Thursday, November 28, 2013

స. హ. చట్టం ద్వారా కేంద్ర హొమ్ శాఖకు నేను పంపిన విజ్ఞాపన ..

ప్రజాభిప్రాయంతో పనే లేదన్నట్లుగా - దేశంలో వున్నది రాజకీయ పార్టీలే అన్న రీతిలో - కేవలం రాజకీయ పార్టీల లేఖలని ఆధారం చేసుకొని అడ్డగోలుగా ఆంధ్ర ప్రదేశ్ విభజనకి కేంద్రం పూనుకుంది.  అత్యంత దుర్మార్గంగా సాగిపోతున్న ఈ విభజన ప్రక్రియలో ప్రజల గోడు చెప్పుకోవటానికి లభించిన ఏకైక అవకాశం - జీవోఎం కి పంపిన ఈ మెయిల్స్ !  అయితే ఇప్పుడు జీవోఎం నివేదిక తుది దశకి వచ్చిన వేళ, ప్రజానీకంనుండి వచ్చిన అభిప్రాయాలని అసలు వారు చదివారా లేదా - ఇంకా వారి నివేదికలో ప్రజాభిప్రాయాన్ని కూడా పొందు పరుస్తున్నారా లేదా అన్నది బ్రహ్మ రహస్యమే ! అందుకే జీవోఎం కి అందిన ఈ మెయిల్స్ విషయమై సమాచార హక్కు చట్టం కింద నేడు క్రింది విధంగా విజ్ఞాపన పంపాను.
(https://rtionline.gov.in వెబ్ సైట్ నుంచి)   

Kindly provide the following information at the earliest :
1.Howmany emails were received in response to the invitation of feed back on terms of reference of Group of Ministers (GoM) constituted for bifurcation of Andhra Pradesh
2.Howmany emails supported for bifurcation of Andhra Pradesh and howmany emails opposed the bifurcation of Andhra Pradesh
3.Whether the GoM has studied all the emails received in this regard
4.Whether the response of the public vide emails is being incorported in the report of GoM
5.It is reqested to kindly provide the soft copies of the mails received or to made them accessible for public view in any website

హొమ్ శాఖ నుండి సమాధానం/సమాచారం వచ్చాక  (వస్తే !) బ్లాగులో అప్ డేట్ చెస్తాను. 

Wednesday, November 27, 2013

నేను 'తుపాకి' రామన్న కాదు !

తుపాకి.కామ్ వెబ్ సైటు నుంచి నేను టపాలు ఎత్తి రాస్తున్నట్లుగా నా సన్నిహితులు విమర్శించటం తో ఆ వెబ్ సైటు ని  పరిశీలించటం జరిగింది.  కొన్ని కధనాలు దాదాపు నేను వెలువరించిన టపాల మాదిరిగానే వున్నా అవి నా టపాల ప్రచురణ తరువాత వచ్చిన కధనాలే అని గమనించి నన్ను విమర్శించిన వారికి ఆ విషయం తెలియజేశాను.  అయితే ఇదే విధంగా తోటి బ్లాగర్లు, చదువరులు కూడా అపోహ పడే అవకాశం వుంది అన్న ఉద్దేశ్యం తో ఈ క్రింది ఉదాహరణలు ఇస్తున్నాను :

1. జీవోఎం  కి వచ్చిన మెయిళ్ల గురించి నేను వెలువరించిన టపా తేదీ, సమయం:  26. 11.2013  1.23 PM
http://andhraaakasaramanna.blogspot.in/2013/11/blog-post_26.html

దాదాపుగా ఇదే విషయంతో  తుపాకి.కామ్ వెబ్ సైట్ లో వచ్చిన కధనం వచ్చిన తేదీ,సమయం :  26. 11. 2013  09.39 PM
http://www.tupaki.com/news/view/Emails-to-GOM-On-Telangana/44763

2 .తెలబాన్ల మోడల్ పాలన  గురించి నేను వెలువరించిన టపా తేదీ, సమయం:  20. 11.2013  7.58 AM
http://andhraaakasaramanna.blogspot.in/2013/11/blog-post_20.html

దాదాపుగా ఇదే విషయంతో  తుపాకి.కామ్ వెబ్ సైట్ లో వచ్చిన కధనం వచ్చిన తేదీ,సమయం :  26. 11. 2013  11.41 PM
http://www.tupaki.com/news/view/Telanga-a-le/44791

3. ఆంధ్ర ప్రదేశ్ కి ప్యాకేజి ఎందుకు అంటూ  నేను వెలువరించిన టపా తేదీ, సమయం:  10. 11.2013  9.54 AM
http://andhraaakasaramanna.blogspot.in/2013/11/blog-post_10.html

దాదాపుగా ఇదే విషయంతో  తుపాకి.కామ్ వెబ్ సైట్ లో వచ్చిన కధనం వచ్చిన తేదీ,సమయం :  11. 11. 2013  05.00 AM


http://www.tupaki.com/news/view/Other-/43082

4. హైదరాబాద్ సిర్ఫ్ హమారా కి అర్ధం చెపుతూ   నేను వెలువరించిన టపా తేదీ, సమయం:  09. 11.2013  02.07 PM
http://andhraaakasaramanna.blogspot.in/2013/11/blog-post_9.html

దాదాపుగా ఇదే విషయంతో  తుపాకి.కామ్ వెబ్ సైట్ లో వచ్చిన కధనం వచ్చిన తేదీ,సమయం :  11. 11. 2013  05.00 AM


http://www.tupaki.com/news/view/Telangana-Af/43083

5 . జానా రెడ్డి పంచాయితీ గురించి   నేను వెలువరించిన టపా తేదీ, సమయం:  30.10.2013  03.26 PM
http://andhraaakasaramanna.blogspot.in/2013/10/blog-post_30.html

