Wednesday, November 20, 2013

ఆర్టికిల్ 3 దుర్వినియోగానికి అడ్డు కట్ట వేయాల్సిన సమయమిదే !

ఊహించినట్లుగానే ఆర్టికిల్ 371 (డి) కి సంబంధించి రాజ్యాంగ సవరణ చెయ్యనిదే రాజ్యాంగంలోని 3, 4  అధికరణల ప్రకారం దక్కిన అధికారాలను కేంద్రం నేరుగా వినియోగించుకోలేదని  అటార్నీ జనరల్ తెల్చెసారు.  ఇక ఈ విషయంలో కేంద్రం  ఎలా ముందుకు వెళ్తుంది అన్న విషయం పక్కన పెడితే... 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకి  ఇంత వరకు జరిగిన రాజ్యాంగ బద్ధమైన ప్రక్రియలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ/శాసన సభ/ప్రజల ప్రమేయం ఎంత ? కేవలం రాజకీయ పార్టీలు లేఖలిచ్చాయన్న వంకతో రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంత ప్రజల అంగీకారం లేకుండా - రాజ్యాంగం యొక్క ఫెడరల్ స్ఫూర్తి కి విరుద్ధంగా - అదే రాజ్యాంగం లోని ఆర్టికిల్ 3 కింద  తనకి వున్న విచక్షణాధికారాన్ని దుర్వినియోగ పరుస్తూ కేంద్రం రాష్ట్రాన్ని విభజించేయటానికి దూకుడు గా అడుగులు వేసింది. అవికూడా ఎన్నో తప్పుటడుగులు ! రాష్ట్ర విభజనకై నిర్దేశించిన మంత్రుల కూటమిలో రాష్ట్రానికి చెందిన మంత్రి ఒక్కరూ లేరు! తూతూ మంత్రం గా జరిపిన మంత్రుల కూటమి సమావేశాల్లో ఒక్క జైరామ్ రమేష్ తప్పిస్తే పూర్తి స్థాయి హాజరు కూడా మంత్రులకి లేదు. అంటే ముందుగా నిర్దేశించుకున్న కార్యాచరణ ప్రకారమే కేంద్రం ముందుకు సాగుతోంది తప్ప తతిమ్మా వ్యవహారాలన్నీ నామ మాత్రమె అని స్పష్టమై పోతోంది.      అన్ని రాజకీయ పార్టీలు సమ్మతించాయంటూ విభజన ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లెదు.  అంతెందుకు .. సాక్షాత్తూ తమ పార్టీకే  చెందిన ముఖ్య మంత్రినే విశ్వాసంలోకి తీసుకోలేక పోయిన కాంగ్రెస్ పార్టీకి విభజనకి ముందుకు సాగే హక్కు లేనే లెదు. ఒక రాష్ట్రాన్ని విభజించాలంటే ఆ రాష్ట్ర ప్రజల ప్రమేయం అన్నది ఉండనక్కరలెదా?  రాష్ట్రం లో ప్రభుత్వమే అన్నది లేనట్లుగా కేంద్రమే సర్వాదికారాలని చేతిలోకి తీసుకొని తమ ఇష్టానుసారం విభజన ప్రతిపాదిస్తే రాష్ట్రం/రాష్ట్ర ప్రజలు ఆమోదించాలా ? పైగా శాసన సభ ఆమోదించినా లేక పోయినా కూడా తాము అనుకున్నట్లు విభజించి తీరుతాం అని కేంద్రం మొండికేస్తే ఇక ఫెడరల్ స్ఫూర్తి ఎక్కడ ఉన్నట్లు ?  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆర్టికిల్ 371 (డి) ద్వారా ఒక ప్రత్యెక ప్రతిపత్తి వుంది కాబట్టి కేంద్రం దూకుడు కి కళ్ళెం పడే అవకాశం ఉంది. లేని పక్షంలో పరిస్థితి ఏమిటి ?  ఒక ప్రాంతంలో విభజన లేదా విలీనం వంటి చర్యలు తీసుకోవాలంటే ఆ ప్రాంతం/రాష్ట్ర శాసన సభ నుండి ప్రతిపాదన వస్తే అప్పుడు కేంద్రం ఆర్టికిల్ 3 కింద తనకి వున్న అధికారంతో విభజన/విలీనం చేయాలని రాజ్యాంగ కర్తల ఉద్దేశ్యం. పైగా అటువంటి చర్యలు చేపట్టే ముందు ఆయా ప్రాంతాల సంపూర్ణ అంగీకారం ఉందా లేదా అన్న విషయం ద్రువీకరించుకొనే కేంద్రం అడుగు ముందుకు వెయ్యాలి.  అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా  - రాష్ట్ర శాసన సభ ప్రమేయమే లేకుండా కేంద్ర నిరంకుశ నిర్ణయాన్ని రుద్దే రీతిన కొనసాగుతోంది.  గతంలో రాష్ట్రాల్లో రాష్టపతి పాలన విధించే విషయంలో కేంద్రానికి వున్న ఆర్టికిల్ 356 కింద వినియోగించుకొనే విచక్షణాదికారాలపై  పై  బొమ్మై కేసులో సుప్రీం కోర్టు పరిమితులు విధించింది.  అదే విధంగా నేడు రాజ్యాంగంలో ని ఆర్టికిల్ 3 ద్వారా కేంద్రం చేపట్టబోయే చర్యలకు కూడా రాష్ట్రాల అంగీకారం వుండి తీరాలన్న నిబంధన చేర్చక పొతే ఇదే దుష్ట సాంప్రదాయం కొనసాగుతూనే ఉంటుంది.  రాష్ట్రపతి, ఇంకా ఉన్నత న్యాయ వ్యవస్థలు ఈ విషయంలో క్రియా శీలకంగా వ్యవహరించి ఆంద్ర ప్రదేశ్ కె గాక భవిష్యత్తులో రాబోయే మరెన్నో అనర్దాలని నిరోధించే దిశగా చర్యలు చేపట్టాలి. 

