగరాలు ఉన్నాయి. 

హైదరాబాదు నగరం వయసు 400 ఏళ్ళు. కానీ 350 సంవత్సరాల తర్వాత ఎలా వుంది .. మిగిలిన 50 ఏళ్లలో ఎలా మారింది అన్నది చెప్పనక్కరలేదు. ఆ వివరాలు కూడా శ్రీ కృష్ణ కమిటీ నివేదిక 6 వ అధ్యాయంలో వివరంగా వున్నాయి. హైటెక్ సిటీ వచ్చిన తరువాత ఐటీ రంగంలో బెంగళూరు ని హైదరాబాదు తలదన్నిన విషయం అందరికీ తెలుసు. అంతర్జాతీయ కంపెనీలెన్నో బెంగళూరు ని కాదని హైదరాబాదులో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసాయి. రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న సాఫ్ట్ వేర్ రంగ ఎగుమతుల్లో 98 శాతం కేవలం హైదరాబాదు నగరం నుండే జరుగుతున్నాయి అని శ్రీ కృష్ణ కమిటీ నివేదిక తేల్చింది. అయినా లాభాల కంటే నష్టాలే ఎక్కువ వున్నప్పుడు హైదరాబాదు గురించి అంత మంకు పట్టు ఎందుకు? అక్కడే వుంది అసలు మతలబు! 

4) ఉద్యోగావకాశాలన్ని హైదరాబాదులోనే ఉన్నాయి 
ఐటీ, ఫార్మా రంగాల్లో హైదరాబాదులో ఉన్న అవకాశాలగురించి ఈఏడుపు. అయితే ప్రైవేటు ఉద్యోగాలకు ప్రభుత్వ ఉద్యోగాళ్ళా నేటివిటీ నిబంధనలేవీ లేవు. మబవాళ్ళెందరో రోజూ బెంగుళూరు, నోయిడాల్లాంటి నగరాల్లో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. కనుక రేపు వేరే రాష్ట్రమయినా హైదరాబాదుకు సీమాంధ్ర యువకులు వచ్చి ఉద్యోగాలు వెతుక్కోవచ్చు. ఇక్కడ సీమాంధ్రలో లాగా ఫాక్షనిజం రౌడీయిజం లేవు కనుక ఎవరైనా ప్రశాంతంగా బతుకొచ్చు. అందుకే ఈనగరం అభివృద్ధి చెందింది

ఇక్కడ ఫాక్షనిజం, రౌడీయిజం లేక పోవచ్చు. కానీ వెర్రి తలకెక్కిన వేర్పాటు వాదం, సీమాంధ్రుల పట్ల వల్ల మాలిన విద్వేషం పుష్కలంగా వున్నాయి. ఒక తాజా ఉదాహరణ - ప్రస్తుతానికి సమైక్యంగా వున్న ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అనుమతితో, తమ రాజధానిలో, జరపదలుచుకున్న సమావేశం పట్ల తెలబాన్లు ప్రవర్తిస్తున్న తీరు! సాక్షాత్తూ కేంద్రమే తెలంగాణా ఇవ్వటానికి పరుగులు పెడుతున్న సమయంలో తమ నిరసన తెలపటానికి చిన్న ఉద్యోగులు జరుపుకొనే సమావేశం పట్ల తెలబాన్లు చూపిస్తున్న కక్ష సాధింపు ధోరణి వారి భవిష్యత్ కార్యాచరణ ని చెప్పకనే చెపుతోంది. బందులు, రహదారి దిగ్బంధనాలు ప్రకటించటమే గాక తన్నులు తంతామని కూడా ఓయూ జేఏసీ బరితెగించి చెప్పింది. ఇదేనా కడుపులో పెట్టుకొని చూసుకోవడమంటే? 

5) ఆదాయంలో డెబ్బై శాతం హైదరాబాదునుండే!
రాష్ట్ర ఆదాయంలో ఎక్కవ భాగం హైదరాబాదు నుండి రావడం ఇప్పుడు మొదలు కాలేదు, 1956 నుండే ఉంది. ఆ ఆదాయం చూసే అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్ర నాయకులు వచ్చి తెలంగాణను కలుపుకున్నారు. అయితే ఇప్పుడొస్తున్న ఆదాయంలో కూడా ఎక్సైజ్, సేల్స్ టాక్స్ లాంటి ఆదాయాలు ఆఫీసు ఆంధ్రాలో ఉన్నా హైదరాబాదు కిందే వాస్తాయి. అయితే రాష్ట్ర విభజన తరువాత అవి సీమాంధ్ర అక్కౌంటు కిందికి వస్తాయి కనుక ఆదాయం గురించి చింత పడాల్సిన అవసరం లేదు. 