దాదాపుగా ఇదే విషయంతో  తుపాకి.కామ్ వెబ్ సైట్ లో వచ్చిన కధనం వచ్చిన తేదీ,సమయం :  01. 11. 2013  12.01 AM


http://www.tupaki.com/news/view/GHMC-is-an-Example-for-Telangana-Activists/42003

పై ఉదాహరణలు  యాదృచ్చికంగా జరిగి ఉండ వచ్చు. లేదా ఒక వేళ తుపాకి.కామ్ వెబ్ సైటు వారు నా టపాల లోని భావాలని వాడుకున్నా నాకేమీ అభ్యంతరం లెదు.  అయితే నేను మాత్రం 'తుపాకీ' రామన్న  కాదు అని తెలియజేప్పటానికే ఇదంతా రాయవలసి వచ్చింది. 

Tuesday, November 26, 2013

జీఒఎం కి వచ్చిన ఈ మెయిళ్లు ఎన్ని ?

ఒక రాష్ట్ర విభజన వంటి ప్రాముఖ్యత గల అంశాన్ని కేంద్ర కాబినెట్ సమావేశ ఎజెండా లో చేర్చకుండా కేవలం టేబుల్ పాయింటుగా ప్రవేశ పెట్టి తొండి చేసిన రీతిగా ఆమోదించడమే గాక  పార్టీల లేఖల ఆధారంగా విభజన ప్రక్రియని జరుపుతున్నామని అడ్డగోలుగా ప్రకటించిన కేంద్రం తూతూ మంత్రంగా ప్రజలనుండి విభజన అంశాలపై ఈ మెయిల్ అభిప్రాయాలని ఆహ్వానించింది.   నవంబరు 5 వ తేదీ గడువుగా చెప్పిన కేంద్రం ఆ తరువాత జరుగుతున్న పరిణామాల్లో ఎక్కడా ప్రజలనుండి వచ్చిన సూచనలు, సలహాల ప్రస్తావనే తీసుకురాలేదు.  జీఒఎం నివేదిక కి తుది మెరుగులు దిద్దుతున్న ప్రస్తుత సమయంలో కూడా రెండు ప్రాంతాల రాజకీయనాయకులని, పార్టీలని చర్చలకి పిలుస్తున్నారు కానీ ప్రజాభిప్రాయం ఏమిటి అన్నది కేంద్ర ప్రభుత్వానికి పట్టటంలేదు.  అసలు విభజన కోసం ఈమెయిల్ ద్వారా సలహాలని కోరటమే తప్పు.  మన రాష్ట్ర ప్రజానీకంలో ఈమెయిల్ ద్వారా సూచనలు ఇవ్వగల నిపుణత ఎంతమందికి ఉంది?  వచ్చ్చిన ఈమెయిళ్ళు అన్నీ పూర్తి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయా?  ప్రజాభిప్రాయానికి విలువని ఇవ్వదలుచుకుంటే కేవలం ఈమెయిల్ మాత్రమె గాక తక్కిన మాధ్యమాల ద్వారా కూడా సూచనలు ఆహ్వానించాలి.  రాష్ట్రంలోని అన్ని వర్గాల నుండి సమాచారం/అభిప్రాయాలు సేకరించి విశ్లేషించి ఇచ్చిన శ్రీ కృష్ణ కమిటీ నివేదికని బుట్ట దాఖలు చేసి తన చిత్తం వచ్చినట్లుగా కేంద్రం విభజన ప్రతిపాదన చేసింది.  ఆ తరువాత సీమాంధ్రుల సమస్యలు తీర్చటానికి (?) ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ నివేదిక ఇవ్వకుండానే విభజనకి తన చిత్తానుసారం పరుగులు తీస్తోంది.     ఇవన్నీ పక్కన పెడితే --- అసలు జీవోఎం కి మొత్తం ఎన్ని ఈ మెయిల్స్ వచ్చాయి - వాటిలో రాష్ట్ర విభజన కోరినవి ఎన్ని, సమైక్యతని కోరినవి ఎన్ని -  అసలు అన్ని మెయిళ్ళని  జీవోఎం పరిశీలించిందా లేదా బుట్ట దాఖలు చేసిందా?  అధికారికంగా సూచనలు ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం తనకు అందిన ప్రతి సూచనకి జవాబుదారీగా ఉండాలి.  జీవోఎం  ఇవ్వబోయే నివేదికలో ప్రజలనుండి తనకి అందిన సూచనల/సలహాల వివరాలు కూడా పొందుపరచి తీరాలి. కాని పక్షంలో ఇప్పటికే  ఏకపక్షంగా అడ్డగోలుగా సాగుతున్న విభజన ప్రక్రియ కీలకమైన ప్రజాభిప్రాయాన్ని కూడా విస్మరించి సాగిస్తున్న నిరంకుశ చర్యే అవుతుంది.

Thursday, November 21, 2013

దేశ భద్రతకే ముప్పు కలిగించే విభజన అవసరమా?