12 comments:

  1. నేను ఆంధ్ర జ్యొతి లో ఒక వార్త చూశాను. ఇప్పుడు జరుగుతున్న విభజనని సుప్రీం కూడా విమర్శిస్తున్నది. ఇప్పటికే 1961 లో ఒక తీర్పు ఇప్పటి పధ్ధతిని అడ్డుకుంటూ వచ్చే ఉందట. దాని సంగతేంటో తవ్వి చూడాలి.

    ReplyDelete
  2. రాజ్యాంగాన్ని అనుసరించి వ్యవహరించాల్సిన పార్లమెంటు తానే రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించటం కుదరదు అనే తీవ్రమయిన వ్యాఖ్యలు కూడా చేసింది. బుహుశా ఇదివరలో చేసిన కొన్ని దూకుడు పనుల లాగే సుప్రీంతో చివాట్లు తినటం తెల్ల మొహం వెయ్యటం తప్పదేమో కాంగెసుకి.సుప్రీం నుంచి గనక వ్యతిరేకమయిన తీర్పు వస్తే తెవాదులు యెంత చించుకున్నా సూత్రప్రాయపు సుత్తి గాళ్ళు తాళ మేసినా విభజన ముందుకెళ్ళదు.

    ReplyDelete
    Replies
    1. సుప్రీమ్ అడ్డుకోవాలి అంటే కొన్ని పరిణామాలు జరగాలి.
      1. తెలంగాణా నోట్ కాబినెట్ కి పంపినప్పుడు మీద డిసెంట్ నోట్ రాసి ఉండాల్సింది కానీ మన వాళ్ళు రాయలేదు.
      2. బిల్ సెంట్రల్ కాబినెట్ ముందుకు వచ్చినప్పుడైనా డిసెంట్ నోట్ రాయాలి (మన వాళ్లకి అంత దమ్ము ఉందనుకోను)
      3. కనీసం శాసన సభ కి వచ్చినప్పుడు తీర్మానమైనా, వోటింగ్ అయినా తీవ్ర వ్యతిరేకత తెలియజేయాలి. కానీ మనవాళ్ళు స్వలాభాలకి కక్కుర్తి పడి వోటింగ్ కి వస్తే బిల్ పాస్ అయ్యేటట్టు చూసేలా ఉన్నారు.
      4. పార్లమెంట్ లో బిల్ వీగి పోతే ఇక గొడవే లేదు.

      ఇందులో BJP అడ్డం తిరిగితే 4 ఒక్కటే ఆప్షన్ కన్పిస్తోంది. లేదంటే శాసనసభ, పార్లమెంట్ ఆమోదిస్తే సుప్రీమ్ కోర్ట్ కూడా ఏమి చేయలేదు.

      శ్రీశైలం మొత్తం సీమాంధ్ర లోనే ఉందని వార్తలు వస్తున్నాయి అంటే ఇన్ని రోజులు మన కరెంటు, నీళ్ళు తెలంగాణా వాళ్ళు దోచుకున్నరన్నమాట. ఇప్పటికైనా మన వాళ్ళు పోరాడి భద్రాచలం, మునగాల, అశ్వారావు పేట, శ్రీశైలం ప్రాజెక్ట్, హైదరాబాద్ మీద హక్కులు, రాజధాని కోసం ప్యాకేజీ సాధించుకోవాలి.