6) ఆంధ్రప్రదేశ్ రాజధాని కనుకనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది
ఇదొక పచ్చి అబద్దం. 1956లోనే హైదరాబాదు దేశంలో ఐదవ పెద్దనగరం. మిగతా పెద్ద నగరాలు ఏరేటులో అభివృద్ధి చెందాయో హైదరాబాదు కూడా అంతే ( కాస్త తక్కవే) రేటులో పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి కాకుండా ఇన్నాళ్ళూ తెలంగాణ రాజధానిగా ఉన్నా హైదరాబాదు ఇలాగే ఉండేది. కర్నూలు ఆంధ్ర రాజధానిగా కొనసాగిన అది సుమారు అలాగే ఉండెది, కాకపోతే కాస్తడబ్బొచ్చిన తరువాత డేఋఆలకు బదులు బిల్డింగులు కొన్ని కట్టేవారేమో.
నగర అభివృద్ధి రాజధాని వలన అవదు. వ్యాపార అవకాశాలు, కొత్తవారిని చేర్చుకోవడంలో ప్రజల కలుపుగోలుతనం, భౌగోళిక స్థితిగతులు లాంటి వాటిపైన అభివృద్ధి చెందుతుంది. అలాగే ఐటీ,ఫార్మా కంపెనీలు టాలెంట్ పూల్ లభ్యమయ్యేదగ్గరే ఏర్పడతాయి. అవన్నీ హైదరాబాదుకు ఉన్నాయి గనుకే హైదరాబాదు అభివృద్ధి చెందింది. 
అన్నింటితోబాటు హైదరాబాదు చుట్టు పక్కల కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు సరిపడే స్థలం ఉంది. అది ఆంధ్రా సిటీల్లో దొరకదు. 

1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు చేసినపుడు తెలంగాణా ప్రాంతాన్ని 5 సంవత్సరాలు ప్రత్యేకంగా వుంచి ఆ తరువాత ఆ రాష్ట్ర శాసన సభ అనుమతితో ఆంధ్రలో విలీనం చేయమని ప్రతి పాదన జరిగింది. అయితే ఐదేళ్ళు కూడా ఆగకుండా బేషరతుగా వెంటనే విలీనానికి వచ్చి ఇప్పుడు హైదరాబాదు స్వయం సమృద్ధం అయ్యాక పొమ్మంటే అర్ధమేమిటి? ఇంకా ఆదాయం విషయంలో కూడా శ్రీ కృష్ణ కమిటీ నివేదికే సమాధానం. రాజదానికి వచ్చే ఆదాయాన్ని తమ ప్రాంత ఆదాయంగా పరిగణించటం వాపుని చూసి బలుపు అని భ్రమించటమే! అసలు ఆదాయ వనరులు, నదీ జలాల పంపిణీ వంటి ముఖ్యమైన పంపకాలు చెయ్యకుండా కేంద్రం విభజన ప్రతిపాదించటమే మూర్ఖత్వం. 23 జిల్లాలతో కూడిన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అన్న హోదా లోనే హైదరాబాదు కి ఈ ఆదాయం , అభివృద్ది సంప్రాప్తించాయి. 1956 లోనే కాదు 2009 వరకు కూడా హైదరాబాదు దేశంలో 5 వ పెద్ద నగరం. మరి ఈ రోజు పరిస్థితి ఏమిటి? వేర్పాటు వాదుల విద్వంసక చర్యలతో మనకు రావలసిన వ్యాపారాలు, పరిశ్రమలు ఎన్నో గుజరాత్ కి తరలి పోయాయి. అభివృద్ధిలో దశాబ్దాల వెనక్కి వెళ్లి పోయాం. ఏమైనా రాజధాని విషయంలో మరోసారి మోస పోవటానికి సీమాంధ్రులు సిద్ధంగా లేరు. 

హైదరాబాదు కై "గుండె ఘోష "!


కేంద్రం ప్రతిపాదించిన ఏక పక్ష విభజన ప్రతిపాదనతో సీమాంధ్రుల గుండెలు రగులుతుంటే "గుండె ఘోష" చేస్తున్న వెటకారం! : 

http://telangaanaa.blogspot.in/2013/09/blog-post.html

ఆ గుండె ఘోష తాలూకు తాటాకు చప్పుళ్ళ   మర్మమేమిటో చూద్దాం: 


సమానంగా న్యాయం ఎలా చేత్తార్రా?
ఇప్పుడొక పండుందనుకో... దాన్ని సమానంగా రెండు ముక్కలు చేసి పంచడమే సమన్యాయం అంటే.
అంటే ఆ పండెవరిదయినా రెండు ముక్కలు చేయాలా?
అంటే?
ఆ పండు నీదనుకో. నేనొచ్చి అది నాదే అని వాదించాను. ఇద్దరం కోర్టు కెళ్ళాం. అప్పుడు కోర్టు సమన్యాయం ఎలా చేయాలి? ఆ పండు చెరిసగం కోసిస్తే సమన్యాయం అవుతుందా?
ఎలా అవుతుంది మావా? ఆ పండు నీది అయితే, అది నీకిస్తేనేగా సమన్యాయం అయ్యేది?