"తెలంగాణా ఏర్పాటు వల్ల భద్రతా సంస్థలకి కేవలం ఆంద్ర ప్రదేశ్ లోనే గాక దేశ వ్యాప్తంగా కూడా కొత్త సవాళ్లు ఎదురౌతాయి "

ఈ ప్రకటన చేసింది సమైక్య వాదం వినిపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి కాదు... నేడు ఒక అధికారిక సమావేశంలో సాక్షాత్తు కేంద్ర హొమ్ మంత్రితో ఇంటలిజెన్స్ బ్యూరో అధిపతి ఇబ్రహీం చేసిన హెచ్చరిక ఇది !  


ఇప్పటికే దేశంలో ఎక్కడ ఉగ్ర వాద సంఘటనలు జరిగినా వాటి మూలాలు హైదరాబాదు నగరం వైపే వేలు చూపిస్తున్న విషయం తెలిసిందే ! శ్రీ కృష్ణ కమిటీ కూడా తన నివేదికలో ప్రత్యెక రాష్ట్రం ఏర్పరిస్తే నక్సలిజం , మత తత్వ శక్తులు పెరిగి  అభద్రతా వాతావరణాన్ని ఏర్పరుస్తాయని తన ఐదవ సూచనలో స్పష్టం గా చెప్పింది. కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు విభజించ బడ్డ పోలీసు బలగాలతో నక్సల్స్ సమస్యని ఎదుర్కోవటం కత్తి మీద సామే అవుతుంది.  అటువంటప్పుడు  మావోయిష్ట్ కార్యకలాపాలు విస్తృతంగా వున్న మహా రాష్ట్ర, చత్తీస్ ఘర్ లని సరిహద్దులుగా కలిగి  కొత్తగా ఏర్పడే  బలహీన రాష్ట్రంలో మావోయిష్టులు పెట్రేగి పోయే ప్రమాదం ఎంతైనా ఉంది.  జార్ఖండ్, చత్తీస్ ఘర్  ప్రాంతాల్లో విభజన తరువాతే మావోయిష్టు కార్యకలాపాలు పెరిగిన వైనం ఈ సందర్భంగా గమనించాలి.     వేర్పాటు వాదానికి పట్టం కడుతూ అదే సమయం లో తీవ్ర వాదానికి దారులు తెరవటం అన్నది తెలివైన పనేనా అన్నది విభజనకి బిల్లు పెట్టె ముందే కేంద్రం ఆలోచించుకోవాలి .. 

Wednesday, November 20, 2013

ఆర్టికిల్ 3 దుర్వినియోగానికి అడ్డు కట్ట వేయాల్సిన సమయమిదే !

ఊహించినట్లుగానే ఆర్టికిల్ 371 (డి) కి సంబంధించి రాజ్యాంగ సవరణ చెయ్యనిదే రాజ్యాంగంలోని 3, 4  అధికరణల ప్రకారం దక్కిన అధికారాలను కేంద్రం నేరుగా వినియోగించుకోలేదని  అటార్నీ జనరల్ తెల్చెసారు.  ఇక ఈ విషయంలో కేంద్రం  ఎలా ముందుకు వెళ్తుంది అన్న విషయం పక్కన పెడితే... 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకి  ఇంత వరకు జరిగిన రాజ్యాంగ బద్ధమైన ప్రక్రియలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ/శాసన సభ/ప్రజల ప్రమేయం ఎంత ? కేవలం రాజకీయ పార్టీలు లేఖలిచ్చాయన్న వంకతో రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంత ప్రజల అంగీకారం లేకుండా - రాజ్యాంగం యొక్క ఫెడరల్ స్ఫూర్తి కి విరుద్ధంగా - అదే రాజ్యాంగం లోని ఆర్టికిల్ 3 కింద  తనకి వున్న విచక్షణాధికారాన్ని దుర్వినియోగ పరుస్తూ కేంద్రం రాష్ట్రాన్ని విభజించేయటానికి దూకుడు గా అడుగులు వేసింది. అవికూడా ఎన్నో తప్పుటడుగులు ! రాష్ట్ర విభజనకై నిర్దేశించిన మంత్రుల కూటమిలో రాష్ట్రానికి చెందిన మంత్రి ఒక్కరూ లేరు! తూతూ మంత్రం గా జరిపిన మంత్రుల కూటమి సమావేశాల్లో ఒక్క జైరామ్ రమేష్ తప్పిస్తే పూర్తి స్థాయి హాజరు కూడా మంత్రులకి లేదు. అంటే ముందుగా నిర్దేశించుకున్న కార్యాచరణ ప్రకారమే కేంద్రం ముందుకు సాగుతోంది తప్ప తతిమ్మా వ్యవహారాలన్నీ నామ మాత్రమె అని స్పష్టమై పోతోంది.      అన్ని రాజకీయ పార్టీలు సమ్మతించాయంటూ విభజన ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లెదు.  అంతెందుకు .. సాక్షాత్తూ తమ పార్టీకే  చెందిన ముఖ్య మంత్రినే విశ్వాసంలోకి తీసుకోలేక పోయిన కాంగ్రెస్ పార్టీకి విభజనకి ముందుకు సాగే హక్కు లేనే లెదు. ఒక రాష్ట్రాన్ని విభజించాలంటే ఆ రాష్ట్ర ప్రజల ప్రమేయం అన్నది ఉండనక్కరలెదా?  రాష్ట్రం లో ప్రభుత్వమే అన్నది లేనట్లుగా కేంద్రమే సర్వాదికారాలని చేతిలోకి తీసుకొని తమ ఇష్టానుసారం విభజన ప్రతిపాదిస్తే రాష్ట్రం/రాష్ట్ర ప్రజలు ఆమోదించాలా ? పైగా శాసన సభ ఆమోదించినా లేక పోయినా కూడా తాము అనుకున్నట్లు విభజించి తీరుతాం అని కేంద్రం మొండికేస్తే ఇక ఫెడరల్ స్ఫూర్తి ఎక్కడ ఉన్నట్లు ?  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆర్టికిల్ 371 (డి) ద్వారా ఒక ప్రత్యెక ప్రతిపత్తి వుంది కాబట్టి కేంద్రం దూకుడు కి కళ్ళెం పడే అవకాశం ఉంది. లేని పక్షంలో పరిస్థితి ఏమిటి ?  ఒక ప్రాంతంలో విభజన లేదా విలీనం వంటి చర్యలు తీసుకోవాలంటే ఆ ప్రాంతం/రాష్ట్ర శాసన సభ నుండి ప్రతిపాదన వస్తే అప్పుడు కేంద్రం ఆర్టికిల్ 3 కింద తనకి వున్న అధికారంతో విభజన/విలీనం చేయాలని రాజ్యాంగ కర్తల ఉద్దేశ్యం. పైగా అటువంటి చర్యలు చేపట్టే ముందు ఆయా ప్రాంతాల సంపూర్ణ అంగీకారం ఉందా లేదా అన్న విషయం ద్రువీకరించుకొనే కేంద్రం అడుగు ముందుకు వెయ్యాలి.  అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా  - రాష్ట్ర శాసన సభ ప్రమేయమే లేకుండా కేంద్ర నిరంకుశ నిర్ణయాన్ని రుద్దే రీతిన కొనసాగుతోంది.  గతంలో రాష్ట్రాల్లో రాష్టపతి పాలన విధించే విషయంలో కేంద్రానికి వున్న ఆర్టికిల్ 356 కింద వినియోగించుకొనే విచక్షణాదికారాలపై  పై  బొమ్మై కేసులో సుప్రీం కోర్టు పరిమితులు విధించింది.  అదే విధంగా నేడు రాజ్యాంగంలో ని ఆర్టికిల్ 3 ద్వారా కేంద్రం చేపట్టబోయే చర్యలకు కూడా రాష్ట్రాల అంగీకారం వుండి తీరాలన్న నిబంధన చేర్చక పొతే ఇదే దుష్ట సాంప్రదాయం కొనసాగుతూనే ఉంటుంది.  రాష్ట్రపతి, ఇంకా ఉన్నత న్యాయ వ్యవస్థలు ఈ విషయంలో క్రియా శీలకంగా వ్యవహరించి ఆంద్ర ప్రదేశ్ కె గాక భవిష్యత్తులో రాబోయే మరెన్నో అనర్దాలని నిరోధించే దిశగా చర్యలు చేపట్టాలి. 

