Tuesday, September 3, 2013

తెలబాన్ మోడల్ పాలన!


తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రం ప్రకటన చేసింది.  కేంద్ర ప్రకటన మాత్రమె జరిగింది.  ఇంకా రాష్ట్రం ఏర్పాటు కాలేదు.   రాష్ట్ర ఏర్పాటు కోసం జరగ వలసిన రాజ్యాంగ ప్రక్రియ ఇంకా చాలా వుంది.  అందు వల్లనే రాష్ట్ర విభజన పై కోర్టు ముందుకి వెళ్ళిన రెండు కేసులని కొట్టి వేయటం కూడా జరిగింది.   ప్రస్తుతానికి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగానే వుంది. పాలనలో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం వుంది.  అయితే తెలబాన్ల కి ఈ విషయాలేమీ పట్టవు.  వారి  దృష్టిలో కాంగ్రెస్ ఒకే అంటే తెలంగాణా వచ్చేసినట్లే!  అందుకే అప్పుడే స్వంతంగా నియామకాలు కూడా చేసేస్తున్నారు.  ప్రభుత్వ ఉత్తర్వులతో పదవిలో నియమితులైన వ్యక్తులని కుర్చీనుంచి లాగి వేసి తమకి నచ్చిన వ్యక్తులకి నియామకం ఇచ్చేసి పూల బొకేలతో, మిఠాయిలతో అభినందనలు చెప్పేస్తున్నారు. 

http://www.sakshi.com/news/andhra-pradesh/telangana-versus-medical-jac-at-osmania-hospital-62480

 ఈ పని చేసింది ఏ చదువు రాని  వాడో  లేదా రాష్ట్రం ఇంకా రాలేదన్న విషయం తెలియని వాడో అనుకుంటే పొరపాటే!  మేధావి వర్గానికి చెందిన వైద్యులే ఈ పని చేసింది!  మేధావులే ఇలా వుంటే ఇంక సామాన్య తెలబాన్ల సంగతి ఏమిటి?  సీమాంధ్రులని కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్న నాయకుల మాటల పై భరోసా ఎలా వుంటుంది?  కోడిని కోసి - చికెన్ గా చేసి కడుపులో పెట్టుకుంటారు.  అలా కడుపులో పెట్టుకుంటారేమో  అన్న అనుమానం వస్తోంది ఈ సంఘటనలు చూస్తుంటే!              

15 comments:

  1. వారికి తూర్పు దక్షిణ జిల్లాలకు చెందిన వారంటే కడుపుమంట, అందుకేనేమో కడుపులో పెట్టుకుని చూసుకుంటామని చెబుతూ ఉంటారు.

    ReplyDelete
  2. " తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రం ప్రకటన చేసింది.
    కేంద్ర ప్రకటన మాత్రమె జరిగింది.
    ఇంకా రాష్ట్రం ఏర్పాటు కాలేదు.
    రాష్ట్ర ఏర్పాటు కోసం జరగ వలసిన రాజ్యాంగ ప్రక్రియ ఇంకా చాలా వుంది....."

    అహా .....
    ఏం గురివింద గింజ వాదనో
    మరి ఈ మాత్రానికే
    నెల రోజులుగా ఆర్టీసీ బస్సులను నిలిపివేయడం,
    ప్రభుత్వ కార్యాలయాలను, పాఠశాలలను బందు పెట్టడం ,
    వీధుల్లో ఈ ఈవెంట్ మెనేజ్మెంట్ ప్రదర్శనలు చేయదం ,
    తాలిబన్ల కంటే హీనంగా ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీల విగ్రహాల ధ్వంసం చేయదం,
    రాజినామాల నాటకాలు ఆడటం పార్లమెంటులొ విచిత్ర వేషధారణల తమాషా అంతా దేనికో ??

    ReplyDelete
    Replies
    1. తెలంగాణా ఇంకా రాని మాట నిజమే అయినా రాష్ట్ర ఏర్పాటుకి ప్రక్రియ జరుగుతోందన్న మాట వాస్తవమే కదా! ఈ అడ్డగోలు విభజనని అడ్డుకొనేందుకే సీమాంధ్రులు ఉద్యమిస్తున్నారు. ఆ ఉద్యమంలో భాగమే మీరు చదివిన చిట్టా అంతా.. అయినా నేను రాసింది ఉద్యమం గురించి కాదు. రాష్ట్రం రాకుండానే ఇంతగా చెలరేగి పోతున్న వారు రేపు నిజంగానే తెలంగాణా ఇస్తే సీమాన్ద్రులని హైదరాబాదులో బతకనిస్తారా?

      Delete
    2. nimpu kondi motham andhralo tho ne nimpu kondi post lanni telangana valla ku director post lu endhuku avusaramai ayeethe maa vaaallu motham nioindi naa tharuvatha meegilinaa chaprsi post istham thisukondi

      Delete
    3. ఈ విద్వేషమే చేతికందిన తెలంగాణా నోటికందకుండా చేస్తుంది... తధాస్తు!

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. ఇందిర ,రాజీవ్ ల కుటుంబం తమ స్వార్ధం కోసం రాష్ట్రాన్ని విడదీసారు. అందుకే వారి కుటుంబం మీద కోపం చూపారు. మీలా ఏ సంబంధం లేని కవులు రాజులు చారిత్రిక పురుషుల విగ్రహాలు కూల్చలేదు. (ఆఫ్ఘన్ లో తాలిబాన్లు ఈ కాలం లొ సంబంధం లేని శాంతి రూపుడైన బుధ్ధున్ని తల తెగనరికినట్లు). అందుకే మీరు తెలబాన్లు అయ్యారు.)ప్రతి దానికి నోరు పెంచి వొర్లి నంత మాత్రాన బొంకినంత మాత్రాన ? నిజం కాలుతూనే ఉంటుంది. ..మీ వీధి నాటకాల,అబధాల పాలసీ ప్రస్తుతం పనిచేసింది కదా? అందుకే మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టున్నారు. ....ఐనా మీ అంత బాగా వాళ్ళు అభద్దాల్ని నిజం చేయలేరు. ఎందుకంటె ఉద్యమాలని ఉపాధి మార్గం గా, ఎదుటి వాడి రెక్కల కష్ట్టాన్ని ఎప్పుడొస్తుందా తిందాం అని ఎవరూ ఇక్కడ ఎదురు చూడట్లేదు.

