Sunday, September 29, 2013

సుష్మా స్వరాజ్ శుష్క ప్రసంగం !

మహబూబ్ నగరులో జరిగిన ప్రజా గర్జన సభలో మాట్లాడుతూ  ఒక్క చుక్క రక్తం చిందకుండా మూడు రాష్ట్రాలు ఇచ్చేసామని గొప్పలు చెప్పుకున్నారు సుష్మా స్వరాజ్.   అయితే  తాము ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాల నేపధ్యానికీ,  ప్రస్తుత ఆంద్ర ప్రదేశ్ విభజన నేపధ్యానికి వున్న తేడా ఆవిడకి తెలియకపోవటం ఆశ్చర్యం.   

1) 2000 సంవత్సరంలో ఎన్డీఏ మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయటానికి ముందు  ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాటి శాసన సభల్లో విభజన కోసం ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపటం జరిగింది.  అంతే కానీ రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో నిమిత్తం లేకుండా దొడ్డి దోవన కేంద్రం స్వంతంగా వాటిని ఏర్పాటు చేయడమనే  దుష్ట సాంప్రదాయం అమలు జరగలేదు. 

2) మూడు రాష్ట్రాల విషయంలో కూడా విభజన జరిగిన రెండు ప్రాంతాల పరస్పర అంగీకారంతోనే విభజన ప్రక్రియ జరిగింది తప్ప ఏదో ఒక ప్రాంత ప్రయోజనాలకి కొమ్ము కాస్తూ రాష్ట్రాలని ఏర్పాటు చెయ్యలేదు. 

3) విభజన వల్ల ఏర్పడ్డ మూడు కొత్త రాష్ట్రాలే కొత్త రాజదానులని ఏర్పాటు చేసుకున్నాయి తప్ప  సంపూర్ణంగా అభివృద్ది చెందిన రాజధాని ని కాజేస్తూ తల్లి రాష్ట్రాన్నేతన్ని తగలేసే విధంగా   ఏ ఒక్క రాష్ట్రమూ ఏర్పాటు చేయబడలేదు.  

విభజనల నేపధ్యంలో ఇన్ని వైరుధ్యాలు వున్నా కూడా  చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయటంలో వారికే పేటెంటు హక్కు వున్నట్లు మాట్లాడుతున్న సుష్మా స్వరాజ్ గారు వారు ఏర్పాటు చేసిన రాష్ట్రాల వైభోగం ఎలా వుందో ఒక్కసారి  పునః పరిశీలించుకుంటే బాగుంటుంది.   వరదల సమయంలో ఉత్తరాఖండ్ చేతులెత్తేసింది. పూర్తిగా బయటనుంచి వచ్చిన సాయంతోనే వరద బాధితులకి సహాయం అందింది. చత్తీస్ ఘడ్ లో సల్వాజుడుం, కాంగ్రెస్ నాయకులని నక్సలైట్లు ఊచకోత కోసినా అడిగే దిక్కు లేదు.. ఇంక జార్ఖండ్ సంగతి చెప్పక్కరలేదు. 13 సంవత్సరాల కాలంలో 5 మంది ముఖ్య మంత్రులు 9 సార్లు గద్దెనెక్కడమే గాక మధ్యలో 3 సార్లు రాష్ట్రపతి పాలనకు గురి అయ్యింది. నిజానికి  భారత దేశంలో ఇప్పుడు చిన్న రాష్ట్రాలు అన్నది failed concept.  ఇక భారత దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు  అన్నది రాజకీయ నాయకులకి పునరావాస కేంద్రాలుగా తప్పితే ప్రజలకి ఎంత మాత్రం ఉపయోగం లేనే లేదు. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సీమాంధ్ర ఉద్యమ ఉధృతికి కాంగ్రెస్ తోక ముడిచినట్లే  బీజేపీ కూడా పంధా మార్చుకోక తప్పదు.  మార్చుకోని పక్షంలో సుష్మా స్వరాజ్  డిసెంబరు నెలలో గర్జనలు, భేరీలు, నగారాల తో  ఉద్యమానికి సిద్ధం కావచ్చు. 

3 comments:

  1. సీమాంధ్రలో ఉద్యమం జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో సుష్మా అసలు తెలంగాణ గర్జన సభకు ఎందుకు హాజరు అయినట్టు? వస్తే గిస్తే సీమాంధ్రకు వచ్చి అక్కడి ప్రజలకు స్వాంతన వచనాలు పలకాలి గానీ... తెలంగాణాకు వచ్చి బిల్లు పెడితే మద్ధతిస్తాం అని ప్రకటించడం అంటే సీమాంధ్ర ఉద్యమంలో మరింత పెట్రోలు చల్లినట్లు కాదా??

    ReplyDelete
  2. Mrs. Sushma Swaraj own state Haryana (1st Nov. 1966) has common capital with Punjab and it is agreed that Haryana will be a new capital after 10 years but it is not happened & the old Punjab state capital is still continuing!!!! So it is better first concentrate on new capital of Haryana and talk about AP.

    ReplyDelete
  3. I have a good idea for the Bharat Jehar Party (Indian Poison Party). this party can close its offices in the Andhra region for the next 100 years. Lot of money and time can be saved.Also, since this party has expertise in dividing people based on their desire, why cant we allow Kashmir to secede from India as the Kashmiri people are demanding a separate country for a long time. Just think over it division experts.
    BJP ka VIKAS DESH KA VINAASH.

    sreerama

    ReplyDelete