తెలబాన్ పాలన మొదలై పోయింది !





తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకి ఇంకా బిల్లు కూడా తయారు కాలేదు కానీ అప్పుడే తెలబాన్ మోడల్ పాలన ఎలా వుంటుందో వేర్పాటు వాదులు రుచి చూపించేస్తున్నారు.  తెలబాన్ నాయకుడు ఇప్పటికే సీమాంధ్ర ఉద్యోగులకి ఆప్షన్స్ లేవని, వెనక్కి వెళ్ళిపోవాలని - ముఖ్యమంత్రి టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలని ఫత్వా జారీ చేసి ఉన్నాడు.  ఇక ఇప్పుడు ఆయన అనుచర,బంధు గణాల వంతు !  ఈ రోజు వార్తా పత్రికలలోనే వచ్చిన ఈ వార్తలు చూస్తుంటే ప్రత్యెక రాష్ట్రం ఇస్తే సీమాంధ్రుల పట్ల వారి వైఖరి ఎలా ఉండ బోతున్నదో తేట తెల్లమై పోతోంది.    సీమాంధ్ర  ప్రజల రక్షణ కోసం చట్టం తెస్తామంటున్న కేంద్రం ముందుగా ఇటువంటి బెదిరింపు ప్రకటనలు చేసే వారి పట్ల కఠిన వైఖరి ప్రదర్శించాలి.  అందునా ఎమ్మెల్సీ వంటి రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉంటూ బెదిరింపులకి పాల్పడుతున్న స్వామీ గౌడ్ వంటి నాయకులని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.  

Tuesday, November 19, 2013

ముసుగు తొలగిన జైపాల్ రెడ్డి !


