Thursday, September 26, 2013

ఇంట్లో ఈగల మోత ! : దిగ్విజయ్ సింగ్

ముఖ్య మంత్రిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలని సమానంగా చూడాలని సుద్దులు చెప్తున్న దిగ్విజయ్ సింగ్ తాను ఎలా ప్రవర్తిస్తున్నారో ముందు తెలుసుకోవాలి.  తెలంగాణా ప్రాంతానికి అనుకూలంగా విభజన ప్రతిపాదించటమే గాక సీమాంధ్ర నాయకుల విన్నపాలని సైతం పెడచెవిన పెడుతూ రోజుకో సారి తెలంగాణా తధ్యం అంటూ ఉత్తర కుమార ప్రతిజ్ఞలు చేసేస్తున్నారు. తాటాకు చప్పుళ్ళ లాంటి దిగ్విజయ్ మాటలని ఉద్యోగులు కూడా ఖాతరు చెయ్యటం మానేశారు!  విభజన ప్రతిపాదనతో ఎన్జీఓ ల భవిష్యత్తు అంధకార బంధురం చేసేసి - వారు ఉధృతంగా సమ్మెకి దిగాక - ఏమీ ఎరగని నంగనాచిలాగా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా, సమ్మె విరమించండి అని ప్రకటించటం విడ్డూరం!    సొంత రాష్ట్రం లో ఠికానా లేక కాంగ్రెస్ కోర్ కమిటీలో కాలక్షేపం చేస్తూ అమ్మ దయతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కి ఇన్ చార్జి గా నియమితులైన దిగ్విజయ్ సింగ్ కి రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన దగ్గరనించి చిత్త చాంచల్యం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తన సొంత రాష్ట్రంలో మొహాన తలుపు వేసి జ్యోతిరాదిత్య సింధియా విలేఖరుల సమావేశం నిర్వహిస్తే కిక్కురుమనని దిగ్విజయ్ తన ప్రతాపాన్ని సీమాంధ్ర నాయకుల పై మాత్రం చూపిస్తారు.
 ఒక పార్లమెంటు సభ్యురాలిని టంచ్ మాల్ అంటూ వెకిలిగా మాట్లాడిన పెద్ద మనిషి దగ్గరికి సీమాంధ్ర నాయకుల సతీమణులు వెళ్ళటం అర్ధం లేని పని. తన ప్రవర్తనకి తగ్గట్లే వారిని కూడా అవమానించి పంపాడాయన! మహిళల విషయం వదిలేస్తే మతం విషయంలోనూ దిగ్విజయ్ ది  అవాంచనీయ ధోరణే!  తాజాగా మధ్య ప్రదేశ్ లోనే బీజేపీ సమావేశానికి పదివేల బురఖాలు పంపిణీ అంటూ తల తిక్క వ్యాఖ్యానం చేసి పొలిసు కేసు ఎదుర్కుంటున్నారు. 

http://indiatoday.intoday.in/story/police-complaint-against-digivjaya-singhs-for-his-false-burqua-claims/1/311876.html

ఇంతటి ఘన చరిత్ర గల పెద్ద మనిషి ఆధ్వర్యంలో కేంద్ర కాంగ్రెస్ పార్టీ  నిర్ణయం ప్రకటించాక కూడా ముందుకి సాగే దమ్ము లేక త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లు రాష్ట్ర ప్రగతి తో దారుణమైన విధంగా ఆటలాడుకుంటోంది.  అసలు ఇంట గెలవలేని దిగ్విజయ్ రచ్చ గెలుస్తాడని కాంగ్రెస్ ఎలా భావించింది? తెలుగు వారి పట్ల కేంద్రం చూపుతున్న చిన్న చూపుకి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు పరాకాష్ట అని చెప్పాలి.  

3 comments:

  1. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువని మనం చదువుకున్నాం కదా... కాంగ్రెసు నాయకుల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. ఇందుకు డిగ్గీరాజా ఏమీ మినహాయింపు కాదు. అమ్మగారికి పాంక్రియాటిక్ క్యాన్సర్ ముదిరిపోయి ప్రాణం మీదకు వచ్చేసింది. నెలల నుంచి రోజుల్లోకి వచ్చేశారు. షిండేకేమో లంగ్ క్యాన్సర్, ఆంటోనికి ప్రోస్టేట్ క్యాన్సర్, ఆజాదుకు తీవ్రమైన నడుము నొప్పి. కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు. ఇంతమంది రోగిష్టి నాయకుల మధ్య కాంగ్రెసు పార్టీ తనకు తాను సమాధి కట్టుకోవడం ఖాయం.

    ReplyDelete
  2. దిగ్విజయ సింగ్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కిరణ్ కుమార్ రెడ్డి అంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి అంధ్ర ప్రదేశ్ లోని మొత్తం ప్రాంతాలగురించి మాట్లాడతారు. దిగ్విజయ సింగ్ కూడ అంధప్రదేశ్ మొత్తానికి ఇంచార్జ్ తెలంగాణకు మాత్రమే కాదు. ఆయన తెలంగాణ తరపున మాత్రమే మట్లాడుతున్నారు. సీమాంధ్రలో జరిగే ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. కాంగ్రేస్ వారికి పోయేకాలం వచ్చింది. పురుగులు పట్టి పోతారు శ్రీధర్

    ReplyDelete