Sunday, September 29, 2013

సమైక్య ఉద్యమం లో అధిష్టానం కోవర్టులు ఎవరు ?


తెలంగాణా ఇస్తే అభ్యంతరం లేదు అంటూ కేంద్రానికి బ్లాంక్ చెక్ ఇచ్చింది చంద్ర బాబే! రాష్ట్ర విభజనకి పూర్తి బాధ్యత తెలుగు దేశం పార్టీ దే ! ఇప్పుడు చంద్ర బాబు ఎన్ని యాత్రలు, పర్యటనలు చేసినా సీమాంధ్రులు నమ్మరు
  --  కాంగ్రెస్,  వైఎస్ఆర్ కాంగ్రెస్     

అధిష్టానం ఏం నిర్ణయించినా సరే అని ముందు చెప్పి ఇప్పుడు విభజన ప్రతిపాదన జరిగిన  ఇన్ని రోజుల తరువాత సమస్యలు ఏకరువు పెట్టటంలో అర్ధం ఏమిటి ?  ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం ఆడిస్తున్న గేమ్ ప్లాన్ లో భాగమే.. కేంద్రం ఆడమన్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి ఆడుతున్నారు..
 -- వై ఎస్ ఆర్ కాంగ్రెస్,  టీడీపీ   

సమైఖ్యాంధ్ర ముసుగులో జగన్ కేంద్ర కాంగ్రెస్ కి రాష్ట్ర విభజనకి సహకరిస్తున్నారు.  అందుకే సీమాంధ్ర శాసన సభ్యుల సంఖ్యని తగ్గించే ఆలోచనతో తమ పార్టీ శాసన సభ్యుల రాజీనామాలు ఆమోదింప జేసుకొనే ప్రయత్నం చేసారు.
  -- టీడీపీ,  సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు  

 గత అరవై రోజులుగా సీమాంధ్ర ప్రాంతం మొత్తం ఏక ధాటిగా సమైక్యం కోసం మహోగ్రంగా వుద్యమిస్తుంటే -   ప్రజల ఆశలు, ఆకాంక్షలకి అనుగుణంగా వారికి మార్గ దర్శనం చేయ వలసిన ప్రధాన రాజకీయ పక్షాలు వ్యవహరిస్తున్న తీరు ఇది!

గత రెండు నెలలుగా జీతాలు లేకుండా ఉద్యోగులు/కార్మికులు, విద్యాలయాలు నడవకుండా విద్యార్ధులు, ఇంకా పాలనా పరమైన సౌకర్యాలు అందక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ కూడా - కేవలం రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న స్ఫూర్తితో వుద్యమిస్తుంటే - ప్రధాన పార్టీలకి చెందిన నాయకులు మాత్రం పదవులని అంటి పెట్టుకొని రాజీడ్రామాలు ఆడుతున్నారు. (హరికృష్ణ మినహాయింపు).  ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో కేంద్రం సాంప్రదాయ పద్ధతులకి తిలోదకాలు ఇచ్చి దొడ్డి దారిలో ఐనా రాష్ట్రాన్ని విభజించి పారేయాలని కుట్రలు పన్నుతున్న దశలో ఈ రాజకీయ పార్టీలు/నాయకులలో ప్రజల పక్షాన నిజాయితీగా ఎవరు నిలబడతారు అన్నది ప్రశ్నార్ధకమే !   రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండానే జరుగుతున్న ఉద్యమం దెబ్బకి కేంద్రం తోక ముడిచింది అన్నది స్పష్టం.  ఇటువంటి కీలక సమయంలో ఏ పార్టీకి చెందిన నాయకుడైనా రాజీనామా ఆమోదింప జేసుకొని ముందుకి వస్తే వారిని ఉద్యమం లో భాగస్వాములని చెయ్యాలే తప్ప సారధ్యం అప్పగించరాదు. ఒకసారి ఉద్యమ సారధ్యం రాజకీయుల చేతిలోకి వెళ్లిందంటే అంతే సంగతులు.. ఖచ్చితంగా శల్య సారధ్యం వహించి  పుట్టి ముంచేయటం  ఖాయం.  ఈ విషయం దృష్టిలో వుంచుకొని ఉద్యోగులు, ప్రజలు కూడా రాజకీయుల ప్రమేయం లేకుండా స్వంత మార్గంలోనే ముందుకు సాగితే సమైక్య రాష్ట్ర సాధన తధ్యం... విజయోస్తు ! 

5 comments:

  1. adharmam ennatikee gelavadu!!!

    ReplyDelete
  2. ఇప్పుడు సీమంధ్ర ప్రజలు ఎవరకి వోట్ వెయ్యాలి? అందరూ కలిసి నిజాయితీ గా రాష్ట్రం కోసం పని చేసే వాళ్ళకి వేస్తె బాగుంటుంది. కానీ అలాంటి నాయకుడే కన్పించడం లేదు.
    JP ఉన్నాడు కానీ రాష్ట్రం విడిపోకుండా గట్టి లాబీ ని నడపలేడు. ఒక వేల రాష్ట్రం విడిపోతే పునర్నిర్మాణానికి లోక్ సత్తా ఒక ఉత్తమ ప్రత్యామ్నాయం. చంద్రబాబు కి రాష్ట్రాన్ని అభివృద్ది చేసిన అనుభవం ఉంది కాబట్టి కొంచెం మేలు. కానీ రాష్ట్ర విభజన నేపథ్యం లో తను అనుసరించిన పంథా సమర్థనీయం కాదు. అలా కాకుండా ప్రజలు మళ్లీ బొత్సనో, గజన్ నో గెలిపిస్తే రాష్ట్రం సాంతం నాకిపోయినట్టే.

    ReplyDelete
  3. #ఇప్పుడు సీమంధ్ర ప్రజలు ఎవరకి వోట్ వెయ్యాలి?

    MIM

    ReplyDelete
    Replies
    1. JAIL JAGAN OR KIRIKIRI KUMAR REDDY

      Delete
  4. first point it now Andhrites need to accept division and talk of equal rights for settlers, re-negotiating krishna water allocation, bhadrachalam, charla divisions to andhra...
    Regarding vote.
    1. they need to vote TDP, which will not go with congress for obvious reasons, in Seema and Andhra regions
    2. IN telangana region all Andhras in hyderabad region(26 mla seats)+settlers in nalgonda,mahaboobnagar+khammam to vote for MIM, yes MIM because its a minority party.

    ReplyDelete