మనకి పాత సినిమాలలో గుమ్మడి నటించిన పాత్రలు జ్ఞాపకం ఉన్నాయా ? 16 రీళ్ల సినిమాలో 14 రీళ్ల వరకు పెద్ద మనిషి పాత్ర - ఆ తరువాత ఒక్కసారి గా విలన్ అవతారం ఎత్తి ప్రేక్షకులని ఆశ్చర్య పరచే వారు గుమ్మడి !  ఆ విధంగానే గత నాలుగేళ్ళుగా జరుగుతున్న వేర్పాటువాద ఉద్యమం లో ప్రత్యక్షంగా పాల్గొనకుండా హస్తిన లోనే తెర వెనుక పావులు కదుపుతూ పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న జైపాల్ రెడ్డి తెలంగాణా ఏర్పాటుకు ప్రకటన వెలువడగానే ముసుగు తొలగించి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ లోకి వచ్చేసారు!  వేర్పాటు వాదమే ప్రాతిపదికగా వున్నపార్టీలు,వ్యక్తులు ఎటువంటి డిమాండ్లు చేసినా ఆశ్చర్యం వుండదు కానీ ఇప్పటి వరకు పెద్ద మనిషిగా చెలామణీ   ఐన జైపాల్ రెడ్డి గారు  జీఓఎంకి ఇచ్చిన తమ నోట్ తో చిన్న బుద్ధిని బయట పెట్టుకున్నారు.  తెలంగాణా ప్రాంత వాసిగా తమ ప్రాంతానికి కావలసిన సౌకర్యాలు అడగటం తప్పు కాదు  కానీ అదే సమయం లో సీమాంధ్ర బలి అయి పోయినా పరవాలేదన్న రీతిగా ఆయన ప్రసంగించిన తీరు ఆక్షేపణీయం.  ఒక రాష్ట్ర రాజధాని అన్నది ఆ ప్రాంత ప్రజలందరి హక్కు. అందులో ఎవరి దయా దాక్షిణ్యం అన్నది ఉండే ప్రసక్తే లెదు. హైదరాబాదు కి వున్న మౌలిక వసతులు గానీ, వైద్య, విద్యా పరమైన వసతులు గానీ ఏవి ఏర్పడినా అవి 23 జిల్లాలతో కూడిన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హోదాలో వచ్చినవే !వాటిని వినియోగించుకోవటానికి 23 జిల్లాల వారికి సర్వ హక్కులు ఉంటాయి. ఇప్పుడు అడ్డగోలుగా ఉన్న పళంగా రాష్ట్ర విభజన ప్రతిపాదించిన పక్షంలో హైదరాబాదుకి దీటుగా ప్రత్యామ్నాయ రాజధాని/వసతులు ఏర్పడే  వరకు  హైదరాబాదు అన్నది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి హక్కు.  ప్రత్యామ్నాయ రాజధాని వచ్చే వరకు పదేళ్ళ కాల పరిమితిని కేంద్రం ప్రస్తావిస్తే అదే చాల ఎక్కువ అన్నట్లు తోటి తెలంగాణా కేంద్ర మంత్రులతో కలిసి వ్యాఖ్యానించటం ఆయన దురహంకారాన్ని సూచిస్తుంది. అంతే గాక ఏ దురుద్దేశ్యం లేక పొతే జీఒఎమ్ కి ఇచ్చిన నోట్ ని రహస్యంగా ఎందుకు ఉంచుతారు ?  ఇక హైదరాబాదు నుండి భద్రాచలం వరకు దేనిని వదలరు కానీ రాబోయే తెలంగాణకి ఉండబోయే విద్యుత్ కొరతని మాత్రం సీమాంధ్ర భర్తీ చేయాలట ! ఇంతకన్నా మూర్ఖ వాదన ఎక్కడైనా ఉంటుందా ?  తన రాజకీయ జీవిత చరమాంకంలో జైపాల్ రెడ్డి గారు తన అల్ప బుద్ధిని బయట పెట్టుకొని తాను  కూడా అవకాశ వాదినే అని నిరూపించుకున్నారు.   

Saturday, November 16, 2013

విభజన ప్రక్రియ మీ పుణ్యమే !


విభజన పై కేంద్రం ఇంత ముందుకు వెళ్ళాక కూడా ఇంకా సమైక్యం పట్టుకుని వేళ్ళాడాలా అంటూ ఎంతో  అమాయకం నటిస్తూ ప్రశ్నిస్తున్నారు కేంద్ర మంత్రి పురందేశ్వరి ! ఇటువంటి ఆషాడ భూతుల వల్లే కేంద్రం ఇంత ముందుకు వెళ్ళిందన్న సంగతిని ఆమె మరచి పోయారేమో గానీ ప్రజలు మరచి పోలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం ప్రకటించిన వెంటనే రాజీనామా చేయమని ప్రజలంతా ముక్త కంఠంతో డిమాండ్ చేసినా కూడా పదవిని వదిలి పెట్టకుండా కాలక్షేపం చేసి - మూడు నెలల తరువాత తగుదునమ్మా  అంటూ ప్రజలని ఏమార్చాలని చూడటం ఆవిడ అమాయకత్వం. రాష్ట్రపతి దాకా వెళ్ళిన ఆర్డినెన్సు ని సైతం చించి వేసిన అధిష్టానం ప్రజల అభీష్టానికి విరుద్ధంగా జరుగుతున్న విభజన విషయంలో వెనుకడుగు వెయ్యక పోవటానికి ఇటువంటి ప్రజా ద్రోహులైన నాయకులే కారణం.   అన్ని పార్టీలు నిర్ణయం తెలిపాకే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని సెలవిస్తున్న ఆవిడ గారికి అసలు కాంగ్రెస్ పార్టీలోనే విభజన పట్ల ఏకాభిప్రాయం లేదన్న సంగతి గుర్తు లేదా?  స్వంత పార్టీకి చెందిన  రాష్ట్ర ముఖ్యమంత్రి నే విశ్వాసంలోకి తీసుకోలేక పోయిన కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల అభిప్రాయాల వంకతో విభజన ప్రక్రియ ని కొనసాగించటం మూర్ఖత్వం.  తనని ఎన్నుకున్న ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కూడా సీమాంధ్రని ఉద్ధరిస్తున్నట్లు మాట్లాడుతున్నపురందేశ్వరి  కి, ఆవిడ పార్టీకి 2014 ఎన్నికల్లో తగిన గుణ పాఠం ప్రజలు చెప్పటం ఖాయమే !

రాష్ట్రపతి రబ్బరు స్టాంపు కాకూడదు !