      Delete
    2. శ్రీశైలం ప్రాజెక్ట్ కుడి భాగం కర్నూల్, ఎడమ భాగం మహబూబ్ నగర్ లో ఉన్నాయి అని అనుకుంటున్నారు అందరూ. కానీ జిల్లా అధికారులు సమాచారం తీస్తుంటే ప్రాజెక్ట్ మరియు దానికి సంబంధించిన కార్యాలయాలు ఉన్న ఈగలపెంట, దోమలపెంట ప్రాంతాలు కర్నూల్ జిల్లలో భాగమేనట. అంటే ఇన్ని రోజులు మన నీళ్ళు , మన కరెంటు తెలంగాణా వాళ్ళు దొబ్బి తిన్నారు. వాళ్ళు కేవలం ఆరోపిస్తున్నారు. ఇది ప్రూఫ్.

      Delete
    3. Inni rojulu meeru thinnadaanikante memu emi dobbithinaledhu.

      daridhrunidiki rupayi ichhina vadulukovalata.. mee lanti shani gallani vadulukodaaniki aa pranthalanu vadilesi sukhangaa untaamu.

      me elanti ajakralanu vellipothe aa trupthe verabbaaaa

      Ajakarula next dopidi plan: seeema nayakullaraa kodiiga jagrathha vellatho. emandi ani antunee vonti meedha battalatho saha dochukuntaru.

      Delete
    4. ఊరికే దోపిడీ, దోపిడీ అని పడి కట్టు పదాలనే ఉపయోగించకపోతే ఎవరు ఎంత దోపిడీ చేసారో ప్రకటించండి. డిప్యూటీ సీఎం మొదలుకొని అరి వీర తెలబాన్ రాజులంతా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నారు కదా. అవేవి రావు ఎందుకంటే ఎవరు ఏమి దోపిడీ చేశారో వాళ్ళకే తెలీదు గనుక. మొదట్లో సీమాంధ్ర రాజకీయ నాయకులు దోపిడీ చేశారు అన్నారు (అక్కడికేదో తెలంగాణా రాజకీయ నాయకులంతా ఏమి దోపిడీ చేయకుండా చిరిగిన చొక్కా వేసుకుని తిరుగుతున్నట్టు. అలా అని రాజకీయ అవినీతిని సమర్థించట్లేదు. కానీ ప్రాంతీయ తత్వానికి , విద్వేష విషం కక్కడానికి ఒక ప్రాంతం వారికి అంటగట్టడం పైనే అభ్యంతరం అంతా). తరువాత ఆంధ్ర వాళ్ళంతా దోపిడీదారులు అనే వాళ్ళు. ఇప్పుడు సీమాంధ్ర ప్రజలంతా దోపిడీ దారులు అని ముద్ర వేస్తున్నారు. అదే చేత గాక వంకర అన్నాడట అలా ఉంది వీళ్ళ నిర్వాకం. ఇలా అనే వాళ్ళ స్నేహితులే చాలా మంది సీమాంధ్ర నుండి ఉండి ఉంటారు. కనీసం వాళ్ళని చూసి , వీళ్ళు ఏమి దోపిడీ చేసి ఉంటారు అని ఒక్క క్షణం ఆలోచిస్తే అర్థం అవుతుంది మాట్లాడేది ఎంత చెత్తో. కానీ అంత బుర్రలో గుజ్జు ఉంటె కదా ఆలోచించడానికి. తెలబాన్ బాస్ లు ఏమి చెప్తే దాన్ని పట్టుకుని తందానా అనడం.
      నాకు తెలిసి వీళ్ళ భాషలో దోపిడీ అంటే
      ఊరికి దూరంగా ఉన్నా హైదరాబాద్ కి వచ్చి కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవడం. వీళ్ళు చదవరు. కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకుంటే అది దోపిడీ. అదేమంటే మాకు రావాల్సిన ఉద్యోగం అంటాడు. తెలంగాణా లో కస్టపడి చదివిన వాళ్ళు ఎంతమంది అమెరికన్స్ ని కూడా కాదని ఉద్యోగం తెచ్చుకోవట్లేదు.

      Delete
    5. 610GO , గిర్గ్లాని రిపోర్టు ఏడికెల్లి వచ్చినై? భార్గవ రిపోర్ట్ ఎప్పుడయినా సదివినవా? థు మీ బతుకులు. గిర్గ్లాని క్లియర్ గా జెప్పిండు, డిపార్ట్ మెంట్ హెడ్ లు సహకరిస్తలెరు అని, ఆ వార్త ఈనాడుల గూడా వచ్చింది.

