Saturday, September 21, 2013

అరిచే కుక్క కరవదు !

52 రోజులుగా సీమాంధ్ర ప్రాంతమంతా ఊరు వాడ ఏకమై చేస్తున్న మహోద్యమం తో కేంద్రానికి కాలు చెయ్యి ఆడటం లేదు.  అడ్డగోలు విభజన ప్రతిపాదించి అడుసు తొక్కిన కాంగ్రెస్ ఇప్పుడు కాళ్ళు ఎలా కడుక్కోవాలో తెలీక సతమతమవుతోంది. చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలమన్న బీజేపీ కూడా తాము రాష్ట్రాలు ఇచ్చినపుడు ఎటువంటి గొడవలు జరగలేదని, ఇప్పుడు సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించకుండా ముందుకు వెళ్ళటం కష్టమే అని సన్నాయి నొక్కులు మొదలు పెట్టింది.  కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వక పొతే తాము ఇచ్చి తీరతామని చెప్పిన బీజేపీ కూడా మడమ తిప్పెయ్యటంతో కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా అయ్యింది.     ఆంధ్రులని ఆరంభ శూరులుగా జమ కట్టి  ఎక్కువ కాలం   వుద్యమించలెరన్న తప్పుడు అంచనాతో ఏకపక్ష విభజనకి ఒడి గట్టిన కేంద్రం, ఇప్పుడు   పరువు కాపాడుకోవటానికి టీవీల ముందు  రోజుకో  నాయకునితో  తెలంగాణా పై వెనక్కి తగ్గేది లేదన్న ఉత్తర కుమార ప్రతిజ్ఞలు చేయిస్తోంది.  ఓటి కుండకి మోతలెక్కువ అన్నట్లు  వెనక్కి వెళ్ళలేం అని ఎంత మంది కాంగ్రెస్ నాయకులు చెప్తుంటే --  అంత ముందుకి సమైక్య ఉద్యమం ఉరకలేస్తోంది ! రాజకీయ నాయకుల ప్రమేయం అన్నది లేకుండా కేవలం ప్రజలు, ఉద్యోగులు స్వచ్చందంగా నడిపిస్తున్న ఇటువంటి ఉద్యమం న భూతో అనే చెప్పాలి.  
నిజంగా కాంగ్రెస్ కి తెలంగాణా ఇచ్చే ఉద్దేశ్యమే వుంటే విభజన ప్రతిపాదన ఏకపక్షంగా చేసేదే కాదు!  సీమాంధ్ర లో ఉద్యమం వస్తే బలగాల సాయంతో అణచి వేసి విభజన పై ముందుకు సాగుదామనుకున్న కేంద్రానికి  -  ఎటువంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా కొనసాగుతున్న సమైక్య ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా పాలుపోవట్లేదు.. పదవులని వదలి పెట్టకుండా సీమాంధ్ర నాయకులు మొహం చాటేసినా కూడా నాయకత్వ లేమి అన్నది కనపడకుండా సాగుతున్న ఉద్యమ ఉధృతికి కేంద్రం తల వంచక తప్పదు.    జూలై 30 ప్రకటనకి ముందు 15 రోజుల్లో చక చకా పావులు కదిపేసి  నిర్ణయం ప్రకటించేసిన కాంగ్రెస్ 52 రోజులైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ప్రవర్తించడం ఖచ్చితంగా వెనకడుగు వేయడమే!  కేంద్రం మెడలు వంచి విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేలా ఉద్యమించే సత్తా తెలుగు వాని సొంతం.  ఆ మంచి రోజు ఎంతో దూరంలో లేదనటంలో ఏ మాత్రం సందేహం లేదు..     

11 comments:

  1. గత పదేళ్లుగా మీరు ఇదే కాన్ఫిడెన్సుతో ఉన్నారు, ఇక ముందు కూడా ఇలాగె ఉండాలి, నెమ్మది నమ్మదిగా తెలంగాణా ప్రక్రియ పూర్తీ అయినా మీరు మాత్రం ఇదే ధిమాతో ఉండాలి, ఏ మాత్రం తగ్గొద్దు కామ్రేడ్, లాల్ సలాం.