రాజ్యాంగం లోని ఆర్టికిల్ 3 ని దుర్వినియోగ పరుస్తూ కేంద్రం ఏక పక్షంగా ఆంద్ర ప్రదేశ్ విభజన ప్రక్రియని కొనసాగిస్తున్న సమయంలో దేశంలోని అత్యున్నత న్యాయ వ్యవస్థలు, మరియు రాజ్యాంగ పరి రక్షకుని  పాత్రలో రాష్ట్రపతి  కూడా క్రియాశీలక పాత్ర వహించ వలసిన అవసరం ఎంతైనా వుంది.  ప్రజా సంక్షేమానికి సంబంధించిన విషయాలలో కేంద్ర మంత్రి వర్గం ఆమోదించి పంపిన బిల్లులని రాష్ట్రపతి యధాతధంగా ఆమోదించినా ఎటువంటి నష్టం ఉండదు.   అయితే ఆర్టికిల్ 3 వంటి విశేష విచక్షణాదికారాలని వినియోగిస్తూ కేంద్రం ప్రతిపాదించిన బిల్లులని రాష్ట్రపతి ఎటువంటి సమీక్ష జరపకుండా అనుమతించటం అనుచితం అవుతుంది.  ఒక రాష్ట్ర విభజన అనే అంశం ఆ ప్రాంతంలోని అనేక వర్గాల ప్రజలని, కొన్ని తరాల పాటు ప్రభావితం చేస్తుంది  అన్న మాట వాస్తవం. అంత ప్రాముఖ్యత గల ఈ అంశానికి సంబంధించిన నోట్ ని   ఆమోదించే సమయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం.  ఒక రాష్ట్ర విభజన వంటి ప్రాముఖ్యత గల అంశాన్ని కేంద్ర మంత్రి వర్గ సమావేశం యొక్క ఎజెండా పాయింటు లో లేకుండా కేవలం టేబుల్ పాయింటుగా  నోట్  ప్రవేశ పెట్టి హడావిడిగా  ఆమోదించేయటం ఏ పాటి సమంజసం అన్నది రాష్ట్రపతి వివేచనతో పరిశీలించాలి.  అంతే కాదు.. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన కోసం ఆ రాష్ట్ర శాసన సభ నుంచి ఎటువంటి తీర్మానం లేకుండా - తీర్మానం లేక పోవటమే కాదు, శాసన సభ అనుమతే అసలు అవసరం లేదు అన్నట్లుగా - నిరంకుశ రీతిగా కొనసాగుతున్న విభజన ప్రక్రియని కూడా రాష్ట్రపతి ప్రశ్నించ వలసిన అవసరం వుంది.  లేని పక్షంలో ఈ విధమైన విచక్షణాదికారాల దుర్వినియోగం అన్నది ఆంద్ర ప్రదేశ్ తో ఆగదు. భవిష్యత్తులో ఇదే ఉదాహరణగా తీసుకొని తమకి నచ్చని రాష్ట్రాన్ని  రాబోయే కేంద్ర ప్రభుత్వాలు విభజించి పడేసి బలహీన పరచటానికి ప్రయత్నించే అవకాశం ఎంతైనా వుంది.  ఇటువంటి దుష్ట సాంప్రదాయానికి ఆదిలోనే అడ్డు కట్ట వేయటం రాజ్యాంగ పరి రక్షకునిగా రాష్ట్రపతి బాధ్యత. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర విభజనకై ఆ రాష్ట్ర శాసన సభ తీర్మానం కేంద్రం వద్ద సిద్ధంగా వుండగా దాన్ని పక్కన పెట్టి మరీ ఏ విధమైన ప్రతిపాదన లేని ఆంద్ర ప్రదేశ్ విభజనకై కేంద్రం ఎందుకు తొందర పడుతున్నదో రాష్ట్రపతి కేంద్రాన్ని ప్రశ్నించాలి.  అన్నిటికన్నా ముఖ్యమైన విషయం - రాష్ట్ర విభజన ప్రతిపాదించిన చోట ఆయా  ప్రాంతాల పరస్పర అంగీకారం తోనే విభజన జరుగుతోందా లేదా అన్న విషయం రాష్ట్రపతి తప్పనిసరిగా పరిశీలించాలి.  ఆంద్ర ప్రదేశ్ విభజన విషయంలో కేంద్రమే  నియమించిన శ్రీ కృష్ణ కమిటీ సైతం తన నివేదికలో రాష్ట్ర విభజన తప్పని సరి అని భావించిన పక్షంలో - అది రాష్ట్రంలోని మూడు ప్రాంతాల పరస్పర అంగీకారంతో మాత్రమె చేయాలని విష్పష్టం గా చెప్పింది.  ఆ కమిటీ నివేదికని పార్లమెంటులో చర్చకి పెట్టకుండా - నివేదికని తుంగలో తొక్కి, తన ఇష్టానుసారం కేవలం ఒక ప్రాంతానికి మాత్రమె ప్రయోజనకరంగా కేంద్రం ప్రతిపాదించిన విభజన ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. అలాగే ఉద్యోగుల విషయానికి వస్తే రాజ్యాంగానికి చేసిన 32 వ సవరణ తో వచ్చిన ఆర్టికిల్ 371 - డి ద్వారా జోనల్ పరంగా/రాజధాని పరంగా విద్యార్ధుల/ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడ బడుతున్నాయి. అటువంటప్పుడు హైదరాబాదు కి దీటుగా ప్రత్యామ్నాయ రాజధానిని, ఇతర సౌకర్యాలని కల్పించకుండా విభజన ప్రతిపాదించటం రాజ్యాంగ విరుద్ధం..ఇటువంటి పలు సమస్యలకి కేంద్రం నుండి సముచితమైన వివరణ లభించకుండా విభజన బిల్లుకి రాష్ట్రపతి ఆమోద ముద్ర వెయ్యరాదు.  ఈ విషయాల్లో అవసరమైతే సుప్రీం కోర్టు సలహాని సైతం రాష్ట్రపతి తీసుకుంటే మెలు.  ఏమైనా గతంలో ప్రధాని ఇందిరా గాంధీ ప్రతిపాదించిన ఆత్యయిక పరిస్థితి ని రబ్బరు స్టాంపు వలె ఆమోదించి అపఖ్యాతి పాలైన ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ వలే కాకుండా ప్రస్తుత రాష్ట్రపతి క్రియా శీలకంగా వ్యవహరించి, కేంద్రం దుర్నీతి ని అడ్డుకోవాలని కోరుకుందాం.     