అదేరా నేను చెప్పేదీ! ఇప్పుడు చెప్పు హైదరాబాదు ఎక్కడుంది?
తెలంగాణలో!
మరి విడదీసి నప్పుడు అది తెలంగాణాకు చెందాలా, చెరిసగం పంచాలా?


నాలుగు వందల ఏళ్ల నగరం హైదరాబాదు! నగరం ఏర్పడ్డ 350 ఏళ్ళ వరకు ఎలా వుంది - గత 56 సంవత్సరాల్లో తెలుగు ప్రజలందరి సమిష్టి కృషితో ఇప్పుడెలా అభివృద్ది చెందింది అన్నది ఆలోచించకుండా భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో ఉన్నంత మాత్రాన విత్తు నాదే-ఫలము నాదే అంటే ఎలా కుదురుతుంది?

న్యాయంగా తెలంగాణాకే ఇవ్వాలి. కాని మన జమీందార్లు అక్కడ పెట్టుబడులు పెట్టి బిజినేసులు పెట్టుకున్నారు కదా? అయ్యేమై పోవాల?
ఏమై పోతాయి? న్యాయంగా సంపాదించుకుంటే వాళ్ళకే ఉంటాయ్. దొంగ సొత్తు అయితే తెలంగాణా గవర్నమెంటు జప్తు చేస్తది.

2009 తరువాత ఇటువంటి తెలబాన్ రాళ్ళ దెబ్బలకి భయపడే రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలు, వ్యాపారాలు గుజరాత్ కి తరలి పోయాయి.  దొంగ సొత్తుతొ వ్యాపారాలు చేస్తున్న మాట నిజమైతే 100 మందికి పైగా వున్న తెలంగాణా ప్రాంత శాసన సభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఇన్నాళ్ళూ ఏం చేస్తున్నారు?  చోద్యం చూస్తూ కూచున్నారా? ఇప్పుడే తెలిసిందా దొంగ సొత్తు అని ?     


మరి మలక్ పేటలో ఇస్త్రీ చేసుకుని బతుకుతున్న మన మద్దులేటిని ఎలగొడతారట గదా?
పొట్టలు గొట్టేవాన్ని ఎలగోడతారంటే నమ్మొచ్చు, కాయ కష్టం చేసుకుని బతికేవాన్ని ఎవరేమంటార్రా?

కాయ కష్టం చేసుకుని బతికే వాణ్ని ఏమీ అనరు.  కానీ ఉద్యోగులని మాత్రం వెళ్ళ గొడతారు.  చివరికి ముఖ్యమంత్రి అయినా సరే కర్రీ పాయింటు పెట్టుకొని బతకాలి ఇక్కడ! 
   

అయినా సరే! హైదరాబాదు వాళ్లకు వదిలి పెట్టాలంటే బాధేస్తుంది బాబాయ్!
 ఒరే! తిరుపతి వెంకటేశుడికి కోట్ల ఆస్తి జమ పడింది కదా? అదంతా ఒక్క ఆంధ్రోల్లదేనా?
ఎందుకవుద్ది? తెలంగాణా వాళ్ళు, తమిళులు, కన్నడులు, ఉత్తర భారద్దేశం వాళ్ళు కూడా వచ్చి కానుకలు వేస్తారు కదా?
మరి మా ఆస్తులు ఇక్కడ పొగడ్డాయి కాబట్టి తిరుపతి మాదే అని ఎవరైనా అంటే ఎలాగుంటది?

బుద్ది, జ్ఞానం వున్న వాడు చెప్పే మాటలు కావు ఇవి! తిరుపతి మాదే - ఇతర ప్రాంతాల వారు రాకూడదు అని ఎవరైనా ఎప్పుడైనా అన్నారా? దేవుని హుండీకి ప్రజల ఆస్తులకీ ఏమైనా సంబంధం ఉందా ? దేవుని సొమ్ములో ప్రభుత్వ జోక్యం ఎప్పుడైనా ఉందా? తి తి దే పాలక మండలి ఆధీనంలో ధర్మ ప్రచారానికై భగవంతుని సొమ్ము వినియోగిస్తారు... అంతే తప్ప తక్కిన తక్కిన విషయాలతో దేవును సొమ్ముని పోల్చి చూడటం దైవాపరాధమే! 