      ఈ మద్య చెప్పుడు మొదలు పెట్టిండ్రు కాని, రెండేళ్ళ క్రితం ఎవ్వదయినా 610GO తో అవసరం లేదు, అంతా సరి జేసినం అన్నాడా ? అంతా సక్రమంగా ఉంటె తెలంగాణా ఏర్పడగానే ఉద్యోగాలు పోతాయని సీమండ్రులు బయపడుడు ఎందుకు?

      ఈ వాదన ఎందుకు , మేం ఎంత జెప్పిన మల్లి తెల్లారి లేచి నువ్వు మల్లి సెం ప్రశాం అడుగుతావ్, మళ్ళి మేం గివ్వే చెప్పాలి. మిమ్మల్ని ఎల్ల నూకితే లోల్లో ఉండదు

      Delete
  3. CHACHCHI POTUNNAARRAA TELANGANA ERPAATUNU DIGEST CHESUKOLEKA. TELANGANA ERPADADAM KHAAYAM. MEERU INKA KULLI KULLI EDVADAM KHAAYAM.

    ReplyDelete
  4. పచ్చ ముసుగు వేసుకుని పేట్రియాటిక్ రాతలు నువ్వు రాయట్లేదూ .. అలాగే

    ReplyDelete
    Replies
    1. ఇవ్వాళ మీరు యే స్తితిలో ఉన్నారో తెలుసా? తొమ్మిదేళ్ళు ఉద్యమం చేశారు, కానీ ప్రకటన మిమ్మల్ని యెంత యెదవల్ని చేశేలాగ చేశాడో చూశావా? తొమ్మిదేళ్ళ మీ ఉద్యమం గురించి ఒక్క మంచి మాట లేదు. అమర వీరుల్ని గురించి మీకు మీరు డప్పు కొట్టుకోవదమే తప్ప ప్రకటనలో యెక్కడా పొగడలేదు.ఒక పెడసరపు మాట, ఇచేస్తున్నాం అని. ఆఖరికి గట్టిగా అడిగితే కచరా తెలంగాణా ఇస్తే తెరాసని కాంగ్రెసులో విలీనం చేస్తానన్నాడు గాబట్టి ఇస్తున్నాం అన్నాడు. మనిషికి రోటీ, కపడా ఔర్ మకాన్ తర్వాత ఇజ్జత్ ఉండాల్. మీ ఉద్యమ ఫలితంలో అది లేదు.

      ఒక న్యాయమయిన ఉద్యమానికి ఇంత దయనీయమయిన ఫలితం మీకు మాత్రమే వస్తున్నది తెలుసుకో. ప్రపంచంలో న్యాయం కోసం చాలా మంది పోరాడి చాలా గౌరవమయిన పధ్ధతి లో సగర్వంగా సాధించుకున్నారు తప్ప ఇంత దిక్కుమాలిన ప్ధతిలో సాధించుకుంటూ కూడా సంబరపడుతున్న వాళ్ళు అనంత కాల చరిత్రలో నాకెక్కడా కనపడ్లేదు.మీరు చదివిన చరిత్రల్లో యెక్కదయినా ఉందేమో వెతికి చెప్పండి.

      ఉద్యమానికి ఫలితంగా వొచ్చే ప్రకటననే మర్యాద అయిన పధ్ధతి లో తెచ్చుకోలేని వాళ్ళు దేన్ని చూసుకుని గర్వించగలరో చెప్పండి?అడిగిన వాడు అంత సొంపు గ అడిగితే ఇచ్చేవాడికి ఫికర్ యెందుకుంటుంది?

      Delete
    2. ఒరేయ్ సూరా"నేని"
      మీ నాయకుడిలాగా నువ్వుకూడా అడ్డగోలుగా వాదిస్తావేంట్రా?
      నీ ముసుగుని బయటపెడితే ప్రతీ ఒక్కడూ తలంగాణ వాది అయిపోతాడేంట్రా?

      నేను పక్కా సమైక్యవాదిన్రోయ్, నీ వ్యాఖ్య మొదటికే తప్పు .. మళ్ళీ రాయి మొదటినుంచీ

      Delete
  5. ఒక్కసారి రాసినందుకే తగలరాని చోట షాట్ తగిలినట్టుగా అయ్యావు, గిల గిల కొట్టుకుంటున్నావు - రెండోసారి రాయాలా? నా ముసుగు గురించి మాట్లాడే నువ్వు అనామకం ముసుగులో యెందుకున్నావో చెప్పు.ముసుగు వేసుకున్నది నువ్వు.వ్యాఖ్యలో తప్పేమిటో చెప్పొచ్చుగా ప.స.వా.య్!

    ReplyDelete