Thursday, November 14, 2013

తమిళులని చూసి ఎంతైనా నేర్చుకోవాలి !

తెలుగు జాతి కి అనైక్యతే ఒక శాపం .. దక్షిణాదిన ఒక గట్టి రాష్ట్రం గా అభివృద్ది చెందుతున్న మన రాష్ట్రాన్ని కుట్ర పూరితంగా విభజన చేసి బలహీన పరచాలన్న కేంద్రం కుయుక్తులని ఎదుర్కోవాల్సిన మన నాయకులు ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా విడిపోయి స్వంత ప్రయోజనాల కోసం మన రాష్ట్ర భవిష్యత్తునే పణం గా పెడుతున్నారు.   తమిళ నాడు విషయానికి వస్తే అక్కడి ప్రత్యర్ధి పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనేంత వైరం వున్నా కూడా తమ రాష్ట్ర ప్రయోజనాలు లేదా జాతి ప్రయోజనాల దగ్గరికి వచ్చేసరికి అందరూ ఒకే మాట పై వుంటారు.  

మన రాష్ట్రాన్ని కేకు ముక్కలా కోసేయాలని సంబర పడుతున్న కాంగ్రెస్ పార్టీ
కి చెందిన చిదంబరం గారిని తమిళనాడు విభజన గురించి అడిగితె -- అటువంటి ప్రతిపాదనలు మొగ్గలోనే తుంచి వేయాలని నిష్కర్షగా చెప్తాడు. కానీ తెలుగునాడు ని ముక్కలు చేయటానికి మాత్రం కత్తి  పట్టుకొని సదా సిద్ధంగా ఉంటాడు. ఆంధ్ర ప్రదేశ్ రెండు లేదా మూడు ముక్కలై పొతే దక్షిణాదిన తమ రాష్ట్రమే సూపర్ పవర్ అవ్వాలన్న స్వార్ధ ప్రయోజనాన్ని ఏ మాత్రం దాచుకోడాయన ! 


అలాగే శ్రీలంక యుద్ధ నేరాలకి సంబంధించిన తీర్మానం విషయం లో సక్రమం
గా వ్యవహరించ లేదని గత మార్చి నెలలో డీఎంకే పార్టీ కి చెందిన 5 గురు కేంద్ర మంత్రులు పదవులని తృణ ప్రాయంగా త్యజించేసారు. కానీ ఇక్కడో ? ఊరు వాడ ఏకమై రోడ్ల మీదకి వచ్చి రాజీనామా చేయమని నినదించినా సరే, నియోజక వర్గాలకి రాకుండా రాజధానిలో కాల క్షేపం చేస్తున్నారు తప్ప పదవుల ని వదిలి పెట్టరు మన మంత్రి వర్యులు ! 


ఇక, అన్నా డీఎంకె సారధ్యంలోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం - శ్రీలంక లో
జరగనున్న చొగమ్ సదస్సుని భారత్ బహిష్కరించాలంటూ అక్టోబరు 29 న తమ శాసన సభలో  ఏకగ్రీవంగా తీర్మానించింది.  ఆ ఒత్తిడి నేపధ్యంలోనే ఆ సదస్సుకి ప్రధాని హాజరు అవకుండా మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ని పంపుతున్న నేపధ్యంలో నవంబరు 12 న మరొక మారు తమిళనాడు శాసన సభ సమావేశమై శ్రీలంక సదస్సు లో భారత్ ప్రాతినిధ్యం ఉండరాదని ప్రతిపాదిస్తూ ఎకగ్రీవ  తీర్మానం చేసింది.  ఎక్కడో రాష్ట్రం బయటే కాదు, దేశం బయట వున్న తమిళుల పట్ల అక్కడి రాజకీయ పార్టీల నిబద్ధత అలా ఉంది.  మన దగ్గరేమో - రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు సమైక్యత ని కోరుతున్నా - వంద రోజులు పైగా ఆందోళనలు చేస్తున్నా -  ఏ రాజకీయ పార్టీకి మన రాష్ట్రం భవిష్యత్తు పట్ల సరైన దృక్పధమే లెదు. విభజన బిల్లు రాక ముందే శాసన సభలో సమైక్య తీర్మానం చేయటానికి సమావేశం జరపమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినా కూడా "సమైక్య చాంపియన్" ముఖ్య మంత్రి గారికి శాసన సభని సమావేశ పరిచే తీరిక లేదు !  తమిళులకి మనకీ ఇదే తేడా !     

Sunday, November 10, 2013

అసలు ఆంద్ర ప్రదేశ్ కి ప్యాకేజీ ఎందుకు ఇవ్వాలి ?