రక్తం మరుగుద్ది? నాలుగు తన్నాలనిపిస్తది?
మరి హైదరాబాదు కావాలంటే వాళ్ళకే మనిపిస్తది?
నిజమే బాబాయ్!!

ఇది మాత్రం నిజమే! సీమాంధ్రుల రక్తం మరుగుతోంది. నాలుగు తన్నాలని కూడా అనిపించినా విజ్ఞత అడ్డు వచ్చి కేంద్రంతో న్యాయ పోరాటం చేస్తున్నారు సీమాంధ్రులు.. సత్యమేవ జయతే !

ఉద్యోగుల సమావేశం పై ఉలుకెందుకు ?

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రం ప్రకటన చేసింది. కేంద్ర ప్రకటన మాత్రమె జరిగింది. ఇంకా రాష్ట్రం ఏర్పాటు కాలేదు. రాష్ట్ర ఏర్పాటు కోసం జరగ వలసిన రాజ్యాంగ ప్రక్రియ ఇంకా చాలా వుంది. అందు వల్లనే రాష్ట్ర విభజన పై కోర్టు ముందుకి వెళ్ళిన రెండు కేసులని కొట్టి వేయటం కూడా జరిగింది. ప్రస్తుతానికి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగానే వుంది. పాలనలో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం వుంది.  ఈ పరిస్థితిలో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు చర్చించుకోవటానికి తమ రాజధాని నగరం లో ఒక సమావేశం పెట్టుకుంటే తెలబాన్ గుంపులకి ఉక్రోష మెందుకో అర్ధం కాదు.  సమావేశం జరగనివ్వమంటూ హెచ్చరికలు చెయ్యటంతో పాటు ముందురోజు నుండి 48 గంటల బంద్ ప్రకటించేశారు! పోటీ గా శాంతి ర్యాలీ అంటూ చేయబోతే పోలీసు అనుమతి ఇవ్వలేదని నానా యాగీ చేస్తున్నారు.  గతంలో మిలియన్ మార్చ్ పేరుతొ ప్రశాంతంగా ర్యాలీ చేస్తామని మభ్య పెట్టి టాంకు బండ్ పై విగ్రహాలు కూల్చిన చరిత్ర వారిది!  ఇటువంటి చరిత్ర వున్న వారికి అనుమతి వస్తుందని ఎలా భావిస్తారు?     ఈ రోజు  సాక్షాత్తూ కేంద్రమే తెలంగాణా ఏర్పాటుకు శర వేగంతో చర్యలు జరుపుతున్నప్పుడు ప్రశాంతంగా ఉండకుండా ఇలాంటి  రెచ్చగొట్టే చర్యలు చెయ్యబట్టే సీమాంధ్రుల-ఉద్యోగుల ఆందోళనలు   మిన్నంటుతున్నాయి.  ఓ పక్క విద్వేషాగ్నిని ఎగదోస్తూ  విభజనకి సహకరించాలని కోరటం తెలబాన్లకే  చెల్లింది.  కీలకమైన ఈ సమయంలో సంయమనం పాటించి సహకరించక పొతే విభజనకి సీమాన్ధ్రులు ఒప్పుకుంటారా?  నిజం చెప్పాలంటే ఇప్పటి వరకూ తెలబాన్లు జరిపిన ఉద్యమం వారికి ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం  కోసం కాదు.    సీమాన్ద్రులకి ప్రత్యెక రాష్ట్రం ఇచ్చి తమ ప్రాంతం నుండి గెంటి  వేయాలని జరిగిన ఉద్యమం అది.   కేంద్రం కూడా  సీమాంధ్ర కి సరైన న్యాయం చెయ్యకుండా విభజన ప్రతిపాదించినప్పుడు నిరసన లు తెలిపే హక్కు అన్ని వర్గాల వారికీ వుంటుంది.  నిరసనలు తెలపటానికి కూడా అనుమతించమంటూ రగడ సృష్టిస్తే  విభజన ప్రక్రియ ముందుకు సాగటం అసంభవం... 

Wednesday, September 4, 2013

తెలబాన్ దురహంకారం - సీమాంధ్ర సంస్కారం!

సీమాంధ్రులని కడుపులో పెట్టుకొని చూసుకొంటాం అంటున్న తెలబాన్లు రాష్ట్రం రాక ముందే ఎలా ప్రవర్తిస్తున్నారో నిన్నటి  టపాలో  చూసాం .



నెత్తి మీద విభజన కత్తి  వేళాడుతున్నా, రాజధానిలో సీమాంధ్రుల కి అవమానం జరిగినా  సహనం కోల్పోకుండా సీమాంధ్రులు చూపిన సంస్కారం ఇది! 


ఎవరు ఎవరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటారో స్పష్టమై పోయింది కదా!