    ReplyDelete
  5. FYI the T-doctors were protesting against an Andhra doctor being promoted ignoring seniority.

    ReplyDelete
    Replies
    1. If the seniority was ignored, they can challenge the order in any court or Administrative Tribunal. But this is not the behaviour expected from an intellectual wing of the society..

      Delete
    2. Promotion has various factors...25years peon ga chesi nannu chairman cheytam ani adagadamanedi moorkatvam...Seniority paatu talent kuda undali :P

      Delete
  6. On what basis and who decided that the seniority was ignored? if telabans decide, is it enough? or because he does not belongs to telangana he automatically became junior and became a traitor?

    ReplyDelete
  7. padi mandini ventesukuni ragane turumkhanlu ayipotarra meeru? ila midisipadda vallantha kaala garbham lo kalisipoyaru. ee telaban mookalentha?

    ReplyDelete
  8. endho! promotion anta..seniority anta..court anta. emo ipati sangathi sare. kani Nims ku gatha 14 director la lo iddare telangana valu endukunaru. danla pani chese vallu entha mandi telangana vallu unnaru. technician jobs lo kuda telangana ku 35% reservatiom matrame endukunnadi. andla kuda hyd la 4 ellu unnam local ani andhra valu entha mandi vastunaru. evaro mahanubavudu talent annadu! Udchetollaku kadigetollaku kuda talent kavalna? ipudu kashtapadatam istam ledu meku antademo!! chittoor c.m unte chittor la..puttur c.m unte puttur la talent puttukostada? endho me talent endo epatki mak ardam kadu.

    ReplyDelete
    Replies
    1. నిజంగా అన్యాయం జరిగి ఉంటె అది ఎవరయినా సరే, మా మద్దతు కూడా ఆ పోరాటానికే.
      ఏది అక్రమం , ఏది సక్రమం అనేది తేలాలి ముందు. దానికి ఉద్యోగులు రాజకీయ నాయకులు కలిసి లెక్కలు బయటకి తీయలి.

      ఈ తెలంగాణా నాయకులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ నిజాలు చెప్పరు. ఉదాహరణకి సెక్రటేరియట్ లో 70% మంది సీమంద్రులు ఉన్నారు అన్నారనుకో, తెలంగాణా ప్రజల గుండె మండుతుంది అదేంది అంత మంది ఉన్నారు అని. కానీ వాళ్ళు చెప్పని విషయం ఏంటంటే అవి స్టేట్ లెవెల్ పోస్ట్లు వాటికీ రిజర్వేషన్ ఉండదు అని. సహజంగానే ఆంధ్రలో చదువులు ఎక్కువ. నిజాం రూల్ వల్ల తెలంగాణా లో అక్షరాస్యత శాతం తక్కువ. దాంతో ఆ పోస్ట్స్ లో ఎక్కువ మంది ఆంధ్ర వల్లే ఉండొచ్చు అది తప్పా? రేప్పొద్దున తెలంగాణా ఏర్పాటయితే అందులో కూడా మిగిలిన జిల్లాల కంటే హైదరాబాద్, రంగారెడ్డి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే అక్కడే అక్షరాస్యత శాతం ఎక్కువ ఉంది. Source:http://www.censusindia.gov.in/2011-prov-results/prov_data_products_andhra.html. అప్పుడేం చెస్తరు. దానికి విరుగుడు తాత్కాలికంగా రిజర్వేషన్ ఇచ్చి అక్షరాస్యత తక్కువ ఉన్న చోట్ల అక్షరాస్యత శాతం పెంచడం. అదే 1956 లో చెసారు. కానీ తెలంగాణా నాయకులు ఏమి చేసారు? ఉదాహరణకి తెలంగాణా కోసం ప్రాణాలయినా ఇస్తాను అని ప్రగల్భాలు పలికే నాగం జనార్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగర్ కర్నూల్ అక్షరాస్యతా శాతం 49.79%. అయ్యగారు దానికి గత కొన్ని దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నరు. Source: http://mahabubnagar.nic.in/Census-2011/Literacy/TotalLiteracy.pdf. దీనికి సీమాన్ధ్రులు బాధ్యులో రాజకీయ నాయకులు బాధ్యులూ మీరే తేల్చుకోండి. ఇలాంటివి సీమంధ్ర లో కూడా ఉన్నాయి ఉదాహరణకి కర్నూల్(53.22 %) మరియు అనంతపురం(56. 13%) అక్షరాస్యత శాతం చూడండి. దీనికి ఆంధ్ర వాళ్ళో తెలంగాణా వాళ్ళో కారణం కాదు. అక్కడి ప్రజా ప్రతినిధులు మాత్రమే. ప్రజలు సరయిన వాళ్ళని గెలిపించుకుంటే ఇలాంటివి రావు. అలా చేయకుండా రాజకీయ నాయకుల చేతిలో కీలు బొమ్మలు అయితే పనికి రాని వెధవలు కూడా దేశాన్ని శాసించే నాయకులు అయి కూర్చుంటారు.

      Delete