వాపుని చూసి బలుపు అని భ్రమించిన రీతిగా - 23 జిల్లాల రాజధాని హోదాలో హైదరాబాదు ప్రాంతానికి వస్తున్న ఆదాయాన్ని తమ ప్రాంత ఆదాయంగా పరిగణిస్తూ - రాజధాని ఆదాయంతో ఇన్నేళ్ళుగా సీమాంధ్ర ని ఉద్దరించేసినట్లు తెలంగాణా ప్రాంత నాయకులు వితండ వాదం వినిపిస్తున్నారు.  ఇప్పుడు రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్ర ప్రాంతానికి పలు ప్యాకేజీలు ఇస్తారని వార్తలు వస్తున్నాయి.  ఇబ్బడి ముబ్బడిగా సౌకర్యాలు వచ్చి తమ ప్రాంతం అభివుద్ది చెందుతుంది అంటే ఎవరికైనా ఆనందమే ! అయితే ఈ ప్యాకేజీలకి సొమ్ములు ఎక్కడినుంచి వస్తాయి ?  అన్ని రాష్ట్రాలకి చెందిన కేంద్ర ప్రభుత్వ మూల నిధి నుంచే కదా !  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ ప్రయోజనాల కోసం అడ్డ గోలుగా తల పెట్టిన ఆంద్ర ప్రదేశ్ విభజన కొరకై మంది సొమ్ముని పందేరం చెయ్యటానికి మిగతా రాష్ట్రాలు అంగీకరిస్తాయా  ? ఉమ్మడి సొత్తుని తమ చిత్తం వచ్చినట్లు ఒక్క ప్రాంతం లోనే వెచ్చించ టానికి ఖచ్చితంగా అభ్యంతరం చెప్తాయి. అంతే  కాదు,  సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇవ్వని సౌకర్యాలు విడ దీస్తూ కల్పిస్తే అది ఒక దుష్ట సాంప్రదాయానికి తెర తీస్తుంది.  ఈ పధ్ధతి ఏదో బాగుంది అంటూ  దేశంలో తక్కిన రాష్ట్రాలు కూడా విభజన కోరి సౌకర్యాలు డిమాండ్ చేస్తే కేంద్రం దగ్గర సమాధానం ఉంటుందా ?  విభజించి ప్యాకేజీ ఇచ్చే బదులు అదే సొమ్ములతో రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలకి సమానంగా సౌకర్యాలు కలుగ జేస్తే మరింత ప్రయోజనం వుంటుంది కదా !  ఏమైనా - వస్తాయో రావో తెలియని ప్యాకేజీ సోమ్ములకై సీమాంధ్ర రాజకీయ నాయకులు కక్కుర్తి  పడుతున్నారు కానీ -- తెలంగాణా ఆకాంక్ష ని గౌరవించటం కోసం సీమాంధ్ర ని బలి చెయ్యటానికి  ప్రజలు సిద్ధంగా లేరు. 

Saturday, November 9, 2013

తెలంగాణా ఉద్యమ చరిత్ర - నాలుగే ముక్కల్లొ...

అరవై ఏళ్ల సమైక్యాంధ్ర గురించి నాలుగే పంక్తుల్లో వివరించేసారు ఆచార్యుల వారు !  

http://dracharyaphaneendra.wordpress.com/2013/11/08/అరవయ్యేళ్ళ-సమైక్యాంధ్ర-చ/

అలాగే పన్నెండేళ్ళ తెలంగాణా ఉద్యమం కూడా నాలుగే ముక్కల్లొ... 

* తెలంగాణా జాగో - ఆంధ్రా వాలా భాగో 

* సీమాంధ్రు లని తరిమి కొడతాం , తెలంగాణా వొద్దు అన్న వాళ్ళ                
   నాలుకలు   కోస్తాం .. 

* సీమాంధ్రులు దోపిడీ దారులు ! 

  (దోపిడీ లెక్కలన్నీ మొన్న శ్రీ కృష్ణ కమిటీ, నేడు ఆర్ధిక శాఖ మంత్రుల బృందానికి ఇచ్చిన నివేదిక  తేల్చేశాయి)



* హైదరాబాద్ సిర్ఫ్ హమారా ! 
  ( 'హమారా'  అంటే మాది అనే  కాక మనందరిదీ అన్న అర్ధం కూడా    వస్తుందని   ఎప్పుడు గ్రహిస్తారో ? )

Thursday, November 7, 2013

దురాశ దుక్ఖమునకు చేటు !

* మా తెలంగాణా మాకు కావాలి !

* హైదరాబాద్ మాకే కావాలి !

* హైదరాబాదులో ఉద్యోగాలన్నీమాకే కావాలి !

*  రాబోయే ఐ టీ  ఐ ఆర్  మాకే కావాలి !

* హస్తిన లో ఏ పీ భవన్ మాకే కావాలి ! 

* నదీ జలాలు మాకే కావాలి !

* అర్హత లేక పోయినా శాసన మండలి మాకూ కావాలి !


* భద్రాచలం మాకే కావాలి ! 

* ఆస్తులన్నీ మాకే కావాలి - అప్పులన్నీ అందరికీ పంచాలి ! 

* రూ . 4. 5 లక్షల కోట్ల ప్యాకేజీ మాకే కావాలి ! 

* సింగరేణి బొగ్గు మాకే కావాలి ! 

* కే జీ బేసిన్ గ్యాస్ మాకే కావాలి !

** ఇంకా ఏం మిగిలింది ? బంగాళా ఖాతం !అదీ మీరే తీసేసుకోండి ... భేషుగ్గా వుంటుంది ....