    ReplyDelete
  2. "సీమాంధ్ర ప్రాంతమంతా ఊరు వాడ ఏకమై చేస్తున్న మహోద్యమం"

    రామన్న గారూ, మీది బెజవాడ కాదనుకుంటా.

    http://jaigottimukkala.blogspot.in/2013/09/reporting-from-vijayawada.html

    ReplyDelete
    Replies
    1. ఆగష్టు 30 న కాదు.. నిన్న బెజవాడ లో జరిగిన సమావేశం చూడలేదా ?

      http://www.eenadu.net/district/inner.aspx?dsname=Krishna&info=kri-panel1

      http://epaper.sakshi.com/apnews/Vijayawada/21092013/8

      Delete
    2. అంటే ఆగస్టు 30 నాడు ఏమీ లేదని ఒప్పుకున్నారా?

      ఇంతకంటే ఎన్నో రెట్లు పెద్దవి ఎన్నెన్నో తెలంగాణాలో జరిగాయి. మచ్చుకు http://jaigottimukkala.blogspot.in/2012/10/telangana-march-first-hand-account.html చూడండి.

      మీరు స్వయంగా ఏవీ చూడలేదనీ, మీడియాలో చూసి రాస్తున్నారనీ అనిపిస్తుంది. ఈ తడవ మీరూ కాస్త వెళ్ళిచూస్తే బాగుంటుందేమో ఆలోచించండి.

      Delete
  3. పాడిందే పాడరా పాచి పళ్ళ గొట్టిపాటి

    ReplyDelete
  4. జై గారు మీరు చెప్పిన రొజు నెను బెజవాడ చూడలెదు.
    ఆ రోజు ఆ టైం లో ఉండక పొవచ్చు . మిగతా అన్ని రోజులూ మీరు చూడట్లేదా?
    మాకు అనుకూలం గా లేనిదేదీ మేం చూడమంటారా మీ ఇష్టం.
    కాని నేను ప్రకటన వచ్చిన రోజు హైదరబాద్ లొ ఉన్నాను. ఏ సంబరాలు లేవు. కనీసం 10 మంది కూడా రోడ్డేక్క లేదు. 7/8 బైకు లు తప్ప. అవి కూడా టి.ఆర్.ఎశ్ కార్యకర్తలు వి మాత్రమే. ఇండియా వరల్డ్ కప్ గెలిచినపుడు కనీసం 20000 మంది యూత్ నేనున్న శెంటర్లో రోడ్డెక్కారు.

    60 ఎళ్ళ ఉద్యమం అన్నారు.ఎన్ని రోజులు రోడ్లపై ఉన్నారు?

    ReplyDelete
    Replies
    1. అవును ఆ రోజు రోడేక్కలేదు, ఎందుకంటే 2009లో జరిగిన అనుభవంతో బిల్లు పాసయ్యేవరకు ఎలాంటి ప్రకటనలు నమ్మే పరిస్తితి లేదు.

      Delete
  5. జై గొట్టిముక్కల గారికి ఆగస్ట్౩౦ బెజవాద ఒక “మధురా“నుభూతి లా మిగిలిపోయింది...ఆంద్రా అంతా ఆగస్ట్౩౦ లానె కనబడుతుంది...:) మంచిదే అలానే అనుకుందాం..ఆంధ్రా లొ ఏం జరగటం లేదు కాబట్తి మీరు పట్టించుకో నక్కరలేదు!!

    ReplyDelete
    Replies
    1. నాకు తెలిసిన వారు నెల్లూరు, బెజవాడ, అనంతపురం వెళ్ళితే వారికి కూడా ఏమీ అగుపదలేదండి. వచ్చేవారం పనిమీద విశాఖపట్నం వెళ్తున్నాను, అక్కడా "ఉద్యమం" కోసం వెతుకుతాను లెండి.

      పోనీ మీకు ఎక్కడయినా తారసపడితే చెప్పండి, విని తరిస్తాను.

      Delete
  6. ఇడిసెయ్ ర భై. మీలాగ 2000 మందితో మిలియన్ మార్చ్ చేయడం సీమాంధ్ర వాళ్ళకి రాదు కాదా. ఇడిసెయ్. దిమాక్ పాడు జేసుకోకు. ఎలాగు ఏమి అయితలేదు కదా. మంచిగా తొంగొ ఇంట్లో

    ReplyDelete
    Replies
    1. ఇరవై మందితో చేసి దానిని లక్షగాలార్చన అంటే 2000 మందితో చేస్తే మిలియన్ మార్చే గాదన్నా.

      Delete